ల్యాండ్ టైట్లింగ్ ఆక్ట్ పై నోరు విప్పండి..మోడీ కి ఆడారి కిషోర్ సవాల్..

తెలుగు సూపర్ న్యూస్, మే 6, 2024:ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేస్తున్న ల్యాండ్ టైట్లింగ్ ఆక్ట్ పై నోరు విప్పి, నిజాలు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి లోక్ సభ ఇంచార్జి ఆడారి కిషోర్ కుమార్ బహిరంగ సవాల్ విసిరారు.

సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఈ చట్టం అద్భుతంగా ఉందని, తమ పార్టీ మద్దతు ఇస్తోందని, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అసెంబ్లీ లోనే చెప్పారన్నారు. ఈ చట్టం పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ లపై సిఐడి కి ఫిర్యాదు చేశామని, వాళ్ళు విచారణ చేస్తారన్నారు.

సీఎం రమేష్..డబ్బు మదం కాదు, దమ్ముంటే నాతొ డిబేట్ కి రా

కేవలం డబ్బు మదం తప్ప మరో అర్హత తప్ప కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు లేదని, దమ్ముంటే తనతో డిబేట్ కు రావాలని ఆడారి కిషోర్ కుమార్ సవాల్ విసిరారు. కడప నుంచి కోట్లాది రూపాయలతో వలస వచ్చి, అనకాపల్లి ని ఉద్ధరిస్తానని బీజేపీ అభ్యర్థిగా వచ్చారని, అతనికి కనీసం అనకాపల్లి ఎల్లలు కూడా తెలియదన్నారు.

గత పదేళ్లుగా రాజ్యసభగా సభ్యునిగా ఆంధ్ర ను ఏమాత్రం ఉద్దరించారో చెప్పాలన్నారు. తనకు ఏపీ లోని సమస్యలు పూర్తిగా అవగాహనా ఉందని, సీఎం రమేష్ కు దమ్ముంటే తనతో ఓపెన్ డిబేట్ కు రావాలని సవాల్ విసిరారు.

కడప, తెలంగాణ కు చెందిన వందలాదిగా వాహనాలు తరలించి అనకాపల్లి లో ప్రచారం వాడుతున్నారన్నారు. అతని చిత్తశుద్ధి ఇక్కడే తెలిసిందన్నారు. స్థానిక వాహనాలను వాడితే స్థాయి స్థానిక యువతకు కొంత ఉపాధి జరుగుతుందన్నారు. కనీసం ఈ మాత్రం సాయం కూడా స్థానికులకు చెయ్యడం ఇష్టపడని వ్యక్తి ఎంపీ అయితే ఏమి ఉద్ధరిస్తాడని మండిపడ్డారు.

ఇక అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ గతంలో మంత్రిగా ఉంది ఏమి ఉద్దరించాడో తమకు తెలుసునని, అతని గురించి వ్యాఖ్యానించడం కూడా సమయం వృధా అన్నారు.

ఈ సమావేశంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులూ తదితరులు పాల్గొన్నారు.

సింగనమలలో శైలజానాథ్ కే అవకాశాలు ఎక్కువ..?

మే 5,2024: మాజీ మంత్రి సింగనమల (ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు సాకే శైలజానాథ్. ఇదే నియోజకవర్గం నుంచి 2004, 2009లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన డాక్టర్ Y.S రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ప్రాథమిక విద్య మంత్రి గా పనిచేశారు. జనవరి 2022 నుంచి డిసెంబర్ 2023 వరకు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనంతపురం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్టీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ జిల్లా నుంచి పోటీ చేసి గెలిచారు. మరికొద్ది రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు జరగనున్న తరుణంలో అనంతపురం జిల్లాలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ వంటి పార్టీల మధ్య పోటీ నెలకొంది. అయితే అనూహ్యంగా శింగనమల నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. అధికార వైసీపీ, టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తోందని సమాచారం.

2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి నాయకత్వం వహించారు. ఈసారి శింగనమల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శైలజానాథ్ పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి తొలిసారి వీరాంజనేయులు బరిలో నిలవగా, టీడీపీ నుంచి బండారు శ్రావణి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు.

అయితే కూటమి నుంచి బండారు శ్రావణికి సహకరించే పరిస్థితులు అంతగా లేవు. గతంలో శింగనమలలో టీడీపీ సీనియర్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అయితే శ్రావణిపై కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకంగా ఉన్నారు. శైలజా నాథ్ కి ఇది కొంచెం కలిసొచ్చే అంశం. కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ఇతర పార్టీల్లోనూ శైలజానాథ్ కు అభిమానులున్నారు. ఇప్పుడు ఇది శైలజ నాథ్‌కి ప్లస్‌గా మారనుంది.

శింగనమల నియోజకవర్గంలో శైలజానాథ్ సామాజికవర్గానికి చెందిన వారు చాలా మంది ఉన్నారు. ఇది చూస్తుంటే వైసీపీ, టీడీపీ పార్టీలకు శైలజానాథ్ తలనొప్పిగా మారుతున్నారు. ఆయన నామినేషన్ సందర్భంగా కూడా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఆయనతో సెల్ఫీలు దిగడమే కాకుండా శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున చేసిన అభివృద్ధి శైలజానాథ్ కు కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మరి ఈ త్రిముఖ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి.

అనకాపల్లి వైఎస్ ఆర్సీపీ ఎంపీ క్యాండిడేట్ గా అడారి కిషోర్ కుమార్..?

తెలుగు సూపర్ న్యూస్, ఏప్రిల్ 24,2024: యువనేత జనహృదయనేత.. ఆడారి కిషోర్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు అంతేకాదు ఆయనకు జనాల్లో మంచి ఆదరణ ఉంది. ఆయన రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. క్రియాశీలకంగా వ్యవహరించి అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు, ఆందోళనలు చేసి ప్రజలకోసం నిలబడ్డారు. ఆపదలో ఉన్నవారికి అవసరమైన సాయం అందిస్తూ జనాల సమస్యలను పరిష్కరించారు.

ఆడారి కిషోర్ కుమార్ కు తెలుగుదేశం పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదు. అయినప్పటికీ ఎన్నో సందర్భాలుగా ద్వితీయ స్థాయి నాయకులు కార్యకర్తలు ఇదే అభిప్రాయం బహిరంగంగా ఆయనతో చెప్పారుకూడా.. ఐనా గానీ కేవలం చంద్రబాబు మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల మీద ఉన్న గౌరవంతో ఆడారి కిషోర్ కుమార్ ఎటువంటి పదవులు దక్కకపోయినా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేశారు.

అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో..

దాదాపు పద్నాలుగు లక్షల జనాభా కలిగిన అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రధానంగా కాపుల ఓట్లతో పాటు, వెలమ, గవర సామాజిక వర్గాల ఓటర్లు 75 శాతానికి పైగా ఉంటాయి. కాబట్టి ప్రధాన పార్టీలన్నీ ఎప్పుడు ఈ మూడు సామాజిక వర్గాలకు చెందిన నాయకులకే ఎంపీ టికెట్లు కేటాయిస్తూ ఉంటాయి.

అనకాపల్లి ఎంపీ స్థానానికి..

అయితే అనూహ్య పరిణామాల మధ్య.. తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి పార్లమెంటు స్థానానికి టికెట్ ఆశావహులుగా ఉన్న ఆడారి కిషోర్ కుమార్ స్వయంగా సీఎం జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

స్కిల్ స్కాం వ్యవహారంలో..

స్కిల్ స్కాం వ్యవహారంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు స్వయంగా వైజాగ్ విమానాశ్రయం రన్వే పైనే ఆందోళన చేసినందుకు ఆయనపై కేంద్ర సాయుధ బలగాల అధికారులు కేసులు కూడా పెట్టారు. నారా లోకేష్ యువగళం యాత్రకు కూడా.. ఆడారి కిషోర్ కుమార్ తన శక్తికి మించి ఆర్థికంగా ఎంతో ఖర్చు పెట్టారు.

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంటు టికెట్ ఆయనకు ఇస్తారని స్పష్టమైన సమాచారం అందడంతో.. ఎన్నో ఏళ్లుగా తనని నమ్ముకున్న కార్యకర్తల కోసం వాళ్ల కోరిక మేరకు అడారి కిషోర్ కుమార్ వైయస్సార్సీపి తీర్థం పుచ్చుకున్నారు.

గత ఎన్నికల్లో..

గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నుంచి విజయం సాధించి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న డాక్టర్ భీసెట్టి సత్యవతి ఆ సమయంలో వచ్చిన జగన్ వేవ్ ద్వారా మాత్రమే గెలిచారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తన పొలిటికల్ కెరీర్ లో..

ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో.. గ్రౌండ్ లెవెల్ లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడంలో విఫలం అవడంతో… ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వలేదు. అనకాపల్లి పార్లమెంటు స్థానంలో బలమైన నేత కోసం ఎదురుచూస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆడారి కిషోర్ కుమార్ రూపంలో ఒక బలమైన నాయకుడు దొరికాడు. మరో రెండు మూడు రోజుల్లో అనకాపల్లి పార్లమెంటు సీటు అడారి కిషోర్ కుమార్ కు ప్రకటించే అవకాశం ఉంది.

జనాల మనిషిగా..

జగన్ మోహన్ రెడ్డికి తగ్గట్లుగా అడారి కిషోర్ కుమార్ కూడా.. దూకుడుగా వ్యవహరించగలిగే యువ నేత. ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అన్నివిధాలా ప్రజలకు తనవంతుగా సాయం అందిస్తున్నారు. అటు సామాజిక సమీకరణలతో పాటు ప్రజల్లో ఎంతగానో మంచి పేరు ఉన్న జనహృదయనేత అడారి. కాబట్టి కొన్ని రోజుల్లో అడారి కిషోర్ కుమార్ కు టికెట్ ప్రకటించాలని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అడారి కిషోర్ అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.

గత 30 సంవత్సరాల గా సూచిరిండియా ఫౌండేషన్ సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డులు

సూచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమం సర్ సివి రామన్ యంగ్ జీనియస్ అవార్డుల ప్రధానం ….

ముఖ్య అతిథిలు శ్రీ. చంద్రబోస్
ఆస్కార్ అవార్డు గ్రహీత, టాలీవుడ్ గీత రచయిత గాయకుడు, డా. జి. సతీష్ రెడ్డి గారు,రక్షా మంత్రికి మాజీ సైంటిఫిక్ అడ్వైజర్, సెక్రటరీ DD (R&D) , & చైర్మన్ DRDO మరియు H.E. నికోలాయ్ హ్రిస్టోవ్ యాంకోవ్, భారతదేశానికి రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా యొక్క గౌరవనీయమైన అంబాసిడర్ అసాధారణ & ప్లీనిపోటెన్షియరీ పాల్గొని అవార్డులు అందచేశారు

హైదరాబాద్: ప్రముఖ సామాజిక సేవాసంస్థ సుచిరిండియా ఫౌండేషన్ 31వ సర్ సివి రామన్ టాలెంట్ సెర్చ్ పరీక్షను జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించింది. 1500 పాఠశాలల నుండి 1,00,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన 31వ జాతీయ స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్షల్లో 16 మందికి గోల్డ్ మెడల్స్, 16 మంది ర్యాంకేర్స్ కి మరియు 396 డిస్ట్రిక్ ర్యాంకేర్స్ కి, 8 మంది కి చత్రాలయా పురస్కార్ అవార్డ్స్, 8 మందికి గురు బ్రహ్మ అవార్డ్స్, రాష్ట్రా స్థాయి మెడల్స్ మరియు జిల్లా స్థాయి ర్యాంక్స్ వచ్చిన యువ టాలెంట్ విద్యార్థులకు శ్రీ సత్యసాయి నిగమాగమం లో అవార్డులు ప్రదానం చేశాము అని సూచిరిండియా ఫౌండేషన్ నిర్వహకులు లయన్ కిరణ్ మాట్లాడుతూ నాకు గత 30సంవత్సరాలగా ఈ అవార్డ్స్ అందచేయడం చాలా సంతోషంగా ఉంది నాకు స్ఫూర్తి అబ్దుల్ కలామ్ గారు మనం దేశానికి ఏదో ఒక విధంగా సేవా చెయాలి…

నిరుపేదల అభ్యున్నతే కాంగ్రెస్ ధ్యేయం : జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్

తెలుగు సూపర్ న్యూస్,ఫిబ్రవరి 5,2024: తెలంగాణలో దొరల పాలన పోయి సామాన్యుల పాలన వచ్చిందని, నిరుపేదల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ పేర్కొన్నారు. ఈరోజు మణికొండ లో ప్రగతి శీల మహిళా సంఘం నాయకురాలు జేబా రహిమాన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ,మణికొండ మున్సిపల్ చైర్మన్ అయిన కస్తూరి నరేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారెంటీల అమలు సమర్థ వంతంగా జరుగుతాయి అన్నారు. కస్తూరి నరేందర్ మాట్లాడుతూ త్వరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నందున గులాబీ దొరలు మళ్ళీ మొసలి కన్నీరు కారుస్తూ ఓట్ల కోసం వచ్చే ప్రమాదం ఉందన్నారు. గులాబీ, కాషాయ దళాలు రెండూ ఒకటే నని పేదోడి గురించి ఆలోచించేది కాంగ్రెస్ ఒక్కటే అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి అని కోరారు. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన జేబా రహిమాన్ కు మహిళా సమస్య ల కోసం, పేదల అభ్యున్నతి కోసం ఉద్యమాలు చేసిన చరిత్ర ఉందన్నారు. ఆమె సేవలు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది అని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారెంటీల అమలు సమర్థ వంతంగా జరుగుతాయి అన్నారు. కస్తూరి నరేందర్ మాట్లాడుతూ త్వరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నందున గులాబీ దొరలు మళ్ళీ మొసలి కన్నీరు కారుస్తూ ఓట్ల కోసం వచ్చే ప్రమాదం ఉందన్నారు. గులాబీ, కాషాయ దళాలు రెండూ ఒకటే నని పేదోడి గురించి ఆలోచించేది కాంగ్రెస్ ఒక్కటే అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి అని కోరారు. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన జేబా రహిమాన్ కు మహిళా సమస్య ల కోసం, పేదల అభ్యున్నతి కోసం ఉద్యమాలు చేసిన చరిత్ర ఉందన్నారు. ఆమె సేవలు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,సంగం కిరణ్ కుమార్ , కౌన్సిలర్లు కే. లావణ్య, లక్ష్మీనారాయణ, శ్వేత, మణికొండ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

తెదేపా కేంద్ర కార్యాలయంలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

తెలుగు సూపర్ న్యూస్,జనవరి 24,2024 : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ఆధ్వర్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్‍లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి కట్ చేశారు. అనంతరం శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ.. నారా లోకేష్ జీవితం నేటి యువతరానికి ఆదర్శమని, కృషి, పట్టుదలతో ప్రజల నుంచి నాయకుడిగా ఎదిగిన ఘనత లోకేష్‍కే దక్కిందన్నారు.

రాష్ట్ర ప్రజలే తన కుటుంబంగా భావించి 3,200 కిలోమీటర్లకు పైగా ప్రజాగళమే తన గళమై ముందుకు సాగి పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారన్నారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కార్యకర్తల సంక్షేమ నిధి సృష్టికర్తగా నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటూ వారి సంక్షేమాన్ని బుజానికెత్తుకొని వేలాది మంది కార్యకర్తలను ఆదుకోవడమే కాక.. వారిలో మనోధైర్యాన్ని నింపారన్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల్లో 23 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, ఎల్‍ఈడీ బల్పులతో పాటూ గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.

మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా పెట్టుబడులు, కంపెనీలు తెచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయడంకా మోగించడం ఖాయమని చినబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత పార్లమెంట్, నియోజకవర్గ అధ్యక్షులు, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.

TDP National General Secretary Nara Lokesh’s Birthday Celebrations Held Grandly Under The Leadership Of Telugu Youth At TDP Central Office

Telugu super news, January 24,2024:The birthday celebrations of TDP National General Secretary Nara Lokesh were held grandly at NTR Bhavan of the TDP Central Office under the leadership of Telugu Youth State President Sriram Chinababu. The occasion featured a spectacular cake-cutting ceremony.

Subsequently, Sriram Chinababu stated that Nara Lokesh’s life serves as an ideal for today’s youth. He emphasized Lokesh’s journey, earning the honour of becoming a leader through hard work and perseverance. Treating the people of the state as his family, the Telugu Youth President highlighted Lokesh’s remarkable 3,200-kilometer march to understand public problems. As the national general secretary of the party and the architect of the Workers’ Welfare Fund, Sriram Chinababu revealed that Nara Lokesh has consistently supported activists, ensuring their welfare and backing thousands of them.

He further added, ‘As the Panchayati Raj Minister, Lokesh implemented numerous development programs in villages, including the construction of 23 thousand kilometers of CC roads and distribution of LED bulbs. Moreover, as the Minister of IT, he attracted investments and companies, creating employment and job opportunities for the youth.’ Sriram Chinababu expressed confidence that the TDP will emerge victorious in the upcoming elections. The event saw participation from Telugu Youth Parliament members, Constituency Presidents, and Telugu Youth Leaders.

TDP National General Secretary Nara Lokesh’s Birthday Celebrations Held Grandly Under the Leadership Of Kandukuru Constituency Leader Unnam Nalini Devi

Telugu super news, Ap news,January 24,2024:The birthday celebrations of TDP National General Secretary Nara Lokesh were held grandly in Kandukuru under the leadership of the constituency leader Unnam Nalini Devi. The occasion featured a spectacular cake-cutting ceremony along with the leader distributing clothes to sanitation workers in Kandukur.

Subsequently, Unnam Nalini Devi stated that Nara Lokesh’s life serves as an ideal for today’s youth. She emphasized Lokesh’s journey, earning the honour of becoming a leader through hard work and perseverance. Treating the people of the state as his family, she highlighted Lokesh’s remarkable 3,200-kilometer march to understand public problems.

As the national general secretary of the party and the architect of the Workers’ Welfare Fund, Unnam Nalini Devi revealed that Nara Lokesh has consistently supported activists, ensuring their welfare and backing thousands of them.

She further added, ‘As the Panchayati Raj Minister, Lokesh implemented numerous development programs in villages, including the construction of 23 thousand kilometers of CC roads and distribution of LED bulbs. Moreover, as the Minister of IT, he attracted investments and companies, creating employment and job opportunities for the youth.’ Unnam Nalini Devi expressed confidence that the TDP will emerge victorious in the upcoming elections. The event saw participation from local Telugu Desam Party leaders and sanitation workers participate in this program.

కందుకూరు నియోజకవర్గం నాయకులు ఉన్నం నళిని దేవి ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకలు..

తెలుగు సూపర్ న్యూస్,జనవరి 24,2024 : కందుకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్న నళిని దేవి గారి ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా నళినీ దేవి కేక్ ను కట్ చేశారు. అనంతరం కందుకూరులోని పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు.

అనంతరం ఈ క్రమంలో నళిని దేవీ గారు మాట్లాడుతూ.. నారా లోకేష్ జీవితం నేటి యువతరానికి ఆదర్శమని, కృషి, పట్టుదలతో ప్రజల నుంచి నాయకుడిగా ఎదిగిన ఘనత లోకేష్‍కే దక్కిందన్నారు. రాష్ట్ర ప్రజలే తన కుటుంబంగా భావించి 3,200 కిలోమీటర్లకు పైగా ప్రజాగళమే తన గళమై ముందుకు సాగి పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారన్నారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కార్యకర్తల సంక్షేమ నిధి సృష్టికర్తగా నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటూ వారి సంక్షేమాన్ని భుజానికెత్తుకొని వేలాది మంది కార్యకర్తలను ఆదుకోవడమే కాక.. వారిలో మనోధైర్యాన్ని నింపారన్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల్లో 23 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, ఎల్‍ఈడీ బల్పులతో పాటూ గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.

మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా పెట్టుబడులు, కంపెనీలు తెచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయఢంక మోగించడం ఖాయమని నళినీ దేవి అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

శాం పిట్రోడా రాసిన రీడిజైన్ ద వరల్డ్ పుస్తకాన్ని తెలుగులో ఆవిష్కరించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, జనవరి 8, 2024: ‘రీడిజైన్ ద వరల్డ్’ పుస్తకం తెలుగు అనువాదాన్ని బంజారా హిల్స్ లొని హోటల్ తాజ్ కృష్ణలో గల సెఫైర్ బాంక్వెట్ హాల్ లో ఆవిష్కరించారు.శాం పిట్రోడా రాసిన ఈ పుస్తకాన్ని పోలదాసు నరసింహారావు తెలుగులోకి అనువదించగా, డాక్టర్ డి. చంద్రశేఖర్ రెడ్డి సంపాదకుడిగా వ్యవహరించారు.

శాం పిట్రోడా ఈ కార్యక్రమంలో జూం కాల్ ద్వారా పాల్గొన్నారు. ముఖ్య అతిథులలో తెలంగాణ ఉప
ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి శ్రి ఎం.ఎం. పళ్ళం రాజు ఉన్నారు. గౌరవ
అతిథులుగా మాజీ ఎం.పి. మధు యాష్కీ గౌడ్, పరకాల ప్రభాకర్, మాజీ ఎం.పి. వుండవల్లి అరుణ్
కుమార్, ఎమ్మెల్యే మదన్ మొహన్ ఋఆవు, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మరెడ్డి వెంకటేశ్వర్లు, ఐపీఎస్ వి.వి.

లక్ష్మీనారాయణ, ఐపీఎస్ ఎన్. సాంబశివ రావు, ఐఏఎస్ కె.ఎన్.కుమార్ పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ
సందర్భంగా క్వాడ్ జెన్ వైర్ లెస్ సొల్యుషన్స్ చైర్మన్ సీఎస్ రావు మాట్లాడుతూ, “ఈ కార్యక్రమంలో
పాల్గొనడం, ఇలాంటి ఉన్నత నాయకులు, మేధావులతో వేదికను పంచుకోవడం గౌరవంగా
భావిస్తున్నాను. ‘రీడిజైన్ ది వరల్డ్’ పుస్తకానికి ఈ తెలుగు అనువాదం యొక్క ప్రాముఖ్యతను
తెలియజేస్తుంది. ఈ పుస్తకం ప్రపంచక్రమం ఎలా, ఎందుకు మారాలి, హైపర్ కనెక్టివిటీ ప్రపంచాన్ని ఎలా
మార్చగలదో సూచిస్తుంది. ఈ తెలుగు అనువాదాన్ని శ్రీ పి.ఎన్.రావు తన అద్భుతమైన కృషితో,
హైదరాబాదుకు చెందిన ఎమెస్కో ప్రచురణ సంస్థ సహకారంతో చేశారు. ఇది ప్రజాదరణ పొందిన పుస్తకంగా
మారుతుందని ఆశిస్తున్నాను. ప్రపంచ నిర్మాణం గురించి, భారతదేశ ఎదుగుదలపై దాని ప్రభావం గురించి
రాసిన ఈ తెలుగు అనువాదాన్ని నిజమైన ఆందోళనలను చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు
మాట్లాడే ప్రజలు మనమంతా చదవడానికి అర్హమైనది” అన్నారు.
తనకు తెలుగు అనువాద హక్కులు ఇచ్చినందుకు శామ్ పిట్రోడాకు సి.ఎస్.రావు కృతజ్ఞతలు
తెలియజేశారు. శ్రీ విజయ్ కుమార్ నేతృత్వంలోని ఎమెస్కో అనే అత్యంత ప్రజాదరణ పొందిన,
చరిత్రాత్మకంగా స్థాపించిన తెలుగు ప్రచురణ సంస్థకు కూడా తన కృతజ్ఞతలు తెలియజేశారు.

“రీడిజైన్ ది వరల్డ్” పుస్తకంపై శాం పిట్రోడా ఓవర్ వ్యూ
“రీడిజైన్ ది వరల్డ్” మరియు “ప్రపంచానికి కొత్తరూపం ఇద్దాం. కదలిరండి” అనే ఈ పుస్తకం ప్రపంచం
ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి మూల కారణాలను పూర్తిగా స్పష్టంగా గుర్తించడం ద్వారా
ప్రపంచసమస్యల గురించి చాలా తెలివైన వివరణ. బాగా గుర్తించిన ప్రపంచ సమస్యలకు
ఆచరణాత్మకమైన, ఆచరణీయమైన పరిష్కారంగా స్పష్టమైన మేనిఫెస్టోను శాం ఈ పుస్తకం ద్వారా
సూచించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డెమోక్రటైజేషన్, వికేంద్రీకరణ, డీమానిటైజేషన్ అనే మూడు ప్రత్యేక కోణాలు ప్రపంచ వ్యవస్థను మార్చేందుకు దోహదపడ్డాయని శామ్ పిట్రోడా పేర్కొన్నారు.

ఇంటర్నెట్ ద్వారా
ప్రజాస్వామ్యీకరణ అందరికీ జ్ఞానం, విద్య, వినోదం, షాపింగ్, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ, రవాణాకు
వికేంద్రీకృత అందుబాటును ఈ కొత్త ప్రపంచంలో హైపర్ కనెక్టివిటీ ద్వారా అనుమతిస్తుంది. మొబైల్
వాలెట్లు, పేమెంట్స్, బ్యాంకింగ్ ఆఫర్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లు మన సమాజం, నాగరికతల భవిష్యత్తును
తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
ఎప్పుడో 50 ఏళ్ల క్రితం నాటి ప్రపంచశక్తుల ప్రభావం, ఔచిత్యం ఇప్పుడు ఎలా ఉంటాయని, అమెరికా,
రష్యా, యుకె, నాటో, చైనా తదితర సూపర్ పవర్స్ ఇంకా ఎందుకని శాం పిట్రోడా ప్రశ్నిస్తున్నారు.
భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి నిర్మాణాత్మక మార్పు, జనాభా, డిజిటల్ డివిడెండ్ సామర్ధ్యంతో ప్రపంచ
క్రమంలో భారతదేశం ప్రాముఖ్యత ప్రపంచ పునర్నిర్మాణ ఆవశ్యకత భావనగా హైలైట్ అవుతోంది. సరికొత్త,
అత్యంత క్రియాశీల యువ భారతదేశంలో డిజిటల్ నైపుణ్యాల ద్వారా డిజిటల్ అక్షరాస్యతను వేగంగా
స్వీకరించడం ద్వారా భారతదేశం నిజమైన డిజిటల్ ప్రజాస్వామ్యానికి సిద్ధంగా ఉంది. అందువల్ల ప్రపంచ
వ్యవస్థలో మార్పును ప్రభావితం చేసే శక్తి భారతదేశానికి ఉంది అని శామ్ పిట్రోడా ఈ పుస్తకం ద్వారా
వ్యక్తపరుస్తున్నారు.

1 2 3 6