సింగనమలలో శైలజానాథ్ కే అవకాశాలు ఎక్కువ..?

మే 5,2024: మాజీ మంత్రి సింగనమల (ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు సాకే శైలజానాథ్. ఇదే నియోజకవర్గం నుంచి 2004, 2009లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన డాక్టర్ Y.S రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ప్రాథమిక విద్య మంత్రి గా పనిచేశారు. జనవరి 2022 నుంచి డిసెంబర్ 2023 వరకు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనంతపురం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్టీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ జిల్లా నుంచి పోటీ చేసి గెలిచారు. మరికొద్ది రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు జరగనున్న తరుణంలో అనంతపురం జిల్లాలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ వంటి పార్టీల మధ్య పోటీ నెలకొంది. అయితే అనూహ్యంగా శింగనమల నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. అధికార వైసీపీ, టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తోందని సమాచారం.

2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి నాయకత్వం వహించారు. ఈసారి శింగనమల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శైలజానాథ్ పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి తొలిసారి వీరాంజనేయులు బరిలో నిలవగా, టీడీపీ నుంచి బండారు శ్రావణి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు.

అయితే కూటమి నుంచి బండారు శ్రావణికి సహకరించే పరిస్థితులు అంతగా లేవు. గతంలో శింగనమలలో టీడీపీ సీనియర్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అయితే శ్రావణిపై కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకంగా ఉన్నారు. శైలజా నాథ్ కి ఇది కొంచెం కలిసొచ్చే అంశం. కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ఇతర పార్టీల్లోనూ శైలజానాథ్ కు అభిమానులున్నారు. ఇప్పుడు ఇది శైలజ నాథ్‌కి ప్లస్‌గా మారనుంది.

శింగనమల నియోజకవర్గంలో శైలజానాథ్ సామాజికవర్గానికి చెందిన వారు చాలా మంది ఉన్నారు. ఇది చూస్తుంటే వైసీపీ, టీడీపీ పార్టీలకు శైలజానాథ్ తలనొప్పిగా మారుతున్నారు. ఆయన నామినేషన్ సందర్భంగా కూడా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఆయనతో సెల్ఫీలు దిగడమే కాకుండా శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున చేసిన అభివృద్ధి శైలజానాథ్ కు కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మరి ఈ త్రిముఖ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి.

Leave a Reply