శాం పిట్రోడా రాసిన రీడిజైన్ ద వరల్డ్ పుస్తకాన్ని తెలుగులో ఆవిష్కరించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, జనవరి 8, 2024: ‘రీడిజైన్ ద వరల్డ్’ పుస్తకం తెలుగు అనువాదాన్ని బంజారా హిల్స్ లొని హోటల్ తాజ్ కృష్ణలో గల సెఫైర్ బాంక్వెట్ హాల్ లో ఆవిష్కరించారు.శాం పిట్రోడా రాసిన ఈ పుస్తకాన్ని పోలదాసు నరసింహారావు తెలుగులోకి అనువదించగా, డాక్టర్ డి. చంద్రశేఖర్ రెడ్డి సంపాదకుడిగా వ్యవహరించారు.

శాం పిట్రోడా ఈ కార్యక్రమంలో జూం కాల్ ద్వారా పాల్గొన్నారు. ముఖ్య అతిథులలో తెలంగాణ ఉప
ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి శ్రి ఎం.ఎం. పళ్ళం రాజు ఉన్నారు. గౌరవ
అతిథులుగా మాజీ ఎం.పి. మధు యాష్కీ గౌడ్, పరకాల ప్రభాకర్, మాజీ ఎం.పి. వుండవల్లి అరుణ్
కుమార్, ఎమ్మెల్యే మదన్ మొహన్ ఋఆవు, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మరెడ్డి వెంకటేశ్వర్లు, ఐపీఎస్ వి.వి.

లక్ష్మీనారాయణ, ఐపీఎస్ ఎన్. సాంబశివ రావు, ఐఏఎస్ కె.ఎన్.కుమార్ పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ
సందర్భంగా క్వాడ్ జెన్ వైర్ లెస్ సొల్యుషన్స్ చైర్మన్ సీఎస్ రావు మాట్లాడుతూ, “ఈ కార్యక్రమంలో
పాల్గొనడం, ఇలాంటి ఉన్నత నాయకులు, మేధావులతో వేదికను పంచుకోవడం గౌరవంగా
భావిస్తున్నాను. ‘రీడిజైన్ ది వరల్డ్’ పుస్తకానికి ఈ తెలుగు అనువాదం యొక్క ప్రాముఖ్యతను
తెలియజేస్తుంది. ఈ పుస్తకం ప్రపంచక్రమం ఎలా, ఎందుకు మారాలి, హైపర్ కనెక్టివిటీ ప్రపంచాన్ని ఎలా
మార్చగలదో సూచిస్తుంది. ఈ తెలుగు అనువాదాన్ని శ్రీ పి.ఎన్.రావు తన అద్భుతమైన కృషితో,
హైదరాబాదుకు చెందిన ఎమెస్కో ప్రచురణ సంస్థ సహకారంతో చేశారు. ఇది ప్రజాదరణ పొందిన పుస్తకంగా
మారుతుందని ఆశిస్తున్నాను. ప్రపంచ నిర్మాణం గురించి, భారతదేశ ఎదుగుదలపై దాని ప్రభావం గురించి
రాసిన ఈ తెలుగు అనువాదాన్ని నిజమైన ఆందోళనలను చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు
మాట్లాడే ప్రజలు మనమంతా చదవడానికి అర్హమైనది” అన్నారు.
తనకు తెలుగు అనువాద హక్కులు ఇచ్చినందుకు శామ్ పిట్రోడాకు సి.ఎస్.రావు కృతజ్ఞతలు
తెలియజేశారు. శ్రీ విజయ్ కుమార్ నేతృత్వంలోని ఎమెస్కో అనే అత్యంత ప్రజాదరణ పొందిన,
చరిత్రాత్మకంగా స్థాపించిన తెలుగు ప్రచురణ సంస్థకు కూడా తన కృతజ్ఞతలు తెలియజేశారు.

“రీడిజైన్ ది వరల్డ్” పుస్తకంపై శాం పిట్రోడా ఓవర్ వ్యూ
“రీడిజైన్ ది వరల్డ్” మరియు “ప్రపంచానికి కొత్తరూపం ఇద్దాం. కదలిరండి” అనే ఈ పుస్తకం ప్రపంచం
ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి మూల కారణాలను పూర్తిగా స్పష్టంగా గుర్తించడం ద్వారా
ప్రపంచసమస్యల గురించి చాలా తెలివైన వివరణ. బాగా గుర్తించిన ప్రపంచ సమస్యలకు
ఆచరణాత్మకమైన, ఆచరణీయమైన పరిష్కారంగా స్పష్టమైన మేనిఫెస్టోను శాం ఈ పుస్తకం ద్వారా
సూచించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డెమోక్రటైజేషన్, వికేంద్రీకరణ, డీమానిటైజేషన్ అనే మూడు ప్రత్యేక కోణాలు ప్రపంచ వ్యవస్థను మార్చేందుకు దోహదపడ్డాయని శామ్ పిట్రోడా పేర్కొన్నారు.

ఇంటర్నెట్ ద్వారా
ప్రజాస్వామ్యీకరణ అందరికీ జ్ఞానం, విద్య, వినోదం, షాపింగ్, బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ, రవాణాకు
వికేంద్రీకృత అందుబాటును ఈ కొత్త ప్రపంచంలో హైపర్ కనెక్టివిటీ ద్వారా అనుమతిస్తుంది. మొబైల్
వాలెట్లు, పేమెంట్స్, బ్యాంకింగ్ ఆఫర్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లు మన సమాజం, నాగరికతల భవిష్యత్తును
తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
ఎప్పుడో 50 ఏళ్ల క్రితం నాటి ప్రపంచశక్తుల ప్రభావం, ఔచిత్యం ఇప్పుడు ఎలా ఉంటాయని, అమెరికా,
రష్యా, యుకె, నాటో, చైనా తదితర సూపర్ పవర్స్ ఇంకా ఎందుకని శాం పిట్రోడా ప్రశ్నిస్తున్నారు.
భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి నిర్మాణాత్మక మార్పు, జనాభా, డిజిటల్ డివిడెండ్ సామర్ధ్యంతో ప్రపంచ
క్రమంలో భారతదేశం ప్రాముఖ్యత ప్రపంచ పునర్నిర్మాణ ఆవశ్యకత భావనగా హైలైట్ అవుతోంది. సరికొత్త,
అత్యంత క్రియాశీల యువ భారతదేశంలో డిజిటల్ నైపుణ్యాల ద్వారా డిజిటల్ అక్షరాస్యతను వేగంగా
స్వీకరించడం ద్వారా భారతదేశం నిజమైన డిజిటల్ ప్రజాస్వామ్యానికి సిద్ధంగా ఉంది. అందువల్ల ప్రపంచ
వ్యవస్థలో మార్పును ప్రభావితం చేసే శక్తి భారతదేశానికి ఉంది అని శామ్ పిట్రోడా ఈ పుస్తకం ద్వారా
వ్యక్తపరుస్తున్నారు.

Leave a Reply