కందుకూరు నియోజకవర్గం నాయకులు ఉన్నం నళిని దేవి ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుకలు..

తెలుగు సూపర్ న్యూస్,జనవరి 24,2024 : కందుకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్న నళిని దేవి గారి ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా నళినీ దేవి కేక్ ను కట్ చేశారు. అనంతరం కందుకూరులోని పారిశుధ్య కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు.

అనంతరం ఈ క్రమంలో నళిని దేవీ గారు మాట్లాడుతూ.. నారా లోకేష్ జీవితం నేటి యువతరానికి ఆదర్శమని, కృషి, పట్టుదలతో ప్రజల నుంచి నాయకుడిగా ఎదిగిన ఘనత లోకేష్‍కే దక్కిందన్నారు. రాష్ట్ర ప్రజలే తన కుటుంబంగా భావించి 3,200 కిలోమీటర్లకు పైగా ప్రజాగళమే తన గళమై ముందుకు సాగి పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారన్నారు.

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కార్యకర్తల సంక్షేమ నిధి సృష్టికర్తగా నిరంతరం కార్యకర్తలకు అండగా ఉంటూ వారి సంక్షేమాన్ని భుజానికెత్తుకొని వేలాది మంది కార్యకర్తలను ఆదుకోవడమే కాక.. వారిలో మనోధైర్యాన్ని నింపారన్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామాల్లో 23 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, ఎల్‍ఈడీ బల్పులతో పాటూ గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.

మరోవైపు ఐటీ శాఖ మంత్రిగా పెట్టుబడులు, కంపెనీలు తెచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయఢంక మోగించడం ఖాయమని నళినీ దేవి అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply