నిరుపేదల అభ్యున్నతే కాంగ్రెస్ ధ్యేయం : జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్

తెలుగు సూపర్ న్యూస్,ఫిబ్రవరి 5,2024: తెలంగాణలో దొరల పాలన పోయి సామాన్యుల పాలన వచ్చిందని, నిరుపేదల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు జ్యోతి భీమ్ భరత్ పేర్కొన్నారు. ఈరోజు మణికొండ లో ప్రగతి శీల మహిళా సంఘం నాయకురాలు జేబా రహిమాన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ,మణికొండ మున్సిపల్ చైర్మన్ అయిన కస్తూరి నరేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారెంటీల అమలు సమర్థ వంతంగా జరుగుతాయి అన్నారు. కస్తూరి నరేందర్ మాట్లాడుతూ త్వరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నందున గులాబీ దొరలు మళ్ళీ మొసలి కన్నీరు కారుస్తూ ఓట్ల కోసం వచ్చే ప్రమాదం ఉందన్నారు. గులాబీ, కాషాయ దళాలు రెండూ ఒకటే నని పేదోడి గురించి ఆలోచించేది కాంగ్రెస్ ఒక్కటే అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి అని కోరారు. కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన జేబా రహిమాన్ కు మహిళా సమస్య ల కోసం, పేదల అభ్యున్నతి కోసం ఉద్యమాలు చేసిన చరిత్ర ఉందన్నారు. ఆమె సేవలు కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటుంది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,సంగం కిరణ్ కుమార్ , కౌన్సిలర్లు కే. లావణ్య, లక్ష్మీనారాయణ, శ్వేత, మణికొండ కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply