రాక్ స్టార్ యశ్ నటించిన… రారాజు… ట్రైలర్ ను రిలీజ్ చేసిన డైరెక్టర్ వి వి వినాయక్

స్టార్, రాక్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన చిత్రం రారాజు.కన్నడలో విడులై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో జూన్ ద్వితీయార్థంలో బారీ ఎత్తున రిలీజ్ చేయబోతుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ను మెగా డైరెక్టర్ వి వి వినాయక్ విడుదల చేసారుఈ సందర్భంగా డైరెక్టర్ వి వి వినాయక్ గారు మాట్లాడుతూ: పద్మావతి పిక్చర్స్ సుబ్బారావు గారు గత 25 సంవత్సరాలనుంచీ ఎన్నో సినిమాలను రిలీజ్ చేశారు. నాకు బాగా కావాల్సిన వ్యకి. ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్ లోకి వస్తున్నారు. యష్ .. కే జీ ఎఫ్ సినిమా కు ముందు నటించిన సినిమాని తెలుగులో రారాజు పేరుతో పద్మావతి పిక్చర్స్ బ్యానర్ లో జూన్ లో రిలీజ్ అవుతుంది.ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. మరిన్ని మంచి సినిమా లు పద్మావతి పిక్చర్స్ బ్యానర్ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.నిర్మాత: వి.ఎస్.సుబ్బారావు గారు మాట్లాడుతూ: పద్మావతి పిక్చర్స్ బ్యానర్ లో కన్నడ రాక్ స్టార్ యశ్ నటించిన రారాజు చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలోజూన్ లో రిలీజ్ చేస్తున్నాము. మా ట్రైలర్ ను రిలీజ్ చేసిన మెగా డైరెక్టర్ వి వి వినాయక్ గారికి కృతజ్ఞతలు యశ్ అతని భార్య రాధిక పండిట్ ఇద్దరు కలిసిన నటించిన చిత్రం కన్నడ లో సూపర్ హిట్ అయినట్టు తెలుగు లో కూడా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని అన్నారు.రాక్ స్టార్ యశ్ , హీరోయిన్ రాధిక పండిట్, కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు ప్రధాన తారాగణంపద్మావతి పిక్చర్స్ బ్యానర్మ్యూజిక్ హరికృష్ణడీ ఓ పి.. ఆండ్రూనిర్మాత.. వి ఎస్. సుబ్బారావుడైరెక్టర్ . మహేష్ రావు

ఆచార్య ట్రైలర్ వచ్చేసింది … ఇది స్టోరీ

మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య .. డైరెక్టర్ కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు . ఆచార్య సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. . ఆచార్య సినిమా లో రామ్ చరణ్ ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు , ఈ రోల్ కోసం ముందుగా డైరెక్టర్ కొరటాల శివ మహేష్ బాబు ను అనుకున్నారు , కానీ ఆ తర్వాత అనుకోకుండా రామ్ చరణ్ ఎంటరయ్యారు .. ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి – మరియు రామ్ చరణ్ కు సంబంధించి ఇద్దరినీ చూపిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో ఈ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఆచార్య సినిమా లో రామ్ చరణ్ కు సంబంధించి ఇటీవలే నీలాంబరి అనే సాంగ్ రిలీజ్ చేయాగా ఈ సాంగ్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది .. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది . ఆచార్య సినిమా రామ్ చరణ్ చేస్తున్న రోల్ గురించి తెలుపుతూ చిన్న టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ ,ఈ సినిమా లో రామ్ చరణ్ సిద్దా అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు . ఆచార్య సినిమాలో రామ్ చరణ్ రోల్ కు సంబంధించి టీజర్ చూస్తుంటే ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది .. ఈ సినిమాలో రామ్ చరణ్ ధర్మస్థలి కి చెందిన వ్యక్తిగా సిద్దా క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు … ఇక అసలు విషయానికి వెళ్ళితే .. మెగా అభిమానులు ఆచార్య మూవీ ట్రైలర్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు . ఫైనల్ గా అనుకున్న తేదికి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ .. భరత్ అనే నేను మూవీ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ మెగా స్టార్ తో మూవీ ఎనౌన్సుమెంట్ చేసిన్నప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టారు ..ఈ మూవీ కోసం టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు , కొరటాల శివ ఈ మూవీ మేకింగ్ కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు …

మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ తో కలిసి మొదటగా మఘదీర మూవీ లో ఇంట్రొడక్షన్ సాంగ్ లో కనిపించి కాసేపు చిన్న డాన్స్ స్టెప్స్ తో ప్రేక్షకులను అలరించారు .. అలాగే మెగా స్టార్ మగధీర మూవీ తరువాత చాలా లాంగ్ గ్యాప్ తరువాత బ్రూస్లీ , ఖైదీ no 150 సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ,,ఇక అసలు విషయానికి వెళ్ళితే .. మెగా అభిమానులు – రామ్ చరణ్ – మెగా స్టార్ కాంబినేషన్ లో మూవీ రావాలి అని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు .. సరైన సబ్జెక్ట్ సరైన డైరెక్టర్ దొరికితే చేద్దాము అని మెగా స్టార్ చిరంజీవి చాలా సందర్భాల్లో తెలిపారు .. ఇక అలాంటి సమయంలో డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమా స్టోరీ మెగా స్టార్ చిరంజీవికి చెప్పడం , ఒక స్పెషల్ పవర్ ఫుల్ రోల్ రామ్ చరణ్ కు డిజైన్ చేయడం , ఆ రోల్ కు రామ్ చరణ్ కు సెట్ అవ్వడంతో ఈ కాంబినేషన్ సెట్ అయింది .. మొత్తానికి మెగా అభిమానులు – రామ్ చరణ్ ను మెగా స్టార్ చిరంజీవి ని ఒకే బిగ్ స్క్రీన్ మీద చూడాలి అన్న కోరికను డైరెక్టర్ కొరటాల శివ నెరవేరచ్చారు ……. చిరంజీవి – రామ్ చరణ్ లు ఇద్దరు కలిసి చేసిన మగధీర మూవీ , బ్రూస్లీ ,ఖైదీ no 150 మూవీ లో స్క్రీన్ టైమ్ కాసేపు అయిన ఇద్దరు విజువల్స్ మెగా అభిమానులకు పెద్ద పండగ ..ఇక వీరిద్దరూ బిగ్ స్క్రీన్ మీద , డైలాగ్స్ , ఫైట్స్ , సెంటిమెంట్ సీన్స్ తో మరి కాస్త సేపు బిగ్ స్క్రీన్ మీద కనబడితే ఎలా ఉంటుందో తెలియాలి ఆచార్య మూవీ లో రామ్ చరణ్ రోల్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది .. ఇది చిరంజీవి నటించిన 152వ చిత్రం కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకల్లో ఎంపిక చేసిన 152 థియేటర్లలో ప్రకటించిన సమయానికి ‘ఆచార్య’ ట్రైలర్ ను ప్రదర్శించారు.“దివ్యవనమొకవైపు… తీర్థజనమొకవైపు… నడుమ పాదఘట్టం…” అంటూ రామ్ చరణ్ వాయిస్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. “ఆపద వస్తే ఆ అమ్మోరు తల్లే మమ్మల్ని ఆవహించి ముందుకు పంపుతుంది…” అంటూ యాక్షన్ మొదలవుతుంది. తమ ‘ధర్మస్థలిని అధర్మస్థలి ఎలా అవుతది?’ అనే ప్రశ్న వినిపిస్తుంది. సుమారు 2 నిమిషాల 32 సెకండ్ల పాటు రూపొందిన ఈ ట్రైలర్ లో అభిమానులను అలరించే పలు అంశాలు చోటు చేసుకున్నాయి. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ బాగా హై లైట్ .. ఇక ఈ మూవీ ట్రైలర్ లో రామ్ చరణ్ వాయిస్ , అలానే రామ్ చరణ్ షాట్స్ డైరెక్టర్ కొరటాల శివ చాలా బాగా డిజైన్ చేసారు ..ఇక ఈ మూవీ లో విలన్ రోల్ చేసిన సోనూసూద్ క్యారెక్టర్ పూర్తిగా రివీల్ చేయలేదు కానీ , మెగా స్టార్ సోనూసూద్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ చాలా న్యాచురల్ గా ఉంది .. చివరలో “సిద్ధా తెలుసా మీకు…” అంటూ తనికెళ్ళ భరణి, చిరంజీవిని ప్రశ్నించగానే “కామ్రేడ్…” అంటూ పిలుపు వినిపిస్తుంది. దీనిని బట్టి, ‘ఆచార్య’లో నక్సలిజమ్ నేపథ్యం కూడా చోటు చేసుకుందని తెలిసిపోతుంది. .ఆచార్య మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకేకించారు . డైరెక్టర్ కొరటాల శివ డ్రీమ్ ప్రాజెక్ట్ – మెగా అభిమానుల ఇంత కాలం ఎదురుచూసిన ట్రైలర్ లో ఎలాంటి అంశాలు ఉంటే మెగా అభిమానులు ఇష్టపడతారో , ఆ అంశాలు , మాస్ ఎలిమెంట్స్ అన్ని బాగా శ్రద్ధ తీసుకొని కొరటాల శివ మెగా అభిమానులకు చూపించారు .మొత్తానికి ఆచార్య ట్రైలర్ కు మెగా అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది …

గాడ్ ఫాదర్ మూవీ లో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న స్టార్ డైరెక్టర్…

ఖైదీ నంబర్ 150 వ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి , ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని స్టైలిష్ డైరైక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సైరా నరసింహారెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .. తెలుగు తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరెకెక్కిన ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ , సాంగ్స్ విజువల్ గ్రాండియర్ , సురేందర్ రెడ్డి టేకింగ్ , పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది ..

సైరా నరసింహారెడ్డి మూవీ తరువాత .. చిరంజీవి కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా చేస్తున్నారు .. ఈ మూవీ కి సంబంధించి , మోషన్ పోస్టర్ , టీజర్ లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ త్వరలనే రిలీజ్ చేస్తాను అని అఫీషియల్ ఎనౌన్సుమెంట్…

ఆచార్య మూవీ తరువాత … మెగా స్టార్ చిరంజీవి చేతిలో వరుసగా సినిమాలు లైన్ లో ఉన్నాయి ..

ఇక అసలు విషయానికి వెళ్ళితే .. ఆచార్య సినిమా తరువాత మెగా స్టార్ మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు .. ఈ మూవీ నుండి రోజు ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తూనే ఉంది .. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చాలా శెరవేగంగా జరుగుతుంది ..

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది ..ఈ మూవీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఒక కీ రోల్ లో నటిస్తున్నట్లు మూవీ టీమ్ అఫీషియల్ ఎనౌన్సమెంట్ చేసింది .. మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ కోసం పూరీ చాలా స్టోరీస్ రెడీ చేశారు , కానీ అప్పటికి అవి ఫైనలైజ్ కాక చిరు ఖైదీ నెంబర్ 150 వ సినిమా చేశారు .. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .. అయితే పూరీ కూడా మెగా స్టార్ తో ఎప్పటికైనా సినిమా చెయ్యాలని పట్టుదలతో ఉన్నాడు . మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్ పూరీ జగన్నాద్ కు గాడ్ ఫాదర్ మూవీ లో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కింది . గాడ్ ఫాదర్ మూవీ లో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఒక కీ రోల్ లో నటిస్తున్నారు అని మెగా స్టార్ చిరంజీవి అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది .. మరి అసలు గాడ్ ఫాదర్ మూవీ లో పూరీ చేయబోయే పాత్ర ఎలా ఉండబోతోంది . పూరీ స్క్రీన్ టైమ్ ఈ మూవీ లో ఎంత సేపు ఉండబోతోందో ..తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే…


ఆర్ ఆర్ ఆర్ మూవీ రివ్యూ…

బాహుబలి రెండు పార్ట్స్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ అవ్వడం తో పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు దర్శకధీరుడు రాజమౌళి ……….. తెలుగు సినీ పరిశ్రమలో డైరెక్టర్ బి ఎన రెడ్డి తరువాత , విజువల్ వండర్ ని స్క్రీన్ మీద క్రియేట్ చేసే దర్శకుడు అతను .. శిల్పి శిల్పాన్ని తీర్చి దిద్దే నేర్పరి అతను , అపజయం ఎరుగని విజయ్ ధీరుడు .. ఒక కొత్త ప్రపంచము లోకి ప్రేక్షకుడిని తీసుకు వెళ్లే మంత్రగాడు .. తెలుగు సినిమా కి ఇంటర్నేషనల్ స్థాయి లో గుర్తింపు తీసుకు వచ్చిన దర్శక ధీరుడు , అతనే ఎస్ ఎస్ రాజమౌళి .. అలానే రాజమౌళి ఏ సినిమా చేసిన ప్రాణం పెట్టి చేస్తారు , ఇటు హీరోకు స్టార్ ఇమేజ్ ,అటు ప్రొడ్యూసర్ కు మంచి పేరు టేబుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చే వన్ అండ్ ఓన్లీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి .. అమృతం సీరియల్ తో మొదలు అయిన తన కెరీర్ , ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ వరకు వెల్లింది అంటే దాని వెనుక రాజమౌళి పడిన తపన , హార్డ్ వర్క్ , డెడికేషన్ . ఇక అసలు విషయానికి వెళ్ళితే జక్కన్న డైరెక్ట్ చేసిన బాహుబలి రెండు పార్ట్స్ భారీ విజయం అందుకొని , పాన్ ఇండియా మార్కెట్ , పాన్ ఇండియా డైరెక్టర్ , పాన్ ఇండియా హీరో పాన్ ఇండియా స్టోరీ తో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుకొని , డైరెక్టర్ రేంజ్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరారు దర్శకదీరుడు రాజమౌళి … బాహుబలి రెండు పార్ట్స్ భారీ విజయం అందుకోవడంతో .. డైరెక్టర్ రాజమౌళి కొంత గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ , ఎన్టీఆర్ తో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీని తెరకెక్కించారు .. ఈ కాంబినేషన్ , అలానే పేట్రియాటిక్ స్టోరీ కావడంతో , ఈ మూవీ పై ప్రేక్షకుల్లో హై ఎక్సపెక్టేషన్స్ నెలకొన్నాయి .. ఇక డైరెక్టర్ రాజమౌళి తొలిసారిగా ఒక ఫిక్షన్ స్టోరీని తీసుకొని తన ఊహ ను జ్యోడించి ఈ సినిమాను భారీ కాస్టింగ్ తో తెరకెక్కించారు .. రాజమౌలి సినిమా అంటేనే ఒక పెద్ద విజువల్ గ్రాండియర్ , సెట్స్ , గ్రాఫిక్స్ , మరియు ఎమోషన్ , యాక్షన్ ఎలిమెంట్స్ , సెంటిమెంట్స్ ఇలా అన్ని కలిసి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉంటుంది .. డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఎన్టీఆర్ , మరియు రామ్ చరణ్ ఇద్దరు సినిమాలు చేశారు , వీరిద్దరి స్టామినా ఏమిటో అలానే వీరిద్దరి యాక్టింగ్ టాలెంట్ ,అలానే వీరిద్దరి ని కలిపి ఒకే బిగ్ స్క్రీన్ పై ప్రెజెంట్ చెయ్యాలంటే ఒక్క రాజమౌళి కె బాగా తెలుసు .., ఈ సినిమాకు రైటర్ గా విజయేంద్రప్రసాద్ కధ అందించారు . స్టోరీ రెడీ , కధ అయితే మాములుగా లేదు ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు , మరియు కొమరం భీమ్ ఇద్దరు క్యారెక్టర్స్ చుట్టూ అల్లుకున్న ఫిక్షన్ డ్రామా గా బ్యాలెన్స్ చేస్తూ స్టోరీ స్క్రీన్ ప్లే పక్కాగా కుదిరింది .. పాన్ ఇండియా సినిమా అంటేనే భారీ సెట్స్ ,భారీ ఖర్చు , భారీ గ్రాఫిక్స్ , ఇలా అన్ని భారీగానే ఉంటాయి , ఈ సినిమాను దాదాపుగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు .ఎన్టీఆర్ , రామ్ చరణ్ పడిన కష్టం స్క్రీన్ మీద బాగా కనబడుతుంది , . పీరియాడిక్ ఫిక్షన్ డ్రామా గా తెరెకెక్కిన సినిమా కాబట్టి రాజమౌళి సినిమా విజువల్స్ విషయంలోనూ , సెట్స్ విషయంలోనూ , మరియు గ్రాఫిక్స్ , కాస్టింగ్ విషయం లోను చాలా శ్రద్ధ తీసుకున్నారు అని ఫిల్మ్ క్రిటిక్స్ చెబుతున్నారు .. అదే విధంగా ఇద్దరు కలిసి డాన్స్ చేసే విజువల్స్ ,మరియు ఎన్టీఆర్ సెంటిమెంట్ తో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి .. ఎన్టీఆర్ , రామ్ చరణ్ స్నేహబంధం గురించి తెలిపే ప్రతి సీన్ డైరెక్టర్ రాజమౌళి అద్భుతముగా తెరకెక్కించారు ..ఇక బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తన వీరత్వం చూపిస్తూ పోరాడే సీన్స్ మరో హై లైట్ , మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి ఈ సినిమాకు ప్రాణం పెట్టి పని చేశారు ,ముఖ్యంగా రీ రికార్డింగ్ సినిమాకు మరో లెవెల్ కు తీసుకొని వెల్లింది ..అలానే డైలాగ్స్ రాసిన సాయి మాధవ్ బుర్ర గారు ఒక్కో డైలాగ్ ఒక్కో బులెట్ లా పేలాయి .. ఫైనల్ గా ఈ సినిమా కి పని చేసిన సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ తన గ్రాండ్ విజువల్స్ తో సినిమాను మరో స్థాయి కి తీసుకువెళ్లారు …. రాజమౌళి చెక్కిన మరో అద్భుతం , రాజమౌళి పడిన కష్టం నిర్మాతలు పెట్టిన ప్రతి రూపాయి ప్రతి షాట్ లో కనబడుతుంది . ఇక ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. ఓవర్సీస్ లో కూడా షోలు పడటంతో టాక్ బయటకి వచ్చేసింది. సినిమా చూసిన వారంతా రాజమౌళి దర్శకత్వానికి, ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనని పొగుడుతున్నారు. సినిమా అద్భుతం, అదిరిపోయింది అంటూ ప్రశంసిస్తున్నారు. ఫ్యాన్స్, ప్రేక్షకులు నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు…

ఈ మూవీ లో రామ్ చరణ్ అల్లరి సీతారామరాజు పాత్రలో కనిపించారు .. ఈ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ పడిన కష్టం ప్రతి షాట్ లోను కనబడుతుంది .. అలానే ఈ మూవీ కోసం రామ్ చరణ్ తన డైలాగ్ డెలివరీ యాక్టింగ్ , స్టంట్స్ , యాక్షన్ సీన్స్ కోసం చాలా శ్రద్ద తీసుకొని బాగా కష్టపడ్డాడు , ఆ కష్టానికి తగ్గిన ప్రతిఫలం ఈ రోజున బిగ్ స్క్రీన్ మీద కనబడుతుంది

…ఎన్టీఆర్‌ ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ప్రాణం పెట్టి వర్క్ చేశారు .. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ అందరి హృదయాలను గెలుచుకున్నారు .ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసం ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి దొరికిన నిజ‌మైన రెండు శ‌క్తులు ఎన్టీఆర్‌, రామ్‌చ‌రణ్‌. ఆయ‌న మొద‌లు పెట్టిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యుద్ధాన్ని వెదుక్కుంటూ వ‌చ్చిన రెండు ప‌దునైన ఆయుధాల్లాగే మారిపోయారు. కొమరం బీమ్ పాత్ర‌ల్లో ఒదిగిపోయిన తీరు, పోరాట ఘ‌ట్టాల్లో అభిన‌యం చాలా బాగుంది. ‘నాటు నాటు’ పాట‌లో ఇద్ద‌రూ క‌లిసి సింక్‌లో డ్యాన్స్ చేసిన తీరు చూస్తూ క‌ళ్లు తిప్పుకోలేం.కీరవాణి గురించి …ఈ సినిమాకు అతి పెద్ద ఎసెట్‌ కీరవాణి సంగీతం. పాటల్లోనూ, నేపథ్యసంగీతంతోనూ సినిమాకు ప్రాణం పోశారు .. ఇక ఈ మూవీ లోని అన్ని సాంగ్స్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది టెక్నీకల్ డీటెయిల్స్ :: ప్రతి షాట్‌నీ, ప్రతి సీన్‌నీ ఇంట్రడక్షన్‌ సీన్‌లా తీయాలనే రాజమౌళి ఆలోచనకు ఫిదా ఆవలిసిందే ..ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ , ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే అందరూ టెక్నీకల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ..లొకేషన్లు, కెమెరా వర్క్ చాలా అద్భుతంగా ఉంది కెమెరా మెన్ సెంథిల్ రాజమౌళి విజువలైజేషన్ తగ్గట్టు గా ప్రతి ప్రేఫ్ ని చక్కిని పెయింటింగ్ లా చెక్కినట్లు బిగ్ స్క్రీన్ మీద కనబడుతుంది ……….. ఇక ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ అందించిన సెట్స్ , మినియేచర్స్ , రామోజీ ఫిల్మ్ సిటీ సెట్స్ అన్ని చాలా గ్రాండియర్ ని తీసుకొచ్చాయి ……..

రాజమౌళి గురించి :: రాజమౌళి ఏ సినిమా మొడులు పెట్టిన ప్రాణం పెట్టి పనిచేస్తాడు .. ప్రతి ఫ్రెమ్ , ప్రతి షాట్ , ప్రతి సీన్ అద్భుతంగా వచ్చేంతవరకు కష్టపడుతూనే ఉంటాడు .. ఇక కెరీర్ బిగినింగ్ నుండి తాను తెరకెక్కించి న మూవీస్ అన్ని నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చాయి అనడం లో ఎటువంటి సందేహం లేదు ……… , ఇటు హీరోకు స్టార్ ఇమేజ్ ,అటు ప్రొడ్యూసర్ కు మంచి పేరు మంచి , టేబుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చే వన్ అండ్ ఓన్లీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి .. బాహుబలి మూవీ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగారు రాజమౌళి , ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా తో జక్కన పేరు వరల్డ్ వైడ్ మార్కెట్ లో తన పేరు మారుమోగిపోతుంది .. నాలుగు సంవత్సరాల సినిమా, మూడు సంవత్సరాల మేకింగ్ ప్రాజెక్ట్ .. ఒక తపస్సు లా చేసిన ఈ మూవీ రాజమౌళి కెరీర్ ని మరో మెట్టు ఎక్కించింది…

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్…”భోళా శంకర్” నుంచి ‘స్వాగ్ ఆఫ్ భోళా’ విడుదల…

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాసివ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “భోళా శంకర్”. ఈ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ మేహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఇవాళ ఈ సినిమాలోని ప్రీ లుక్ పోస్టర్ స్వాగ్ ఆఫ్ భోళాను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

స్వాగ్ ఆఫ్ భోళాలో కంప్లీట్ మాస్ లుక్ లో ఉన్న మెగాస్టార్ స్టైలిష్ మేకోవర్ అదిరిపోయింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు స్వాగ్ ఆఫ్ భోళా న్యూ ఇయర్ గిఫ్ట్ గా భావించవచ్చు. స్వాగ్ ఆఫ్ భోళాతో పాటు సినిమా థీమ్ మ్యూజిక్ తో విడుదల చేసిన మోషన్ వీడియో కూడా ఆకట్టుకుంటోంది.

మెగాస్టార్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా నటిస్తున్న భోళా శంకర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో కీలక షెడ్యూల్ ను ఇటీవలే కంప్లీట్ చేశారు. కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించనుంది.

యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. డడ్లీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథా పర్యవేక్షణ సత్యానంద్.. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఏ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు – చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రశ్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు


ఆర్ ఆర్ ఆర్ మూవీ ట్రైలర్ రివ్యూ …

రాజమౌళి , ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డైరెక్టర్ రాజమౌళి తొలిసారిగా ఒక ఫిక్షన్ స్టోరీని తీసుకొని తన ఊహ ను జ్యోడించి ఈ సినిమాను భారీ కాస్టింగ్ తో తెరకెక్కించారు .. రాజమౌలి సినిమా అంటేనే ఒక పెద్ద విజువల్ గ్రాండియర్ , సెట్స్ , గ్రాఫిక్స్ , మరియు ఎమోషన్ , యాక్షన్ ఎలిమెంట్స్ , సెంటిమెంట్స్ ఇలా అన్ని కలిసి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉంటుంది .. డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఎన్టీఆర్ , మరియు రామ్ చరణ్ ఇద్దరు సినిమాలు చేశారు , వీరిద్దరి స్టామినా ఏమిటో అలానే వీరిద్దరి యాక్టింగ్ టాలెంట్ ,అలానే వీరిద్దరి ని కలిపి ఒకే బిగ్ స్క్రీన్ పై ప్రెజెంట్ చెయ్యాలంటే ఒక్క రాజమౌళి కె బాగా తెలుసు .. రాజమౌళి ని టాలీవుడ్ లో అందరూ జక్కన్న అంటారు , ఏది అయిన ఒక సినిమా మొదలు పెట్టాడు అంటే అది పూర్తి అయ్యేంతవరకు నిద్రపోరు , అలానే తన కుంటుంబం తన బలం , తన ప్రతి సినిమాకు తన కుంటుంబం అంతా కలిసి కష్టపడి పని చేస్తుంది .. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయానికి వస్తే , బాహుబలి సినిమా తర్వాత డైరెక్టర్ రాజమౌళి ఒక మల్టీ స్టారర్ సినిమా చేద్దాము అనుకున్నారు , ఈ సినిమాకు రైటర్ గా విజయేంద్రప్రసాద్ కధ అందించారు . స్టోరీ రెడీ , కధ అయితే మాములుగా లేదు ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు , మరియు కొమరం భీమ్ ఇద్దరు క్యారెక్టర్స్ చుట్టూ అల్లుకున్న ఫిక్షన్ డ్రామా గా బ్యాలెన్స్ చేస్తూ స్టోరీ స్క్రీన్ ప్లే పక్కాగా కుదిరింది .. పాన్ ఇండియా సినిమా అంటేనే భారీ సెట్స్ ,భారీ ఖర్చు , భారీ గ్రాఫిక్స్ , ఇలా అన్ని భారీగానే ఉంటాయి , ఈ సినిమాను దాదాపుగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు .. ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , లిరికల్ సాంగ్స్ , రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ . ఈ సినిమాకు సంబంధించి రోజు ఏదోఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వస్తూనే ఉంది ..

తాజాగా ఈ రోజున ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ .. అభిమానులకు ఈ ట్రైలర్ పెద్ద విజువల్ ట్రీట్ లా ఉంది . ఈ ట్రైలర్ చూస్తుంటే ఎన్టీఆర్ , రామ్ చరణ్ పడిన కష్టం కనబడుతుంది , సుమారు 3:15 నిముషాలు నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో రాజమౌళి టేకింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేశారు , ట్రైలర్ లో విజువల్స్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి , ట్రైలర్ లో మొదటగా రాజీవ్ కనకాల డైలాగ్ తో ప్రారంభమౌతుంది , ఎన్టీఆర్ ను కాపరిగా పరిచయము చేసే సీన్ ఎన్టీఆర్ పులి తో సమానంగా దాని దైర్యంగా ఎన్టీఆర్ నిలబడే సీన్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి .. , అలానే రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా పూర్తీ ఎమోషన్ తో చూపించిన తీరు రామ్ చరణ్ లోని కొత్త నటుడిని చూస్తారు . పీరియాడిక్ ఫిక్షన్ డ్రామా గా తెరెకెక్కుతున్న సినిమా కాబట్టి రాజమౌళి సినిమా విజువల్స్ విషయంలోనూ , సెట్స్ విషయంలోనూ , మరియు గ్రాఫిక్స్ , కాస్టింగ్ విషయం లోను చాలా శ్రద్ధ తీసుకున్నారు , అని ట్రైలర్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది .. ఇక ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ . రామ్ చరణ్ తో యాక్షన్ సీన్ లో ఇద్దరు కలిససుకుని పోరాడే సీన్స్ సినిమాకే పెద్ద హైలైట్ … అదే విధంగా ఇద్దరు కలిసి డాన్స్ చేసే విజువల్స్ ,మరియు ఎన్టీఆర్ సెంటిమెంట్ తో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి .. ఎన్టీఆర్ , రామ్ చరణ్ స్నేహబంధం గురించి తెలిపే ప్రతి సీన్ డైరెక్టర్ రాజమౌళి అద్భుతముగా తెరకెక్కించారు ..ఇక ఈ ట్రైలర్ లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కనిపించే ఒక్క షాట్ లో తన వీరత్వం చూపిస్తూ పోరాడే సీన్స్ మరో హై లైట్ , సినిమాలో మిగతా కాస్టింగ్ గురించి చెప్పాలంటే శ్రియ , సముద్రఖని , తమ పాత్రలకు న్యాయం చేశారు .. అలానే ఇందులో అలియా భట్ , ఒలివియా మోరీస్, సీన్స్ లో ఎమోషన్ ని బాగా చూపించారు , మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి ఈ సినిమాకు ప్రాణం పెట్టి పని చేశారు ,ముఖ్యంగా రీ రికార్డింగ్ సినిమాకు మరో లెవెల్ కు తీసుకొని వెల్లింది ..అలానే డైలాగ్స్ రాసిన సాయి మాధవ్ బుర్ర గారు ఒక్కో డైలాగ్ ఒక్కో బులెట్ లా పేలాయి .. ఫైనల్ గా ఈ సినిమా కి పని చేసిన సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ తన గ్రాండ్ విజువల్స్ తో సినిమాను మరో స్థాయి కి తీసుకువెళ్లారు ..ఇక ఈ సినిమాలో చివరి షాట్ లో రామ్ చరణ్ , మరియు ఎన్టీఆర్ ఇద్దరు కలిసి తిరగబడే సీన్ తో ఈ ట్రైలర్ పూర్తి అవుతుంది .. రాజమౌళి చెక్కిన మరో అద్భుతం , రాజమౌళి పడిన కష్టం నిర్మాతలు పెట్టిన ప్రతి రూపాయి ప్రతి షాట్ లో కనబడుతుంది .. ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఆనందానికి హద్దలు లేవు .అదే విధంగా ఈ ట్రైలర్ చూసిన ప్రతి దర్శకుడు రాజమౌళికి బెస్ట్ విషెస్ చెబుతున్నారు ..

రౌద్రం చూపిస్తున్న రామరాజు…

రామ రాజు పోస్టర్ అదుర్స్ ట్రైలర్ కోసం  వెయిటింగ్...
బాహుబలి సినిమా తో డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ చేరిపోయారు . రాజమౌళి . ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావడంలేదు ,ఈ సినిమాకు సంబంధించి మొదటాగా రామ్ చరణ్ , మరియు ఎన్టీఆర్ క్యారెక్టర్స్ ప్రేక్షకులకు పరిచయము చేస్తూ మోషన్ పోస్టర్స్ రిలీజ్ చేయగా అభిమానుల్లో మంచి రెస్పాన్స్ లభించింది .. ఆర్ ఆర్ ఆర్ సినిమా లో రామ్ చరణ్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు .. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి , రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే చిన్న హింట్ ఇచ్చేసారు .. రామ్ చరణ్ టీజర్ మొదటగా ఎన్టీఆర్ వాయిస్ తో రిలీజ్ చేయగా తారక్ వాయిస్ కు రామ్ చరణ్ పెర్ఫామెన్స్ ,మరియు డైరెక్టర్ రాజమౌళి గ్రాండ్ విజువల్స్ తో ఈ మోషన్ టీజర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు అనే క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు ,ఈ రోల్ లో రామ్ చరణ్ పక్కాగా సూట్ అయ్యారు , రామ్ చరణ్ మీసకట్టు , మరియు రామ్ చరణ్ ఎక్స్ప్రెషన్స్ , ఫైట్స్ , యాక్టింగ్ , డాన్సింగ్ మరో లెవెల్ లో ఉంది .. రాజమౌళి సినిమా అంటేనే చాలా నిదానం గా తెరకెక్కిస్తారు అన్న అభిప్రాయం సగటు ప్రేక్షకులకు వచ్చేసింది . ప్రస్తుతం ఇండస్ట్రీ ,మరియు అభిమానులు అందరి దృష్టి ఆర్ ఆర్ ఆర్ సినిమా మీదనే ఉంది ..
ఇక అసలు విషయానికొస్తే ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైలర్ డిసెంబర్‌ 3న విడుదల చేయాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ట్రైలర్ డిసెంబర్‌ 9కి వాయిదా పడింది. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. ఈ క్రమంలో డైరెక్టర్ రాజమౌళి అభిమానుల్లో జోష్ నింపేదుకు రెండు సర్‌ప్రైజ్‌లు ఇచ్చారు .. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లని విడుదల చేసింది చిత్ర యూనిట్ . ఈ పోస్టర్స్ అభిమానులకు పెద్ద పండుగ ఈ పోస్టర్స్ లో రామ్ చరణ్ ,మరియు ఎన్టీఆర్‌ చాలా పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించి అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియా లో చాలా హాట్ టాపిక్ గా మారాయి , రామ్ చరణ్ పోస్టర్ చూస్తుంటే , కండలు తిరిగిన దేహం , రౌద్రం పూర్తి ఎమోషన్ తో రామ్ చరణ్ మీసకట్టు , అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా ఎమోషన్ తో కూడిన ఎక్సప్రెషన్స్ తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది .. ఈ పోస్టర్ గురించి టాలివుడ్ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటున్నారు ,.. అలానే ఈ పోస్టర్ పై మిగిలిన డైరెక్టర్స్ అంతా డైరెక్టర్ రాజమౌళి కి మరియు రామ్ చరణ్ కు బెస్ట్ విషెస్ అందించారు ..ఈ పోస్టర్ తోనే రామ్ చరణ్ పాత్ర కు సంబంధించి చిన్న హింట్ ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి రామ్ చరణ్ పూర్తి ట్రైలర్ లో ఇంకా ఎన్ని సర్‌ప్రైజ్‌లు అభిమానులకు ఇస్తారో అని అభిమానులు , టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు ..

ఆచార్య అంచనాలను పెంచేసిన సిద్దా టీజర్…

సిద్దా రోల్ లో రామ్ చరణ్ మైండ్  బ్లోయింగ్   పెర్ఫామెన్స్...   

 

మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య .. డైరెక్టర్ కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు . ఆచార్య సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఆచార్య సినిమాకు సంబంధించి రోజు ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వస్తూనే ఉంది . ఆచార్య సినిమా లో రామ్ చరణ్ ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు , ఈ రోల్ కోసం ముందుగా డైరెక్టర్ కొరటాల శివ మహేష్ బాబు ను అనుకున్నారు , కానీ ఆ తర్వాత అనుకోకుండా రామ్ చరణ్ ఎంటరయ్యారు .. ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి – మరియు రామ్ చరణ్ కు సంబంధించి ఇద్దరినీ చూపిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో ఈ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఆచార్య సినిమా లో రామ్ చరణ్ కు సంబంధించి ఇటీవలే నీలాంబరి అనే సాంగ్ రిలీజ్ చేయాగా ఈ సాంగ్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది .. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది .

ఆచార్య సినిమా షూటింగ్ దదాపు ముగింపు దశకు చేరుకుంది . ..ఆచార్య సినిమా రామ్ చరణ్ చేస్తున్న రోల్ గురించి తెలుపుతూ చిన్న టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ ,ఈ సినిమా లో రామ్ చరణ్ సిద్దా అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు . ఆచార్య సినిమాలో రామ్ చరణ్ రోల్ కు సంబంధించి టీజర్ చూస్తుంటే ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది .. ఈ సినిమాలో రామ్ చరణ్ ధర్మస్థలి కి చెందిన వ్యక్తిగా సిద్దా క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు … రామ్ చరణ్ సిద్దా క్యారెక్టర్ టీజర్ చూస్తుంటే అభిమానులకు మైండ్ బ్లోయింగ్ గా ఉంది .. ఈ సినిమాలో రామ్ చరణ్ స్టైలింగ్ , మరియు యాక్షన్ సీన్స్ లోను , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని మెగా స్టార్ చిరంజీవి తో పోటీ పడి నటించారు .. ఆచార్య సినిమా లో రామ్ చరణ్ రోల్ ను చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ అండ్ టీమ్ .. ప్రతుతం సిద్దా టీజర్ గురించి అభిమానులు సోషల్ మీడియా లో బాగా మాట్లాడుకుంటున్నారు ..ఖైది no 150 వ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి తో – రామ్ చరణ్ ఒక సాంగ్ లో డాన్స్ చేసి ఆకాసేపు ప్రేక్షకులను అలరించారు , అలానే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ స్క్రీన్ మీద కనిపించేది కాసేపు అయినా ప్రేక్షకులను బాగా అలరిస్తారు అని పూర్తి నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది .మొత్తానికి రామ్ చరణ్ టీజర్ చూసి అభిమానులు సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది …


సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న రామ్ చరణ్ లేటెస్ట్ పిక్ …

స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఆచార్య సినిమాలో మెగా స్టార్ చిరంజీవి తో పాటు రామ్ చరణ్ కూడా స్పెషల్ రోల్ లో కనిపిస్తున్నారు , ఈ రోల్ కు సంబంధించి టీజర్ త్వరలో రిలీజ్ కానుంది , రామ్ చరణ్ – చిరంజీవి కలిసి ఉన్న పోస్టర్ రిలీజ్ చేయగా ఈ పోస్టర్ కు అభిమానుల్లో మంచి స్పందన లభించింది .. ..ఆచార్య సినిమాకు సంబంధించి రామ్ చరణ్ – పూజా హెగ్డే లతో ఇటీవలే ఒక సాంగ్ రిలీజ్ అయింది ఈ సాంగ్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ..ప్రస్తుతం రామ్ చరణ్ ఆచార్య సినిమా తో ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నటిస్తున్నారు .. ఆర్ ఆర్ ఆర్ సినిమా లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు ,ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ టీజర్ రిలీజ్ చేసి డైరెక్టర్ రాజమౌళి రామ్ చరణ్ రోల్ గురించి ఒక క్లారిటీ ఇచ్చారు .. సినిమా సినిమాకు రామ్ చరణ్ తన లుక్స్ , మరియు స్టైలింగ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు , అలానే రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో రామ్ చరణ్ చాలా స్టైలిష్ లుక్స్ లో కనిస్తున్నట్లు తెలుస్తుంది .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త ఫ్యాషన్ తో ట్రెండ్ సెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది …

ఇటీవల కాలంలో రామ్ చరణ్ ఎక్కడ కనిపించిన చాలా స్టైలిష్కోవర్ లుక్ లో కనిపిస్తున్నారు . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబంధించి ఒక లేటెస్ట్ పిక్ సోషల్ మీడియా లో వైరల్ అయింది .. ఈ పిక్ లో రామ్ చరణ్ ఇండో వెస్ట్రన్ లుక్‌ లో కనిపించారు ..ఈ పిక్ లో రామ్ చరణ్ . స్టైలిష్ ఆలివ్ గ్రీన్ కుర్తా ధరించి చాలా స్టైలిష్ గా కనిపించారు . ఈ పిక్ చూస్తుంటే రామ్ చరణ్ తన స్టైలింగ్ విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటూ ట్రెండ్ సెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది .. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న రామ్ చరణ్ లేటెస్ట్ పిక్ చూసి అభిమానులు తమ అభిమాన హీరో రామ్ చరణ్ పిక్ చూసి సంతోషపడుతున్నారు …

      


యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న జనని సాంగ్

Rajamouli

టాప్ 1 ప్లేస్ లో ఉన్న జనని సాంగ్..  

బాహుబలి సినిమా తో పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు ఎస్ ఎస్ రాజమౌళి .. బాహుబలి సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నారు .. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎనౌన్సుమెంట్ చేసినప్పటినుంచే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి .. ఆర్ ఆర్ ఆర్ సినిమా కు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు లిరికల్ సాంగ్స్ మరియు మేకింగ్ వీడియోస్ తో సినిమా మీద రోజా రోజుకు అంచనాలను తారా స్థాయిలో ఉన్నాయి .. అలానే రామ్ చరణ్ తో , ఎన్టీఆర్ తోను డైరెక్టర్ రాజమౌళి ఇంతకుముందు సినిమాలు చేశారు , రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు .ఇటీవలే రిలీజ్ అయినా నాటు నాటు సాంగ్ ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి సోషల్ మీడియా లో రోజు ఎదో ఒక న్యూస్ వస్తనే ఉంది .. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది …

తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ఈ సాంగ్ ఫుల్ ట్రేండింగ్ లో ఉంది .. ఆర్ఆర్‌ఆర్‌ సోల్‌ యాంథమ్‌ , ‘జనని’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. కీరవాణి స్వరపరిచిన ఈ పాటకు సవ్యంగా కీరవాణి సాహిత్యం అందించడం పెద్ద విశేషం ..ఈ సినిమాలో ఈ సాంగ్ చాలా చాలా కీలాకం అని తెలుస్తుంది .. ఈ సినిమాను సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడనికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు .. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి చాలా స్పీడ్ గా ఉన్నారు .. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ లో ని జనని సాంగ్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది .. .ముఖ్యంగా ఈ సాంగ్ లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ , అజయ్ దేవగన్ , హీరోయిన్ శ్రేయ ఇచ్చిన ఎక్సప్రెషన్స్ మరియు లొకేషన్స్ గురించి ప్రేక్షకులు బాగా మాట్లాడుకుంటున్నారు …

1 2