రౌద్రం చూపిస్తున్న రామరాజు…

రామ రాజు పోస్టర్ అదుర్స్ ట్రైలర్ కోసం  వెయిటింగ్...
బాహుబలి సినిమా తో డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ చేరిపోయారు . రాజమౌళి . ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావడంలేదు ,ఈ సినిమాకు సంబంధించి మొదటాగా రామ్ చరణ్ , మరియు ఎన్టీఆర్ క్యారెక్టర్స్ ప్రేక్షకులకు పరిచయము చేస్తూ మోషన్ పోస్టర్స్ రిలీజ్ చేయగా అభిమానుల్లో మంచి రెస్పాన్స్ లభించింది .. ఆర్ ఆర్ ఆర్ సినిమా లో రామ్ చరణ్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు .. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి , రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనే చిన్న హింట్ ఇచ్చేసారు .. రామ్ చరణ్ టీజర్ మొదటగా ఎన్టీఆర్ వాయిస్ తో రిలీజ్ చేయగా తారక్ వాయిస్ కు రామ్ చరణ్ పెర్ఫామెన్స్ ,మరియు డైరెక్టర్ రాజమౌళి గ్రాండ్ విజువల్స్ తో ఈ మోషన్ టీజర్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు అనే క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు ,ఈ రోల్ లో రామ్ చరణ్ పక్కాగా సూట్ అయ్యారు , రామ్ చరణ్ మీసకట్టు , మరియు రామ్ చరణ్ ఎక్స్ప్రెషన్స్ , ఫైట్స్ , యాక్టింగ్ , డాన్సింగ్ మరో లెవెల్ లో ఉంది .. రాజమౌళి సినిమా అంటేనే చాలా నిదానం గా తెరకెక్కిస్తారు అన్న అభిప్రాయం సగటు ప్రేక్షకులకు వచ్చేసింది . ప్రస్తుతం ఇండస్ట్రీ ,మరియు అభిమానులు అందరి దృష్టి ఆర్ ఆర్ ఆర్ సినిమా మీదనే ఉంది ..
ఇక అసలు విషయానికొస్తే ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైలర్ డిసెంబర్‌ 3న విడుదల చేయాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ట్రైలర్ డిసెంబర్‌ 9కి వాయిదా పడింది. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. ఈ క్రమంలో డైరెక్టర్ రాజమౌళి అభిమానుల్లో జోష్ నింపేదుకు రెండు సర్‌ప్రైజ్‌లు ఇచ్చారు .. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లని విడుదల చేసింది చిత్ర యూనిట్ . ఈ పోస్టర్స్ అభిమానులకు పెద్ద పండుగ ఈ పోస్టర్స్ లో రామ్ చరణ్ ,మరియు ఎన్టీఆర్‌ చాలా పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించి అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్స్ సోషల్ మీడియా లో చాలా హాట్ టాపిక్ గా మారాయి , రామ్ చరణ్ పోస్టర్ చూస్తుంటే , కండలు తిరిగిన దేహం , రౌద్రం పూర్తి ఎమోషన్ తో రామ్ చరణ్ మీసకట్టు , అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు గా ఎమోషన్ తో కూడిన ఎక్సప్రెషన్స్ తో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది .. ఈ పోస్టర్ గురించి టాలివుడ్ ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటున్నారు ,.. అలానే ఈ పోస్టర్ పై మిగిలిన డైరెక్టర్స్ అంతా డైరెక్టర్ రాజమౌళి కి మరియు రామ్ చరణ్ కు బెస్ట్ విషెస్ అందించారు ..ఈ పోస్టర్ తోనే రామ్ చరణ్ పాత్ర కు సంబంధించి చిన్న హింట్ ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి రామ్ చరణ్ పూర్తి ట్రైలర్ లో ఇంకా ఎన్ని సర్‌ప్రైజ్‌లు అభిమానులకు ఇస్తారో అని అభిమానులు , టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు ..