“ది ఇండియన్ స్టోరి”

రివ్యూ – “ది ఇండియన్ స్టోరి”

నటీనటులు – రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్, చమ్మక్ చంద్ర, ముక్తార్ ఖాన్, రామరాజు, సమీర్, సీవీఎల్ నరసింహారావు, అనంత్ తదితరులు

టెక్నికల్ టీమ్ – ఎడిటర్ – జేపి, మ్యూజిక్ – సందీప్ కనుగుల, డీవోపీ – నిమ్మల జైపాల్ రెడ్డి, స్టంట్ – శంకర్, ఆది, కో ప్రొడ్యూసర్ – కమల్ హాసన్ పాత్రుని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – జానకి రామ్ పమరాజు, ప్రొడ్యూసర్ – రాజ్ భీమ్ రెడ్డి, దర్శకత్వం – ఆర్ రాజశేఖర్ రెడ్డి.

రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఇండియన్ స్టోరి సినిమా ఇవాళ థియేటర్స్ లోకి వచ్చింది. మన ఇండియన్ సొసైటీలో ఉన్న ఒక సమస్యను నేపథ్యంగా తీసుకుని అన్ని కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ బ్యానర్ పై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తూ హీరోగా నటించారు. దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి రూపొందించారు. ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

హిందూ వర్గానికి నాయకుడు శ్రీరామ్ (రామరాజు), ముస్లిం వర్గ లీడర్ కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్). ఈ ఇద్దరు నాయకులు ప్రజల్ని రెచ్చగొడుతూ పరస్పరం దాడులు చేసుకునేలా చేస్తుంటారు. విశాఖ నుంచి వచ్చిన రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి)కి ఓ విషయంలో ఫేకు (చమ్మక్ చంద్ర) అనే స్నేహితుడు హెల్ప్ చేస్తాడు. సాయం చేస్తానంటూ స్నేహితుడే మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. కబీర్ ఖాన్ ను శ్రీరామ్ వర్గం చేసిన హత్యాయత్నం నుంచి రెహమాన్ కాపాడతాడు. కబీర్ ఖాన్ బలవంతం మీద అతని వర్గంలో రెహమాన్ చేరతాడు. ఆప్తుడిగా మారిన రెహమాన్ ను కబీర్ ఖాన్ హత్య చేయాలని అనుకుంటాడు. ఇందుకు కారణం ఏంటి. జర్నలిస్ట్ రాజ్ రెహమాన్ గా ఎందుకు మారాడు. అతను కబీర్ ఖాన్ వర్గంలోకి ఎందుకు చేరాడు. కబీర్ ఖాన్ కూతురిలా చూసుకునే ఆయేషాతో రెహమాన్ ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా. మతం పేరుతో ప్రజల్ని విడదీసిన ఈ ఇద్దరు నాయకుల ప్లాష్ బ్యాక్ ఏంటి. కబీర్ ఖాన్, శ్రీరామ్ పుట్టించే మత విద్వేషాల నుంచి సమాజాన్ని రెహమాన్ ఉరఫ్ రాజ్ ఎలా కాపాడాడు అనేది మిగిలిన కథ.

రివ్యూ

రాజకీయాలు, రాజకీయ నాయకుల వ్యవహారాలు అంతు చిక్కవు. పైకి బద్ధ శత్రువుల్లా కనిపించి రోజూ మీడియా ముందు తిట్టుకునే నాయకులు ప్రైవేట్ పార్టీల్లో మాత్రం కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. వారు నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి ప్రజలు అవాక్కవుతుంటారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో. ఇలా రాజకీయ నాయకులు తమ స్వార్థంతో ప్రజల మధ్య మతం పేరుతో చిచ్చు పెడుతుంటారు జాగ్రత్త అని మంచి సందేశాన్నిచ్చింది “ది ఇండియన్ స్టోరి” సినిమా. కబీర్ ఖాన్, శ్రీరామ్ క్యారెక్టర్స్ పరిచయంతో సినిమా మొదలవుతుంది. రెహమాన్ (హీరో రాజ్ భీమ్ రెడ్డి) వైజాగ్ నుంచి రావడం, అతను ఫ్రెండ్ ఫేకు (చమ్మక్ చంద్ర)ను కలవడం, వాళ్లిద్దరు బంగారు బిస్కెట్లను అమ్మేందుకు పడే పాట్లతో సరదాగా సినిమా టేకాఫ్ అవుతుంది. అసలు కథ మాత్రం ప్లాష్ బ్యాక్ లో వచ్చే ఇద్దరు పిల్లలు అన్నం కోసం చనిపోయే సీన్ తో మొదలవుతుంది. కబీర్ ఖాన్ ను హత్య నుంచి రెహమాన్ కాపాడటంతో సినిమాలో సీరియస్ నెస్ మొదలవుతుంది. ఆస్పత్రిలో నర్సుతో చమ్మక్ చంద్ర చేసే కామెడీ, హీరోకు రాజ్ భీమ్ రెడ్డికి, చమ్మక్ చంద్రకు మధ్య వచ్చే సీన్స్ బాగా నవ్వించాయి. హీరో హీరోయిన్స్ మధ్య కూడా ఒక చిన్న ఎమోషనల్ లవ్ స్టోరీ చూపించారు. జర్నలిస్ట్ గా ఉన్న రాజ్ రెహమాన్ గా ఎందుకు మారాడు , మారి ఏం చేశాడు అనేది దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ఒకవైపు కామెడీగా ఉంటూనే కథలో సీరియస్ నెస్ కంటిన్యూ అయ్యేలా చూసుకున్నాడు దర్శకుడు. మతం పేరుతో ప్రజలకు తప్పుడు సందేశం వెళ్లకుండా కేవలం తాము చెప్పదల్చుకున్న పాయింట్ ను ఈ సినిమాలో చూపించారు నిర్మాత రాజ్ భీమ్ రెడ్డి, దర్శకుడు. మతం పేరుతో మన మధ్య చిచ్చు పెట్టేవారి కుట్రలను గమనించాలి అనే మంచి సందేశాన్నిచ్చిందీ సినిమా.

కొత్తగా హీరో అయిన వారు తాము స్టార్ అనుకుంటారు. అలాగే కమర్షియల్ గా పాటలు, పెద్ద పెద్ద ఫైట్స్ క్రియేట్ చేసుకుంటారు కానీ ఈ సినిమాలో హీరో రాజ్ భీమ్ రెడ్డి కథకు, తన పాత్రకు ఎంత కావాలో అంతే నటించాడు. ఎక్కువ హంగులకు పోలేదు. హీరో రాజ్ భీమ్ రెడ్డి చేసిన ఇంటర్వెల్ తర్వత వచ్చే మూడున్నర నిమిషాల లెంగ్తీ ఫైట్స్ సీక్వెన్స్ ఈ సినిమాకే హైలైట్. యాక్షన్ సీక్వెన్సులను బాగా తెరకెక్కించారు. ఫేకు గా చమ్మక్ చంద్రకు తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఇది. ఉన్నంత సేపూ నవ్విస్తూనే ఉన్నాడు చమ్మక్ చంద్ర. అలాగే హీరోయిన్ జరా ఖాన్ పర్ ఫార్మెన్స్ బాగుంది. శ్రీరామ్ గా రామరాజు, కబీర్ ఖాన్ గా ముక్తార్ ఖాన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. టెక్నికల్ గా “ది ఇండియన్ స్టోరి” సినిమా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ హైలైట్ అయ్యాయి. సినిమా అంటే కేవలం వినోదం కాదని సమాజానికి మంచిని చెప్పేలా ఉండాలని ప్రూవ్ చేస్తుంది “ది ఇండియన్ స్టోరి”

Rating : 3 / 5 .

మెప్పించే సస్పెన్స్ థ్రిల్లర్… రౌద్ర రూపాయ నమః

ఈమధ్య సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్ బాక్సాఫీస్ వద్ద బాగా పర్ ఫాం చేస్తున్నాయి. బలమైన ప్లాట్, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో సినిమాను తీస్తే చాలు ఆడియెన్స్ బాగా ఎంగేజ్ అవుతారు. అందుకే కొత్త దర్శకులు, నిర్మాతలు వెండితెరపై రాణించాలని ఇలాంటి కథలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా కాలకేయ ప్రభాకర్, మోహన సిద్ది, పాయల్ ముఖర్జీ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘రౌద్ర రూపాయ నమః’. పాలిక్ దర్శకత్వంలో రావుల రమేష్ నిర్మాణంలో ఈ సినిమా నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా నేడు ఏప్రిల్ 12న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాకు జాన్ భూషణ్ సంగీతం అందించాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం థ్రిల్ కు గురుచేసిందో చూద్దాం పదండి.

కథ: ఆద్య(మోహన సిద్ది)కు తన జాబ్ గోవాకు ట్రాన్ఫర్ అవ్వడంతో తన చెల్లి(పాయల్ ముఖర్జీ)తో కలిసి గోవాకు వెళ్తుంది. అక్కడ ఆఫీస్ క్వార్టర్స్ ఇంకా రెడీ అవ్వకపోవడంతో ఆఫీస్ కి సంబంధించిన గెస్ట్ హౌస్ మోజా విల్లాలో ఉంటారు. వేళ్ళ విల్లా పక్కనే ఇంకో వీళ్ళలో మాజీ ఆర్మీ మేజర్(కాలకేయ ప్రభాకర్)ఉంటాడు. అతనికి ఉన్న ఓ సమస్యతో ఆవేశంతో ఎదురుగా ఎవరైనా గొడవ పెట్టుకున్నా, ఎక్కువ మాట్లాడినా వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. ఆద్య చెల్లి లవర్ జై గోవాకు వచ్చి తన లవర్ ని కలిసి వెళ్లేముందు పక్క వీళ్ళలో ఏదో జరుగుతుందనిపించి వీడియో తెస్తాడు. అక్కడ మేజర్ తన భార్యని చంపేస్తూ ఉంటాడు. జైని చూసి అతన్ని కొట్టి పడేస్తాడు. జై కోసం వెతుక్కుంటూ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ మేజర్ ఇంట్లోకి వెళ్తే అతని అసలు రూపం తెలుస్తుంది. అసలు మేజర్ అందర్నీ ఎందుకు చంపుతున్నాడు? అతనికి ఉన్న సమస్య ఏంటి? అక్కాచెల్లెళ్లు ఇద్దరూ మేజర్ దగ్గర్నుంచి ఎలా బయటపడ్డారు? అనేది తెరపై చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే…

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో వచ్చే సినిమాలు ఇటీవల మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ రౌద్ర రూపాయ నమః సినిమా కుడా అదే జానర్ లో వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో అక్క చెలెళ్ల గురించి చూపించి గోవాకు రావడం, వీల్లలోకి వెళ్లడం, అక్క చెల్లెళ్ళ ప్రేమ కథలు, మేజర్ పాత్ర గురించి చూపించి అక్క చెల్లెల్లు మేజర్ ఇంట్లో చిక్కుకుపోవడంతో ఇంట్రెస్ట్ గా ఇంటర్వెల్ ఇచ్చి సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది అని ఆసక్తి కలిగిస్తారు. ఎక్కువ షూటింగ్ ఒకే లొకేషన్ లో తీసినా అక్కడే నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్కంఠని క్రియేట్ చేయడం విశేషం.

కాలకేయ ప్రభాకర్ ఆల్రెడీ తన విలనిజంతో మెప్పించాడు. ఈ సినిమాలో కూడా తన నెగిటివిటితో మెప్పిస్తాడు. అక్కచెల్లెళ్లుగా నటించిన మోహన సిద్ది, పాయల్ ముఖర్జీ భయపడుతున్న అమ్మాయిలుగా నటనతో మెప్పిస్తునే తమ అందాలతో కూడా అలరిస్తారు.

దర్శకుడు ఎంచుకున్న కథ, కథనాలు చాలా ఎంగెజింగ్ గా ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో ఆడియెన్స్ ను అలరించారు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. మ్యూజిక్ సస్పెన్స్ సీన్స్ లో బాగున్నా కొన్ని చోట్ల మాత్రం డైలాగ్స్ కి డామినేట్ గా అనిపిస్తుంది. సింపుల్ కథని తీసుకొని కథనం కొత్తగా ట్రై చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!!!

రేటింగ్: 3

లంబసింగి’ మూవీ రివ్యూ

ఈ వారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో ‘లంబసింగి’ మూవీ ఒకటి. ‘బిగ్ బాస్’ దివి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సోగ్గాడే చిన్ని నాయన’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బంగార్రాజు’ సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తూ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ‘కాన్సెప్ట్ ఫిల్మ్స్’ బ్యానర్ పై ఆనంద్ తన్నీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. నవీన్ గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. భరత్‌ రాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం మార్చి 15 న ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ మూవీ ఎంత వరకు మెప్పించిందో తెలుసుకుందాం ..

కథ : వీరబాబు(భరత్ రాజ్) కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవుతాడు. లంబసింగి అనే ఊరిలో అతనికి పోస్టింగ్ పడుతుంది. ఆ ఊరిలో బస్సు దిగగానే హరిత(దివి) ని చూసి ప్రేమలో పడతాడు. తర్వాత ఆమె ఓ మాజీ నక్సలైట్ కూతురు అని తెలుస్తుంది. ఆ ఊరిలో నక్సలైట్లు గా ఉన్న చాలా మందికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. అందులో దివి తండ్రి ఒకరు. అలాంటి వారితో పోలీసులు రోజూ సంతకాలు పెట్టించుకుని వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఈ పని వీరబాబుకి అప్పగిస్తారు. హరితని ప్రేమలో పడేయడానికి అతను కూడా రోజూ ఆమె తండ్రితో సంతకం పెట్టించాడు ఆమె ఇంటికి వెళ్లి వస్తుంటాడు. హరిత ఆ ఊరి హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. ఓ రోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడే క్రమంలో హరితకి మరింత దగ్గరవుతాడు వీరబాబు. దీంతో అదే మంచి సమయం అని భావించి హరితకి తన ప్రేమ గురించి చెప్పాలని డిసైడ్ అవుతాడు. ఓ రోజు హరితకి తన ప్రేమని వ్యక్తపరచగా ఆమె అందుకు ఒప్పుకోదు. దీంతో నిరాశకు చెందిన వీరబాబు.. ఓ రోజు అతను మాత్రమే పోలీస్ స్టేషన్లో డ్యూటీలో ఉండగా.. కొందరు నక్సలైట్లు దాడి చేసి అక్కడ ఉన్న అక్రమ ఆయుధాలను తీసుకెళ్ళిపోతారు. అందులో గాయపడిన వీరబాబుకి ఊహించని షాక్ ఎదురవుతుంది. అదేంటి? అసలు హరిత తన ప్రేమని ఎందుకు నిరాకరించింది? ఆమె గతం ఏంటి? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ : ‘లంబసింగి’ చాలా మంచి కథ. దర్శకుడు నవీన్ గాంధీ ఎంపిక చేసుకున్న పాయింట్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో మొదట కొంచెం స్లోగా అనిపించినా.. తర్వాత వేగం పుంజుకుంటుంది. హీరోయిన్ ట్రాక్ ను దర్శకుడు డిజైన్ చేసిన తీరు బాగుంది. కొన్ని వన్ లైన్స్ కూడా బాగా పేలాయి. ఇంటర్వెల్ బ్లాక్ వద్ద వచ్చే ట్విస్ట్ కట్టిపడేస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం మొదటి నుండి ఇంట్రెస్టింగ్ గా నడిపించాడు దర్శకుడు. ఎక్కడా కూడా ప్రేక్షకులు ఆలోచనలో పడే టైం ఇవ్వడు. స్క్రీన్ ప్లేని చాలా పగడ్బందీగా డిజైన్ చేసుకున్నాడు. వీరబాబు, రాజు గారు పాత్రలతో చేయించిన కామెడీ అలరిస్తుంది. ఇక క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటుంది. థియేటర్ నుండి బయటకి వచ్చే ప్రేక్షకుడు ఆ ఫీల్ ను క్యారీ చేస్తూ వస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు.

సాంకేతిక నిపుణుల పనితీరు : దర్శకుడు నవీన్ గాంధీ ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా ‘లంబసింగి’ ని తెరకెక్కించాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. 2 గంటల 2 నిమిషాల పాటు ప్రతి ప్రేక్షకుడు ‘లంబసింగి’ అనే ప్రపంచంలోకి వెళ్లిపోయేలా చేశాడు. ఆర్.ఆర్.ధృవన్ అందించిన సంగీతం సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో ఓ చిన్న సినిమాలో ఇలాంటి పాటలు ఉంటాయని, వింటామని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఒక్కసారి వినగానే ప్రతి పాట ఎక్కేసేలా ఉంటుంది. తెరపై కూడా వాటిని అందంగా ప్రెజెంట్ చేశాడు కె.బుజ్జి. ఎడిటర్ విజయ్ వర్ధన్ కావూరి కూడా తన పనితనంతో మెప్పించాడు.

నటీనటుల విషయానికి వస్తే.. దివిని ఎక్కువగా గ్లామర్ కోసమే అన్నట్టు దర్శకులు వాడుతూ వచ్చారు. కానీ ఆమెలో సహజమైన నటి ఉందని ‘లంబసింగి’ ద్వారా అందరికీ తెలిసొచ్చింది. హరిత అనే పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఆమె పాత్రలో ట్విస్ట్..లు కూడా ఉంటాయి. దర్శకుడు నవీన్ గాంధీ.. లా మిగిలిన దర్శకులు కూడా దివిలో ఉన్న నటిని గమనిస్తే.. కచ్చితంగా ఆమె సినీ కెరీర్ మరోలా ఉంటుంది అనడంలో అతిశయోక్తి అనిపించుకోలేదు. ఇక హీరో భరత్ కూడా వీరబాబు అనే పాత్రలో చాలా నేచురల్ గా నటించాడు. క్లైమాక్స్ లో ఇతని ఎమోషనల్ పెర్ఫార్మన్స్ తో మంచి మార్కులు వేయించుకుంటాడు. అలాగే కామెడీతో అలరించాడు అని చెప్పాలి. ఇక వంశీ రాజ్, కిట్టయ్య, నిఖిల్ రాజ్, జనార్దన్, అనురాధ, మాధవి, ఈవీవీ, నవీన్ రాజ్ సంకరపు, ప్రమోద్, రమణ, పరమేష్, సంధ్య.. వంటి నటీనటులు కూడా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.

చివరి మాట : ‘లంబసింగి’ కచ్చితంగా ప్రతి ప్రేక్షకుడిని అలరించే సినిమా. 2 గంటల 2 నిమిషాల పాటు ఇంకో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కచ్చితంగా ఈ వీకెండ్ కి థియేటర్లలో మిస్ కాకుండా చూడదగ్గ చిత్రం.

రేటింగ్ : 3 /5

Akasa Air launches refreshed menu on-board Café Akasa

Telugu super news,National,  June 2023: Akasa Air has announced an enhanced inflight food and beverage menu across its  network as part of its constant endeavour to provide a differentiated culinary experience in the skies. Café  Akasa, the airline’s inflight meal service has evolved its unique and varied menu offering, with a wide array of  meal options – including healthy meals, festive favourites, gourmet, and fusion meals, while retaining some  original favourites. The new menu boasts of over 60 meal options which have been exclusively curated with  reputed chefs from across India. The menu refresh is the airline’s response to an extensive exercise to  understand customer preferences and consumer dining trends while staying true to its promise of delighting  customers with fresh and innovative offerings. 

Elaborating on the menu refresh, Belson Coutinho, Co-Founder and Chief Marketing & Experience  Officer, Akasa Air said, “India is a melting pot of various cultures, and this reflects in our gastronomical  landscape as well. With an impressive selection of 60+ items, the new Café Akasa menu is carefully curated  with a range of delectable snacks, hearty meals, indulgent desserts and festive favourites to provide a taste of  global, fusion and local flavours. We have refreshed our menu in response to the resounding, positive feedback

from our customers. The new menu presents a highly evolved assortment of multi-cuisine, tasty and healthy  meals, ensuring that there is something to cater to a wide-ranging culinary preference, as we uphold our ethos  of serving a high quality, elevated flying experience to our valued customers.”

Some of the most interesting additions include unique, industry-first options like Avocado & Tomato Croissant,  Chicken Tikka Mint Mayo & Capsicum in Chutney pinwheel, Mushroom & Feta Quiche, Chicken Kakori Kebab  Turnover, Oats & Berry Muffins and Orzo Duck Salad. Favourites being retained in the menu include Kathi  Roll, Mediterranean Bagelwich and Mushroom & Brie Croissant among others. 

Focus on inclusivity

The new menu at Café Akasa is curated keeping in mind increasing customer preferences and attempts to  provide high-quality appetizing meals with something for everyone. A curated range of delectable snacks,  hearty meals, festive and celebratory meals in addition to indulgent desserts, provide a taste of global,  fusion and local flavours alongside great value for money. 

Health and nutrition as a key focus 

A healthy and well-balanced lifestyle need not be comprised while travelling. Café Akasa’s new menu ensures  that flyers can stay committed to their health regimes by providing vegetarian, non-vegetarian, vegan and  healthy meal options at Café Akasa. Further, all these meals are wholesome with high rich nutritional value  and are prepared with the highest standards of hygiene and quality. The new menu includes a range of salads  such as Insta-worthy Salad, Basil pesto chicken salad, Chick-a-licious Salad and Quack Pack Salad which are  all prepared with nourishing and hearty ingredients.

Moreover, given the plethora of health benefits of millets and as an ode to the Government of India and the  United Nations’ mission to create awareness and increase the production & consumption of millets, Café Akasa  has also introduced a millet salad with pomegranate seeds and lemon olive oil dressing. 

A blend of traditional and modern palette

Classic yet contemporary, the new menu incorporates the perfect harmony between traditional, international  and gourmet meal choices. The selection includes Indian flavours such as Achari Paneer Wrap and Chicken  Kakori Kebab Turnover to international dishes such as Grilled Chicken Mustard Corn & Zucchini Wrap as well  as Asian Vegetarian Bento Box.

Exhibiting the vastness of Indian cuisine, the menu includes a myriad of regional delicacies such as Misal Pav,  Biryani, and Idli Sambar. The menu also comprises the Care-free-al Poi, a traditional Goan chicken cafreal  with greens and coconut mayo in freshly baked poi bread.

SNV Aviation Pvt. Ltd., Urmi Estate, Tower A, 12th Floor, 95, Ganpatrao Kadam Marg, Lower Parel (W), Mumbai 400013  CIN: U63013MH2020PTC350653 I info@akasaair.com | akasaair.com

Special year-round festive meals

Since its inception, the airline has launched specially curated festive meals inspired by regional delicacies  associated with celebrations during popular festivals and special occasions like Ganesh Chaturthi, Dusshera,  Diwali, Christmas, Makar Sankranti, Holi, Eid al-Fitr, Valentine’s Day, Mother’s Day, and Yoga Day. Each  unique meal is specially curated to share the joy of celebrations and revel in the country’s festive spirit. For  instance, the Mother’s Day meal included a methi thepla and sweet mango pickle to offer the airline’s  customers the same comforting flavours of a mom-cooked meal and relive the memories of moments spent  around the family table. Café Akasa offers a pre-selection of cakes on its menu for flyers who want to celebrate  birthdays and other special occasions with their loved ones at 30,000 feet above the ground.

Industry-first offerings to impart a gourmet dining experience in the skies

The menu is designed to delight taste buds with gourmet, fusion flavours. The assortment includes croissants,  tarts, Vietnamese rolls, hot chocolate and kombucha among others. The wide selection of never seen before  in-flight items has been curated to delight customers and provide a unique culinary experience. 

Committed to the agenda of sustainability, the packaging for all perishable meals is 100 per cent recyclable  and made from paper which is ethically sourced from sustainably grown crops. Meal boxes are manufactured  without any bleach or other optical brightening agents (OBA) chemicals. The wooden cutlery onboard is also  biodegradable. Moreover, when passengers pre-book their meals before flying with Café Akasa we eliminate  food wastage as all perishable meals are accounted for.

This new menu has been launched in June 2023 and is available in flight on Café Akasa. Read more about  Café Akasa or book your meal now.

About Café Akasa

“దోచేవారెవరురా” సినిమా రివ్యూ& రేటింగ్..

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,మార్చి12,2023: గతంలో కొన్నేళ్ల క్రితం మనీ, సిసింద్రీ వంటి సినిమాలతో భారీ విజయాలు సొంతం చేసుకున్న సీనియర్ డైరెక్టర్ శివ నాగేశ్వరరావు తాజాగా ఎన్నో ఏళ్ళ విరామం తరువాత తెరకెక్కించిన కామెడీ యాక్షన్ మూవీ దోచేవారెవరురా. నేడు మంచి అంచనాలతో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన ఈ మూవీ సమీక్ష ఇప్పుడు చూద్దాం.

చిత్రం: దోచేవారెవరురా
నటీనటులు: అజయ్ ఘోష్, చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి, బిత్తిరి సత్తి, ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్, బెనర్జీ, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు
దర్శకుడు : శివ నాగేశ్వరరావు
నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు
సంగీత దర్శకుడు: రోహిత్ వర్ధన్,కార్తీక్
సినిమాటోగ్రఫీ: ఆర్లి
ఎడిటర్: శివ వై ప్రసాద్

కథ: సిద్దు సీనియర్ (ప్రణవ చంద్ర) సిద్దు జూనియర్ (చైల్డ్ ఆర్టిస్ చక్రి) తమ జీవనోపాధి కోసం దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో సీనియర్ సిద్దు, లక్కీ (మాళవిక సతీషన్) ని తొలి చూపులోనే ఇష్టపడి ఆమెతో ప్రేమలో పడడం, ఆపై ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం జరుగుతుంది.

అయితే లక్కీ కి ఎదురైన పలు సమస్యలని పరిష్కరించేందుకు సిద్దు సహాయం చేస్తాడు. మధ్యలో విమల్ (అజయ్ ఘోష్) పీకే సత్తి (బిత్తిరి సత్తి)ని తన భార్య పార్వతి (ప్రణవి సాధనాల) ని హత్య చేయించేందుకు నియమిస్తాడు.

అయితే పార్వతిని ఎందుకోసం విమల్ మర్డర్ చేయించాలనుకుంటాడు, మరి మధ్యలో సత్తి కి సిద్దు కి ఉన్న సంబంధం ఏమిటి, ఆపైన కథ ఏవిధంగా నడిచింది అనేవి తెలియాలి అంటే దోచేవారెవరురా మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:
చాలా ఏళ్ళ విరామం తరువాత మరొక్కసారి ఈ మూవీ ద్వారా మంచి కామెడీ కథతో ఆడియన్స్ ముందుకి వచ్చారు శివ నాగేశ్వర రావు. అలానే ఈ సినిమాలో విలన్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ప్రధాన బలంగా నిలుస్తాయి. ఇప్పటివరకు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించిన అజయ్ ఘోష్ ఈ మూవీలో హీరోగా కనిపించడంతో పాటు డ్యూయల్ రోల్ పోషించడం విశేషం. సినిమా సెకండ్ హాఫ్ లో ఆయన సీన్స్ బాగుంటాయి.

లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ కొడుకైన ప్రణవ చంద్ర, అలానే హీరోయిన్ మాళవిక సతీషన్ ఇద్దరూ కూడా తమ పాత్రల్లో ఎంతో ఆకట్టుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి యాక్టింగ్ తో పాటు అతడి డైలాగ్ డెలివరీ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మంచి కామెడీ ని పండిస్తుంది.

ప్రణవి సాధనాల పాత్ర కూడా బాగుంది, సెకండ్ హాఫ్ లోని పలు సీన్స్ లో ఆమె పాత్ర మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇక మిగతా ఇతర పాత్రధారుల నటన కూడా బాగానే ఉంటుంది.

అన్నివిధాలుగా దోచేవారెవరురా మూవీ విషయమై దర్శకడు శివ నాగేశ్వరరావు సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. నవతరనికి బాగా నచ్చే కథని తీసుకొని దానిని ఆసక్తికరంగా ముందుకు నడపడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆర్లి అందించిన సినిమాటోగ్రఫీ, అలానే కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

రోహిత్ వర్ధన్ అందించిన రెండు సాంగ్స్ పర్వాలేదనిపిన్చడంతో పాటు విజువల్స్ గా కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ విభాగం బాగుంది, నీట్ గా కట్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి, మొత్తంగా చూసుకుంటే దోచేవారెవరురా మూవీ కామెడీ సీన్స్, థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ఆడియన్స్ ని మెప్పించే సినిమా అని చెప్పాలి.

రేటింగ్: 3/5..

దోచేవారెవరురా.. మూవీ రివ్యూ.. రెంటింగ్..

తెలుగు సూపర్ న్యూస్ , మార్చి 11,2023:గతంలో కొన్నేళ్ల క్రితం మనీ, సిసింద్రీ వంటి సినిమాలతో భారీ విజయాలు సొంతం చేసుకున్న సీనియర్ డైరెక్టర్ శివ నాగేశ్వరరావు తాజాగా ఎన్నో ఏళ్ళ విరామం తరువాత తెరకెక్కించిన కామెడీ యాక్షన్ మూవీ దోచేవారెవరురా. నేడు మంచి అంచనాలతో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన ఈ మూవీ యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం.

చిత్రం: దోచేవారెవరురా
నటీనటులు: అజయ్ ఘోష్, చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి, బిత్తిరి సత్తి, ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్, బెనర్జీ, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు
దర్శకుడు : శివ నాగేశ్వరరావు
నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు
సంగీత దర్శకుడు: రోహిత్ వర్ధన్, కార్తీక్
సినిమాటోగ్రఫీ: ఆర్లి
ఎడిటర్: శివ వై ప్రసాద్

కథ:
సిద్దు సీనియర్ (ప్రణవ చంద్ర) సిద్దు జూనియర్ (చైల్డ్ ఆర్టిస్ చక్రి) తమ జీవనోపాధి కోసం దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో సీనియర్ సిద్దు, లక్కీ (మాళవిక సతీషన్) ని తొలి చూపులోనే ఇష్టపడి ఆమెతో ప్రేమలో పడడం, ఆపై ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం జరుగుతుంది. అయితే లక్కీ కి ఎదురైన పలు సమస్యలని పరిష్కరించేందుకు సిద్దు సహాయం చేస్తాడు. మధ్యలో విమల్ (అజయ్ ఘోష్) పీకే సత్తి (బిత్తిరి సత్తి)ని తన భార్య పార్వతి (ప్రణవి సాధనాల) ని హత్య చేయించేందుకు నియమిస్తాడు. అయితే పార్వతిని ఎందుకోసం విమల్ మర్డర్ చేయించాలనుకుంటాడు, మరి మధ్యలో సత్తి కి సిద్దు కి ఉన్న సంబంధం ఏమిటి, ఆపైన కథ ఏవిధంగా నడిచింది అనేవి తెలియాలి అంటే దోచేవారెవరురా మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:
చాలా ఏళ్ళ విరామం తరువాత మరొక్కసారి ఈ మూవీ ద్వారా మంచి కామెడీ కథతో ఆడియన్స్ ముందుకి వచ్చారు శివ నాగేశ్వర రావు. అలానే ఈ సినిమాలో విలన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ప్రధాన బలంగా నిలుస్తాయి. ఇప్పటివరకు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించిన అజయ్ ఘోష్ ఈ మూవీలో హీరోగా కనిపించడంతో పాటు డ్యూయల్ రోల్ పోషించడం విశేషం. సినిమా సెకండ్ హాఫ్ లో ఆయన సీన్స్ బాగుంటాయి. లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ కొడుకైన ప్రణవ చంద్ర, అలానే హీరోయిన్ మాళవిక సతీషన్ ఇద్దరూ కూడా తమ పాత్రల్లో ఎంతో ఆకట్టుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి యాక్టింగ్ తో పాటు అతడి డైలాగ్ డెలివరీ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మంచి కామెడీ ని పండిస్తుంది. ప్రణవి సాధనాల పాత్ర కూడా బాగుంది, సెకండ్ హాఫ్ లోని పలు సీన్స్ లో ఆమె పాత్ర మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇక మిగతా ఇతర పాత్రధారుల నటన కూడా బాగానే ఉంటుంది.


అన్నివిధాలుగా దోచేవారెవరురా మూవీ విషయమై దర్శకడు శివ నాగేశ్వరరావు సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. నవతరనికి బాగా నచ్చే కథని తీసుకొని దానిని ఆసక్తికరంగా ముందుకు నడపడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆర్లి అందించిన సినిమాటోగ్రఫీ, అలానే కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయు. రోహిత్ వర్ధన్ అందించిన రెండు సాంగ్స్ పర్వాలేదనిపిన్చడంతో పాటు విజువల్ గా కూడా బాగానే ఉంటాయి. రెండు భాగాల్లోనూ పలు అనవసర సన్నివేశాలను ఎడిటింగ్ విభాగం బాగుంది. నీట్ గా కట్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి, మొత్తంగా చూసుకుంటే దోచేవారెవరురా మూవీ కామెడీ సీన్స్ మరియు థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ఆడియన్స్ ని మెప్పించే సినిమా అని చెప్పాలి.

రేటింగ్: 3/5

“మిస్టర్ కళ్యాణ్”చిత్రం రివ్యూ

Mr Kalyan (2023) movie review and rating

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,మార్చి 10,2023:శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడిన చిత్రం మిస్టర్ కళ్యాణ్. మార్చి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత సుబ్బారెడ్డి ఈ సినిమాను నిర్మించారు. సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ:
హీరో కళ్యాణ్ (కృష్ణ మాన్యం) ఒక కాల్ బాయ్. అలా అతని వృత్తిలో ఉన్న కళ్యాణ్ కు కొన్ని క్యారెక్టర్లు తారసపడతాయి. ఆ పాత్రలు కళ్యాణ్ తో కొన్ని ఎమోషన్స్ ను పంచుకుంటాయి. అదే సిటీలో చాపెల్ ( సప్తగిరి ) ఒక కార్పొరేట్ వ్యవస్థ పెట్టి కాల్ బాయ్ కంపెని రన్ చేస్తూ ఉంటాడు, ఈ క్రమంలో చాపెల్ తన కంపెనీలో జాన్ అవ్వమని కళ్యాణ్ ను రిక్వెస్ట్ చేస్తాడు. కానీ కళ్యాణ్ అతని మాట వినడు. కళ్యాణ్ కాల్ బాయ్ గా చేస్తున్న ఒకానొక సందర్భంలో తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి సారిక (అర్చన) కు దొరికిపోతాడు. ఆ తరువాత సారిక కళ్యాణ్ ను ఎలా ట్రీట్ చేసింది ? కళ్యాణ్, చాపెల్ చివరికి ఏమయ్యారు ? అసలు కళ్యాణ్ కాల్ బాయ్ గా ఎందుకు మారాడు వంటి విషయాలు తెలియాలంటే మిస్టర్ కళ్యాణ్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
మిస్టర్ కళ్యాణ్ సినిమా మొదటి భాగం వినోదాత్మకంగా సాగుతుంది. సప్తగిరి తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. సప్తగిరి కి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ పాత్రల్లో నటించిన ధనరాజ్, బాబీ వారి పాత్రల్లో బాగా నటించి మెప్పించారు. హీరోయిన్ అర్చన బాగా నటించింది, సారిక పాత్రలో ఒదిగిపోయింది. హీరో ప్రయాణంలో తనకు పరిచయం అయిన నాలుగు పాత్రలు మనలోని ఎమోషన్స్ ను తట్టి లేపుతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక ఇంట్రెస్ర్ తప్పకుండా కలుగుతుంది. సెకండ్ హాఫ్ హ్యూమన్ ఎమోషన్స్, బంధాలు వాటి విలువల గురించి అద్భుతంగా చూపించారు.

దర్శకుడు పండు కు మిస్టర్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ మూవీ అయినప్పటికీ అనుభవం కలిగిన దర్శకుడిలా చేశాడు. తాను రాసుకున్న కథ కథనాలు తెర మీద చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. మ్యూజిక్ డైరెక్టర్ సుక్కు మొత్తం 5 పాటలను బాగా ఇచ్చాడు. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా చేశాడు. సాహిత్యం కూడా తనే ఇవ్వడం విశేషం. ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ గా మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ నిలబడ్డాడని చెపొచ్చు. కెమెరామెన్ నానాజి, ఎమ్.వి.గోపి వీరి పనితనం అద్భుతం వారి కెమెరా వర్క్ తో సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్లిందని చెప్పక తప్పదు.

డైరెక్టర్ పండు, కెమెరామెన్స్ నానాజి , ఎమ్.వి.గోపి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ కొత్తవల్లే అయినప్పటికీ అనుభవం కలిగిన టెక్నిషన్స్ లా చేసి మిసర్ట్ కళ్యాణ్ సినిమాను నిలబెట్టారు. ఎడిటర్ వినోద్ అద్వయ్ సినిమాను చాలా నీట్ గా కట్ చేశారు. అతని వర్క్ బాగుంది. ఈ సినిమాకు ఫైట్స్ బిగ్ ప్లస్, షావాలింన్ మల్లేష్ మాస్టర్ కంపోజ్ చేసిన నాలుగు ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి. అనిష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన నాలుగు పాటలు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో బాగా తీశారు. మాస్టర్ కొరియోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్ అయ్యింది.

నిర్మాత ఎన్. వి.సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా మిస్టర్ కళ్యాణ్ సినిమాను నిర్మించారు. శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ లో వచ్చిన మొదటి సినిమా మిస్టర్ కళ్యాణ్ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. అన్ని వర్గాల వారికి నచ్చే చాలా ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా చూస్తే నిర్మాత ఎన్. వి. సుబ్బారెడ్డి అభిరుచి స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి మంచి కథ బలం ఉన్న సినిమాలు నిర్మాత తీయాలని కోరుకుందాం. వినోదం తో పాటు ఎమోషన్స్, వాల్యూస్, మెసేజ్ ఈ సినిమాలో బాగున్నాయి.

సినిమా: మిస్టర్ కళ్యాణ్
విడుదల తేది: మార్చి 10, 2023.
నటీనటులు: కృష్ణ మాన్యం, అర్చన, సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్, రాజ్ వర తదితరులు
డైరెక్టర్: పండు
నిర్మాత: ఎన్. వి. సుబ్బారెడ్డి
సంగీతం: సుక్కు
సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి
ఎడిటర్: వినోద్ అద్వయ్
డాన్స్: అనీష్
ఫైట్స్: మల్లేష్

చివరిగా: మిస్టర్ కళ్యాణ్ అందరిని మెప్పిస్తాడు.

రేటింగ్: 3/5

‘ సదా నన్ను నడిపే ‘సినిమా రివ్యూ

cinima-review

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్ ,జూన్ 24,2022: ‘వాన‌విల్లు ‘ చిత్రం త‌ర్వాత హీరో ప్రతీక్ ప్రేమ్ క‌ర‌ణ్ న‌టించిన చిత్రం ‘ సదా నన్ను నడిపే ‘. వైష్ణవి పట్వర్ధన్ హీరోయిన్. నాగేంద్ర బాబు, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ ఇతర ప్ర‌ధాన తారాగ‌ణంగా తెరకెక్కిన ఈ సినిమాకి చిత్ర హీరోనే ద‌ర్శ‌క‌త్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం అందించారు. స్వచ్చమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి.

cinima-review

కథ: MJ అలియాస్ మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సరదాగా స్నేహితులతో గడిపే కుర్రాడు. అతడు సాహా(వైష్ణవి పట్వర్దన్) ప్రేమలో పడతాడు. ఆమె ఎంత కాదన్నా ఎంతో సిన్సియర్ గా లవ్ చేస్తూ వుంటాడు. సాహా తండ్రి రాజీవ్ కనకాల కూడా MJ ప్రేమని అంగీకరించడు. అయితే MJ మాత్రం ఎలాగైనా సాహా ప్రేమని పొందాలని పరితపిస్తూ వుంటాడు. ఈ కార్యక్రమంలో MJ ప్రేమని…. సాహా అంగీకరించి వివాహం చేసుకుంటుంది. అయితే పెళ్ళైన మొదటి రోజు నుంచే MJ ని దూరం పెడుతూ ఉంటుంది. పెళ్లి చేసుకుని కూడా సాహా… MJ ని ఎందుకు దూరం పెడుతూ ఉంటుంది? ఆమె సమస్య ఏంటి? హీరో దాన్ని ఎలా పరిష్కరించాడు? వీరిద్దరూ చివరకి కలుసుకున్నారా? లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…!!!

cinima-review

కథ… కథనం విశ్లేషణ: చిత్ర హీరో చెప్పినట్టు ఇంతకు మునుపు స్వచ్చమైన, నిశ్వర్థమైన ప్రేమకథలతో గీతాంజలి, కలిసుందాం రా లాంటి సినిమాలు వచ్చి బాక్సాఫీస్ ని కళకళ లాడించాయి. ఇప్పుడీ చిత్రాన్ని కుడా హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ కరణ్… ఎంతో ఎమోషనల్ గా… ప్యూర్ లవ్ ట్రాక్ తో ఎంతో ఎంటర్టైనింగ్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. మ‌న‌కు బాగా తెలిసిన వ్య‌క్తి చ‌నిపోతున్నారని తెలిశాక వారితో వున్న కొద్దిక్ష‌ణాలను ఎంత మధుర జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటామో అనేది ఇందులో చూపించారు. ప్రేమించిన వ్యక్తికోసం ఎలాంటి త్యాగాన్ని ఆయినా చెయ్యొచ్చు అని… ఇందులో ఎంతో ఎమోష‌నల్ గా తెరకెక్కించారు. దానికీ ప్ర‌తి ఒక్క‌రూ క‌నెక్ట్ అవుతారు. క‌ర్నాట‌క‌లో జ‌రిగిన ఓ వాస్తవ సంఘటన అంశాన్ని తీసుకుని సినిమాటిక్‌గా మార్చిన తీరు బాగుంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా వుంది

cinima-review

హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ చాలా బాగా చేశాడు. తను నటిస్తూనే.. దర్శకత్వ బాధ్యలను చాలా సమర్థవంతంగా నిర్వహించాడు. హీరోయిన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అలీ వున్నంత సేపు బాగా నవ్వులు పుయించాడు. నాగబాబు, రాజీవ్ కనకాల తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. సంగీతం బాగుంది. నందు కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి. విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌, కొడైకెనాల్‌, కులుమ‌నాలిలో చిత్రీకరించిన లోకేషన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేసుంటే బాగుండేది. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్..! రేటింగ్: 3.25.

విరాటపర్వం విప్లవ ప్రేమ కావ్యం…

వాళ్లూ ఓ కన్న తల్లి బిడ్డలే. కాని ఆ తల్లిని వీడి అడవి తల్లి ఒడిలోనే సేదతీరారు. పెద్ద చదువులు చదవినా… బడుగుల హక్కులకై పోరాడారు. గంజి, గడ్క తిన్నారు. మట్టి నేలమీదే పడుకున్నారు. సామ్రజ్యవాదపు ప్రభుత్వాల ఇనుప పాదాల కింద నలుగుతున్న పేదల బతుకులకు… మేమున్నామని భరోసానిచ్చారు. పేదల కష్టాలు, కన్నీలు మనకెందుకులే అని ఏనాడూ అనుకోలేదు. పెత్తందారుల భరతం పట్టారు. భూస్వాములను పల్లెల నుంచి తరిమికొట్టి…పట్టణాల్లో తలదాచుకునేలా చేశారు. ప్రభుత్వాలు వాళ్లను రాజ్య ద్రోహులుగా చిత్రీకరించాయి. నక్సలైట్లగా ముద్రవేశాయి. కాని ప్రజలు మాత్రం.. వాళ్ల కష్టాలను తీర్చే దేవుల్లలా కొలిచారు. ఆ అడవి తల్లి బిడ్డలను… అన్నలన్నారు. ఇది గత చరిత్ర… ఈ చరిత్రను మరోసారి తట్టిలేపిన చిత్రం విరాటపర్వం.

తెలంగాణలో సాయుధ పోరాటాన్ని ఈ చిత్రం కళ్లకు కట్టింది. ఆనాటి పరిస్థితులను… సామాన్యుల జీవితాల ముఖచిత్రాన్ని ఆవిష్కరించింది. పోరాటాలకు నిలయమైన ఓరుగల్లు సాయుధ పోరాటాన్ని మరోసారి గుర్తు చేసింది. విప్లవం ఎంత బలమైనదో… ప్రేమ సైతం అంతే బలమైనదని చెప్పే కథే విరాటపర్వం చిత్రం. ప్రజలను పీడించే రాజ్యంపై ఓ పోరాటయోధుడు ఎక్కుపెట్టిన బంధూకు చివర… ఓ ఎర్రగులాబీ పూచింది. ఆ గులాబీ పేరే వెన్నెల( సాయిపల్లవి) . ఆ పోరాటయోదుడి పేరే రవన్న( రాణా ). పీడిత ప్రజలపై రవన్నకు ఎంత ప్రేమ ఉందో… అంతే ప్రేమ రవన్నపై వెన్నలకు ఉంటుంది. చుక్కాని లేని నావలా అడవిలో పయనించే రవన్నకు వేగు చుక్కలా కనిపిస్తుంది వెన్నెల. ఇక సెలవని రవన్న వెళ్లిపోతుంటే.. అతని వైపే ఆబరాగా చూస్తుంది. ఎందుకలా చూస్తున్నావని ప్రశ్నిస్తే… చెమ్మగిల్లిన కళ్లతో ప్రేమను వెలిబుచ్చుతుంది. స్వరాజ్యం కోసమే నా ఈ పయనమని రవన్నంటే.. నీ అడుగులో అడుగేస్తానని బదులిస్తుంది. రణమే తన బాటని రవన్నంటే… అరుణారుణమై నీ వెంటే ఉంటానని … నీ ఒడిలో బంధుకులా ఒదిగిపోతానని చెబుతుంది వెన్నెల. వెన్నెల పాత్రలో సాయిపల్లవి ఒదిగిపోయిన తీరు కట్టిపడేస్తుంది. భావోద్వేగబరిత సన్నివేశాల్లో జీవించేసింది. కథ చివరి క్షణంలో తన నటన కన్నుల వెంట నీరు తెచ్చేలా చేస్తోంది.

రవన్న పాత్రలో రాణా చాలా బాగా నటించారు. ఆ పాత్రకు రాణా న్యాయం చేశాడు. కథ చివరి అంకంలో సాయిపల్లవితో ఉండే సన్నివేశాల్లో రాణా అద్భుతంగా నటించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వరంగల్ ప్రాంత వాసి కావడంతో దర్శకుడు వేణు ఊడుగుల కథను చక్కగా రాసుకున్నారు. ఆనాటి పరిస్థితులను కండ్ల ముందు ఆవిష్కరించాడనే చెప్పాలి. 1973-90 నాటి నక్సల్స్ పోరాటాలను తెరకెక్కించడంలో దర్శకుడు వేణు సక్సెస్ అయ్యారు. కొన్ని సన్నివేశాల్లో వచ్చే పాటలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉంది. సినిమాను మరోస్థాయిలో నిలబెట్టడంలో నేపథ్య సంగీతం ఎంతగానో దోహదపడింది. కెమెరామెన్ పనితనం ఆకట్టుకుంది. ప్రతీ ఫ్రేమ్ అప్పటి పరిస్థితులకు అద్దం పట్టింది.

విప్లవం కోసం రాజ్యంపై యుద్ధం చేస్తాడు రవన్న అలియాస్ అరణ్య. అరణ్య ప్రేమ కోసం యుద్ధం చేస్తోంది వెన్నెల. అరణ్యకు న్యాయం కావాలి. వెన్నెలకు అరణ్య ప్రేమ కావాలి. ఇదే విరాటపర్వం…

రెడ్డిగారింట్లో రౌడీయిజం మూవీ రివ్యూ…

కమర్షియల్ ఎంటర్టైనర్… రెడ్డిగారింట్లో రౌడీయిజంసిరి మూవీస్ బ్యాన‌ర్‌పై ర‌మ‌ణ్ క‌థానాయ‌కుడిగా కె.శిరీషా ర‌మ‌ణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. ఎం.ర‌మేష్‌, గోపి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వ‌ర్ష హీరోయిన్స్‌. సీనియ‌ర్ న‌టుడు వినోద్ కుమార్ విల‌న్‌గా న‌టించారు. ఇటీవల హీరో శ్రీకాంత్ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. లవ్… రొమాన్స్… యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం పదండి.కథ: ప్రతాప్ రెడ్డి(వినోద్ కుమార్) గ్రామంలో కులాంతర వివాహాలను కానీ, ప్రేమ వివాహాలను కానీ అసలు ఎంకరేజ్ చేయరు. అలా చేస్తే చంపి పాతిపెట్టే రకం ఆయన. తన పక్క గ్రామానికి చెందిన.శివ(ర‌మ‌ణ్).ఊళ్ళో అల్లరి చిల్లరగా స్నేహితులతో సరదాగా తిరిగే ఓ గ్రామీణ యువకుడు. తండ్రి(జూనియర్ బాలకృష్ణ) ఎంత చెప్పినా డిగ్రీ కంప్లీట్ చేయకుండా అమ్మాయిల చుట్టూ ప్రేమ పేరుతో తిరుగుతూ ఉంటాడు. అయితే తన క్లాస్ మేట్ అయిన సంధ్య(ప్రియాంక రౌరీ)ని ప్రేమిస్తాడు. ఈమె ప్రతాప్ రెడ్డి కూతురు. అసలే ప్రేమ పెళ్ళిళ్లకి, కులాంతర వివాహాలంటే రగిలిపోయే ప్రతాప్ రెడ్డి… వీరి వివాహానికి ఒప్పుకున్నాడా? అసలు సంధ్య… శివని నిజంగానే ప్రేమించిందా? శివ ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.కథనం విశ్లేషణ: కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. రొమాన్స్, యాక్షన్ పార్ట్ ని సరైన మోతాదులో వెండితెరపై చూపించగలిగితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్. అందుకే చాలా మంది నిర్మాతలు ఇలాంటి సబ్జెక్టుని ఎంచుకుని మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యే డెబ్యూ హీరోలు కూడా ఇలాంటి కథలనే సెలెక్ట్ చేసుకొని తమలోని టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు. అలానే సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో మంచి దర్శకులుగా పేరు తెచ్చుకోవాలనుకునే వారూ ఇలాంటి కమర్షియల్ కథలను ఎంచుకుని విజయం సాధిస్తున్నారు. ఇలాంటి కొత్త టీమ్ యే.. ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ అనే ఓ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ సినిమా విడుదలకు ముందే… టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను సొంతం. చేసుకుంది. కులం, మతం కంటే… ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం గొప్ప మానవత్వం అని చాటి చెప్పే సినిమా ఇది. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కులం పేరుతో ఆటవికంగా మనుషులను అంతమొదించడం…. నిమ్న కులాల వారిని అంటరాని వారిగా చూడటం చూస్తూనే ఉన్నాం. ఆలాంటి… సున్నితమైన సబ్జెక్టును తీసుకుని… వాటికి కమర్షియల్ విలువలు జోడించి… ఓ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా సినిమాని తెరకెక్కించారు. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటీనటుల విషయానికి వస్తే… ఈ చిత్రంతో వెండితెరకు పరిచయమైన హీరో ర‌మ‌ణ్‌ చాలా మెచ్యూర్డ్ గా నటించారు. ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ని ఎలా మెప్పించాలో.. అలా అలరించారు. పాటలు, ఫైట్స్, డైలాగ్స్ విషయంలో ఎక్కడా కొత్త కుర్రాడు అనే థాట్ రాకుండా చాలా ఎనర్జిటిక్ గా నటించారు. అలానే అందమైన ముద్దుగుమ్మలు నలుగురూ ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వర్ష పోటీ పడి యూత్ ని ఆయకట్టు కున్నారు. సీనియర్ హీరో వినోద్ కుమార్ మరోసారి తన మార్కు నటన విలనిజంతో మెప్పించారు. రచ్చ రవి, జూనియర్ బాలకృష్ణ అండ్ బ్యాచ్ కామెడీ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. ముఖ్యంగా హీరో తండ్రి పాత్రలో జూనియర్ బాలకృష్ణ బాగా ఆకట్టుకున్నాడు.సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే… కమర్షియల్ ఎంటర్టైనర్ ని దర్శకులిద్దరూ ఎం. ర‌మేష్‌, గోపి బాగా డీల్ చేశారు. ఒక డెబ్యూ హీరోని ప్రేక్షకులు మెచ్చేలా వెండితెరపై అన్ని విధాలుగా ఆవిష్కరించి సక్సెస్ అయ్యారు. సున్నితమైన కథను ఓ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాంగా మలచడానికి ట్విస్టులతో రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. శ్రీ‌వ‌సంత్‌ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌ ఒకే. మ‌హిత్ నారాయ‌ణ్‌ స్వరపరిచిన సంగీతం బాగుంది. ఎ.కె. ఆనంద్‌ సినిమాటోగ్ర‌ఫీ రిచ్ గా ఉంది. హీరో ఎలివేషన్… హీరోయిన్ల అందాలను యూత్ కి కనెక్ట్ అయ్యేలా కెమెరాలో బంధించారు. శ్రీ‌నివాస్ పి. బాబు, సంజీవ‌రెడ్డి ల ఎడిటింగ్ ఇంకాస్త కృస్పీగా ఉంటే బాగుండేది. అల్టిమేట్ శివ‌, కుంగ్‌ఫూ చంద్రు కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ మాస్ ని మెప్పిస్తాయి నిర్మాత‌ కె.శిరీషా ర‌మ‌ణారెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని ఎంతో ఉత్తమమైన నిర్మాణ విలువలతో నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్..!!

!రేటింగ్: 3.25

1 2