దోచేవారెవరురా.. మూవీ రివ్యూ.. రెంటింగ్..

తెలుగు సూపర్ న్యూస్ , మార్చి 11,2023:గతంలో కొన్నేళ్ల క్రితం మనీ, సిసింద్రీ వంటి సినిమాలతో భారీ విజయాలు సొంతం చేసుకున్న సీనియర్ డైరెక్టర్ శివ నాగేశ్వరరావు తాజాగా ఎన్నో ఏళ్ళ విరామం తరువాత తెరకెక్కించిన కామెడీ యాక్షన్ మూవీ దోచేవారెవరురా. నేడు మంచి అంచనాలతో ప్రేక్షకాభిమానుల ముందుకి వచ్చిన ఈ మూవీ యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం.

చిత్రం: దోచేవారెవరురా
నటీనటులు: అజయ్ ఘోష్, చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి, బిత్తిరి సత్తి, ప్రణవ చంద్ర, మాళవిక సతీషన్, బెనర్జీ, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు
దర్శకుడు : శివ నాగేశ్వరరావు
నిర్మాత: బొడ్డు కోటేశ్వరరావు
సంగీత దర్శకుడు: రోహిత్ వర్ధన్, కార్తీక్
సినిమాటోగ్రఫీ: ఆర్లి
ఎడిటర్: శివ వై ప్రసాద్

కథ:
సిద్దు సీనియర్ (ప్రణవ చంద్ర) సిద్దు జూనియర్ (చైల్డ్ ఆర్టిస్ చక్రి) తమ జీవనోపాధి కోసం దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో సీనియర్ సిద్దు, లక్కీ (మాళవిక సతీషన్) ని తొలి చూపులోనే ఇష్టపడి ఆమెతో ప్రేమలో పడడం, ఆపై ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవడం జరుగుతుంది. అయితే లక్కీ కి ఎదురైన పలు సమస్యలని పరిష్కరించేందుకు సిద్దు సహాయం చేస్తాడు. మధ్యలో విమల్ (అజయ్ ఘోష్) పీకే సత్తి (బిత్తిరి సత్తి)ని తన భార్య పార్వతి (ప్రణవి సాధనాల) ని హత్య చేయించేందుకు నియమిస్తాడు. అయితే పార్వతిని ఎందుకోసం విమల్ మర్డర్ చేయించాలనుకుంటాడు, మరి మధ్యలో సత్తి కి సిద్దు కి ఉన్న సంబంధం ఏమిటి, ఆపైన కథ ఏవిధంగా నడిచింది అనేవి తెలియాలి అంటే దోచేవారెవరురా మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:
చాలా ఏళ్ళ విరామం తరువాత మరొక్కసారి ఈ మూవీ ద్వారా మంచి కామెడీ కథతో ఆడియన్స్ ముందుకి వచ్చారు శివ నాగేశ్వర రావు. అలానే ఈ సినిమాలో విలన్ యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ప్రధాన బలంగా నిలుస్తాయి. ఇప్పటివరకు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించిన అజయ్ ఘోష్ ఈ మూవీలో హీరోగా కనిపించడంతో పాటు డ్యూయల్ రోల్ పోషించడం విశేషం. సినిమా సెకండ్ హాఫ్ లో ఆయన సీన్స్ బాగుంటాయి. లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ కొడుకైన ప్రణవ చంద్ర, అలానే హీరోయిన్ మాళవిక సతీషన్ ఇద్దరూ కూడా తమ పాత్రల్లో ఎంతో ఆకట్టుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ చక్రి యాక్టింగ్ తో పాటు అతడి డైలాగ్ డెలివరీ ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుని మంచి కామెడీ ని పండిస్తుంది. ప్రణవి సాధనాల పాత్ర కూడా బాగుంది, సెకండ్ హాఫ్ లోని పలు సీన్స్ లో ఆమె పాత్ర మంచి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఇక మిగతా ఇతర పాత్రధారుల నటన కూడా బాగానే ఉంటుంది.


అన్నివిధాలుగా దోచేవారెవరురా మూవీ విషయమై దర్శకడు శివ నాగేశ్వరరావు సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. నవతరనికి బాగా నచ్చే కథని తీసుకొని దానిని ఆసక్తికరంగా ముందుకు నడపడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆర్లి అందించిన సినిమాటోగ్రఫీ, అలానే కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయు. రోహిత్ వర్ధన్ అందించిన రెండు సాంగ్స్ పర్వాలేదనిపిన్చడంతో పాటు విజువల్ గా కూడా బాగానే ఉంటాయి. రెండు భాగాల్లోనూ పలు అనవసర సన్నివేశాలను ఎడిటింగ్ విభాగం బాగుంది. నీట్ గా కట్ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి, మొత్తంగా చూసుకుంటే దోచేవారెవరురా మూవీ కామెడీ సీన్స్ మరియు థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ తో ఆడియన్స్ ని మెప్పించే సినిమా అని చెప్పాలి.

రేటింగ్: 3/5

Leave a Reply