ఆచార్య ట్రైలర్ వచ్చేసింది … ఇది స్టోరీ

మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య .. డైరెక్టర్ కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు . ఆచార్య సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. . ఆచార్య సినిమా లో రామ్ చరణ్ ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు , ఈ రోల్ కోసం ముందుగా డైరెక్టర్ కొరటాల శివ మహేష్ బాబు ను అనుకున్నారు , కానీ ఆ తర్వాత అనుకోకుండా రామ్ చరణ్ ఎంటరయ్యారు .. ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి – మరియు రామ్ చరణ్ కు సంబంధించి ఇద్దరినీ చూపిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో ఈ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఆచార్య సినిమా లో రామ్ చరణ్ కు సంబంధించి ఇటీవలే నీలాంబరి అనే సాంగ్ రిలీజ్ చేయాగా ఈ సాంగ్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది .. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది . ఆచార్య సినిమా రామ్ చరణ్ చేస్తున్న రోల్ గురించి తెలుపుతూ చిన్న టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ ,ఈ సినిమా లో రామ్ చరణ్ సిద్దా అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు . ఆచార్య సినిమాలో రామ్ చరణ్ రోల్ కు సంబంధించి టీజర్ చూస్తుంటే ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది .. ఈ సినిమాలో రామ్ చరణ్ ధర్మస్థలి కి చెందిన వ్యక్తిగా సిద్దా క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు … ఇక అసలు విషయానికి వెళ్ళితే .. మెగా అభిమానులు ఆచార్య మూవీ ట్రైలర్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు . ఫైనల్ గా అనుకున్న తేదికి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ .. భరత్ అనే నేను మూవీ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ మెగా స్టార్ తో మూవీ ఎనౌన్సుమెంట్ చేసిన్నప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టారు ..ఈ మూవీ కోసం టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు , కొరటాల శివ ఈ మూవీ మేకింగ్ కోసం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు …

మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ తో కలిసి మొదటగా మఘదీర మూవీ లో ఇంట్రొడక్షన్ సాంగ్ లో కనిపించి కాసేపు చిన్న డాన్స్ స్టెప్స్ తో ప్రేక్షకులను అలరించారు .. అలాగే మెగా స్టార్ మగధీర మూవీ తరువాత చాలా లాంగ్ గ్యాప్ తరువాత బ్రూస్లీ , ఖైదీ no 150 సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ,,ఇక అసలు విషయానికి వెళ్ళితే .. మెగా అభిమానులు – రామ్ చరణ్ – మెగా స్టార్ కాంబినేషన్ లో మూవీ రావాలి అని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు .. సరైన సబ్జెక్ట్ సరైన డైరెక్టర్ దొరికితే చేద్దాము అని మెగా స్టార్ చిరంజీవి చాలా సందర్భాల్లో తెలిపారు .. ఇక అలాంటి సమయంలో డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమా స్టోరీ మెగా స్టార్ చిరంజీవికి చెప్పడం , ఒక స్పెషల్ పవర్ ఫుల్ రోల్ రామ్ చరణ్ కు డిజైన్ చేయడం , ఆ రోల్ కు రామ్ చరణ్ కు సెట్ అవ్వడంతో ఈ కాంబినేషన్ సెట్ అయింది .. మొత్తానికి మెగా అభిమానులు – రామ్ చరణ్ ను మెగా స్టార్ చిరంజీవి ని ఒకే బిగ్ స్క్రీన్ మీద చూడాలి అన్న కోరికను డైరెక్టర్ కొరటాల శివ నెరవేరచ్చారు ……. చిరంజీవి – రామ్ చరణ్ లు ఇద్దరు కలిసి చేసిన మగధీర మూవీ , బ్రూస్లీ ,ఖైదీ no 150 మూవీ లో స్క్రీన్ టైమ్ కాసేపు అయిన ఇద్దరు విజువల్స్ మెగా అభిమానులకు పెద్ద పండగ ..ఇక వీరిద్దరూ బిగ్ స్క్రీన్ మీద , డైలాగ్స్ , ఫైట్స్ , సెంటిమెంట్ సీన్స్ తో మరి కాస్త సేపు బిగ్ స్క్రీన్ మీద కనబడితే ఎలా ఉంటుందో తెలియాలి ఆచార్య మూవీ లో రామ్ చరణ్ రోల్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది .. ఇది చిరంజీవి నటించిన 152వ చిత్రం కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకల్లో ఎంపిక చేసిన 152 థియేటర్లలో ప్రకటించిన సమయానికి ‘ఆచార్య’ ట్రైలర్ ను ప్రదర్శించారు.“దివ్యవనమొకవైపు… తీర్థజనమొకవైపు… నడుమ పాదఘట్టం…” అంటూ రామ్ చరణ్ వాయిస్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. “ఆపద వస్తే ఆ అమ్మోరు తల్లే మమ్మల్ని ఆవహించి ముందుకు పంపుతుంది…” అంటూ యాక్షన్ మొదలవుతుంది. తమ ‘ధర్మస్థలిని అధర్మస్థలి ఎలా అవుతది?’ అనే ప్రశ్న వినిపిస్తుంది. సుమారు 2 నిమిషాల 32 సెకండ్ల పాటు రూపొందిన ఈ ట్రైలర్ లో అభిమానులను అలరించే పలు అంశాలు చోటు చేసుకున్నాయి. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ బాగా హై లైట్ .. ఇక ఈ మూవీ ట్రైలర్ లో రామ్ చరణ్ వాయిస్ , అలానే రామ్ చరణ్ షాట్స్ డైరెక్టర్ కొరటాల శివ చాలా బాగా డిజైన్ చేసారు ..ఇక ఈ మూవీ లో విలన్ రోల్ చేసిన సోనూసూద్ క్యారెక్టర్ పూర్తిగా రివీల్ చేయలేదు కానీ , మెగా స్టార్ సోనూసూద్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ చాలా న్యాచురల్ గా ఉంది .. చివరలో “సిద్ధా తెలుసా మీకు…” అంటూ తనికెళ్ళ భరణి, చిరంజీవిని ప్రశ్నించగానే “కామ్రేడ్…” అంటూ పిలుపు వినిపిస్తుంది. దీనిని బట్టి, ‘ఆచార్య’లో నక్సలిజమ్ నేపథ్యం కూడా చోటు చేసుకుందని తెలిసిపోతుంది. .ఆచార్య మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకేకించారు . డైరెక్టర్ కొరటాల శివ డ్రీమ్ ప్రాజెక్ట్ – మెగా అభిమానుల ఇంత కాలం ఎదురుచూసిన ట్రైలర్ లో ఎలాంటి అంశాలు ఉంటే మెగా అభిమానులు ఇష్టపడతారో , ఆ అంశాలు , మాస్ ఎలిమెంట్స్ అన్ని బాగా శ్రద్ధ తీసుకొని కొరటాల శివ మెగా అభిమానులకు చూపించారు .మొత్తానికి ఆచార్య ట్రైలర్ కు మెగా అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది …