గాడ్ ఫాదర్ మూవీ లో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న స్టార్ డైరెక్టర్…

ఖైదీ నంబర్ 150 వ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి , ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని స్టైలిష్ డైరైక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సైరా నరసింహారెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .. తెలుగు తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరెకెక్కిన ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ , సాంగ్స్ విజువల్ గ్రాండియర్ , సురేందర్ రెడ్డి టేకింగ్ , పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది ..

సైరా నరసింహారెడ్డి మూవీ తరువాత .. చిరంజీవి కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా చేస్తున్నారు .. ఈ మూవీ కి సంబంధించి , మోషన్ పోస్టర్ , టీజర్ లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ త్వరలనే రిలీజ్ చేస్తాను అని అఫీషియల్ ఎనౌన్సుమెంట్…

ఆచార్య మూవీ తరువాత … మెగా స్టార్ చిరంజీవి చేతిలో వరుసగా సినిమాలు లైన్ లో ఉన్నాయి ..

ఇక అసలు విషయానికి వెళ్ళితే .. ఆచార్య సినిమా తరువాత మెగా స్టార్ మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు .. ఈ మూవీ నుండి రోజు ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తూనే ఉంది .. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చాలా శెరవేగంగా జరుగుతుంది ..

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది ..ఈ మూవీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఒక కీ రోల్ లో నటిస్తున్నట్లు మూవీ టీమ్ అఫీషియల్ ఎనౌన్సమెంట్ చేసింది .. మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ కోసం పూరీ చాలా స్టోరీస్ రెడీ చేశారు , కానీ అప్పటికి అవి ఫైనలైజ్ కాక చిరు ఖైదీ నెంబర్ 150 వ సినిమా చేశారు .. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .. అయితే పూరీ కూడా మెగా స్టార్ తో ఎప్పటికైనా సినిమా చెయ్యాలని పట్టుదలతో ఉన్నాడు . మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్ పూరీ జగన్నాద్ కు గాడ్ ఫాదర్ మూవీ లో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కింది . గాడ్ ఫాదర్ మూవీ లో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఒక కీ రోల్ లో నటిస్తున్నారు అని మెగా స్టార్ చిరంజీవి అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది .. మరి అసలు గాడ్ ఫాదర్ మూవీ లో పూరీ చేయబోయే పాత్ర ఎలా ఉండబోతోంది . పూరీ స్క్రీన్ టైమ్ ఈ మూవీ లో ఎంత సేపు ఉండబోతోందో ..తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే…