ఆచార్య అంచనాలను పెంచేసిన సిద్దా టీజర్…

సిద్దా రోల్ లో రామ్ చరణ్ మైండ్  బ్లోయింగ్   పెర్ఫామెన్స్...   

 

మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య .. డైరెక్టర్ కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు . ఆచార్య సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఆచార్య సినిమాకు సంబంధించి రోజు ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వస్తూనే ఉంది . ఆచార్య సినిమా లో రామ్ చరణ్ ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు , ఈ రోల్ కోసం ముందుగా డైరెక్టర్ కొరటాల శివ మహేష్ బాబు ను అనుకున్నారు , కానీ ఆ తర్వాత అనుకోకుండా రామ్ చరణ్ ఎంటరయ్యారు .. ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి – మరియు రామ్ చరణ్ కు సంబంధించి ఇద్దరినీ చూపిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో ఈ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఆచార్య సినిమా లో రామ్ చరణ్ కు సంబంధించి ఇటీవలే నీలాంబరి అనే సాంగ్ రిలీజ్ చేయాగా ఈ సాంగ్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది .. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది .

ఆచార్య సినిమా షూటింగ్ దదాపు ముగింపు దశకు చేరుకుంది . ..ఆచార్య సినిమా రామ్ చరణ్ చేస్తున్న రోల్ గురించి తెలుపుతూ చిన్న టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ ,ఈ సినిమా లో రామ్ చరణ్ సిద్దా అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు . ఆచార్య సినిమాలో రామ్ చరణ్ రోల్ కు సంబంధించి టీజర్ చూస్తుంటే ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది .. ఈ సినిమాలో రామ్ చరణ్ ధర్మస్థలి కి చెందిన వ్యక్తిగా సిద్దా క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు … రామ్ చరణ్ సిద్దా క్యారెక్టర్ టీజర్ చూస్తుంటే అభిమానులకు మైండ్ బ్లోయింగ్ గా ఉంది .. ఈ సినిమాలో రామ్ చరణ్ స్టైలింగ్ , మరియు యాక్షన్ సీన్స్ లోను , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని మెగా స్టార్ చిరంజీవి తో పోటీ పడి నటించారు .. ఆచార్య సినిమా లో రామ్ చరణ్ రోల్ ను చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ అండ్ టీమ్ .. ప్రతుతం సిద్దా టీజర్ గురించి అభిమానులు సోషల్ మీడియా లో బాగా మాట్లాడుకుంటున్నారు ..ఖైది no 150 వ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి తో – రామ్ చరణ్ ఒక సాంగ్ లో డాన్స్ చేసి ఆకాసేపు ప్రేక్షకులను అలరించారు , అలానే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ స్క్రీన్ మీద కనిపించేది కాసేపు అయినా ప్రేక్షకులను బాగా అలరిస్తారు అని పూర్తి నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది .మొత్తానికి రామ్ చరణ్ టీజర్ చూసి అభిమానులు సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది …