ఆర్ ఆర్ ఆర్ మూవీ ట్రైలర్ రివ్యూ …

రాజమౌళి , ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డైరెక్టర్ రాజమౌళి తొలిసారిగా ఒక ఫిక్షన్ స్టోరీని తీసుకొని తన ఊహ ను జ్యోడించి ఈ సినిమాను భారీ కాస్టింగ్ తో తెరకెక్కించారు .. రాజమౌలి సినిమా అంటేనే ఒక పెద్ద విజువల్ గ్రాండియర్ , సెట్స్ , గ్రాఫిక్స్ , మరియు ఎమోషన్ , యాక్షన్ ఎలిమెంట్స్ , సెంటిమెంట్స్ ఇలా అన్ని కలిసి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉంటుంది .. డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఎన్టీఆర్ , మరియు రామ్ చరణ్ ఇద్దరు సినిమాలు చేశారు , వీరిద్దరి స్టామినా ఏమిటో అలానే వీరిద్దరి యాక్టింగ్ టాలెంట్ ,అలానే వీరిద్దరి ని కలిపి ఒకే బిగ్ స్క్రీన్ పై ప్రెజెంట్ చెయ్యాలంటే ఒక్క రాజమౌళి కె బాగా తెలుసు .. రాజమౌళి ని టాలీవుడ్ లో అందరూ జక్కన్న అంటారు , ఏది అయిన ఒక సినిమా మొదలు పెట్టాడు అంటే అది పూర్తి అయ్యేంతవరకు నిద్రపోరు , అలానే తన కుంటుంబం తన బలం , తన ప్రతి సినిమాకు తన కుంటుంబం అంతా కలిసి కష్టపడి పని చేస్తుంది .. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయానికి వస్తే , బాహుబలి సినిమా తర్వాత డైరెక్టర్ రాజమౌళి ఒక మల్టీ స్టారర్ సినిమా చేద్దాము అనుకున్నారు , ఈ సినిమాకు రైటర్ గా విజయేంద్రప్రసాద్ కధ అందించారు . స్టోరీ రెడీ , కధ అయితే మాములుగా లేదు ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు , మరియు కొమరం భీమ్ ఇద్దరు క్యారెక్టర్స్ చుట్టూ అల్లుకున్న ఫిక్షన్ డ్రామా గా బ్యాలెన్స్ చేస్తూ స్టోరీ స్క్రీన్ ప్లే పక్కాగా కుదిరింది .. పాన్ ఇండియా సినిమా అంటేనే భారీ సెట్స్ ,భారీ ఖర్చు , భారీ గ్రాఫిక్స్ , ఇలా అన్ని భారీగానే ఉంటాయి , ఈ సినిమాను దాదాపుగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు .. ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , లిరికల్ సాంగ్స్ , రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ . ఈ సినిమాకు సంబంధించి రోజు ఏదోఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వస్తూనే ఉంది ..

తాజాగా ఈ రోజున ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ .. అభిమానులకు ఈ ట్రైలర్ పెద్ద విజువల్ ట్రీట్ లా ఉంది . ఈ ట్రైలర్ చూస్తుంటే ఎన్టీఆర్ , రామ్ చరణ్ పడిన కష్టం కనబడుతుంది , సుమారు 3:15 నిముషాలు నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో రాజమౌళి టేకింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేశారు , ట్రైలర్ లో విజువల్స్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి , ట్రైలర్ లో మొదటగా రాజీవ్ కనకాల డైలాగ్ తో ప్రారంభమౌతుంది , ఎన్టీఆర్ ను కాపరిగా పరిచయము చేసే సీన్ ఎన్టీఆర్ పులి తో సమానంగా దాని దైర్యంగా ఎన్టీఆర్ నిలబడే సీన్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి .. , అలానే రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ గా పూర్తీ ఎమోషన్ తో చూపించిన తీరు రామ్ చరణ్ లోని కొత్త నటుడిని చూస్తారు . పీరియాడిక్ ఫిక్షన్ డ్రామా గా తెరెకెక్కుతున్న సినిమా కాబట్టి రాజమౌళి సినిమా విజువల్స్ విషయంలోనూ , సెట్స్ విషయంలోనూ , మరియు గ్రాఫిక్స్ , కాస్టింగ్ విషయం లోను చాలా శ్రద్ధ తీసుకున్నారు , అని ట్రైలర్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది .. ఇక ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ . రామ్ చరణ్ తో యాక్షన్ సీన్ లో ఇద్దరు కలిససుకుని పోరాడే సీన్స్ సినిమాకే పెద్ద హైలైట్ … అదే విధంగా ఇద్దరు కలిసి డాన్స్ చేసే విజువల్స్ ,మరియు ఎన్టీఆర్ సెంటిమెంట్ తో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి .. ఎన్టీఆర్ , రామ్ చరణ్ స్నేహబంధం గురించి తెలిపే ప్రతి సీన్ డైరెక్టర్ రాజమౌళి అద్భుతముగా తెరకెక్కించారు ..ఇక ఈ ట్రైలర్ లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కనిపించే ఒక్క షాట్ లో తన వీరత్వం చూపిస్తూ పోరాడే సీన్స్ మరో హై లైట్ , సినిమాలో మిగతా కాస్టింగ్ గురించి చెప్పాలంటే శ్రియ , సముద్రఖని , తమ పాత్రలకు న్యాయం చేశారు .. అలానే ఇందులో అలియా భట్ , ఒలివియా మోరీస్, సీన్స్ లో ఎమోషన్ ని బాగా చూపించారు , మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి ఈ సినిమాకు ప్రాణం పెట్టి పని చేశారు ,ముఖ్యంగా రీ రికార్డింగ్ సినిమాకు మరో లెవెల్ కు తీసుకొని వెల్లింది ..అలానే డైలాగ్స్ రాసిన సాయి మాధవ్ బుర్ర గారు ఒక్కో డైలాగ్ ఒక్కో బులెట్ లా పేలాయి .. ఫైనల్ గా ఈ సినిమా కి పని చేసిన సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ తన గ్రాండ్ విజువల్స్ తో సినిమాను మరో స్థాయి కి తీసుకువెళ్లారు ..ఇక ఈ సినిమాలో చివరి షాట్ లో రామ్ చరణ్ , మరియు ఎన్టీఆర్ ఇద్దరు కలిసి తిరగబడే సీన్ తో ఈ ట్రైలర్ పూర్తి అవుతుంది .. రాజమౌళి చెక్కిన మరో అద్భుతం , రాజమౌళి పడిన కష్టం నిర్మాతలు పెట్టిన ప్రతి రూపాయి ప్రతి షాట్ లో కనబడుతుంది .. ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఆనందానికి హద్దలు లేవు .అదే విధంగా ఈ ట్రైలర్ చూసిన ప్రతి దర్శకుడు రాజమౌళికి బెస్ట్ విషెస్ చెబుతున్నారు ..