యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న జనని సాంగ్

Rajamouli

టాప్ 1 ప్లేస్ లో ఉన్న జనని సాంగ్..  

బాహుబలి సినిమా తో పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు ఎస్ ఎస్ రాజమౌళి .. బాహుబలి సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నారు .. రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎనౌన్సుమెంట్ చేసినప్పటినుంచే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి .. ఆర్ ఆర్ ఆర్ సినిమా కు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు లిరికల్ సాంగ్స్ మరియు మేకింగ్ వీడియోస్ తో సినిమా మీద రోజా రోజుకు అంచనాలను తారా స్థాయిలో ఉన్నాయి .. అలానే రామ్ చరణ్ తో , ఎన్టీఆర్ తోను డైరెక్టర్ రాజమౌళి ఇంతకుముందు సినిమాలు చేశారు , రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు .ఇటీవలే రిలీజ్ అయినా నాటు నాటు సాంగ్ ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి సోషల్ మీడియా లో రోజు ఎదో ఒక న్యూస్ వస్తనే ఉంది .. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది …

తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ఈ సాంగ్ ఫుల్ ట్రేండింగ్ లో ఉంది .. ఆర్ఆర్‌ఆర్‌ సోల్‌ యాంథమ్‌ , ‘జనని’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. కీరవాణి స్వరపరిచిన ఈ పాటకు సవ్యంగా కీరవాణి సాహిత్యం అందించడం పెద్ద విశేషం ..ఈ సినిమాలో ఈ సాంగ్ చాలా చాలా కీలాకం అని తెలుస్తుంది .. ఈ సినిమాను సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడనికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు .. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ విషయంలో రాజమౌళి చాలా స్పీడ్ గా ఉన్నారు .. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ లో ని జనని సాంగ్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది .. .ముఖ్యంగా ఈ సాంగ్ లో రామ్ చరణ్ – ఎన్టీఆర్ , అజయ్ దేవగన్ , హీరోయిన్ శ్రేయ ఇచ్చిన ఎక్సప్రెషన్స్ మరియు లొకేషన్స్ గురించి ప్రేక్షకులు బాగా మాట్లాడుకుంటున్నారు …