మరో క్రేజీ మల్టీ స్టారర్ సినిమా ని సెట్ చేకున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల …

మరో క్రేజీ మల్టీ స్టారర్ సినిమా ని సెట్ చేకున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల …

 పీరియాడికల్  బ్యాక్ డ్రాప్ తో  రానున్న  మల్టీ  స్టారర్  సినిమా ...

విభిన్నమైన సినిమాలను తెరకెక్కించే అతి కొద్దీ మంది దర్శకుల్లో , శ్రీకాంత్ అడ్డాల ఒకరు .. శ్రీకాంత్ అడ్డాల సినిమా అనగానే కుటుంబ బంధాలు , సెంటిమెంట్స్ , యూత్ ఫుల్ కంటెంట్స్ అన్ని కలిసి ఉంటాయి .. రొటీన్ కి బిన్నంగా శ్రీకాంత్ అడ్డాల స్టోరీస్ ఉంటాయి . క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఫ్యామిలీ ఎమోషన్స్ , సెంటిమెంట్స్ సీన్స్ , ఎలా చిత్రీకరిస్తారో , అలానే శ్రీకాంత్ అడ్డాల సినిమాలు కూడా ఎక్కువ ఫ్యామిలీ స్టోరీస్ , ఫ్యామిలీ ఎమోషన్స్ , సహజంగా ప్రేక్షకుల అందరికి కనెక్ట్ అయ్యేలాగా తెరకెక్కించే అతి కొద్దీ మంది దర్శకుల్లో , శ్రీకాంత్ అడ్డాల ఒకరు .దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చిన దర్శకుల లిస్ట్ లో శ్రీకాంత్ అడ్డాల ఒకరు .. శ్రీకాంత్ అడ్డాల అసిస్టెంట్ డైరెక్టర్ గా నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఎన్నో సినిమాలకు పని చేసి 2008 లో , ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాడు .. మొదటి సినిమా తో మంచి సక్సెస్ అందుకొని సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ‘కొత్త బంగారు లోకం’ సినిమా ఇటు యూత్ కు ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి బిగ్గెస్ట్ హిట్ అందుకోవడమే కాకుండా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కు మంచి పేరును తీసుకొచ్చింది ..

‘కొత్త బంగారు లోకం’ సినిమా తరువాత డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని , మల్టీస్టారర్ సినిమా గా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ అనే సినిమాను డైరెక్ట్ చేశారు .. మల్టీస్టారర్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ..అంతే కాకుండా ఈ సినిమా తర్వాతే టాలీవుడ్ లో ఈ జెనరేషన్ హీరోల మల్టీస్టారర్ ట్రెండ్ మొదలైయ్యింది. ప్రస్తుతం రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్స్ కు బీజం వేసింది శ్రీకాంత్ అడ్డాలే అని దిల్ రాజు తెలిపారు .. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత , వచ్చిన “ముకుంద” మరియు , “బ్రహ్మోత్సవం ” రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంతగా విజయం సాధించలేకపోయాయి .. “ముకుంద” మరియు “బ్రహ్మోత్సవం ” సినిమాల తరువాత నాలుగేళ్ళ గ్యాప్ తీసుకొని ‘నారప్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ..

‘నారప్ప’ సినిమా తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఆ తరువాత సినిమా ఏ స్టార్ హీరో తో చేస్తాడా తన నెక్స్ట్ సినిమా ఉండబోతుందో అనే చర్చ సోషల్ మీడియా లో మోదలైయింది .. ‘నారప్ప’ ఇచ్చిన రిసల్ట్ తో ఫుల్ జోష్ మీదున్న శ్రీకాంత్ అడ్డాల ”అన్నాయ్” అనే ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నట్లు శ్రీకాంత్ అడ్డాల సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు .. ”అన్నాయ్” సినిమా గుంటూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందే భారీ పీరియాడికల్ డ్రామా అని.. అది కూడా మూడు భాగాలుగా తెరకెక్కే ట్రైయాలజీ అని శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమా సక్సెస్ మీట్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి తెలిపారు .. . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి .. అయితే ఈ భారీ మల్టీస్టారర్ సినిమా కోసం చిరంజీవి – బన్నీ లను సంప్రదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి .. . ఇప్పటికే మహేష్ – వెంకీ వంటి ఇద్దరు స్టార్ హీరోలను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసిన అడ్డాల.. వారి ఫ్యాన్స్ ని కూడా మెప్పించారు. ఇప్పుడు చిరు – బన్నీ లకు కూడా అదే విధంగా తెర మీద ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతము మెగా స్టార్ చిరంజీవి చేతిలో ఆచార్య , గాడ్ ఫాదర్ సినిమాలు , మరియు మెహెర్ రమేష్ , మరియు డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి .. అలానే అల్లు అర్జున్ పుష్ప సినిమా లో ఫుల్ బిజీగా ఉన్నారు ,గీతా ఆర్ట్స్ బ్యానర్ లో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటిస్తారని టాక్ వినిపిస్తుంది .. మరి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రాబోయే ఈ భారీ మల్టీస్టారర్ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా లో వస్తున్న వార్తల్లో నిజం ఎంతవరకు ఉన్నదో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలిసిందే …

నిఖిల్ 18 పేజీలు కథ కు సుకుమార్ ఫుల్ స్టాప్ పెట్టాడా …

నిఖిల్ 18 పేజెస్'మూవీ లేటెస్ట్ అప్ డేట్ ...

 





...

నిఖిల్ సినీ కెరీర్ కనుక చూస్తే , మొదటి నుంచీ డిఫరెంట్‌ సినిమాలతో టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో తనకంటూ ఒక సెపెరేట్ రూట్ క్రియేట్ చేసుకొని తన గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు .. 2019 లో డైరెక్టర్ టీఎన్‌ సంతోష్‌ – నిఖిల్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా “అర్జున్‌ సురవరం” . తమిళం లో సూపర్‌హిట్‌ అయిన కణితన్‌’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర యావేరేజ్ టాక్ తెచ్చుకుంది .. “అర్జున్‌ సురవరం” సినిమా తరువాత నిఖిల్ చాలా లాంగ్ గ్యాప్ తీసొకొన్నాడు .. అర్జున్ సురవరం సినిమా తరువాత నిఖిల్ పెళ్లి చేసుకోవడం , ఆ తరువాత మహమ్మారి కరోనా రావడం వల్ల నిఖిల్ చెయ్యాలిసిన సినిమాల గురించి ఎటువంటి న్యూస్ బయటకు రాలేదు .. నిఖిల్ చందు మొండేటి కాంబినేషన్ లో 2014 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కార్తికేయ ,ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ హిట్ అందుకుంది ..కార్తికేయ సినిమా హిట్ అవ్వడమే కాకుండా హీరో నిఖిల్ కు డైరెక్టర్ చందూ మొండేటి కి మంచి పేరు తీసుకొచ్చింది .. డైరెక్టర్ చందూ మొండేటి – నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా “సవ్యసాచి” .ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్ మరియు మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నది కానీ , బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత విజయం సాధించలేకపోయింది .. ” సవ్యసాచి” సినిమా తరువాత డైరెక్టర్ చందూ మొండేటి చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని హీరో నిఖిల్ తో కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు .. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది..

సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖ లో పనిచేసిన పల్నాటి సూర్యప్రతాప్ , 2015 లో కుమారి 21ఎఫ్ సినిమా తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. కుమారి 21ఎఫ్ సినిమా తరువాత డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ , యంగ్ హీరో నిఖిల్ కాంబినేషన్ లో 18 పేజెస్ సినిమా ను తెరకెక్కిస్తున్నారు .. ఈ సినిమాను స్టార్ నిర్మాత అల్లు అరవింద్ మరియు సుకుమార్ ల సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు ..ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. ఈ సినిమా చిత్రీకరణ గత ఏడాదిలోనే ముగించాల్సి ఉన్నా కూడా మహమ్మారి కరోనా కారణం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఫైనల్ గా ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ ను ముగింపు దశకు తీసుకు వచ్చారు చిత్ర యూనిట్ … కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమా షూటింగ్ కు వీలు కాకపోవడంతో షూటింగ్ పూర్తి అయినంత వరకు డబ్బింగ్ ను చెప్పించారు. ఆ సమయంలో నిఖిల్ 18 పేజెస్ సినిమా డబ్బింగ్ చెప్తున్నట్లుగా ఒక ఫొటోను కూడా షేర్ చేశారు అని సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి ..

ఈ సినిమా 10 రోజులు మినహా షూటింగ్ పూర్తి అయ్యింది. ఆ పది రోజుల వర్కింగ్ డేస్ ను అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు చిత్ర యూనిట్ .. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు స్క్రిప్ట్ ను సుకుమార్ అందించడం వల్ల సినిమా స్థాయి మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు. ఈమద్య కాలంలో బన్నీ వాసు నిర్మించిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.

నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా మొదటి సారి ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వచ్చినట్లుగా నిఖిల్ చెప్పుకొచ్చాడు. కార్తికేయ 2 మరియు 18 పేజెస్ సినిమాలు తరువాత మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి .. మొత్తానికి 18 పేజెస్ సినిమా గురించి లేటెస్ట్ న్యూస్ తెలిసి నిఖిల్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు …

మెగాస్టార్ కోసం దివ్యాంగ అభిమాని సాహసం.. చలించిపోయిన చిరు

మెగాస్టార్ కోసం దివ్యాంగ అభిమాని సాహసం.. చలించిపోయిన చిరు

మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు ఉండరు భక్తులే ఉంటారు అని నిరూపించే మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. స్వయంకృషితో ఎదిగి టాలీవుడ్ నెం.1 స్థానానికి చేరిన చిరంజీవి అంటే ప్రాణం ఇచ్చే అభిమానులున్నారు. అలాంటి అభిమానులలో ఒకరైన డెక్కల గంగాధర్ ఎవరూ ఊహించని పని చేశారు. మెగాస్టార్ చిరును కలిసేందుకు డెక్కల గంగాధర్ అనే ఒక అభిమాని పాదయాత్ర ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుంచి హైదరాబాద్ వరకు ఆయన పాదయాత్ర చేస్తూ వచ్చారు. ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన డెక్కల గంగాధర్‌ అనే అభిమాని అక్టోబర్ 3వ తేదీన కాలి నడకన హైదరాబాద్‌ బయలు దేరాడు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్‌ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవిని చూడాలనే తపనతో పాదయాత్ర ప్రారంభించినట్టు గంగాధర్‌ పేర్కొన్నారు. చిరంజీవి నుంచి ఏమి ఆశించడం లేదని, కలిస్తే చాలని అదే పది వేలని భవిస్తూ 726 కి.మీ దూరం నడిచి హైదరాబాద్ వచ్చాడు డెక్కల గంగాధర్. ఈ మధ్య కాలంలో తమ తమ అభిమాన నటీనటుల కోసం పాదయాత్రలు చేయడం కామన్ అయిపోయాయి కానీ గంగాధర్ దివ్యాంగుడు. అమలాపురం తాలూకా ఉప్పలగుప్తం మండలానికి చెందిన కిత్తనచెరువు గ్రామ వాసి అయిన శ్రీ డెక్కల గంగాధర్ కాలినడకనే చిరంజీవి గారిని కలవాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్ కు చేరుకున్నాడు.

ఈ వార్త తెలిసిన శ్రీ చిరంజీవి గారు చలించి పోయి వెంటనే ఇంటికి పిలిపించుకుని గంగాధర్ తో సమయం గడిపారు. అనంతరం గంగాధర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అతని కుటుంబ నేపథ్యం, ఇతర విషయాలు అడిగి తెలుసుకున్న చిరంజీవి ఇలాంటి సాహసాలు మళ్లీ చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు. అయితే తమ అభిమాన హీరోను చూస్తే చాలనుకున్న గంగాధర్ చిరంజీవి ఆతిధ్యానికి పులకించిపోయారు. చిరును కలవడంతో గంగాధర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాను జీవితాంతం రుణపడి ఉంటాను అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు.

శర్వానంద్ – సినిమా లేటెస్ట్ అప్ డేట్ …….

శర్వానంద్ – సినిమా లేటెస్ట్ అప్ డేట్ …….

2020 హీరో శర్వానంద్ కు పెద్దగా కలిసి రాలేదు అని చెప్పాలి .. శర్వానంద్ – సమంత కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా జాను .. తమిళంలో పెద్ద హిట్ అందుకున్న క్లాసిక్‌ సినిమా ‘96’. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలనుకున్నారు. హీరో శర్వానంద్‌, సమంత లతో ఈ సినిమాను మాతృకకు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమారే ఈ సినిమాను కూడా తెరెకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంతగా హిట్ సాధించలేకపోయింది .. జాను సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ఫిల్మ్ క్రిటిక్స్ నుండి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంది .. జాను సినిమా తో ప్రేక్షకులను డిస్సపాయింట్మెంట్ చేసిన శర్వానంద్ ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని శ్రీకారం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. జాను సినిమా లవ్ స్టోరీ మరియు రీమేక్ సినిమా కాబట్టి , ఎక్కడో ఒక చోట చిన్న చిన్న లోపల వల్ల ఈ స్టోరీ కి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేకపోయారు .. జాను’ సినిమాతో నిరాశపర్చిన శర్వానంద్‌ ఈసారి లవ్‌స్టోరీని కాకుండా రైతుల స్టోరీని ఎంచుకున్నాడు. ” కుటుంబకథా చిత్రాలతో పాటు లవ్ స్టోరీస్‌తో ఆకట్టుకున్న శర్వానంద్.. వ్యవసాయం నేపథ్యంలో ‘శ్రీకారం’ అనే సోషల్ మెసేజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , డైలాగ్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా నిలిచింది ..

శ్రీకారం సినిమా తరువాత హీరో శర్వానంద్ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లో మల్టీ స్టారర్ గా ‘మహా సముద్రం సినిమా తో ప్రేక్షకులముందుకు వచ్చాడు ..ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా మారారు అజయ్‌ భూపతి. ఇప్పుడు తన సెకండ్ సినిమాగా ‘మహా సముద్రం’ మరోసారి తన సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు. శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ ప్రధాన పాత్రల్లో మరియు పెద్ద స్టార్ కాస్టింగ్ తో దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇవ్వడం, ఈ సినిమా ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ రావడంతో ‘మహా సముద్రం’పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది ..

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ – ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ .. ఈ సినిమా ట్రైలర్స్ , టీజర్స్ , మేకింగ్ , డైలాగ్స్ మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ,రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి సాలిడ్ హిట్ అందుకున్నాడు .. ‘ఇస్మార్ట్ శంకర్’ ..సినిమా తరువాత రామ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా రెడ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. గతంలో రామ్ కు ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి హిట్లు ఇచ్చిన కిశోర్ తిరుమలతో ‘రెడ్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ..

రెడ్ సినిమా తరువాత డైరెక్టర్ కిషోర్ తిరుమల కొంత గ్యాప్ తీసుకొని హీరో శర్వానంద్రష్మిక కాంబినేషన్ లో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు .. ఈ సినిమా కు సంబందించి 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది . శర్వానంద్ మరియు రష్మికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణతో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అవుతుంది అని చిత్ర యూనిట్ తెలిపింది ..ఈ సినిమా లో శర్వానంద్ పాత్ర చాలా నాచురల్ గా మన చుట్టు ఉండే కుర్రాళ్లలో ఒకడిగా అనిపిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.. షూటింగ్ మెజార్టీ పార్ట్ పూర్తి చేసుకోవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ చెయ్యాలి అనే ప్లాన్ లో ఉన్నారు చిత్ర యూనిట్ .. . ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా తో శర్వానంద్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు .. శర్వానంద్ ఇటీవల మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దసరా కానుకగా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా హిట్ సాధించలేకపాయింది ..మహాసముద్రం సినిమా తరువాత హీరో శర్వానంద్ చేస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ..హీరో శర్వా కూడా ఈ సినిమా తో సక్సెస్ దక్కించుకుని మళ్లీ ఫామ్ లోకి రావాలని ఆశ పడుతున్నాడు. ఈ సినిమా వచ్చే నెల వరకు షూటింగ్ పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసింది చేసింది చిత్ర యూనిట్ .. ఈ . సినిమాను వచ్చే సమ్మర్ లో విడుదల చేస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది. మొత్తానికి డైరెక్టర్ కిషోర్ తిరుమల – శర్వానంద్ కాంబినేషన్ లో వస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయం తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలిసిందే ..

ఈ నెల 29న కడుపుబ్బ న‌వ్వించ‌డానికి `మిస్ట‌ర్ ప్రేమికుడు`వ‌స్తున్నాడు

ఈ నెల 29న కడుపుబ్బ న‌వ్వించ‌డానికి మిస్ట‌ర్ ప్రేమికుడువ‌స్తున్నాడు

          ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని హీరో హీరోయిన్లుగా నటించగా శ‌క్తి చిదంబ‌రం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన  ‘చార్లీ చాప్లిన్’ చిత్రాన్ని తెలుగులో  శ్రీ తార‌క‌రామ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎమ్ .వి. కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి  తెలుగులో కి ‘మిస్ట‌ర్ ప్రేమికుడు’ పేరుతో అనువ‌దించారు.  అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం ఈ నెల 29న  గ్రాండ్ గా రిలీజ్ కానుంది.   ఈ సంద‌ర్భంగా ఈరోజు ఫిలించాంబ‌ర్ లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ...``మ‌హేష్ చౌద‌రి, వి.శ్రీనివాస‌రావు  వైజాగ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ గా ఎన్నో పెద్ద చిత్రాలు రిలీజ్ చేశారు.  త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన చార్లిచాప్లిన్ చిత్రాన్ని`మిస్ట‌ర్ ప్రేమికుడు`గా  తెలుగులో అనువ‌దిస్తూ నిర్మాత‌లుగా మారారు.  ప్ర‌భుదేవా న‌టించిన ఎన్నో మంచి చిత్రాల్లో ఇదొక‌టి. మొద‌ట్లో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌డానికి చాలా మంది ప్ర‌య‌త్నించారు. ఎందుకంటే తెలుగు నేటివిటీకి స‌రిగ్గా స‌రిపోయే సినిమా ఇది. ల‌వ్, క‌డుపుబ్బ న‌వ్వించే   కామెడీ, యాక్ష‌న్ ఎపిసోడ్స్ తో పాటు ఇందులో మంచి పాట‌లు కూడా ఉన్నాయి. ప్ర‌భుదేవా న‌ట‌న‌, నిక్కి గ‌ల్రాని, అదాశ‌ర్మ అందం, అభిన‌యం, శ‌క్తి చిదంబ‌రం డైర‌క్ష‌న్ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లు. ఈ నెల 29 వ‌స్తోన్న ఈ చిత్రంతో నిర్మాత‌లకు మంచి లాభాలు వ‌చ్చి మ‌రెన్నో చిత్రాలు నిర్మించాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా`` అన్నారు.

డిస్ట్రిబ్యూట‌ర్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ…వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి ఇద్ద‌రూ డిస్ట్రిబ్యూట‌ర్స్ గా ఎన్నో మంచి చిత్రాలు రిలీజ్ చేశారు. ఈ సినిమాతో నిర్మాత‌లుగా మారారు. ఇటీవ‌ల విడుద‌లైన డబ్బింగ్ సినిమాలు మంచి క‌లెక్ష‌న్స్ రాబడుతున్నాయి. ఆ కోవ‌లో ఈ సినిమా కూడా విజ‌యం సాధించి నిర్మాత‌లు మంచి పేరు, లాభాలు తీసుకురావాల‌న్నారు. నిర్మాత గుర్రం మ‌హేష్ చౌద‌రి మాట్లాడుతూ.. ఎక్కడా రాజీ ప‌డ‌కుండా తెలుగు స్ట్ర‌యిట్ సినిమాలా డ‌బ్బింగ్ చేయించాము. పాట‌లు కూడా బాగొచ్చాయి. త‌మిళంతో ఈ సినిమా పెద్ద స‌క్సెస్ అయింది. తెలుగులో కూడా అదే స్థాయిలో ఆడుతుంన‌ద్న న‌మ్మ‌కం ఉంది. ఈ నెల 29న విడుద‌ల‌కు సిద్ధ‌మైన మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్న‌అన్నారు. వి.శ్రీనివాస‌రావు మాట్లాడుతూ... ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లతో పాటు సెకండాఫ్ లో వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిల‌వ‌నున్నాయి. ప్ర‌భుదేవ ప‌ర్ఫార్మెన్స్, డాన్స్ తో పాటు అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని అందం, అభిన‌యం సినిమాకు హైలెట్. చాలా కాలం త‌ర్వాత ప్ర‌భుదేవ త‌ర‌హా హాస్యంతో పాటు ఆయ‌న డాన్స్ ని మ‌రోసారి తెరపై క‌నువిందు చేయ‌బోతుంది. ఈ నెల 29న గ్రాండ్ గా సినిమా రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాంఅన్నారు. `బాక్సాఫీస్ `అధినేత ర‌మేష్ చందు మాట్లాడుతూ...`మ‌హేష్ చౌద‌రి గారు, శ్రీనివాస గారు చాలా కాలంగా ప‌రిచ‌యం. ఇద్ద‌రూ ఎంతో ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తులు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు చాలా రిచ్ గా చేశారు. త‌మిళంలో ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో తెలుగులో కూడా అదే స్థాయిలో ఆడాల‌ని కోరుకుంటున్నా అన్నారు.
డిస్ట్రిబ్యూట‌ర్ గోపాల్ మాట్లాడుతూ…మ‌హేష్ చౌద‌రి, శ్రీనివాస్ ఇద్ద‌రితో మంచి ప‌రిచ‌యం ఉంది. ఒక మంచి సినిమాను తెలుగులోకి అనువదించారు. డిస్ట్రిబ్యూట‌ర్స్ గా స‌క్సెస్ అయ్యారు. నిర్మాత‌లుగా కూడా స‌క్సెస్ అవ్వాల‌ని కోరుకుంటున్నా అన్నారు.

పాయిజన్ మూవీ లోని మ్యాడ్ సాంగ్ ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్

పాయిజన్ మూవీ లోని మ్యాడ్ సాంగ్ ను విడుదల చేసిన హీరో శ్రీకాంత్

సి ఎల్ ఎన్ మీడియా నిర్మించిన “పాయిజన్” మూవీ లోని మ్యాడ్ సాంగ్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేయడం జరిగింది .ఈ“పాయిజన్” మూవీను తెలుగు ,హిందీ ,తమిళ్, కన్నడ, అండ్ మలయాళం భాషలలో ఒకేసారి విడుదల చేయబడును. ఈ చిత్ర నిర్మాత ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డిఫరెంట్ లొకేషన్లలో ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్ గా ఎంతో ప్యాషనేట్ గా నిర్మించిన చిత్రం “పాయిజన్” .ఈ చిత్రాన్ని ముంబై ,పూణే ,లోనావాలా, హైదరాబాద్ వంటి డిఫరెంట్ సిటీలలో  డిఫరెంటు లొకేషన్లలో భారీగా చిత్రీకరించడం జరిగింది.ఈ సందర్భంగా

హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతూ..
పాయిజన్ మూవీలోని మ్యాడ్ సాంగ్ సూపర్ గా ఉంది.చాలా ట్రెండీగా యూత్ ఫుల్ గా పిక్చరైజ్ చేశారు. డెఫినెట్గా ఈ సాంగ్ చాలా పెద్ద హిట్ అవుతుంది.మ్యూజిక్ చాలా క్యాచీగా ఉంది. హీరో రమణ నాకు తమ్ముడు కన్నా ఎక్కువే.. అతడికి ఈ పాయిజన్ మూవీ పెద్ద హిట్ ఇవ్వాలి అల్ ద బెస్ట్ ఎంటైర్ టీం కు అన్నారు .

డైరెక్టర్ రవిచంద్రన్
మాట్లాడుతూ.. మా పాయిజన్ మూవీ లోని మ్యాడ్ సాంగ్ ను హీరో శ్రీకాంత్ గారు రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. శ్రీకాంత్ గారికి మా ధన్యవాదాలు అన్నారు

హీరో రమణ మాట్లాడుతూ ..
మా అన్నయ్య శ్రీకాంత్ గారు నా పాయిజన్ మూవీ లోని మ్యాడ్ సాంగ్ ను రిలీజ్ చేయడం నా అదృష్టం.తనకు చాలా చాలా థాంక్స్ టూ అన్నయ్య. మ్యూజిక్ డైరెక్టర్ నిహారి ఈ మ్యాడ్ సాంగ్ కోన జర్మన్ నుంచి ఏబూల్టన్ మ్యూజిక్ ను ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది ఆన్నారు.

ఆర్టిస్ట్స్ : 
రమణ, షఫీ ,కమల్, అమిత్ విక్రమ్,
మోడల్స్ : సిమ్రాన్ ,శివన్య,, సారిక ,అర్చన ,ప్రతీక్ష , తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్  : సి.యల్.యన్ మీడియా
లాంగ్వేజెస్ : తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం
డీఒపి  : ముత్తు కుమరన్
మ్యూజిక్ : డి.జె.నిహాల్
ఎడిటర్  : సర్తాజ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సిరాజ్
ప్రొడ్యూసర్  : శిల్పిక .కె
స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ : రవిచంద్రన్
పి.ఆర్.ఓ : మధు వి.ఆర్, వంశీ శేఖర్

ఘనంగా జరిగిన “మైల్స్ అఫ్ లవ్”‘ ప్రి రిలీజ్ వేడుక..అక్టోబర్ 29న గ్రాండ్ గా రిలీజ్

ఘనంగా జరిగిన “మైల్స్ అఫ్ లవ్”‘ ప్రి రిలీజ్ వేడుక..అక్టోబర్ 29న గ్రాండ్ గా రిలీజ్

కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హుషారు ఫేమ్ అభినవ్ మేడిశెట్టి ,రమ్య పసుపులేటి జంటగా నందన్ దర్శకత్వంలో  రామ్ కామ్  బాక్డ్రాప్ లో  రాజు రెడ్డి నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న చిత్రం “మైల్స్ ఆఫ్ లవ్ “. ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. మరీ ముఖ్యంగా ‘తెలియదే.. తెలియదే’ అనేపాటకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకి యూట్యూబ్ లో 6.5 మిలియన్స్ వ్యూస్ ను కొల్లగొట్టింది. ఇప్పటికీ ఆ పాట ట్రెండింగ్లోనే ఉండడం మరో విశేషం. ఈ ఒక్క పాట సినిమా పై ఉన్న అంచనాలను డబుల్ చేసిందనే చెప్పాలి.  ఇదిలా ఉండగా చిత్రంలోని ‘గగనము దాటే’ వీడియో సాంగ్ ని హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.. ప్రముఖ గాయకుడు యశస్వి కొండేపూడి ఆలపించారు.ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల ఆయింది.అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదు లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి హీరో కార్తికేయ, నిర్మాత బెక్కం వేణుగోపాల్, హీరో దినేష్,పాగల్ డైరెక్టర్ నరేష్, నిర్మాత బాబ్జి , గాయత్రి గుప్త తదితరులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా వచ్చిన హీరో కార్తికేయ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ట్రైలర్స్ పాటలు చాలా బాగున్నాయి.ధ్రువన్ మంచి సంగీతం అందించారు. నిర్మాతకు ఇది మొదటి సినిమా అయినా నందన్ లాంటి మంచి దర్శకుడు తో ఈ కథను సెలెక్ట్ చేసుకొని చాలా చక్కగా నిర్మించాడు.ఏ మూవీ కైనా నిర్మాత దొరకడంచాలా కష్టం. మనకు ఎంత టాలెంట్ ఉన్నా ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేసినప్పుడే మనం సక్సెస్ అయ్యినట్లు.ఈ సినిమా ద్వారా  ఇండస్ట్రీకి  కొత్త ప్రొడ్యూసర్ రావడం చాలా సంతోషంగా ఉంది.డైరెక్టర్ నందన్ గారికి ఈ సినిమా పెద్ద హిట్ అయి ఇంకా ఇలాంటి మంచి మూవీస్ ఎన్నో చేయాలి. హీరోయిన్ రమ్య చాలా చక్కగా నటించింది. నా సినిమా RX 100 లోని “పిల్లారా..” సాంగ్ హిట్ అయినప్పుడే అదే ఇయర్ లో అభినవ్ ది ‘ఉండిపోరాదే’ సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఆ ఇయర్  హిట్ సాంగ్స్ లలో ఎప్పుడూ ఈ రెండు సాంగ్స్  మాత్రమే ఉండేవి. ఈ సాంగ్స్  మధ్యనే కాంపిటీషన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు తన సినిమా ఫంక్షన్ కు రావడం చాలా హ్యాపీ గా ఉంది. ఈ నెల 29 న వస్తున్న ఈ సినిమాతో పాటు విడుదల అవుతున్న అన్ని సినిమాలు పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ .. చిత్ర నిర్మాత రాజిరెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా నాకు తెలుసు. తనకు సినిమా తీయాలని తపన ఉన్న వ్యక్తి. ఒక చిన్న కథను సెలెక్ట్ చేసుకొని లాక్ డౌన్ టైం లో హుషారు ఫేమ్ అభినవ్ తొ మూవీ స్టార్ట్ చేయడం జరిగింది.తను పడ్డ కష్టానికి ఈ సినిమా ద్వారా కచ్చితంగా ప్రతి ఫలం లభిస్తుంది. ధ్రువన్ ఇచ్చిన పాటలు ఎంతో హిట్ అయ్యాయి.ఇందులో సిద్ శ్రీరామ్ ఆలపించిన పాట యూట్యూబ్ లో 6.5 మిలియన్స్ వ్యూస్ ను  కొల్లగొట్టింది. ఇప్పటికీ ఆ పాట ట్రెండింగ్లోనే  ఉండడం మరో విశేషం. యశస్వి ఫెంటాస్టిక్ గా పాడాడు. ఈ చిత్రం లోని విజువల్స్ సూపర్బ్ గా ఉన్నాయి. డైరెక్టర్  సాంగ్ పిక్చరైజేషన్ బాగా చిత్రీకరించారు. ఈ సినిమా సక్సెస్ అయి మా రాజిరెడ్డి ఇంకా మరిన్ని మంచిత్రాలు తియ్యాలి.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

చిత్ర నిర్మాత రాజారెడ్డి మాట్లాడుతూ …మా సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన బెక్కం వేణుగోపాల్ కి కార్తికేయ కు,నిర్మాత బాబ్జి,దర్శకుడు నరేష్, దినేష్ గార్లకు ధన్యవాదాలు.ఈ సినిమాకు ఆర్.ఆర్.ధ్రువన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.రమ్య, అభినవ్ కెమిస్ట్రీ ఎక్స్ట్రార్డినరీగా ఉంది.అభినవ్ మల్టీ టాలెంటెడ్. మా దర్శకుడు నందన్ డిఫరెంట్ కాన్సెప్టుతో “మైల్స్ ఆఫ్ లవ్” చిత్రాన్ని అందరికీ నచ్చే విధంగా తెరకెక్కించాడు.రవిమణి కెమెరా విజువల్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి. రెగ్యులర్ కమర్షియల్ లో కాకుండా చేసిన ఈ సినిమా క్లీన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అందరూ  కచ్చితంగా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు అన్నారు

చిత్ర దర్శకుడు నందన్ మాట్లాడుతూ ..మా మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రెజెంట్ యూత్ కి నచ్చే ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో రామ్ కామ్ బాక్డ్రాప్ లో క్లీన్ మూవీగా రూపొందించాం.ఈ మూవీకు కొత్త డైరెక్టర్, కొత్త డిఓపి ని పెట్టుకొని నన్ను నా కథపై ఉన్న నమ్మకంతో మాకు సపోర్ట్ గా నిలిచారు మా నిర్మాత రాజిరెడ్డి గారు. తను ఈ చిత్రాన్ని ఎక్కడా వెనకాడకుండా రిచ్ గా నిర్మించారు. బెక్కం వేణుగోపాల్ గారు మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. వారికి చాలా థాంక్స్. ఆర్.ఆర్ ధ్రువన్ మాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా చూసి బయటికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఈ  మ్యూజిక్ కు కచ్చితంగా కనెక్ట్ అవుతారు. అభినవ్, రమ్యల పెయిర్ చాలా బాగా కుదిరింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కోపరేట్ చేసి సినిమా బాగా రావడానికి హెల్ప్ చేశారు. రవి మణి కె.నాయుడు అందించిన విజువల్స్ కనుల పండగా ఉంటుంది. ఈ రోజు ఈ చిత్రం ప్రి రిలీజ్ జరుపు కుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

పాగల్ చిత్ర దర్శకుడు నరేష్ మాట్లాడుతూ.. ఈ మూవీ టీం అందరూ నాకు మంచి ఫ్రెండ్స్ అభినవ్,రాజారెడ్డి ,రమ్య వీరంతా ఎంతో కష్టపడి చేశారు. ఇందులో 2,3 సాంగ్స్ చూశాను అన్నీ చాలా బాగున్నాయి. డి.ఒ.పి రవి చాలా బాగా చూపించారు. అందరూ టీమ్ వర్క్  కలసి చేసిన ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

గెస్ట్ గా వచ్చిన నిర్మాత బాబ్జి మాట్లాడుతూ ..అభి చాలా మంచి యాక్టర్ తనకు మంచి భవిష్యత్తు ఉంది. నాలుగు పాటలు ఒక సినిమాలో హిట్ అవడం అనేది అంత ఈజీ కాదు. విజువలైజ్ గా చాలా బాగున్నాయి. ట్రైలర్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఈ సినిమా టీమ్ అందరికీ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

గెస్ట్ గా వచ్చిన హీరో దినేష్ మాట్లాడుతూ ..అభినవ్ చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్… రైటింగ్ ఎడిటింగ్ అన్నీ చూసుకుంటూ మ్యూజిక్ కంపోజ్ కూడా చేసుకుంటాడు. తను ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి .సాంగ్స్ చాలా బాగున్నాయి.ఈ మూవీ చూశాను చాలా బాగుంది. చూసిన ప్రతి ఒక్కరికీ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. నిర్మాత రాజి రెడ్డి  గారికి ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

ఆర్టిస్ట్ & డైరెక్టర్ గాయత్రి గుప్తా మాట్లాడుతూ .. అభి మంచి యాక్టర్ &  మంచి రైటర్ కూడా. ఇంకా తనలో చాలా టాలెంట్ ఉంది. ఇందులోమ్యూజిక్ సో బ్యూటిఫుల్. ఈ మూవీ తప్పకుండా విజయం సాధించాలని అన్నారు.

చిత్ర సంగీత దర్శకుడు ఆర్ ఆర్ ధ్రువన్ మాట్లాడుతూ ..
నా లైఫ్ లో ఇది స్పెషల్ మూమెంట్. ఇది నా ఫస్ట్ మూవీ. ఇలాంటి ప్రి రిలీజ్ ఈవెంట్  కోసం నేను చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ 2020 లో “సోలో బ్రతుకు సో బెటర్” సినిమా లోని ‘హే ఇది నేనేనా’..,’ఇది నీ పెళ్లి’ వంటి పాటలతో లిరిసిస్ట్ గా మంచి బ్రేక్ వచ్చింది. తరువాత నేను మంచి బ్రేక్ కోసం ఎదురు చూశాను. అలా లాక్ డౌన్ టైమ్ లో మధుర శ్రీధర్ గారి ద్వారా రాజిరెడ్డి అన్న కనెక్ట్ అయ్యాడు. అభినవ్ తో మూవీ అనగానే తను చేసిన సినిమాలోని ‘ఉండి పోరాదే’ సాంగ్ గుర్తుకొచ్చింది. అది నా పేవరేట్ సాంగ్. ఆ సాంగ్ ను నేను ఎన్నో షోస్ లలో పాడడం జరిగింది. అలాంటిది ఈ సినిమాలో కూడా అభినవ్ కు గుర్తుండిపోయే సాంగ్స్ ఇవ్వాలనుకున్నాను. అనుకున్ననట్లే ఇందులో ఉన్న అన్ని పాటలు హిట్ అయ్యాయి. అలా వైకుంఠ పురం తర్వాత సిద్ శ్రీరాం,అర్మాన్ మాలిక్ వంటి గొప్ప సింగర్స్ ఈ సినిమాకు రిపీట్ అవ్వడంతో ఈ సినిమాలోని పాటలకు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. సిద్ శ్రీరామ్ గారు పాడిన  ‘తెలియదే తెలియదే’ పాటకి యూట్యూబ్ లో 6.5 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ పాటలు ఇంతపెద్ద హిట్ అయ్యినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యూచర్ లో నేను ప్రేక్షకులకు ఇంకా మంచి సాంగ్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. రాజిరెడ్డి , అభినవ్ , నందన్, మణి గార్ల తో నాది చాలా యూనిక్ జర్నీ. నేను ఎన్నో విషయాలు తెలుసు కున్నాను, నేర్చుకున్నాను. ఈ జర్నీ నాకు ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఇంత మంచి పాటలు ఇచ్చిన నా లిరిసిస్ట్ చారి,రాజు లకు ధన్య వాదాలు.ఈ నెల 29 న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

చిత్ర హీరో అభినవ్ మేడిశెట్టి మాట్లాడుతూ .. నందన్ తో మేము స్టోరీని డిస్కషన్ చేసుకొని మూవీ స్టార్ట్ చేశాము. డి.ఓ.పి మణి గారు ఓన్లీ కెమెరా వర్క్ వరకే కాకుండా నాకు ప్రతి దాంట్లో అన్ని డిపార్ట్మెంట్ లలో నాతో ట్రావెల్ అయ్యాడు. ధ్రువన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. పాటల ద్వారా ఈ సినిమాకు మంచి వెయిట్ వచ్చింది. నా సినిమాకు ఇంత మంచి మ్యూజిక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. 2001లో  వచ్చిన ‘చెలి’ సినిమా చూసినప్పుడు ఆ వినిమాలోని పాటలకు ఫీలింగ్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ సినిమాలోని పాటలకు ఆలాంటి ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా డెడికేటెడ్ గా వర్క్  చేశారు.ఈ నెల 29 న వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి మా టీంను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

చిత్ర హీరోయిన్ రమ్య పసుపులేటి మాట్లాడుతూ..నందన్ గారు నాకు మంచి పాత్ర ఇచ్చి నన్ను చాలా బాగా చూపించారు. అభినవ్ నాకు మంచి కో స్టార్. మేము చాలా మంచి ఫ్రెండ్స్. తన ద్వారా నాకు ఈ సినిమా అవకాశం వచ్చింది. బెక్కం వేణు గోపాల్ గారు మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నా సినిమాకు ఇంత మంచి సాంగ్స్ కుదిరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంచి సినిమాలో నటించే ఆకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

డి ఓ పి రవి గారు మాట్లాడుతూ.. అభినవ్ లేకపోతే “మైల్స్ఆఫ్ లవ్” సినిమా ఉండేది కాదు. మేము లైన్ తీసుకొని వెళ్లిన తర్వాత తను ఈ ప్రాజెక్టుని ముందుకు నడిపించాడు. చిన్నగా  స్టార్ట్ చేసిన మాకు ఇంత పెద్ద  రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. సాంగ్స్ పరంగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ధ్రువన్ గారు నా విజువల్స్ కి మంచి మ్యూజిక్ ఇచ్చారు. మేము ఈ సినిమాను చాలా జెన్యూన్ గా తీశాము. అక్టోబర్ 29న వస్తున్న మా సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

లిరిసిస్ట్ పూర్ణా చారి మాట్లాడుతూ ..’మైల్స్ ఆఫ్ లవ్’ చూస్తుంటే స్మైల్స్ ఆఫ్ లవ్ గా మారుతుంది. ఇందులో నీలంబరి, ఒకటే ఒక లైఫ్ అని రెండు పాటలు రాశాను. ధ్రువన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తనలో మంచి ఫైర్ ఉంది, అది “మైల్స్ ఆఫ్ లవ్” రూపంలో బయటకు వచ్చింది. అలరాజు గారు “తెలియదే తెలియదే”, “గగనందాటి” రెండు పాటలు రాశాడు. అలాగే నందు, మణి గార్లు ఏదైనా ఒక పని చేయాలనకొంటే అది పూర్తి అయ్యేవరకు ఆపకుండా ఎంత కష్టమైనా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలా ఆపకుండా ఈ సినిమా ఇక్కడిదాకా వచ్చింది. అందరూ ఫ్రెష్ టాలెంట్ తో చాలా బాగా తీశారు. 29 న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

లిరిసిస్ట్ ఆలరాజు మాట్లాడుతూ.. నందన్, మణి గార్లు చాలా సపోర్ట్ ఇచ్చారు. రఘురాం గారు అద్బుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాతో ఆర్.ఆర్ ధ్రువన్ గా మన ముందుకు వస్తున్నాడు.నిజంగా చెప్పాలంటే తనొక సంగీత కెరటం అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ సినిమాలోని పాటలు వింటుంటే మీకే తెలుస్తుంది.అంత మంచి సంగీతం ఇచ్చాడు. ఇందులో నేను రెండు పాటలు రాశాను. అందులోని ‘తెలియదే’  అను పాటను సిద్ శ్రీరామ్ గారు పాడారు. ఏ ప్రమోషన్ లేకుండా జన్యున్ గా ఈ పాట యూట్యూబ్ లో 6.5 మిలియన్స్ వ్యూస్ ను కొల్లగొట్టింది. ఇప్పటికీ ఆ పాట ట్రెండింగ్లోనే  ఉండడం మరో విశేషం. ఇది నాకు ప్రౌడ్ మూమెంట్. అలాగే గగనందాటి అనే పాటను ప్రముఖ గాయకుడు యశస్వి కొండేపూడి ఆలపించారు. ఈ పాటతో పెద్ద వాళ్ళు సాయి మాధవ్ బుర్ర లాంటి వాళ్ళు నన్ను పిలిచి అప్రిష్యేట్ చేశారు. అలాగే మా ఈ చిన్న సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో కార్తికేయ గారికి కండలే గాదు మంచి గుండె కూడా ఉందని ప్రూవ్ చేసుకున్నారు. వారికి ధన్యవాదాలు అన్నారు.

నటీనటులు
అభినవ్ మేడిశెట్టి ,రమ్య పసుపులేటి,విస్మయశ్రీ, రవితేజ, సురేందర్ ,ప్రియ.

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ
సినిమా : మైల్స్ ఆఫ్ లవ్
ప్రొడ్యూసర్ : రాజిరెడ్డి
రైటర్ అండ్ డైరెక్టర్ : నందన్
మ్యూజిక్ : ఆర్.ఆర్.ధ్రువన్
డి.ఓ.పి : రవిమణి కె.నాయుడు,
ఎడిటర్ : బి నాగేశ్వర్ రెడ్డి
పిఆర్ఓ : సాయి సతీష్ , రాంబాబు పర్వతనేని

అడవి శేష్ మేజర్ మూవీ రిలీజ్ అప్డేట్…

‘మేజర్’ సినిమా లేటెస్ట్ అప్ డేట్ …

క్షణం, గూఢచారి సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్‌ మరోసారి తనదైన స్టైల్‌లో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీవీపీ నిర్మాణంలో వెంకట్‌ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఎవరు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అందుకుంది . స్పై సినిమాలు చేయాలన్న , థ్రిల్లర్ సినిమాలు చేయాలన్న హీరో అడవి శేష్ ఒక్కరు మాత్రమే అనే మంచి పేరు సంపాదించుకున్నాడు .. ..అడివి శేష్‌ కెరీర్ బిగినింగ్ నుండి విభిన్నమైన కాన్సెప్ట్స్ తో డిఫెరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకులముందుకు వచ్చి అలరిస్తున్నాడు .. క్షణం, గూఢచారి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అడవి శేష్. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ కొత్త మార్క్ కోసం ప్రయత్నిస్తున్నాడు. .అడివి శేష్‌ నటించిన ఎవరు సినిమాలో తన యాక్టింగ్ కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు ..రొటీన్ కు బిన్నంగా అడవి శేష్ స్టోరీస్ సెలెక్షన్ ఉంటాయి , అడవి శేష్ చేసిన సినిమాలు తక్కువ అయినా , అవి అన్నీ ప్రేక్షకాదరణ పొందినవే.. అడవి శేష్ తాను హీరో గా చేసిన సినిమాల్లో కాకుండా వేరే సినిమాల్లో అయిన , తన క్యారెక్టర్ బాగుంటే చాలు అలానే తాను నటించిన ఊపిరి , మరియు ఓ బేబీ’ సైజ్ జీరో సినిమాలు తాను చేసిన చిన్న రోల్స్ అయినప్పటికీ ప్రేక్షకులు ఆకట్టుకొన్నారు ..

2019 లో అడవి శేష్ నటించిన చివరి సినిమా ఎవరు .. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అడవి శేష్ యాక్టింగ్ లో మరో కోణాన్ని చూపించింది ..ఎవరు సినిమా తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో అడవి శేష్ తను చేయబోయే నెక్స్ట్ సినిమా ఎలాంటి జానర్ లో ఉంటుంది అనే ప్రశ్న ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది .. అడవి శేష్ సినిమా సినిమాకు చాలా టైం తీసుకుంటాడు , తను చేస్తున్న సినిమాలు ఎంతో వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటాడు , అలానే ఎవరు సినిమా తరువాత 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన ఎన్ఎస్జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ‘మేజర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు .. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్నారు .. ఎవరు లాంటి ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ సినిమా తో హిట్ అందుకున్నాకా చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని అడవి శేష్ ఈ సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు .. ఈ సినిమాను GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామిగా ఉండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ..

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న మేజర్ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. . ఈ సినిమాకు అడివి శేష్ కథ – స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ..అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఇటీవల అనారోగ్యానికి గురై తిరిగి కోలుకున్న శేష్.. రెట్టింపు ఎనర్జీతో ఉత్సాహంతో ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారని సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి …కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోయ్యుంటే ఈపాటికే ‘మేజర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని సరైన తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది.

“రామ్ అసుర్’ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్…

“రామ్ అసుర్’ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్..!!

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  నటీనటులుగా వెంక‌టేష్ త్రిప‌ర్ణ దర్శకత్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న “పీనట్ డైమండ్” చిత్రం మాస్ ఆడియన్స్ కు రీచ్ కాదని టైటిల్ ను రామ్ అసుర్గా మార్చడమైనది.ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ లతో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమా కి బెంగాల్ టైగ‌ర్ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమ కూరుస్తున్నారు. ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా ఆ పాటకు విశేష స్పందన లభించింది.అలాగే  ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ రిలీజ్ చేయడం విశేషం . సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి జె. ప్ర‌భాక‌రరెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రి స్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రామ్ అసుర్ చిత్రం.టైటిల్ ఫస్ట్ లుక్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరుపు కున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, ఇన్ కమ్ ట్యాక్స్ ఆడిషనల్ కమీషనర్ జీవన్ లాల్ ఐ.ఆర్.యస్ లు ముఖ్య అతిధులు గా పాల్గొని `రామ్ అసుర్’ టైటిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ .. అభినవ్ నాకు మంచి ఫ్రెండ్ తనకున్న బిజినెస్ లలో సక్సెస్ సాధించాడు. తను ఏ ప్రాజెక్ట్ మొదలు పెట్టినా సక్సెస్ అయ్యాడు.”రామ్ అసుర్” టైటిల్ ఎంతో ఆసక్తిగా ఉంది.  ట్రైలర్ చాలా బాగుంది.. దర్శకుడు ఎంత శ్రద్ధ పెట్టి సినిమా చేశారో అర్థం అవుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా మంచి హిట్ అయ్యి దర్శక నిర్మాత లకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఇన్ కమ్ ట్యాక్స్ ఆడిషనల్ కమీషనర్ జీవన్ లాల్ ఐ.ఆర్.యస్ మాట్లాడుతూ .. జీవితంలో ప్యాషనేట్ గా ఉంటే  ఉంటే ఎలా పైకి వస్తారు అనే దానికి నిదర్శనం అభినవ సర్దార్. తను చాలా కమిటెడ్  వ్యాల్యూస్ తో ముందుకు తీసుకెళ్తాడు.ఒక స్పెషల్ హైదరాబాద్ చాయ్ ని  ప్రొజెక్ట్ చేయడం చాలా గొప్ప విషయం. కానీ  బిజినెస్ మాన్ గా ప్రొజెక్ట్ చేసి దాన్ని ఎన్నో బ్రాంచీలు ఏర్పాటు చేసి అందులో బిజినెస్ ని సక్సెస్  క్రియేట్ చేసిన వ్యక్తి అభినవ సర్దార్.అలాంటి వ్యక్తి ఒక మూవీని ప్రాజెక్టును టేకప్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ముందుకు తీసుకెళ్లారు అని విన్న నేను ఈ సినిమా చూశాను. ఆయన జీవితంలో ఉన్న క్రియేటివిటి ఇందులో చూపించారు. సబ్జెక్ట్ చాలా బాగుంది ఇప్పటివరకు ఎవరూ ఇటువంటి సబ్జెక్ట్  ఉన్న సినిమాను  చూడనటువంటి  కథ. కొత్త గా క్రియేటివ్ గా ఆలోచించే తనకు ఈ మూవీ లో ఉన్నటువంటి క్యారెక్టర్ సర్దార్ కు కరెక్టుగా సరిపోతుంది.ఈ సినిమా కచ్చితంగా సూపర్ సూపర్ సక్సెస్ అవుతుంది.డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకూ ఇటువంటి కాన్సెప్ట్ సినిమా రాలేదు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది అన్నారు

చిత్ర దర్శక, నిర్మాత వెంక‌టేష్ త్రిప‌ర్ణ మాట్లాడుతూ ..ఫస్ట్ నీ మూవీని  ఓటిటి లో విడుదల చేయాలనుకొని “పీనట్ డైమండ్” అనే ఇంగ్లీష్ టైటిల్ టైటిల్ పెట్టడం జరిగింది.
కానీ మూవీ జరుగుతున్న ప్రాసెస్ లో ఎక్స్ట్రార్డినరీ విజువల్స్ చాలా గ్రాండ్ గా రావడం జరిగింది.దీంతో చాలా మంది వెల్ విషర్స్  ప్రస్తుతం కోవిడ్ నార్మల్ స్విచ్వేషన్ కు వచ్చింది ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయమని
సలహాలు ఇవ్వడంతో ఈ సినిమాను థియేటర్స్ లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.అయితే .మాస్ ఆడియన్స్ కు, కమర్షియల్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి కనుక “పీనట్  డైమండ్” ఇంగ్లీష్ టైటిల్
అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలని  “రామ్ అసుర్” గా టైటిల్ మార్చడం జరిగింది. బీమ్స్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.మాకు కొత్త ఓటిటి ఫ్లాట్ ఫామ్ నుండి మాకు పెద్ద ఆఫర్ వచ్చింది. మేము సినిమాకు పెట్టిన బడ్జెట్ కు మూడు రెట్లు ఎక్కువ ఆఫర్ వచ్చినా.. దాన్ని రిజెక్ట్ చేసి థియేటర్లో రిలీజ్  చేస్తే బాగుంటుంది.ఈ చిత్రంలోని విజువల్స్ ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి థియేటర్లో చూసిన ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఈ సినిమాను థియేటర్స్ లలో నవంబర్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

చిత్ర హీరో, నిర్మాత అభిన‌వ్ స‌ర్ధార్‌ మాట్లాడుతూ ..మా “రామ్ అసుర్” అనే ఈ పవర్ ఫుల్ టైటిల్ ఫస్ట్ లుక్ కు పిలవగానే వచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు “పీనట్ డైమండ్” అనే కాన్సెప్ట్ ను వెంకటేష్ గారు చెప్పడంతో తో చిన్న బడ్జెట్ తో చాలా కాన్ఫిడెంట్గా మూవీ స్టార్ట్ చేశాము. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి సెట్స్ కు వెళ్లిన  తరువాత  ఈ సినిమాని నెక్ట్స్ లెవల్ కు వెళ్ళింది. మాకు ప్రభాకర్ రెడ్డి గారు కెమెరామెన్ గా, బీమ్స్ గారు మ్యూజిక్  చేయడం , సుమన్ గారు, శుభలేక సుధాకర్ ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేయడంతో ప్రొడక్షన్ వ్యాల్యూస్ పెరిగి ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో వెళ్లడం జరిగింది. మా సినిమాకు ఓ టి టి లో విడుదల చేస్తే మీరు పెట్టిన బడ్జెట్ పై మూడు రెట్లు  ఎక్కువ అమౌంట్ ఇస్తామని ఆఫర్ వచ్చినా కూడా కాదని కోవిడ్ వలన థియేటర్స్ అన్నీ నార్మల్ సిచువేషన్ వచ్చిన తర్వాత థియేటర్స్ లోనే ఈ సినిమా రిలీజ్ చేద్దాం  అనుకున్నాము. ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమాను మేము అనుకున్న  టార్గెట్ సెగ్మెంట్లలో  మొత్తం అందరికీ  మాస్, క్లాస్,యూత్ అందరికీ ఈ సినిమా రీచ్ అవ్వాలని బిగ్  స్క్రీన్ మీద ఈ సినిమా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు అని ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం.అలాగే ఈ సినిమాను నెక్స్ట్ లెవల్లో పబ్లిసిటీ చేసి చిన్న సినిమా అయినా నెక్స్ట్ రేంజ్ లో తీసుకెళ్లి  బిగ్ సక్సెస్ చేయాలని వచ్చే నెల నవంబర్ 19న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. హాలీవుడ్, బాలీవుడ్,టాలీవుడ్ లోగానీ  ఇటువంటి కాన్సెప్ట్ తో ఉన్న సినిమా ఎవ్వరూ టచ్ చేయలేదు, తీయలేదు. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అన్నారు.

నటుడు బ్లాక్ షానీ మాట్లాడుతూ ..  అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్యాండమిక్ స్విచ్వేషన్ కారణంగా ఓటిటి లో విడుదల చేయాలనుకొని “పీనట్ డైమండ్” తో మూవీ మొదలు పెట్టాము. అయితే ప్రస్తుతం నార్మల్ స్విచ్వేషన్ వచ్చిన కారణంగా ఈ సినిమా ను థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.పీనట్ డైమండ్ మాస్ ఆడియన్స్ కు రీచ్ కాదని ఈ చిత్ర టైటిల్ ను రామ్ అసుర్గా మార్చడమైనది. త్వరలో మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

నటీనటులు :
అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, సుమన్,శుభలేఖ సుధాకర్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు :
సినిమాటోగ్ర‌ఫి: జె. ప్ర‌భాక‌ర రెడ్డి,
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఫైట్స్‌: శ‌ంక‌ర్‌.యు,
లైన్ ప్రొడ్యూస‌ర్‌: శ్రీ‌నిధి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : శాని సాల్మాన్‌‌,
పి.ఆర్‌.ఓ: సాయి స‌తీష్‌,
నిర్మాత‌లు : అభిన‌వ్ స‌ర్ధార్‌,వెంక‌టేష్ త్రిప‌ర్ణ,
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేష్ త్రిప‌ర్ణ.

శ్రీసింహా కోడూరి కొత్త సినిమా “భాగ్ సాలే” షూటింగ్ ప్రారంభం

శ్రీసింహా కోడూరి కొత్త సినిమా “భాగ్ సాలే” షూటింగ్ ప్రారంభం

సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “భాగ్ సాలే”. ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం సోమవారం ఉదయం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు హరీష్ శంకర్ ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టారు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి సురేష్ బాబు సమర్పణలో బిగ్ బెన్ సినిమా, సినీ వ్యాలీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా “భాగ్ సాలే” చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యష్ రంగినేని, శింగనమల కళ్యాణ్ నిర్మాతలు. దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి రూపొందిస్తున్నారు.

“మత్తు వదలరా”, “తెల్లవారితే గురువారం” చిత్రాల తర్వాత శ్రీ సింహ నటిస్తున్న మూడో చిత్రమిది. క్రైమ్ కామెడీ జానర్ లో తెరకెక్కుతున్న “భాగ్ సాలే” ఈ చిత్రానికి కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.

జాన్ విజయ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, నందినీరాయ్, సుదర్శన్, వంశీ నెక్కంటి, వైవా హర్ష, కిడ్ చక్రి, జయవాణి, బాష, యాదం రాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ – సత్య గిడుటూరి, సినిమాటోగ్రఫీ – సుందర్ రామ్ కృష్ణన్, ప్రొడక్షన్ డిజైనర్ – శృతి నూకల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అశ్వత్థామ – , సాహిత్యం – శ్రీజో, ఫైట్స్ – రామకృష్ణ, కాస్ట్యూమ్స్ – రాగ రెడ్డి, కాస్ట్యూమర్ – కృష్ణ, మేకప్ – బాబు, పీఆర్వో – జీఎస్కే మీడియా, సమర్పణ – డి సురేష్ బాబు, నిర్మాతలు – యష్ రంగినేని, శింగనమల కళ్యాణ్, రచన, దర్శకత్వం – ప్రణీత్ బ్రహ్మాండపల్లి.

1 166 167 168 169