“రామ్ అసుర్’ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్…

“రామ్ అసుర్’ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్..!!

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  నటీనటులుగా వెంక‌టేష్ త్రిప‌ర్ణ దర్శకత్వంలో అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న “పీనట్ డైమండ్” చిత్రం మాస్ ఆడియన్స్ కు రీచ్ కాదని టైటిల్ ను రామ్ అసుర్గా మార్చడమైనది.ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ లతో మంచి క్రేజ్ ను దక్కించుకున్న ఈ సినిమా కి బెంగాల్ టైగ‌ర్ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం సమ కూరుస్తున్నారు. ఈ చిత్రంలోని పాటను టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా ఆ పాటకు విశేష స్పందన లభించింది.అలాగే  ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ రిలీజ్ చేయడం విశేషం . సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి జె. ప్ర‌భాక‌రరెడ్డి ఛాయాగ్ర‌హ‌కుడిగా వ్య‌వ‌హ‌రి స్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రామ్ అసుర్ చిత్రం.టైటిల్ ఫస్ట్ లుక్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరుపు కున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, ఇన్ కమ్ ట్యాక్స్ ఆడిషనల్ కమీషనర్ జీవన్ లాల్ ఐ.ఆర్.యస్ లు ముఖ్య అతిధులు గా పాల్గొని `రామ్ అసుర్’ టైటిల్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ .. అభినవ్ నాకు మంచి ఫ్రెండ్ తనకున్న బిజినెస్ లలో సక్సెస్ సాధించాడు. తను ఏ ప్రాజెక్ట్ మొదలు పెట్టినా సక్సెస్ అయ్యాడు.”రామ్ అసుర్” టైటిల్ ఎంతో ఆసక్తిగా ఉంది.  ట్రైలర్ చాలా బాగుంది.. దర్శకుడు ఎంత శ్రద్ధ పెట్టి సినిమా చేశారో అర్థం అవుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా మంచి హిట్ అయ్యి దర్శక నిర్మాత లకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

ఇన్ కమ్ ట్యాక్స్ ఆడిషనల్ కమీషనర్ జీవన్ లాల్ ఐ.ఆర్.యస్ మాట్లాడుతూ .. జీవితంలో ప్యాషనేట్ గా ఉంటే  ఉంటే ఎలా పైకి వస్తారు అనే దానికి నిదర్శనం అభినవ సర్దార్. తను చాలా కమిటెడ్  వ్యాల్యూస్ తో ముందుకు తీసుకెళ్తాడు.ఒక స్పెషల్ హైదరాబాద్ చాయ్ ని  ప్రొజెక్ట్ చేయడం చాలా గొప్ప విషయం. కానీ  బిజినెస్ మాన్ గా ప్రొజెక్ట్ చేసి దాన్ని ఎన్నో బ్రాంచీలు ఏర్పాటు చేసి అందులో బిజినెస్ ని సక్సెస్  క్రియేట్ చేసిన వ్యక్తి అభినవ సర్దార్.అలాంటి వ్యక్తి ఒక మూవీని ప్రాజెక్టును టేకప్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ముందుకు తీసుకెళ్లారు అని విన్న నేను ఈ సినిమా చూశాను. ఆయన జీవితంలో ఉన్న క్రియేటివిటి ఇందులో చూపించారు. సబ్జెక్ట్ చాలా బాగుంది ఇప్పటివరకు ఎవరూ ఇటువంటి సబ్జెక్ట్  ఉన్న సినిమాను  చూడనటువంటి  కథ. కొత్త గా క్రియేటివ్ గా ఆలోచించే తనకు ఈ మూవీ లో ఉన్నటువంటి క్యారెక్టర్ సర్దార్ కు కరెక్టుగా సరిపోతుంది.ఈ సినిమా కచ్చితంగా సూపర్ సూపర్ సక్సెస్ అవుతుంది.డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకూ ఇటువంటి కాన్సెప్ట్ సినిమా రాలేదు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది అన్నారు

చిత్ర దర్శక, నిర్మాత వెంక‌టేష్ త్రిప‌ర్ణ మాట్లాడుతూ ..ఫస్ట్ నీ మూవీని  ఓటిటి లో విడుదల చేయాలనుకొని “పీనట్ డైమండ్” అనే ఇంగ్లీష్ టైటిల్ టైటిల్ పెట్టడం జరిగింది.
కానీ మూవీ జరుగుతున్న ప్రాసెస్ లో ఎక్స్ట్రార్డినరీ విజువల్స్ చాలా గ్రాండ్ గా రావడం జరిగింది.దీంతో చాలా మంది వెల్ విషర్స్  ప్రస్తుతం కోవిడ్ నార్మల్ స్విచ్వేషన్ కు వచ్చింది ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయమని
సలహాలు ఇవ్వడంతో ఈ సినిమాను థియేటర్స్ లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.అయితే .మాస్ ఆడియన్స్ కు, కమర్షియల్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి కనుక “పీనట్  డైమండ్” ఇంగ్లీష్ టైటిల్
అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలని  “రామ్ అసుర్” గా టైటిల్ మార్చడం జరిగింది. బీమ్స్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.మాకు కొత్త ఓటిటి ఫ్లాట్ ఫామ్ నుండి మాకు పెద్ద ఆఫర్ వచ్చింది. మేము సినిమాకు పెట్టిన బడ్జెట్ కు మూడు రెట్లు ఎక్కువ ఆఫర్ వచ్చినా.. దాన్ని రిజెక్ట్ చేసి థియేటర్లో రిలీజ్  చేస్తే బాగుంటుంది.ఈ చిత్రంలోని విజువల్స్ ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి థియేటర్లో చూసిన ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఈ సినిమాను థియేటర్స్ లలో నవంబర్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

చిత్ర హీరో, నిర్మాత అభిన‌వ్ స‌ర్ధార్‌ మాట్లాడుతూ ..మా “రామ్ అసుర్” అనే ఈ పవర్ ఫుల్ టైటిల్ ఫస్ట్ లుక్ కు పిలవగానే వచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు “పీనట్ డైమండ్” అనే కాన్సెప్ట్ ను వెంకటేష్ గారు చెప్పడంతో తో చిన్న బడ్జెట్ తో చాలా కాన్ఫిడెంట్గా మూవీ స్టార్ట్ చేశాము. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి సెట్స్ కు వెళ్లిన  తరువాత  ఈ సినిమాని నెక్ట్స్ లెవల్ కు వెళ్ళింది. మాకు ప్రభాకర్ రెడ్డి గారు కెమెరామెన్ గా, బీమ్స్ గారు మ్యూజిక్  చేయడం , సుమన్ గారు, శుభలేక సుధాకర్ ఇలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాకు పని చేయడంతో ప్రొడక్షన్ వ్యాల్యూస్ పెరిగి ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో వెళ్లడం జరిగింది. మా సినిమాకు ఓ టి టి లో విడుదల చేస్తే మీరు పెట్టిన బడ్జెట్ పై మూడు రెట్లు  ఎక్కువ అమౌంట్ ఇస్తామని ఆఫర్ వచ్చినా కూడా కాదని కోవిడ్ వలన థియేటర్స్ అన్నీ నార్మల్ సిచువేషన్ వచ్చిన తర్వాత థియేటర్స్ లోనే ఈ సినిమా రిలీజ్ చేద్దాం  అనుకున్నాము. ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమాను మేము అనుకున్న  టార్గెట్ సెగ్మెంట్లలో  మొత్తం అందరికీ  మాస్, క్లాస్,యూత్ అందరికీ ఈ సినిమా రీచ్ అవ్వాలని బిగ్  స్క్రీన్ మీద ఈ సినిమా చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరు అని ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం.అలాగే ఈ సినిమాను నెక్స్ట్ లెవల్లో పబ్లిసిటీ చేసి చిన్న సినిమా అయినా నెక్స్ట్ రేంజ్ లో తీసుకెళ్లి  బిగ్ సక్సెస్ చేయాలని వచ్చే నెల నవంబర్ 19న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాము. హాలీవుడ్, బాలీవుడ్,టాలీవుడ్ లోగానీ  ఇటువంటి కాన్సెప్ట్ తో ఉన్న సినిమా ఎవ్వరూ టచ్ చేయలేదు, తీయలేదు. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అన్నారు.

నటుడు బ్లాక్ షానీ మాట్లాడుతూ ..  అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్యాండమిక్ స్విచ్వేషన్ కారణంగా ఓటిటి లో విడుదల చేయాలనుకొని “పీనట్ డైమండ్” తో మూవీ మొదలు పెట్టాము. అయితే ప్రస్తుతం నార్మల్ స్విచ్వేషన్ వచ్చిన కారణంగా ఈ సినిమా ను థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.పీనట్ డైమండ్ మాస్ ఆడియన్స్ కు రీచ్ కాదని ఈ చిత్ర టైటిల్ ను రామ్ అసుర్గా మార్చడమైనది. త్వరలో మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.

నటీనటులు :
అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, సుమన్,శుభలేఖ సుధాకర్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు :
సినిమాటోగ్ర‌ఫి: జె. ప్ర‌భాక‌ర రెడ్డి,
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఫైట్స్‌: శ‌ంక‌ర్‌.యు,
లైన్ ప్రొడ్యూస‌ర్‌: శ్రీ‌నిధి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : శాని సాల్మాన్‌‌,
పి.ఆర్‌.ఓ: సాయి స‌తీష్‌,
నిర్మాత‌లు : అభిన‌వ్ స‌ర్ధార్‌,వెంక‌టేష్ త్రిప‌ర్ణ,
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: వెంక‌టేష్ త్రిప‌ర్ణ.