మరో క్రేజీ మల్టీ స్టారర్ సినిమా ని సెట్ చేకున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల …

మరో క్రేజీ మల్టీ స్టారర్ సినిమా ని సెట్ చేకున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల …

 పీరియాడికల్  బ్యాక్ డ్రాప్ తో  రానున్న  మల్టీ  స్టారర్  సినిమా ...

విభిన్నమైన సినిమాలను తెరకెక్కించే అతి కొద్దీ మంది దర్శకుల్లో , శ్రీకాంత్ అడ్డాల ఒకరు .. శ్రీకాంత్ అడ్డాల సినిమా అనగానే కుటుంబ బంధాలు , సెంటిమెంట్స్ , యూత్ ఫుల్ కంటెంట్స్ అన్ని కలిసి ఉంటాయి .. రొటీన్ కి బిన్నంగా శ్రీకాంత్ అడ్డాల స్టోరీస్ ఉంటాయి . క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఫ్యామిలీ ఎమోషన్స్ , సెంటిమెంట్స్ సీన్స్ , ఎలా చిత్రీకరిస్తారో , అలానే శ్రీకాంత్ అడ్డాల సినిమాలు కూడా ఎక్కువ ఫ్యామిలీ స్టోరీస్ , ఫ్యామిలీ ఎమోషన్స్ , సహజంగా ప్రేక్షకుల అందరికి కనెక్ట్ అయ్యేలాగా తెరకెక్కించే అతి కొద్దీ మంది దర్శకుల్లో , శ్రీకాంత్ అడ్డాల ఒకరు .దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చిన దర్శకుల లిస్ట్ లో శ్రీకాంత్ అడ్డాల ఒకరు .. శ్రీకాంత్ అడ్డాల అసిస్టెంట్ డైరెక్టర్ గా నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఎన్నో సినిమాలకు పని చేసి 2008 లో , ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాడు .. మొదటి సినిమా తో మంచి సక్సెస్ అందుకొని సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ‘కొత్త బంగారు లోకం’ సినిమా ఇటు యూత్ కు ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి బిగ్గెస్ట్ హిట్ అందుకోవడమే కాకుండా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కు మంచి పేరును తీసుకొచ్చింది ..

‘కొత్త బంగారు లోకం’ సినిమా తరువాత డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని , మల్టీస్టారర్ సినిమా గా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ అనే సినిమాను డైరెక్ట్ చేశారు .. మల్టీస్టారర్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ..అంతే కాకుండా ఈ సినిమా తర్వాతే టాలీవుడ్ లో ఈ జెనరేషన్ హీరోల మల్టీస్టారర్ ట్రెండ్ మొదలైయ్యింది. ప్రస్తుతం రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్స్ కు బీజం వేసింది శ్రీకాంత్ అడ్డాలే అని దిల్ రాజు తెలిపారు .. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత , వచ్చిన “ముకుంద” మరియు , “బ్రహ్మోత్సవం ” రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంతగా విజయం సాధించలేకపోయాయి .. “ముకుంద” మరియు “బ్రహ్మోత్సవం ” సినిమాల తరువాత నాలుగేళ్ళ గ్యాప్ తీసుకొని ‘నారప్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ..

‘నారప్ప’ సినిమా తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఆ తరువాత సినిమా ఏ స్టార్ హీరో తో చేస్తాడా తన నెక్స్ట్ సినిమా ఉండబోతుందో అనే చర్చ సోషల్ మీడియా లో మోదలైయింది .. ‘నారప్ప’ ఇచ్చిన రిసల్ట్ తో ఫుల్ జోష్ మీదున్న శ్రీకాంత్ అడ్డాల ”అన్నాయ్” అనే ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నట్లు శ్రీకాంత్ అడ్డాల సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు .. ”అన్నాయ్” సినిమా గుంటూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందే భారీ పీరియాడికల్ డ్రామా అని.. అది కూడా మూడు భాగాలుగా తెరకెక్కే ట్రైయాలజీ అని శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమా సక్సెస్ మీట్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి తెలిపారు .. . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి .. అయితే ఈ భారీ మల్టీస్టారర్ సినిమా కోసం చిరంజీవి – బన్నీ లను సంప్రదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి .. . ఇప్పటికే మహేష్ – వెంకీ వంటి ఇద్దరు స్టార్ హీరోలను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసిన అడ్డాల.. వారి ఫ్యాన్స్ ని కూడా మెప్పించారు. ఇప్పుడు చిరు – బన్నీ లకు కూడా అదే విధంగా తెర మీద ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతము మెగా స్టార్ చిరంజీవి చేతిలో ఆచార్య , గాడ్ ఫాదర్ సినిమాలు , మరియు మెహెర్ రమేష్ , మరియు డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి .. అలానే అల్లు అర్జున్ పుష్ప సినిమా లో ఫుల్ బిజీగా ఉన్నారు ,గీతా ఆర్ట్స్ బ్యానర్ లో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటిస్తారని టాక్ వినిపిస్తుంది .. మరి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రాబోయే ఈ భారీ మల్టీస్టారర్ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా లో వస్తున్న వార్తల్లో నిజం ఎంతవరకు ఉన్నదో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలిసిందే …