అడవి శేష్ మేజర్ మూవీ రిలీజ్ అప్డేట్…

‘మేజర్’ సినిమా లేటెస్ట్ అప్ డేట్ …

క్షణం, గూఢచారి సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్‌ మరోసారి తనదైన స్టైల్‌లో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పీవీపీ నిర్మాణంలో వెంకట్‌ రామ్‌జీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఎవరు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అందుకుంది . స్పై సినిమాలు చేయాలన్న , థ్రిల్లర్ సినిమాలు చేయాలన్న హీరో అడవి శేష్ ఒక్కరు మాత్రమే అనే మంచి పేరు సంపాదించుకున్నాడు .. ..అడివి శేష్‌ కెరీర్ బిగినింగ్ నుండి విభిన్నమైన కాన్సెప్ట్స్ తో డిఫెరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకులముందుకు వచ్చి అలరిస్తున్నాడు .. క్షణం, గూఢచారి లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అడవి శేష్. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ కొత్త మార్క్ కోసం ప్రయత్నిస్తున్నాడు. .అడివి శేష్‌ నటించిన ఎవరు సినిమాలో తన యాక్టింగ్ కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు ..రొటీన్ కు బిన్నంగా అడవి శేష్ స్టోరీస్ సెలెక్షన్ ఉంటాయి , అడవి శేష్ చేసిన సినిమాలు తక్కువ అయినా , అవి అన్నీ ప్రేక్షకాదరణ పొందినవే.. అడవి శేష్ తాను హీరో గా చేసిన సినిమాల్లో కాకుండా వేరే సినిమాల్లో అయిన , తన క్యారెక్టర్ బాగుంటే చాలు అలానే తాను నటించిన ఊపిరి , మరియు ఓ బేబీ’ సైజ్ జీరో సినిమాలు తాను చేసిన చిన్న రోల్స్ అయినప్పటికీ ప్రేక్షకులు ఆకట్టుకొన్నారు ..

2019 లో అడవి శేష్ నటించిన చివరి సినిమా ఎవరు .. ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అడవి శేష్ యాక్టింగ్ లో మరో కోణాన్ని చూపించింది ..ఎవరు సినిమా తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో అడవి శేష్ తను చేయబోయే నెక్స్ట్ సినిమా ఎలాంటి జానర్ లో ఉంటుంది అనే ప్రశ్న ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది .. అడవి శేష్ సినిమా సినిమాకు చాలా టైం తీసుకుంటాడు , తను చేస్తున్న సినిమాలు ఎంతో వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటాడు , అలానే ఎవరు సినిమా తరువాత 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన ఎన్ఎస్జి కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ‘మేజర్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు .. ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్నారు .. ఎవరు లాంటి ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ సినిమా తో హిట్ అందుకున్నాకా చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని అడవి శేష్ ఈ సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు .. ఈ సినిమాను GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామిగా ఉండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి ..

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న మేజర్ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. . ఈ సినిమాకు అడివి శేష్ కథ – స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. ‘గూఢచారి’ ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ..అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఇటీవల అనారోగ్యానికి గురై తిరిగి కోలుకున్న శేష్.. రెట్టింపు ఎనర్జీతో ఉత్సాహంతో ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారని సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి …కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోయ్యుంటే ఈపాటికే ‘మేజర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని త్వరలోనే అనౌన్స్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని సరైన తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది.