శర్వానంద్ – సినిమా లేటెస్ట్ అప్ డేట్ …….

శర్వానంద్ – సినిమా లేటెస్ట్ అప్ డేట్ …….
2020 హీరో శర్వానంద్ కు పెద్దగా కలిసి రాలేదు అని చెప్పాలి .. శర్వానంద్ – సమంత కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా జాను .. తమిళంలో పెద్ద హిట్ అందుకున్న క్లాసిక్ సినిమా ‘96’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. హీరో శర్వానంద్, సమంత లతో ఈ సినిమాను మాతృకకు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమారే ఈ సినిమాను కూడా తెరెకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంతగా హిట్ సాధించలేకపోయింది .. జాను సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ఫిల్మ్ క్రిటిక్స్ నుండి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంది .. జాను సినిమా తో ప్రేక్షకులను డిస్సపాయింట్మెంట్ చేసిన శర్వానంద్ ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని శ్రీకారం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. జాను సినిమా లవ్ స్టోరీ మరియు రీమేక్ సినిమా కాబట్టి , ఎక్కడో ఒక చోట చిన్న చిన్న లోపల వల్ల ఈ స్టోరీ కి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేకపోయారు .. జాను’ సినిమాతో నిరాశపర్చిన శర్వానంద్ ఈసారి లవ్‌స్టోరీని కాకుండా రైతుల స్టోరీని ఎంచుకున్నాడు. ” కుటుంబకథా చిత్రాలతో పాటు లవ్ స్టోరీస్‌తో ఆకట్టుకున్న శర్వానంద్.. వ్యవసాయం నేపథ్యంలో ‘శ్రీకారం’ అనే సోషల్ మెసేజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , డైలాగ్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా నిలిచింది ..
శ్రీకారం సినిమా తరువాత హీరో శర్వానంద్ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లో మల్టీ స్టారర్ గా ‘మహా సముద్రం సినిమా తో ప్రేక్షకులముందుకు వచ్చాడు ..ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా మారారు అజయ్ భూపతి. ఇప్పుడు తన సెకండ్ సినిమాగా ‘మహా సముద్రం’ మరోసారి తన సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో మరియు పెద్ద స్టార్ కాస్టింగ్ తో దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇవ్వడం, ఈ సినిమా ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ‘మహా సముద్రం’పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది ..
డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ – ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ .. ఈ సినిమా ట్రైలర్స్ , టీజర్స్ , మేకింగ్ , డైలాగ్స్ మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ,రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి సాలిడ్ హిట్ అందుకున్నాడు .. ‘ఇస్మార్ట్ శంకర్’ ..సినిమా తరువాత రామ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా రెడ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. గతంలో రామ్ కు ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి హిట్లు ఇచ్చిన కిశోర్ తిరుమలతో ‘రెడ్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ..