నిఖిల్ 18 పేజీలు కథ కు సుకుమార్ ఫుల్ స్టాప్ పెట్టాడా …

నిఖిల్ 18 పేజెస్'మూవీ లేటెస్ట్ అప్ డేట్ ...

 

...

నిఖిల్ సినీ కెరీర్ కనుక చూస్తే , మొదటి నుంచీ డిఫరెంట్‌ సినిమాలతో టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో తనకంటూ ఒక సెపెరేట్ రూట్ క్రియేట్ చేసుకొని తన గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు .. 2019 లో డైరెక్టర్ టీఎన్‌ సంతోష్‌ – నిఖిల్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా “అర్జున్‌ సురవరం” . తమిళం లో సూపర్‌హిట్‌ అయిన కణితన్‌’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర యావేరేజ్ టాక్ తెచ్చుకుంది .. “అర్జున్‌ సురవరం” సినిమా తరువాత నిఖిల్ చాలా లాంగ్ గ్యాప్ తీసొకొన్నాడు .. అర్జున్ సురవరం సినిమా తరువాత నిఖిల్ పెళ్లి చేసుకోవడం , ఆ తరువాత మహమ్మారి కరోనా రావడం వల్ల నిఖిల్ చెయ్యాలిసిన సినిమాల గురించి ఎటువంటి న్యూస్ బయటకు రాలేదు .. నిఖిల్ చందు మొండేటి కాంబినేషన్ లో 2014 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా కార్తికేయ ,ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని సూపర్ హిట్ అందుకుంది ..కార్తికేయ సినిమా హిట్ అవ్వడమే కాకుండా హీరో నిఖిల్ కు డైరెక్టర్ చందూ మొండేటి కి మంచి పేరు తీసుకొచ్చింది .. డైరెక్టర్ చందూ మొండేటి – నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా “సవ్యసాచి” .ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్ మరియు మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నది కానీ , బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత విజయం సాధించలేకపోయింది .. ” సవ్యసాచి” సినిమా తరువాత డైరెక్టర్ చందూ మొండేటి చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని హీరో నిఖిల్ తో కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు .. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది..

సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖ లో పనిచేసిన పల్నాటి సూర్యప్రతాప్ , 2015 లో కుమారి 21ఎఫ్ సినిమా తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. కుమారి 21ఎఫ్ సినిమా తరువాత డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ , యంగ్ హీరో నిఖిల్ కాంబినేషన్ లో 18 పేజెస్ సినిమా ను తెరకెక్కిస్తున్నారు .. ఈ సినిమాను స్టార్ నిర్మాత అల్లు అరవింద్ మరియు సుకుమార్ ల సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు ..ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. ఈ సినిమా చిత్రీకరణ గత ఏడాదిలోనే ముగించాల్సి ఉన్నా కూడా మహమ్మారి కరోనా కారణం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఫైనల్ గా ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ ను ముగింపు దశకు తీసుకు వచ్చారు చిత్ర యూనిట్ … కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమా షూటింగ్ కు వీలు కాకపోవడంతో షూటింగ్ పూర్తి అయినంత వరకు డబ్బింగ్ ను చెప్పించారు. ఆ సమయంలో నిఖిల్ 18 పేజెస్ సినిమా డబ్బింగ్ చెప్తున్నట్లుగా ఒక ఫొటోను కూడా షేర్ చేశారు అని సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి ..

ఈ సినిమా 10 రోజులు మినహా షూటింగ్ పూర్తి అయ్యింది. ఆ పది రోజుల వర్కింగ్ డేస్ ను అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు చిత్ర యూనిట్ .. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు స్క్రిప్ట్ ను సుకుమార్ అందించడం వల్ల సినిమా స్థాయి మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు. ఈమద్య కాలంలో బన్నీ వాసు నిర్మించిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.

నిఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా మొదటి సారి ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వచ్చినట్లుగా నిఖిల్ చెప్పుకొచ్చాడు. కార్తికేయ 2 మరియు 18 పేజెస్ సినిమాలు తరువాత మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి .. మొత్తానికి 18 పేజెస్ సినిమా గురించి లేటెస్ట్ న్యూస్ తెలిసి నిఖిల్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు …