అక్కినేని :అభిమానులకు చేదు వార్త ..

అక్కినేని :అభిమానులకు చేదు వార్త ..

నాగ చైతన్య సమంతల విడాకుల పై తరుచు రోజు ఏదో ఒక న్యూస్ చూస్తున్నాం .. సోషల్ మీడియా లో నాగ చైతన్య సమంత విడిపోతున్నారు అని రోజు ఎదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాం , అయితే ఎట్టకేలకు ఈ రోజున ఈ న్యూస్ కి ఈ రోజున క్లారిటీ వచ్చింది .. అందరూ అనుకున్నదే నిజమైంది. గత కొంత కాలంగా నాగ చైతన్య సమంత ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తూనే ఉన్నాయి , అయితే వీరిద్దరి మధ్య వచ్చే మనస్పర్థలకు చాలా పెద్దవి గా ఉండే సరికి చివరికి కౌన్సిలింగ్ దాకా వెళ్లాయి ..మజిలీ సినిమా తరువాత నాగ చైతన్యు కొంత గ్యాప్ తీసుకొని శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేసాడు , అయితే చై సినిమాకు ఎప్పుడు సపోర్ట్ చేసే సమంత లవ్ స్టోరీ సినిమాకు , ట్విట్టర్ వేదికగా సాయి పల్లవికి , మరియు చిత్ర యూనిట్ కి అల్ ది బెస్ట్ అని చెప్పడం అభిమానులకు నిరాశ కలిగించింది , అదే విధంగా సమంత పిక్స్ కొన్ని సోషల్ మీడియా లో వైరల్ అవ్వడం అక్కినేని అభిమానులకు ఆవేదన గురి చేయడం జరిగింది .. సమంత నటించిన ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో కొన్ని సన్నివేశాలు అక్కినేని కుటుంబానికి నచ్చలేదు . అలాగే సూపర్ డీలక్స్ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలు కూడా సమంత చేయడం నాగా చైతన్య కు ఇష్టం లేదు , అలానే సూపర్ డీలక్స్ సినిమాలో సమంత కు కొన్ని సీన్స్ చేయద్దు అని నాగ చైతన్య చెప్పడం జరిగింది .. ఏది ఏమి అయినా సమంత నాగ చైతన్య విడిపోవడం ఇటు అక్కినేని అభిమానులకు , ఇటు ఇండస్ట్రీకి మింగుడు పడని విషయం ..ప్రధానంగా నాగ చైతన్య -సమంత ల మధ్య ఇగో క్లాష్ రావడం జరిగింది , అలానే సమంత బోల్డ్ గా నటించడం అక్కినేని కుటుంబానికి ఇష్టం లేదు , ఈ విషయం ఫై అక్కినేని కుటుంబం చాలా సీరియస్ గా ఉంది సమంత నటించడం పై అక్కినేని కుటుంబం ఆక్షేపణ కూడా తెలిపారు .. 2017, అక్టోబర్‌ 7న సమంత- నాగ చైతన్య పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గోవాలో క్రిస్టియన్‌, హిందూ సాంప్రదాయాల ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నారు. సమంత నాగ చైతన్యల విడాకులపై గత నెల నుంచి వస్తోన్న రూమర్లను నిజం చేస్తూ ఈ ఇద్దరూ అధికారికంగా ప్రకటన చేశారు, అయితే ఈ వార్త విన్నప్పటి నుంచి అక్కినేని అభిమానులు కొంత అందోళంగా ఉన్నారు .. నాగ చైతన్య తన ట్విట్టర్‌ ద్వారా అధికారికంగా విడాకుల గురించి ప్రకటించి , బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని, ఎవరి దారి వారు చూసుకోవాలనుకున్నామని పేర్కొన్నారు.తమ ప్రైవసీకి భంగం కలిగించొద్దంటూ కోరాడు. మరోవైపు సమంత సైతం నాగచైతన్యతో విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించింది. పదేళ్ల స్నేహానికి ముగింపు పలుకుతున్నామని, అయితే విడిపోయినా స్నేహితులుగా కలిసి ఉంటామని సమంత పేర్కొంది. మా శ్రేయోభిలాషులందరికీ.. ఇక నుంచి మేం భార్య-భర్తలుగా దూరంగా ఉండాలనుకుంటున్నాం. చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి వేర్వేరుగా మా సొంత మార్గాల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. దశాబ్ద కాలంగా మా స్నేహం కొనసాగినందుకు మేం అదృష్టవంతులం. ఇప్పుడు ఈ కష్ట సమయంలో అభిమానుల మద్దతు కావాలి. మా గోప్యతను కాపాడాలని శ్రేయోభిలాషులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాం’అని నాగచైతన్య ట్వీట్‌ చేశారు.ఎన్నో సుధీర్ఘ చర్చల తరువాత మేం ఇద్దరం భార్యా భర్తలుగా విడిపోయి ఎవరి జీవితాలను వారే బతికేందుకు నిర్ణయించుకున్నామని ప్రకటించారు. గత దశాబ్దాలుగా మా మధ్య ఉన్న స్నేహబంధం ఇలానే కొనసాగుంది.. అది ఇప్పటికీ ఎప్పటికీ అలానే ఉంటుందని ఇరువురు పేర్కొన్నారు.

రిపబ్లిక్’ మూవీ రివ్యూ

రిపబ్లిక్’ మూవీ రివ్యూ

మెగాహీరో సాయిధరమ్ తేజ్, దేవ కట్టా కాంబినేషన్ లో వచ్చిన ‘రిపబ్లిక్’ మూవీ ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది . సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తరువాత సాయిధరమ్ తేజ్ చాలా గ్యాప్ తీసుకొని డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ చేసిన తర్వాత ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి దేవ కట్టా డైరెక్షన్ లో వచ్చిన చివరి సినిమా డైనమేట్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది .. డైనమేట్ సినిమా తరువాత దేవ కట్టా చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మెగాహీరో సాయిధరమ్ తేజ్ తో సినిమా ఎనౌన్స్ చేయాడం , అదే విధంగా ఈ సినిమా పొలిటికల్ సబ్జెక్ట్ కావడంతో ,ఇటు ప్రేక్షకులకు , మరియు ఇండస్ట్రీ లో అందరికి మరో ప్రస్థానం లాంటి సినిమా అవుతుంది అని అందరూ అనుకున్నారు .. దేవ కట్టా సినిమాలు ప్రేక్షకులు అంత త్వరగా జడ్జ్ చేయడం కష్టం , దేవ కట్టా సినిమాలు అంటే కమ్మర్షియల్ అంశాలు తక్కువ ఉంటాయి , సామాజిక అంశాలు చాలా అంతర్లీనంగా ఉంటాయి . సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతుండ‌గా.. ఆయ‌న న‌టించిన సినిమా ‘రిప‌బ్లిక్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ప్రస్థానం’తో త‌న‌దైన ముద్రవేసిన దేవాక‌ట్టా ద‌ర్శకుడు కావ‌డం.. సాయితేజ్ యువ ఐఏఎస్ అధికారిగా న‌టించ‌డంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక‌మైన ఆస‌క్తి ఏర్పడింది. కధ విషయానికి వస్తే పంజా అభిరామ్ (సాయి ధరమ్ తేజ్) చిన్న తనం నుంచి దారి తప్పిన సిస్టమ్ కి అపోజిట్ థాట్ ప్రాసెస్ తో పెరుగుతాడు. అమెరికాకి వెళ్ళాల్సిన వాడు కొన్ని కారణాల కారణంగా కలెక్టర్ కావాలని నిర్ణయించుకుంటాడు. మరోపక్క విశాఖవాణి (రమ్యకృష్ణ) పార్టీ అధికారంలోకి వస్తోంది. ఓటు బ్యాంక్ కోసం తెల్లేరును విషపూరితంగా మారుస్తారు. దాంతో లక్ష మంది వరకూ అనేక రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మైరా (ఐశ్వర్య రాజేష్) అన్నయ్య చనిపోతాడు. ఆ కేసుతో మొదలైన అభిరామ్ పోరాటం.. తెల్లేరు జాతకాన్ని ఎలా మార్చాడు.? ఆ తరవాత ఈ సిస్టమ్ వల్ల అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది మిగిలిన కధ..

ప్లస్ పాయింట్స్ : ప్రస్థానం సినిమాలో ఏ విధమైన పొలిటికల్ డ్రామా అయితే ఉందొ , అదే విధంగా ఈ సినిమాలో పొలిటికల్ డ్రామా మరియు సిస్టమ్ లో
ప్రస్తుత రాజకీయాల గురించి, సిస్టమ్ లోని లొసుగులు గురించి సినిమాలో చర్చించిన అంశాలు అద్భుతంగా చిత్రీకరించారు .. ముఖ్యంగా డైర్ష్కుడు రాసుకున్న పొలిటికల్ సన్నివేశాలు, రమ్యకృష్ణ ట్రాక్.. జగపతిబాబు – సాయి తేజ్ మధ్య వచ్చే ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి .సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ క‌థ‌ని న‌మ్మి భుజానికెత్తుకోవ‌డం అభినందించ‌గ‌ద‌గ్గ విష‌యం. సాయి తేజ్ ఈ సినిమా లో యువ ఐఏఎస్ అధికారిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు ..సాయి తేజ్ గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది అని మొదటి నుంచి దేవ కట్టా చెబుతూనేఉన్నారు .. అలాగే ఈ సినిమాలో సాయి తేజ్ కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇంకా ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కనిపించిన రమ్యకృష్ణ రాజకీయ నాయకురాలిగా తన నటనతో ప్రేక్షకుల అందరిని
బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన జగపతిబాబు కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన కొన్ని ఏమోషనల్ సీన్స్ ను చాలా బాగా పండించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు, అదే విధంగా దేవ కట్టా రాసిన డైలాగ్స్, అండ్ కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి.

తీర్పు :రిపబ్లిక్ అంటూ వచ్చిన ఈ పొలిటికల్ అండ్ ప్రాక్టికల్ ఎమోషనల్డ్రామాలో.. నేటి రాజకీయ వాస్తవ పరిస్థితులకు సంబంధించి ఇచ్చిన మెసేజ్, పొలిటికల్ డైలాగ్స్, అండ్ కొన్ని ఎమోషన్స్ వంటి అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. . ఓవరాల్ గా ఈ సినిమా, పొలిటికల్ జోనర్ లో సినిమాలను ఇష్ట పడే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

సెన్సార్ సన్నాహాల్లో “ఎక్కడికో ఈ అడుగు’

సెన్సార్ సన్నాహాల్లో
“ఎక్కడికో ఈ అడుగు’

‘ఎఫెక్ట్స్ రాజు’గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన రాజు బొనగాని దర్శకత్వంలో… ‘స్కై లైన్ ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై తొలి ప్రయత్నంగా అట్లూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం “ఎక్కడికో ఈ అడుగు”. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ సన్నాహాల్లో ఉంది.
గోపీకృష్ణ-ప్రియాంక చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్తి రాజ్, జయప్రకాష్ (తమిళ్), తోటపల్లి మధు, పిల్లా ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

1990లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా.. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన “ఎక్కడికో ఈ అడుగు” అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం తమకుందని, సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న తమ చిత్రాన్ని నవంబర్ ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రాజు బొనగాని తెలిపారు.
నిర్మాత అట్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ…”చిత్ర నిర్మాణంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ “ఇనావర్స్ స్టూడియో”కు అప్పగించాం. మాకు ప్రామిస్ చేసిన బడ్జెట్ లో… మాకు ప్రామిస్ చేసిన దానికంటే మంచి క్వాలిటీతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా “ఇనావర్స్ స్టూడియో”వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం” అన్నారు.

ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, కో-డైరెక్టర్: నాగరాజు, ఆర్ట్: వెంకటేష్ ఆరె, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దిలీప్ బండారి, మాటలు: రమన్ లోక్ వర్మ, ఛాయాగ్రహణం: ఈశ్వర్ ఎల్లుమహంతి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తాతినేని సుజన్ బాబు, నిర్మాత: అట్లూరి శ్రీనివాస్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజు బొనగాని!!

“ఆట నాదే.. వేట నాదే..”

అక్టోబరు 2 న గ్రాండ్ గా విడుదలవుతున్న “ఆట నాదే.. వేట నాదే..”

వీరాంజనేయులు &  రాజ్యలక్ష్మి సమర్పించు  భరత్, సంచిత శెట్టి,చాందిని తమిళ రసన్, ఖతీర్ ,
రాధా రవి ,యోగ్ జపి, ఆత్మ పాట్రిక్, గడ్డం కిషన్ నటీనటులుగా అరుణ్ కృష్ణస్వామి దర్శకత్వంలో కుబేర ప్రసాద్ నిర్మించిన చిత్రం “ఆట నాదే.. వేట నాదే” .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ  సందర్భంగా

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ .. మనిషి జీవితమే ఒక ఆట ప్రేమ అనే ఆటలో గెలవాలంటే మనుసులను  గెలవాలి,  మనసులను గెలవాలంటే గెలుపోటములు ఉంటాయి . గెలుపు ఓటమి అనేది ప్రతి ఆట లో ఉంటాయి .ఒక ప్రేమికుడు తను  కోరుకున్న అమ్మాయిని గెలుచు కోవడం కోసం గుర్రపు పందేలు ఆడదానికి సిద్ధమయ్యి ఆఖరి రూపాయి వరకు తను ఎంత కష్టపడ్డాడు ఆ గుర్రపు పందేలు ఎంతోమంది హేమాహేమీలు ఉన్నా.. గుర్రపు పందేలలో తను నెగ్గి తన ప్రేమను గెలిపించు కున్నాడా..తను గెలిచాడా.. ఒడిపోయాడా.. తనకోసం అనుకోని  ఇంకొక తన ఫ్రెండ్ ను ఈ ఉచ్చు లోకి లాగితే అమాయకుడైన ఫ్రెండ్ తను కూడా ఈ పోటీకి సిద్ధమై తను  సహాయ పడ్డాడా.. తను గెలిచాడా.. తన ప్రేమను గెలిపించుకున్నాడా… గెలుపు ఓటమి అనేది మనిషికి ముఖ్యం అది ప్రేమ కావచ్చు జీవితంలో కావచ్చు  ఆటలో అవ్వచ్చు అయితే ఈ ఆట ఆడేటప్పుడు ప్రేమ  మనిషిని గెలిపించుకోవడం కోసం రేస్ ఆడవలసిన అవసరం లేదు అని చెప్పవచ్చు.అలాగే మనిషి తన ప్రేమను గెలిపించుకోవడం కోసం  దేనికైనా  తెగిస్తాడు  అనేది సినిమా ఇతి వృత్తం. తనని తాను గేలుసుకోవడం కోసం తనను తన మనసు చేసిన చేసిన అమ్మాయిని  గెలుచుకోవడం కోసం ఇద్దరు కుర్రాళ్లు ఈ ఆటలో పోటీపడి ఎలా నెగ్గారు. తన ప్రేమను ఎలా గెలిపించుకున్నారు తన జీవితంలో ఎలా గెలిచారు   అనేదే మా “ఆట నాదే.. వేట నాదే”.. అంటే ఆట కోసం వేట మొదలెట్టాలి ఆ  వేట సక్సెస్ అయితే మన ఆట ఆడి గెలిచినట్లే..అందుకే  ఈ చిత్రానికి  ఆట నాదే.. వేట నాదే.. టైటిల్ పెట్టడం జరిగింది.సినిమా చాలా బాగా వచ్చింది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబరు 2 న విడుదల చేస్తున్నాము. ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

నటీనటులు
భరత్, సంచిత శెట్టి,చాందిని తమిళ రసన్, ఖతీర్ ,రాధా రవి , యోగ్ జపి, ఆత్మ పాట్రిక్, గడ్డం కిషన్ తదితరులు

సాంకేతిక నిపుణులు
సమర్పణ :-వీరాంజనేయులు & రాజ్యలక్ష్మి
నిర్మాత :- కుబేర ప్రసాద్
రచన దర్శకత్వం :-అరుణ్ కృష్ణస్వామి
సహ నిర్మాతలు :- అక్కినేని శ్రీనివాసరావు, అట్లూరి సురేష్ బాబు
సంగీతం :- ఏ మోసెస్
ఛాయాగ్రహణం :; యువ
కూర్పు :- గోపికృష్ణ
వి.ఎఫ్.ఎక్స్  :-చందు ఆది – అండ్ టీం
ఆర్ట్ డైరెక్టర్ :- సుబ్బు.ఏ
నృత్యం :-  విజయ సతీష్
పాటలు, మాటలు :-భారతీబాబు
నేపథ్య సంగీతం :- సుదర్శన్ కుమార్
పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్

మత్య్సకారుల ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను సర్కార్ మానుకోవాలి… పవన్ కల్యాణ్

మత్య్సకారుల ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను సర్కార్ మానుకోవాలి… పవన్ కల్యాణ్

సంప్రదాయంగా, వారసత్వంగా వస్తున్న చేపల వేట, అమ్మకాలపై ఆధారపడ్డ మత్స్యకారుల జీవనోపాధికి గండికొట్టి, వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. చెరువులు, రిజర్వాయర్లు లాంటి చోట్ల మత్స్యకార సొసైటీ సభ్యులకు చేపలు వేటాడుకొనే అవకాశం లేకుండా చేస్తున్న జీవో 217 విషయంలో జనసేన పార్టీ ఎలా పోరాడాలనే విషయంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన మత్స్యకార వికాస విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్ గారు పాల్గొన్నారు. విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను, జీవో 217 తమ జీవనోపాధికి ఎలా విఘాతం కలిగిస్తుందో వివరించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “ప్రజా పోరాట యాత్రను ఇచ్చాపురం ప్రాంతంలో కపాసు కుర్ది దగ్గర గంగమ్మకు పూజ చేసే మొదలుపెట్టాను. కోస్తాలో పర్యటించిన ప్రతి ప్రాంతంలో మత్స్యకారుల సమస్యల గురించి, ఇక్కడ జీవనోపాధి లేక వలసలుపోతుండటాన్ని అవగాహన చేసుకున్నాను. మత్స్యకారుల సమస్యలపై పోరాడటమే కాకుండా… ఈ వృత్తిపై ఆధారపడ్డవారు నైపుణ్యాలు పెంచుకొని ఆర్థికంగా ఎదిగే అంశాలపై అవగాహన కలిగించేందుకే పార్టీ పక్షాన మత్స్యకార వికాస విభాగం ఏర్పాటు చేశాం. పాలనలో ఉన్నవారు సైతం సంప్రదాయ వృత్తులపై ఆధారపడ్డవారికి ఆర్థిక బలం చేకూర్చేలా చేయాలి. అంతేగానీ ఆర్థిక మూలాలను దెబ్బ తీసేలా నిర్ణయాలు చేయకూడదు. చెరువులు, రిజర్వాయర్ల దగ్గర చేపల వేటకు మత్స్యకారులకు అవకాశం లేకుండా చేసి వేలం ద్వారా సమకూరే ఆదాయంలో 70శాతం ప్రభుత్వమే తీసుకొంటుందనే ఆందోళన మత్స్యకారుల్లో ఉంది” అన్నారు.
మత్స్యకార వికాస విభాగం సభ్యులు తమ ఆందోళనను వెలిబుచ్చుతూ ఈ విధంగా వేలం వేయడం అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే… అదీ నెల్లూరు జిల్లాకే పరిమితం అని రాష్ట్ర మంత్రి చెబుతున్నారనీ… అయితే జీవో 217లో ఆ వివరాలు లేవు అన్నారు. ఈ వృత్తిపై ఆధారపడ్డవారికి ఉపాధి లేకుండా చేస్తుంది ఈ జీవో అని తెలిపారు.
ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ టి.శివశంకర్ గారు, శ్రీ సత్య బొలిశెట్టి గారు, శ్రీమతి పాలవలస యశస్వి గారు, లీగల్ సెల్ ఛైర్మన్ శ్రీ ఈవన సాంబశివ ప్రతాప్ గారు పాల్గొన్నారు.

అక్టోబర్ 9న వస్తున్న “తీరం”

అక్టోబర్ 9న వస్తున్న “తీరం” సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. టీజర్ విడుదల కార్యక్రమంలో మైటీ స్టార్ శ్రీకాంత్ !!

అకి క్రియేటివ్ వర్క్స్, యల్ యస్ ప్రొడక్షన్స్ బ్యానర్లు పై శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిష్టెన్ రవళి, అపర్ణ నాయికా నాయకులుగా యం. శ్రీనివాసులు నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రం “తీరం” ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని అక్టోబర్ 9న అత్యధిక ధియేటర్సలలో గ్రాండ్ గా విడుదల కానుంది.. కాగా ఈ చిత్రం టీజర్ ను శత చిత్రాల కథానాయకుడు మైటీ స్టార్ శ్రీకాంత్ విడుదల చేశారు. ఆయన స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో మరియు దర్శకులు అనిల్ ఇనమడుగు, శ్రావణ్ వైజిటి, సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, నటులు అజయ్, ఇజాజ్ జాన్, సునీల్ ఉప్పిరెట్ల, జై, కెమెరామెన్ శ్రవణ్ జి కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ బిజె తదితరులు పాల్గొన్నారు.. అనంతరం ఏర్పాటైన ప్రెస్ మీట్ లో..

మైటీ స్టార్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ” తీరం టీజర్ చూశాను. చాలా ఎక్స్ ట్రార్డినరిగా ఉంది.. సీన్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మ్యూజికల్ లవ్ స్టోరీతో పాటు భావోద్వేగాల సమ్మేళనంతో సినిమా తీశారని తెలుస్తుంది.. ఇప్పుడు అందరూ కొత్త కథలతో కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నారు.. అనిల్ టేకింగ్ చాలా బాగుంది.. కెమెరా వర్క్, మ్యూజిక్ సుపెర్బ్ గా చేశారు.. నిర్మాత శ్రీనివాసులు చిన్న సినిమా అయినా కూడా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీరం చిత్రాన్ని నిర్మించారు.. ఆయన ఇంకా మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలి.. అక్టోబర్ 9న వస్తున్న ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని.. అవుతుందని నమ్ముతూ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్.. అన్నారు.

హీరో కమ్ దర్శకుడు అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ.. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. మా నిర్మాత శ్రీనివాసులు గారు కథని నమ్మి నా మీద నమ్మకంతో ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మించారు.. సినిమా బాగా వచ్చింది.. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.. ముఖ్యంగా అడిగిన వెంటనే మా మూవీ టీజర్ ను శ్రీకాంత్ గారు విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది. మా టీమ్ అందరి తరుపున ఆయనకి మా కృతజ్ఞతలు.. అక్టోబర్ 9న మా చిత్రం విడుదలవుతుంది.. అన్నారు.

మరో హీరో శ్రావణ్ వైజిటి మాట్లాడుతూ.. ” తీరం లో మెయిన్ హీరోగా చేశాను.. అనిల్ నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చాడు.. సినిమా యూత్ కె కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.. మా టీజర్ రిలీజ్ చేసి మమ్మల్ని బ్లెస్ చేసిన హీరో శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు.. అన్నారు.

చిత్ర నిర్మాత యం. శ్రీనివాసులు మాట్లాడుతూ.. ” కొత్త వారైనా కూడా తీరం చిత్రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దారు. సెన్సార్ పనులు అన్నీ పూర్తి అయ్యాయి.. మా సినిమా టీజర్ ను శ్రీకాంత్ గారు లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.. ఆయనకి మా టీమ్ అందరి తరుపున చాలా థాంక్స్. అక్టోబర్ 9న తీరం చిత్రాన్ని సినేటెరియా సంస్థ ద్వారా వెంకట్ గారు రిలీజ్ చేస్తున్నారు.. సినిమాని ఆదరించి పెద్ద విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.. అన్నారు.

సినేటెరియా గ్రూప్ సంస్థ అధినేత వెంకట్ బోలేమోని మాట్లాడుతూ.. ” తీరం ఒక అద్భుతమైన ఎమోషనల్ ఎంటర్టైనర్ చిత్రం. సినిమా చూశాను.. శ్రీనివాసులు గారి మేకింగ్, అనిల్ టేకింగ్ బ్యూటిఫుల్ అనే చెప్పాలి.. మ్యూజిక్ మెయిన్ హైలెట్ గా నిలుస్తుంది.. మా సినేటెరియా ద్వారా ఈ చిత్రాన్ని అక్టోబర్ 9న అత్యధిక థియేటర్స్ లలో భారీగా రిలీజ్ చేస్తున్నాం.. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను.. అన్నారు.

చార్లీ చాప్లిన్ లుక్ లో నభా నటేష్

చార్లీ చాప్లిన్ లుక్ లో మెరిసిన హీరోయిన్ నభా నటేష్.వైరల్ అవుతున్న ఫొటోలు

టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో నభా నటేష్ ఒకరు. నన్ను దోచుకుందువటే, ఇస్మార్ట్ శంకర్,‘‘సోలో బ్రతుకే సో బెటర్’’ సినిమాల్లో గ్లామరస్ రోల్స్ లో ఆకట్టుకున్న నభా తాజాగా మాస్ట్రో సినిమాలోనూ తన అందంతో ఫ్యాన్స్ ను అలరించింది. ఇక నభా సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్ కి కనువిందు చేస్తుంది. ఎప్పుడూ గ్లామర్ షూట్స్ చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇందుకు భిన్నమైన ఫోటో షూట్ చేసింది.

అందులో నభా నటేష్ చార్లీ చాప్లిన్ అవతారమెత్తింది. ఫన్నీగా ఉన్న నభా చార్లీ చాప్లిన్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. భిన్నమైన ఈ గెటప్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

“వెల్లువ” టైటిల్ పోస్టర్

అలీ గారి చేతులమీదుగా విడుదలైన “వెల్లువ” టైటిల్ పోస్టర్

వీనస్ మూవీస్ పతాకంపై రంజిత్, సౌమ్య మీనన్(కేరళ), అలీ, రావు రమేష్, పెద్ద నరేష్, నటీనటులు గా మైల రామకృష్ణ దర్శకత్వంలో M. కుమార్ , M. శ్రీని వాసులు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం “వెల్లువ”. ఈ చిత్రం  షూటింగ్ హైదరాబాద్ లోని సైనిక్ పురి లోగల హైజాక్ బిస్ట్రో లో  అలీ పై ‘చెప్పకురా మామా నువ్వు చెప్పకు సారీ  ‘ సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సమావేశంలో అలీ గారు ‘వెల్లువ’ చిత్ర టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు.అనంతరం

నటుడు అలీ మాట్లాడుతూ* ..చిత్ర నిర్మాత కుమార్ గారు మనీషా ఫిల్మ్స్ లో 20 సంవత్సరాలుగా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశాడు, ఇప్పుడు ఈ చిత్రాన్నీ
శ్రీనివాస్ గారితో కలిసి నిర్మిస్తున్నాడు. హీరో రంజిత్ కి ఇది మూడవ సినిమా. రంజిత్ తో గతంలో జువ్వ  మూవీ చేసాను. ఇది తనతో రెండవ సినిమా .ఈ సినిమా కోవిడ్ కారణంగా ఆలస్యం అయ్యింది. అసిస్టెంట్ గా, కో డైరెక్టర్ గా,.అసోసియేట్ డైరెక్టర్ గా వ్యవహరించిన రామకృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా  పరిచయ మవుతున్నాడు. ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ అద్భుతమైన పాటలు అందించాడు.ఇందులో నాతో  “చెప్పకురా మామా ..నువ్వు చెప్పకు సారీ ..పాటను పాడించారు. ఇందులో హీరో హీరోయిన్లు చాలా చక్కగా నటించారు ఇది బ్యూటిఫుల్ మెసేజ్ ఉన్న కథ . అక్టోబర్ లో  విడుదల అవుతున్న ఈ సినిమా చిత్ర యూనిట్ కు పెద్ద విజయం  సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.. అన్నారు.

చిత్ర దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ … నిర్మాతలకు నేను చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. లవ్, ఫ్యామిలీ ఎమోషన్ తో వస్తున్న చిత్రమిది. నిర్మాతలు నాకేం కావాలో అన్ని సమకూర్చారు. కొవిడ్ కారణంగా లేట్ అయినా  సినిమా చాలా బాగా వచ్చింది. ఘంటాడి కృష్ణ గారి సంగీతం,బాల్ రెడ్డి గారి ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. హీరో హీరోయిన్లు చాలా చక్కగా నటించారు. రావు రమేష్ గారు, అలీ, సీనియర్ నరేష్, లాంటి పెద్ద నటులతో  సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.హీరో రంజిత్, అలీ గార్లతో  చేసే ఈ పాటతో తో సినిమా పూర్తయింది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

హీరో రంజిత్ మాట్లాడుతూ .. సీనియర్ నటులతో నేను చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఘంటాడి కృష్ణ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలీ గారితో కలసి పాట చేసుకున్నందుకు చాలా అందంగా ఉంది .ఇలాంటి మంచి సినిమా లో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

చిత్ర నిర్మాత ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ ..దర్శకుడు చెప్పిన కథ నచ్చింది.విద్యార్థి చివరి దశలో మనం జీవనోపాధిని ఏర్పాటు చేసుకుంటే జీవితాంతం అందరమూ కూడా సంతోషంగా ఉంటాం.జీవనోపాధి తర్వాతే లవ్, పెళ్లి అనే మంచి కాన్సెప్టు తో వస్తున్న  సినిమా ఇది. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి మెసేజ్ అందిస్తున్నాము.ఇందులో నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు .మంచి కాన్సెప్టుతో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలని కోరుచున్నాను అన్నారు.

మరో నిర్మాత కుమార్ మాట్లాడుతూ ..ఈ సినిమా అలీ, రావు రమేష్ , సీనియర్ నరేష్ గార్లకు కథ నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారికి ఈ కథ నచ్చడంతో  ఈ సినిమాపై మాకు మరింత నమ్మకం ఏర్పడింది.. గతంలో నేను చాలా సినిమాలు చేశాను సీనియర్ నటులతో ఇప్పుడు ఈ చిత్రాన్ని తీస్తున్నాం .సినిమాలో మంచి కంటెంట్ ఉంది. సొసైటీకి ఇలాంటి మంచి  సినిమా కావాలి. ఘంటాడి కృష్ణ గారు అందించిన పాటలను ప్రేక్షకులు అందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. టెక్నీషియన్స్ అందరూ కోవిడ్ పరంగా ఎంతో ఇబ్బంది పడిన కూడా మాకు సపోర్ట్ గా నిలిచారు వారి వల్లే సినిమా బాగా వచ్చింది.  ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది..అన్నారు

సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ … వీనస్ పతాకంపై వస్తున్నా “వెల్లువ” సినిమాకు నేను నిజంగా వెల్లువ లాంటి సంగీతం అందించాను. ఇంత మంచిది సబ్జెక్టుకు ఇంత మంచి పాటలు నాతో దగ్గరుండి చేయించుకున్నారు దర్శక, నిర్మాతలు.నిర్మాతలకు సినిమాపై  టేస్ట్ ఉండడం వల్లే పాటలు  సిచువేషన్ తగ్గట్టు బాగా వచ్చాయి. ఈ సినిమా నేను అందించిన మ్యూజిక్ నా కెరీర్లో మైల్ స్టోన్ గా నిలుస్తుంది అని భావిస్తున్నాను అన్నారు.

నటీనటులు
రంజిత్ , సౌమ్య మీనన్ (కేరళ ),విలన్ గగన్ విహారి (108 మూవీ ఫేమ్),రావు రమేష్, పెద్ద నరేష్, ఆలీ, సత్యం రాజేష్, తోటపల్లి మధు, ఆటో రామ్ ప్రసాద్, జూనియర్ రేలంగి, ఆనంత్, కెవ్వు కార్తిక్, సంధ్య జనక్, సుధ (కన్నడ),రియా, కల్పన, రాధిక

సాంకేతిక నిపుణులు
నిర్మాతలు :- M. కుమార్ , M. శ్రీనివాసులు
డైరెక్షన్ :- మైల రామకృష్ణ
ఎగ్స్క్యూటివ్ ప్రొడ్యూసర్ :- బి.నాగేశ్వర్ రావు
మ్యూజిక్ :-ఘంటాడి కృష్ణ
డి.ఓ.పి :- బాల్ రెడ్డి
ఎడిటర్ :- ప్రవీన్ పూడి
రైటర్ :-పరుచూరి నరేష్
డాన్స్ మాస్టర్ :- అజయ్ ,వెంకటేష్ దీప్
ఫైట్ మాస్టర్ :- శంకర్
ఆర్ట్ డైరెక్టర్ :- నారాయణ
స్టిల్స్ :- కృష్ణ కనుగుల
కాస్టూన్స్ :- సుబ్బయ్య ముర్ తోటి
లిరిక్స్ :-  రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీ మణి, ఉమా మహేష్, పండు తన్నేరు
పి.ఆర్.ఓ.:- ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్, నివాస్

‘పుష్ప: ది రైజ్’ రష్మిక ఫస్ట్ లుక్

‘పుష్ప: ది రైజ్’ నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన..

అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదలైంది. శ్రీవల్లి పాత్రలో ఇందులో నటిస్తున్నారు రష్మిక. పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు రష్మిక మందన్న. చెవుల కమ్మలు పెట్టుకుంటూ ఉన్న ఆమె లుక్ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా విడుదలైంది. క్రిస్మస్ సందర్భంగా పుష్ప: ది రైజ్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

నటీనటలు:
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు

టెక్నికల్ టీం:
దర్శకుడు: సుకుమార్
నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్
కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా
సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ – మోనిక నిగొత్రే
సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R
ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్
లిరిసిస్ట్: చంద్రబోస్
క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్
మేకప్: నాని భారతి
CEO: చెర్రీ
కో డైరెక్టర్: విష్ణు
లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం
బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా
PRO: ఏలూరు శ్రీను, మడూరి మధు

1 257 258 259 260 261 262