బల్లాల దేవ టీజర్ కు డేట్ ఫిక్స్

భీమ్లా… భీమ్లా నాయక్‌’ అని ఒకరు. ‘డేని… డేనియల్‌ శంకర్‌’ అంటూ మరొకరు. ఇద్దరూ శక్తిమంతమైన వ్యక్తులే. మరి వీరిద్దరి మధ్య గొడవేమిటో… అది ఎక్కడివరకు దారి తీసిందో తెలియాలంటే మాత్రం ‘భీమ్లా నాయక్‌’ విడుదల వరకు ఆగాల్సిందే. పవన్‌కల్యాణ్‌, రానా కథానాయకులుగా నటిస్తున్న చిత్రమిది. నిత్యమేనన్‌, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ సినిమా పేరుని అధికారికంగా ప్రకటించడంతోపాటు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది .. ఇప్పటికే రిలీజైన పవన్ టీజర్ ఇంట్రో సాంగ్ కు సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది .. పవన్ అభిమానులు పవన్ గ్లిమ్స్ ఫై ఫుల్ హ్యాపీ గా ఉన్నారు .. పవన్ కళ్యాణ్ కు సంబంధించి టీజర్ అయితే రిలీజ్ చేశారు కానీ , రానా కు సంబంధించి ,ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో ,రానా ఫాన్స్ రానా టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు . రానా క్యారెక్టర్ గురించి సోషల్ మీడియా లో కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి .. అయితే ఈ నెగిటివ్ కామెంట్స్ పై చిత్రబృందం క్లారిటీనిచ్చింది
రానా పాత్రకు సంబంధించిన టీజర్ ని కూడా త్వరలో విడుదల చేస్తాం.. కాస్త ఓపిక పట్టండి అంటూ రానా అభిమానులకు క్లారిటీనిచ్చారు. .రానా పాత్రకు సంబంధించిన వీడియో సెప్టెంబర్ 17 తర్వాత ఏ క్షణం అయినా బయటకు వస్తుంది. ఈ టీజర్ పవన్ టీజర్ తరహాలోనే పవర్ ప్యాక్డ్ గా ఉంటుందని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి .. పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్న కంటెంట్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇందులో రానా పాత్రను తక్కువ చేశారా ఎక్కువ చేశారా? అన్నది తెలియాలంటే టీజర్ వరకూ ఆగాల్సిందే.

హీరోగా “గణేష్ బెల్లంకొండ”

*హీరోగా “గణేష్ బెల్లంకొండ” పరిచయ చిత్రం ”స్వాతిముత్యం”
*ప్రేమ తో కూడిన వినోద భరిత కుటుంబ కథా చిత్రం.

వెండితెరకు మరో వారసుడు హీరో గా పరిచయం అవుతున్నారు. అతని పేరు “గణేష్ బెల్లంకొండ” ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, ప్రముఖ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు ఈ ‘గణేష్’.
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ ‘గణేష్’ ను హీరోగా వెండితెరకు పరిచయం చేస్తోంది. యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ, ‘గణేష్’ హీరోగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘స్వాతిముత్యం’ అనే పేరును నిర్ణయించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రంను కూడా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో కథానాయకుడు గణేష్ భుజాన బ్యాగ్ తో ఉండటం కనిపిస్తుంది.ఆకర్షణీయమైన లోగో తో కూడిన చిత్రం పేరు కనిపిస్తుంది. ఈరోజు చిత్ర కథానాయకుడు పుట్టినరోజు. ప్రచార చిత్రంలో ఈ విషయాన్ని కూడా గమనించవచ్చు.
‘వర్ష బొల్లమ్మ’ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే ‘స్వాతిముత్యం’ లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల,ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి.
ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ.

గణేష్ బెల్లంకొండ, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు.

‘స్వాతిముత్యం’ చిత్రానికి
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయా గ్రహణం: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
కళ: అవినాష్ కొల్ల
పి.ఆర్.ఓ.లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన- దర్శకత్వం: లక్ష్మణ్.కె.కృష్ణ

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్

సెప్టెంబర్ 15న అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లెహరాయి లిరికల్ సాంగ్..

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి లెహరాయి లిరికల్ సాంగ్ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 15న ఈ రొమాంటిక్ సాంగ్ విడుదల కానుంది. ఈ మేరకు అఖిల్, పూజ హెగ్డే రొమాంటిక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.

న‌టీ న‌టులు:
అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..

సాంకేతిక నిపుణులు:

దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌
బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమడి
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
పీఆర్ఓ – ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

1 260 261 262