భారతదేశంలో పెట్ బాటిళ్లను రీసైకిల్ చేయడానికి సహకారాన్ని విస్తరించిన కోకా-కోలా ఇండియా, జెప్టో

మే16 2023: ప్లాస్టిక్ పునర్వినియోగానికి వీలు కల్పించడం పట్ల తమ నిబద్ధతను బలోపేతం చేసేందుకు కోకా-కోలా ఇండియా, జెప్టో భారతదేశంలో తమ విజయవంతమైన, ఈ రకమైన మొదటి సహకారాన్ని వి స్తరించినట్లు ప్రకటించాయి. ముంబైలోని ఎంపిక చేసిన ప్రదేశాలలో పైలట్ ప్రాజెక్ట్‌ గా ‘రిటర్న్ అండ్ రీసైకి ల్’ కార్యక్రమం నవంబర్ 2022లో ప్రారంభించబడింది.

ఈ ప్రత్యేక కార్యక్రమం సమర్థవంతమైన ప్లాస్టిక్ వ్య ర్థాల నిర్వహణను నిర్ధారించడానికి 100% ట్రేసబిలిటీతో పెట్ బాటిళ్లను సేకరించే వ్యవస్థీకృత ప్రక్రియ ఏర్పా టు చేసింది. 60-రోజుల పైలట్‌ కార్యక్రమంలో భాగంగా 100 కిలోల పెట్ బాటిళ్లను సేకరించి రీసైకిల్ చేయ డంలో వినియోగదారుల నుండి చక్కటి స్పందన లభించింది.

జెప్టో, కోకో కోలా సహకారం అనేది ఇ-కామర్స్ వేదికలను ఉపయోగించుకోవడం ద్వారా వాటి కలెక్షన్ వ్యూ హం డిజిటలైజేషన్ ను ముందుకు తీసుకెళ్తోంది. డిజిటలైజేషన్ దిశగా అడుగులు అనేది ఈ ప్రక్రియను మరింత సామర్థ్యపూరితం చేయడం మాత్రమే గాకుండా, సుస్థిరదాయక కలెక్షన్ మోడల్స్ పై వినియోగదా రుల్లో అవగాహనను కూడా పెంచుతుంది. సుస్థిరదాయకత దిశగా చేస్తున్న ప్రయాణంలో వారిని కూడా ముఖ్యమైన వాటాదారుగా చేస్తుంది.

దిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, కోల్‌కతాలో వందలాది జెప్టో డెలివరీ హబ్‌ లలో ఏర్పాటు చేసిన సేకరణల డబ్బాలతో ఈ కార్యక్రమం ఇప్పుడు మరింత పెద్దదైంది.

ఈ కార్యక్రమం విస్తరణపై కోకా-కోలా వైస్ ప్రెసిడెంట్ (ఇండియా, సౌత్ వెస్ట్ ఆసియా కస్టమర్ అండ్ కమర్షి యల్ లీడర్‌షిప్) గ్రీష్మా సింగ్ మాట్లాడుతూ, “జెప్టోతో కోకా-కోలా భాగస్వామ్యం విజయం సుస్థిరత, సామా జిక బాధ్యతలో బలమైన సమ్మేళనాల ద్వారా రూపుదిద్దబడింది. .ప్లాస్టిక్ సర్క్యులారిటీ (పునర్వినియోగం) వైపు మా ప్రయత్నాలను కొనసాగిస్తూ, భాగస్వామ్యాన్ని ఇతర నగరాలకు విస్తరించడం పట్ల మేం సంతోషి స్తున్నాం. భారతదేశం అంతటా ‘రిటర్న్ అండ్ రీసైకిల్’ కార్యక్రమంతో, వ్యర్థాలు లేని ప్రపంచాన్ని సృష్టించే సంస్థ ప్రపంచ లక్ష్యాన్ని మేం మరింత ముందుకు తీసుకువెళుతున్నాం“’’’’ అని అన్నారు. ’’

జెప్టోతో కోకా-కోలా ఇండియా భాగస్వామ్యం పెట్ రీసైక్లింగ్ విలువ గొలుసులో పాల్గొనే వారందరినీ అను సంధానం చేయడం ద్వారా ప్లాస్టిక్ కోసం ఒక వృత్తాకార ఆర్థిక వ్యవస్థను రూపొందించాలని భావిస్తోంది. జె ప్టో ద్విచక్ర వాహన పంపిణీ నెట్‌వర్క్‌ ను ఉపయోగించుకోవడం ద్వారా, వినియోగదారుల నుండి ఏ బ్రాం డ్‌కు చెందిన ఖాళీ పెట్ బాటిళ్లనైనా ‘సేకరించేందుకు’ ఈ ‘స్వయం సమృద్ధి కార్యక్రమం’ ప్రయత్నిస్తుంది.

ఇలా సేకరించినవి ముడిపదార్థంగా రీసైక్లర్ ను చేరుకుంటాయి. రీసైక్లింగ్‌ను దాని ప్రధాన సూత్రాలలో ఒక టిగా ప్రోత్సహించే భారత ప్రభుత్వ స్వచ్ఛ భారత్ మిషన్ పట్ల కోకా-కోలా నిబద్ధతను కూడా ఈ కార్యక్ర మం ప్రదర్శిస్తుంది. రీసైక్లింగ్ ప్రాముఖ్యత, పర్యావరణంపై దాని సానుకూల ప్రభావంపై అవగాహన పెంచడం ద్వారా పెట్ ని రీసైకిల్ చేయడానికి వినియోగదారులను ప్రోత్సహించడం దీని లక్ష్యం.

జెప్టో చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ వినయ్ ధనాని మాట్లాడుతూ, “వ్యాపారానికి మించిన రీతిలో నవతరం ఇ-కామర్స్ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఈ సహకారం ఒక ఉత్తేజకరమైన అవకాశంగా ఉంది. చురుకైన, స మర్థవంతమైన చివరిఅంచె నెట్‌వర్క్‌ ను సజావుగా విస్తరించినందుకు మేం గర్విస్తున్నాం. జెప్టో లో మేం కార్యకలాపాల అన్ని రంగాలలో సుస్థిరదాయక పద్ధతులను నిరంతరం ఆవిష్కరించడం, పొందుపరచడం చే స్తుంటాం.

రూట్ ఆప్టిమైజేషన్ (గమ్యస్థానాన్ని తక్కువ సమయంలో చేరుకోవడం), ఈవీ లేదా సైకిల్ ఆధా రిత డెలివరీలు, సుస్థిరదాయక ప్యాకేజింగ్ లేదా వృథాను తగ్గించడం…ఏదైనా సరే ప్రకృతిపై వేసే ముద్రను తగ్గించుకోవడం, బ్రాండ్‌లు, భారత ప్రభుత్వంతో మా ఆశయాన్ని పంచుకోవడం మా లక్ష్యం”’’ అని అన్నారు.

కోకా-కోలా ఇండియా, జెప్టో ‘రిటర్న్ అండ్ రీసైకిల్’ కార్యక్రమం శాశ్వత సుస్థిరదాయక ప్రవర్తనను ప్రోత్స హించడం, నిర్మించడం, భాగస్వామ్య ప్రయోజనం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం ఉమ్మడి బ్రాండ్ సహకారాలు సంస్కృతిని సృష్టించడంలో సుస్థిరత, బాధ్యతాయుత వినియోగం ఎలా సహాయపడతాయనేదానికి నిదర్శనంగా ఉపయోగపడుతుంది.

Leave a Reply