కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ దేశానికి ఆదర్శం… మంత్రి కొప్పుల ఈశ్వర్

కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమం లో భాగంగా 4 కోట్ల 16 లక్షల తో ఇస్రాజ్ పల్లె, గోవింద్ పల్లె, గుంజపడుగు గ్రామాలను కలుపుతూ BT రోడ్డు, మరియు DMFT 2019-20, 40 లక్షల నిధులతో CC రోడ్లుకు శంకుస్థాపన చేసి, గ్రామంలో అసంపూర్తిగా ఉన్న యాదవ సంఘ భవనం అభివృద్ది కి 9.20 లక్షల తో ప్రారంభించి, 19 మంది లబ్ధిదారులకు రూ. 19,02,204 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….👉కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టింది. నిరు పేద ఆడపడుచులకు పెద్దన్నయ్య ల అండగా ఉంటున్నారు.👉టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు.కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00116 వేలు ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు.👉మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. అని అన్నారు రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.👉ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు..

రైతుబంధు సాయం 50,000 కోట్లు

👉8వ విడతతో అరలక్ష కోట్లు రైతులకు పంపిణీ
దేశంలోనే రికార్డు స్థాయిలో అన్నదాతకు పెట్టుబడి
👉యావత్తు దేశానికి అనుసరణీయమైన అరుదైన పథకం #రైతుబంధు పథకం

★ రైతుబంధు సాయం రూ. 50,000 కోట్లు★ 8వ విడతతో అరలక్ష కోట్లు రైతులకు పంపిణీ★ దేశంలోనే రికార్డు స్థాయిలో అన్నదాతకు పెట్టుబడి★ ఇప్పటివరకు రైతుబంధు రూ.43 వేల కోట్లు అందజేత★ యాసంగిలో 7,500 కోట్లు అందించేందుకు ఏర్పాట్లు★ వ్యవసాయరంగంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని పథకం★ అవినీతికి తావులేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ★ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలందుకొన్న రైతుబంధు★ యావత్తు దేశానికి అనుసరణీయమైన అరుదైన పథకంబీడుపడ్డ తెలంగాణ పచ్చవడాలె.. అన్నదాత దేనికోసం ఆరాటపడకుండా.. గుండెలమీద చెయ్యేసుకొని ఎవుసం చేసుకోవాలె. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి సంకల్పం. అందులోంచి ఆవిష్కారమైంది రైతుబంధు. అవినీతి లేదు.. హెచ్చుతగ్గులు లేవు.. గుంట జాగున్నా.. పదులకొద్దీ ఎకరాలున్నా భేదం లేదు. నిఘా నిగరానీల్లేనే లేవు. ఎకరానికి ఐదు వేలు.. ఏడాదికి రెండు కార్లు.. నేరుగా రైతుల ఖాతాల్లో జమ. దఫ్తర్‌ లేదు.. దరఖాస్తు లేదు. ఒక్కసారి నమోదు చేసుకొంటే చాలు. ఇంకేం ఆలోచించక్కర్లేదు. నాట్లు మొదలయ్యే నాటికి ఠంచన్‌గా పైసలొచ్చి ఖాతాల్లో పడిపోతాయి. ఇప్పటికి ఏడు విడుతలైపోయాయి. ఎనిమిదో విడుత సాయం పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పంపిణీతో రైతుబంధు సాయం మొత్తంగా రూ.50 వేల మార్కును దాటిపోనున్నది.పెట్టుబడి సాయం.. వినూత్నం———————రైతుకు పంట సమయంలో పెట్టుబడి అనేది చాలా కీలకం. దాని కోసం చిన్న, సన్నకారు ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం.. అప్పు, దానిమీద పడే మిత్తి పులిమీద పుట్రలా ఒకదానికి ఒకటి తోడై రైతును పూర్తిగా కృంగదీసే దుస్థితి. ఈ క్షోభ నుంచి రైతును కాపాడటం కోసం పంటకు అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వమే సమకూర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించి రైతులపక్షాన నిలిచారు. అంత గొప్ప నిర్ణయాన్ని స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఏ ప్రభుత్వమూ తీసుకోలేదు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 2018 మే 10న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్‌ వద్ద రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. తొలుత 2018-19 సంవత్సరం నుంచి ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకోసం రెండు విడతల్లో ప్రతి రైతుకు మొత్తం ఏడాదికి రూ. 8వేలను ప్రభుత్వం అందించడం ప్రారంభించారు. పునాస పంట పెట్టుబడిని ఏప్రిల్‌ నుంచి, యాసంగి పంట పెట్టుబడిని నవంబర్‌ నుంచి పంపిణీ చేశారు. 2019-20 నుంచి పంట పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచింది ప్రభుత్వం. దీంతో రైతుకు ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు అందుతుంది. ఈ పథకం కింద ఇప్పటివరకు రూ.43 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమచేసింది. ప్రస్తుతం ఈ యాసంగికి పెట్టుబడిని విడుదల చేయాల్సి ఉంది. ఈ సారి రైతులతోపాటు, సాగువిస్తీర్ణం కూడా పెరగనుందని తెలుస్తున్నది. అందుకు రూ.7,500కోట్లు అవసరమని అంచనా వేసింది. ఆ నిధులు త్వరలోనే విడుదల కానున్నాయి. దీంతో రైతుబంధు పథకం రూ. 50 వేల కోట్ల మైలురాయిని దాటిపోనున్నది. పంట పెట్టుబడి పథకం వల్ల 90.5 శాతం ఉన్న పేద రైతులు లబ్ధి పొందారు.ప్రపంచంలోనే ఎక్కడాలేని పథకం———————–దేశంలో ఏ ఒక్క ప్రధానీ ఆలోచించలేదు.. అన్నం పెడుతున్న రైతుకు ఏమైనా చేద్దామని.. ఏ ముఖ్యమంత్రీ కనీసం దృష్టిపెట్టలేదు.. అన్నదాతలను కడుపులో పెట్టుకొని కాచుకోవాలని.. కానీ తెలంగాణలో ఒకే ఒక్క నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కలగన్నారు.. కడుపు నింపుతున్న కర్షకుడిని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని.. అందులోంచి పుట్టిందే రైతుబంధు. ఇలాంటి పథకం ప్రపంచంలోనే ఏ దేశంలోనూ ఇప్పటివరకు అమలులో లేదు. ఏ ఒక్క పాలకుడి ఆలోచనకూ తట్టని పథకం. ఈ పథకాన్ని యావత్‌ భారతదేశమే కాదు ఏకంగా ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసించింది. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ తరహా సాయం చేయడంలో రైతుబంధును మించిన పథకం మరొకటి లేదని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ లాంటివారే కొనియాడారు.ఇంతకు ముందు పెట్టుబడి కొరకు అప్పులు చేసే పరిస్థితి ఉండేది. సీఎం కేసీఆర్‌ సార్‌కు రైతులపై ఉన్న ప్రేమతో రైతుబంధు ఇస్తున్నరు. రైతుబంధు కింద ఇచ్చే పైసలతోనే పంటలు వేస్తున్న. ఇంతమంచి పథకాన్ని అమలు చేస్తున్నందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.- ప్రభు, రైతు, కొత్తూర్‌(డి), కోహీర్‌ మండలం (సంగారెడ్డి జిల్లా)ఈ సాయం ఎవరు చేయలే——————-మా అమ్మనాయిన నేర్పిన ఎవుసం పని కానుంచి నేను పంటలు సాగు చేస్తన్న. నాకు తెలిసి గిసొంటి సాయం ఏ ప్రభుత్వం చేయలే. సర్కార్లు అంటే దోచుకొనేటివి అని అనుకున్న. కానీ బువ్వ పెట్టే మా అసొంటి రైతులకు సాయం అందుతదని అనుకోలే. కేసీఆర్‌ సార్‌ ఇచ్చే సాయం శాన గొప్పది ఉల్లా. నాకు రైతుబంధు వస్తంది. రైతుబంధుకు నమస్తే.- తాడూరి కుమారస్వామి, నర్సాపూర్‌, ములుగు జిల్లాఎవుసం అల్కగయ్యింది రైతుబంధు పైసలతోని ఎరువులు, విత్తనాలు కొంటున్నం. ఇదివరకు ఎరువులు, విత్తనాల డీలర్లు కొందరు ఉద్దెర ఇచ్చేది. కానీ వాటి మీద మిత్తి వేసి ధరలు పెట్టేది. అట్ల రైతులకు మస్తు లుక్సానయ్యేది. ఇప్పుడు రైతుబంధు పైసలురాంగనే విత్తనాలు, ఎరువులు నుకచ్చుకుంటున్నం. మిత్తి రంది లేదు. ఎవుసం శానా అల్కగ అయ్యింది.- రేండ్ల శ్రీనివాస్‌, కొండన్నపల్లి, కరీంనగర్‌ జిల్లా

దటీజ్ జొన్నలగడ్డ పద్మావతి

దటీజ్ జొన్నలగడ్డ పద్మావతి

29 ఏళ్ళుగా నలుగుతున్న సమస్య
ఒక బలహీనుడికి దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయం
ఊరు మొత్తం నిస్సహాయమై దీన్ని భరిస్తున్న సందర్భం
కానీ ఒకరోజు వస్తుంది అన్యాయానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి
ఒక వ్యక్తి వస్తారు ధర్మాన్ని పరిరక్షించడానికి
ఇందుకోసం ఆ వ్యక్తి ఎన్నో సవాళ్ళను, విమర్శలను, ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.
న్యాయం వైపు ధర్మం వైపు నిలబడటానికి గుండె ధైర్యం కావాలి తెగువ కావాలి
ప్రతి సమస్యలోనూ ఆమె న్యాయం వైపు నిలబడ్డారు
అదరక బెదరక గుండె ధైర్యంతో బలహీనుల పక్షాన నిలబడ్డారు
సమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ
నిజాయితీగా వ్యవహరిస్తూ
నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ
ప్రజల జేజేలు అందుకుంటూ
ఒక ప్రత్యేక శైలిలో ముందుకు సాగుతున్న ఆ వ్యక్తి శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.

పూర్తి వివరాల్లోకి వెళితే…

శింగనమల నియోజకవర్గంలో కొర్రపాడు పొలం దారి విషయానికి సంబంధించి పచ్చ మీడియాలో ఒక వార్త వచ్చింది. పొలం మధ్యలో దారి వేస్తున్నారని, తాము నష్టపోతున్నామని ఆ రైతు కుటుంబానికి చెందిన మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని. అసలు నిజం ఇది కాదు. 29 సంవత్సరాలుగా వేదన అనుభవిస్తున్న ఒక బలహీన బ్రాహ్మణుడి బాధ ఉంది. ప్రధాన రహదారికి రెడ్డి సామాజిక వర్గం వారి పొలం ఉంది. దాని వెనుక బ్రాహ్మల పొలం ఉంది. రెవెన్యూ రికార్డుల పరంగా వీరి పొలానికి దారి కూడా ఉంది. అయితే ముందు పొలం వారు వీరికి దారి ఇవ్వకుండా వేధిస్తున్నారు. అడిగిన ప్రతిసారీ బ్రాహ్మలపై దౌర్జన్యం చేయడం లేదా ఇప్పటి లాగే ఆత్మహత్య చేసుకుంటాం అని బెదిరించడం జరుగుతోంది. దీంతో వారు విసిగి వేసారి పోయి, దాని పై ఆశలు వదులుకున్నారు. ఒక చివరి ప్రయత్నంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారికి తమ సమస్యల పరిష్కార వేదిక ద్వారా తెలియజేశారు. ఆమె తక్షణమే స్పందించారు. అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించారు. న్యాయం బ్రాహ్మణ కుటుంబం వైపు ఉందని తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డుల మేరకు, నియమ నిబంధనలు పాటిస్తూ దారి వేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా జనవరిలో అధికారులు నోటీసులు ఇచ్చారు. దీన్ని తప్పించుకోవడానికి ఆ పొలం వారు గ్యాప్ లేకుండా పంట వేస్తూనే ఉన్నారు, ఒకవేళ అధికారులు దారి వేసే ప్రయత్నం చేస్తే పంట నష్టం జరుగుతుందని బెదిరించడానికి. మొన్న జరిగింది ఇదే. ఎప్పటిలాగే ఆత్మహత్య చేసుకుంటామని బ్లాక్ మెయిల్ చేశారు, దాన్ని పచ్చ మీడియా విపరీతమైన హడావిడి చేసింది.

కానీ బ్రాహ్మణ కుటుంబానికి న్యాయం జరగడం పట్ల ఊరు ఊరంతా హర్షం వ్యక్తం చేసింది. పొలం చేస్తున్న రైతుకు ఊరిలో ఒక్కరు కూడా మద్దతు ఇవ్వలేదు.

మరోవైపు ఎమ్మెల్యే భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. కాబట్టి చూసీ చూడనట్లు పోవాలని ఎమ్మెల్యే పద్మావతికి‌ కొందరు సూచించారు. కానీ ఆమె ఎప్పుడూ న్యాయం వైపు నిలిచారు నిలుస్తున్నారు.

గతంలో కూడా గార్లదిన్నె బుక్కరాయసముద్రం మండలాల్లో ఇలాంటి సమస్యలే వచ్చినప్పుడు ఆమె కానీ భర్త సాంబశివారెడ్డి కానీ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగ లేదు, కుల పక్షపాతం చూడలేదు. బుక్కరాయ సముద్రంలో ఒక వ్యక్తి ఇంటి హద్దుకు సంబంధించిన సమస్య వచ్చింది. అప్పుడు  తాడిపత్రి జెసి సోదరులను ఎదుర్కోవాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకులంతా మూకుమ్మడిగా అన్యాయం వైపు నిలబడ్డారు. అయినా పద్మావతి మరియు సాంబశివారెడ్డి తమ పట్టు వీడలేదు.  మామూలుగా ఏ రాజకీయ నాయకులైనా ఏదైనా సమస్య వివాదాస్పదం అయితే న్యాయం ఉన్నప్పటికీ దాని జోలికి వెళ్లడానికి ఇష్టపడరు. కానీ పద్మావతి అలా కాదు ఏ సమస్యలోనైనా బాధితుల వైపు నిలబడతారు. వారికి న్యాయం చేయడానికి సాయశక్తులా కృషి చేస్తారు. దటీజ్ పద్మావతి.

కొర్రపాడు పొలం విషయంలో మరో కోణం కూడా ఉంది. పద్మావతి గత వారం రోజులుగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించడంతో పాటు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి దళితులను ఉపయోగిస్తారు. వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు సదరు నాయకుడిపై విమర్శలు గుప్పిస్తారు. దీన్ని చంద్రబాబు అండ్ కో దళితులపై దాడులుగా చిత్రీకరిస్తుంది. ఈ కుట్రను పద్మావతి మీడియాకు క్షుణ్ణంగా వివరించింది. ఇది జీర్ణించుకోలేని పచ్చ మీడియా అసలు ఎలాంటి సమస్యా లేని కొర్రపాడు పొలం విషయంలో నానాయాగీ చేసింది.

అసలు జొన్నలగడ్డ పద్మావతి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది రైతుల సమస్యలకే. నియోజకవర్గానికి నీటిని తీసుకురావడంలో ఆమె చరిత్ర సృష్టించారు. సకాలంలో రైతులకు నీరు ఇవ్వడం మొదలు కొని నియోజకవర్గంలోని అన్ని చెరువులను నీటిని నింపడానికి ఆమె పడిన కష్టానికి రైతులు జయజయధ్వానాలు పలికారు. ఇప్పుడు గిట్టుబాటు ధర కోసం ఒక యాప్ రూపొందించే పనిలో ఉన్నారు. అది కూడా త్వరలో విడుదల కానుంది.  రైతులకు న్యాయం చేసిన ఏకైక ఎమ్మెల్యేగా ఆమె శింగనమల చరిత్రలో నిలుస్తున్నారు.

పద్మావతి మరో అరుదైన ఘనతను కూడా సాధించారు. జాతీయ పరిశోధన అభివృద్ధి కార్పొరేషన్ నిర్వహించిన పోటీలో ఆమెకు జాతీయస్థాయి బహుమతి గెలుచుకున్నారు.     ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా వైద్య సిబ్బందికి వైరస్ సోకని ఒక క్యాబిన్ ను రూపొందించారు.  ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్-19 తో పాటు భవిష్యత్తులో మరింత భయంకరమైన వైరస్ లు వచ్చినా ఈ ఆవిష్కరణ వైద్య సిబ్బందికి ఒక వరం కానుంది.
ఒక ఎమ్మెల్యే ఇలాంటి ఆవిష్కరణ చేయడం దేశ చరిత్రలోనే మొట్ట మొదటి సారి కావడం విశేషం. జొన్నలగడ్డ పద్మావతి అనంతపురం జేఎన్టీయూలో ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు.

మత్య్సకారుల ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను సర్కార్ మానుకోవాలి… పవన్ కల్యాణ్

మత్య్సకారుల ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను సర్కార్ మానుకోవాలి… పవన్ కల్యాణ్

సంప్రదాయంగా, వారసత్వంగా వస్తున్న చేపల వేట, అమ్మకాలపై ఆధారపడ్డ మత్స్యకారుల జీవనోపాధికి గండికొట్టి, వారి ఆర్థిక మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పష్టం చేశారు. చెరువులు, రిజర్వాయర్లు లాంటి చోట్ల మత్స్యకార సొసైటీ సభ్యులకు చేపలు వేటాడుకొనే అవకాశం లేకుండా చేస్తున్న జీవో 217 విషయంలో జనసేన పార్టీ ఎలా పోరాడాలనే విషయంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనసేన మత్స్యకార వికాస విభాగం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మిడి నాయకర్ గారు పాల్గొన్నారు. విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను, జీవో 217 తమ జీవనోపాధికి ఎలా విఘాతం కలిగిస్తుందో వివరించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “ప్రజా పోరాట యాత్రను ఇచ్చాపురం ప్రాంతంలో కపాసు కుర్ది దగ్గర గంగమ్మకు పూజ చేసే మొదలుపెట్టాను. కోస్తాలో పర్యటించిన ప్రతి ప్రాంతంలో మత్స్యకారుల సమస్యల గురించి, ఇక్కడ జీవనోపాధి లేక వలసలుపోతుండటాన్ని అవగాహన చేసుకున్నాను. మత్స్యకారుల సమస్యలపై పోరాడటమే కాకుండా… ఈ వృత్తిపై ఆధారపడ్డవారు నైపుణ్యాలు పెంచుకొని ఆర్థికంగా ఎదిగే అంశాలపై అవగాహన కలిగించేందుకే పార్టీ పక్షాన మత్స్యకార వికాస విభాగం ఏర్పాటు చేశాం. పాలనలో ఉన్నవారు సైతం సంప్రదాయ వృత్తులపై ఆధారపడ్డవారికి ఆర్థిక బలం చేకూర్చేలా చేయాలి. అంతేగానీ ఆర్థిక మూలాలను దెబ్బ తీసేలా నిర్ణయాలు చేయకూడదు. చెరువులు, రిజర్వాయర్ల దగ్గర చేపల వేటకు మత్స్యకారులకు అవకాశం లేకుండా చేసి వేలం ద్వారా సమకూరే ఆదాయంలో 70శాతం ప్రభుత్వమే తీసుకొంటుందనే ఆందోళన మత్స్యకారుల్లో ఉంది” అన్నారు.
మత్స్యకార వికాస విభాగం సభ్యులు తమ ఆందోళనను వెలిబుచ్చుతూ ఈ విధంగా వేలం వేయడం అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే… అదీ నెల్లూరు జిల్లాకే పరిమితం అని రాష్ట్ర మంత్రి చెబుతున్నారనీ… అయితే జీవో 217లో ఆ వివరాలు లేవు అన్నారు. ఈ వృత్తిపై ఆధారపడ్డవారికి ఉపాధి లేకుండా చేస్తుంది ఈ జీవో అని తెలిపారు.
ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ టి.శివశంకర్ గారు, శ్రీ సత్య బొలిశెట్టి గారు, శ్రీమతి పాలవలస యశస్వి గారు, లీగల్ సెల్ ఛైర్మన్ శ్రీ ఈవన సాంబశివ ప్రతాప్ గారు పాల్గొన్నారు.

విశాఖలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘనస్వాగతం

విశాఖలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘనస్వాగతం

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. పులమాలలు వేసి, పుష్పగుఛ్చాలతో ఆహ్వానించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తప్పెటగుళ్లు, కోలాటం, తీన్ మార్ కళాకారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వందలాది మంది యువకులు కార్లు, బైకులతో వెంటరాగా ఎయిర్ పోర్టు నుంచి నేరుగా మాధవధారలోని పార్టీ కార్యాలయానికి శ్రీ మనోహర్ గారు చేరుకున్నారు. మాధవధార పార్టీ కార్యాలయానికి వచ్చిన శ్రీ మనోహర్ గారికి పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వితోపాటు పలువురు మహిళ నేతలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు శ్రీ కోన తాతారావు, రాష్ట్ర నాయకులు శ్రీ గడసాల అప్పారావు, శ్రీ బోడపాటి శివదత్, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పరుచూరి భాస్కరరావు, డా. బొడ్డేపల్లి రఘు, శ్రీ వంపూరు గంగులయ్య, శ్రీమతి పి.ఉషా కిరణ్, శ్రీ పి.వి.ఎస్.ఎన్. రాజు, శ్రీ శివప్రసాద్ రెడ్డి, శ్రీమతి అంగ దుర్గా ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ టి. శివశంకర్, శ్రీ సత్య బొలిశెట్టి, పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం, పార్టీ నాయకులు శ్రీ గెడ్డం బుజ్జి, శ్రీ గిరడా అప్పల స్వామి, శ్రీ సూర్యచంద్ర తదితరులతో సమావేశమయ్యారు.

1 3 4 5