దటీజ్ జొన్నలగడ్డ పద్మావతి

దటీజ్ జొన్నలగడ్డ పద్మావతి

29 ఏళ్ళుగా నలుగుతున్న సమస్య
ఒక బలహీనుడికి దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయం
ఊరు మొత్తం నిస్సహాయమై దీన్ని భరిస్తున్న సందర్భం
కానీ ఒకరోజు వస్తుంది అన్యాయానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి
ఒక వ్యక్తి వస్తారు ధర్మాన్ని పరిరక్షించడానికి
ఇందుకోసం ఆ వ్యక్తి ఎన్నో సవాళ్ళను, విమర్శలను, ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.
న్యాయం వైపు ధర్మం వైపు నిలబడటానికి గుండె ధైర్యం కావాలి తెగువ కావాలి
ప్రతి సమస్యలోనూ ఆమె న్యాయం వైపు నిలబడ్డారు
అదరక బెదరక గుండె ధైర్యంతో బలహీనుల పక్షాన నిలబడ్డారు
సమస్యలను తక్షణమే పరిష్కరిస్తూ
నిజాయితీగా వ్యవహరిస్తూ
నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ
ప్రజల జేజేలు అందుకుంటూ
ఒక ప్రత్యేక శైలిలో ముందుకు సాగుతున్న ఆ వ్యక్తి శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.

పూర్తి వివరాల్లోకి వెళితే…

శింగనమల నియోజకవర్గంలో కొర్రపాడు పొలం దారి విషయానికి సంబంధించి పచ్చ మీడియాలో ఒక వార్త వచ్చింది. పొలం మధ్యలో దారి వేస్తున్నారని, తాము నష్టపోతున్నామని ఆ రైతు కుటుంబానికి చెందిన మహిళ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందని. అసలు నిజం ఇది కాదు. 29 సంవత్సరాలుగా వేదన అనుభవిస్తున్న ఒక బలహీన బ్రాహ్మణుడి బాధ ఉంది. ప్రధాన రహదారికి రెడ్డి సామాజిక వర్గం వారి పొలం ఉంది. దాని వెనుక బ్రాహ్మల పొలం ఉంది. రెవెన్యూ రికార్డుల పరంగా వీరి పొలానికి దారి కూడా ఉంది. అయితే ముందు పొలం వారు వీరికి దారి ఇవ్వకుండా వేధిస్తున్నారు. అడిగిన ప్రతిసారీ బ్రాహ్మలపై దౌర్జన్యం చేయడం లేదా ఇప్పటి లాగే ఆత్మహత్య చేసుకుంటాం అని బెదిరించడం జరుగుతోంది. దీంతో వారు విసిగి వేసారి పోయి, దాని పై ఆశలు వదులుకున్నారు. ఒక చివరి ప్రయత్నంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి గారికి తమ సమస్యల పరిష్కార వేదిక ద్వారా తెలియజేశారు. ఆమె తక్షణమే స్పందించారు. అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించారు. న్యాయం బ్రాహ్మణ కుటుంబం వైపు ఉందని తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డుల మేరకు, నియమ నిబంధనలు పాటిస్తూ దారి వేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా జనవరిలో అధికారులు నోటీసులు ఇచ్చారు. దీన్ని తప్పించుకోవడానికి ఆ పొలం వారు గ్యాప్ లేకుండా పంట వేస్తూనే ఉన్నారు, ఒకవేళ అధికారులు దారి వేసే ప్రయత్నం చేస్తే పంట నష్టం జరుగుతుందని బెదిరించడానికి. మొన్న జరిగింది ఇదే. ఎప్పటిలాగే ఆత్మహత్య చేసుకుంటామని బ్లాక్ మెయిల్ చేశారు, దాన్ని పచ్చ మీడియా విపరీతమైన హడావిడి చేసింది.

కానీ బ్రాహ్మణ కుటుంబానికి న్యాయం జరగడం పట్ల ఊరు ఊరంతా హర్షం వ్యక్తం చేసింది. పొలం చేస్తున్న రైతుకు ఊరిలో ఒక్కరు కూడా మద్దతు ఇవ్వలేదు.

మరోవైపు ఎమ్మెల్యే భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. కాబట్టి చూసీ చూడనట్లు పోవాలని ఎమ్మెల్యే పద్మావతికి‌ కొందరు సూచించారు. కానీ ఆమె ఎప్పుడూ న్యాయం వైపు నిలిచారు నిలుస్తున్నారు.

గతంలో కూడా గార్లదిన్నె బుక్కరాయసముద్రం మండలాల్లో ఇలాంటి సమస్యలే వచ్చినప్పుడు ఆమె కానీ భర్త సాంబశివారెడ్డి కానీ ఎలాంటి ఒత్తిళ్లకు లొంగ లేదు, కుల పక్షపాతం చూడలేదు. బుక్కరాయ సముద్రంలో ఒక వ్యక్తి ఇంటి హద్దుకు సంబంధించిన సమస్య వచ్చింది. అప్పుడు  తాడిపత్రి జెసి సోదరులను ఎదుర్కోవాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ నాయకులంతా మూకుమ్మడిగా అన్యాయం వైపు నిలబడ్డారు. అయినా పద్మావతి మరియు సాంబశివారెడ్డి తమ పట్టు వీడలేదు.  మామూలుగా ఏ రాజకీయ నాయకులైనా ఏదైనా సమస్య వివాదాస్పదం అయితే న్యాయం ఉన్నప్పటికీ దాని జోలికి వెళ్లడానికి ఇష్టపడరు. కానీ పద్మావతి అలా కాదు ఏ సమస్యలోనైనా బాధితుల వైపు నిలబడతారు. వారికి న్యాయం చేయడానికి సాయశక్తులా కృషి చేస్తారు. దటీజ్ పద్మావతి.

కొర్రపాడు పొలం విషయంలో మరో కోణం కూడా ఉంది. పద్మావతి గత వారం రోజులుగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం రేకెత్తించడంతో పాటు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి దళితులను ఉపయోగిస్తారు. వెంటనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు సదరు నాయకుడిపై విమర్శలు గుప్పిస్తారు. దీన్ని చంద్రబాబు అండ్ కో దళితులపై దాడులుగా చిత్రీకరిస్తుంది. ఈ కుట్రను పద్మావతి మీడియాకు క్షుణ్ణంగా వివరించింది. ఇది జీర్ణించుకోలేని పచ్చ మీడియా అసలు ఎలాంటి సమస్యా లేని కొర్రపాడు పొలం విషయంలో నానాయాగీ చేసింది.

అసలు జొన్నలగడ్డ పద్మావతి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచీ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది రైతుల సమస్యలకే. నియోజకవర్గానికి నీటిని తీసుకురావడంలో ఆమె చరిత్ర సృష్టించారు. సకాలంలో రైతులకు నీరు ఇవ్వడం మొదలు కొని నియోజకవర్గంలోని అన్ని చెరువులను నీటిని నింపడానికి ఆమె పడిన కష్టానికి రైతులు జయజయధ్వానాలు పలికారు. ఇప్పుడు గిట్టుబాటు ధర కోసం ఒక యాప్ రూపొందించే పనిలో ఉన్నారు. అది కూడా త్వరలో విడుదల కానుంది.  రైతులకు న్యాయం చేసిన ఏకైక ఎమ్మెల్యేగా ఆమె శింగనమల చరిత్రలో నిలుస్తున్నారు.

పద్మావతి మరో అరుదైన ఘనతను కూడా సాధించారు. జాతీయ పరిశోధన అభివృద్ధి కార్పొరేషన్ నిర్వహించిన పోటీలో ఆమెకు జాతీయస్థాయి బహుమతి గెలుచుకున్నారు.     ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా వైద్య సిబ్బందికి వైరస్ సోకని ఒక క్యాబిన్ ను రూపొందించారు.  ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న కోవిడ్-19 తో పాటు భవిష్యత్తులో మరింత భయంకరమైన వైరస్ లు వచ్చినా ఈ ఆవిష్కరణ వైద్య సిబ్బందికి ఒక వరం కానుంది.
ఒక ఎమ్మెల్యే ఇలాంటి ఆవిష్కరణ చేయడం దేశ చరిత్రలోనే మొట్ట మొదటి సారి కావడం విశేషం. జొన్నలగడ్డ పద్మావతి అనంతపురం జేఎన్టీయూలో ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు.