విశాఖలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘనస్వాగతం

విశాఖలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘనస్వాగతం

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. పులమాలలు వేసి, పుష్పగుఛ్చాలతో ఆహ్వానించారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తప్పెటగుళ్లు, కోలాటం, తీన్ మార్ కళాకారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వందలాది మంది యువకులు కార్లు, బైకులతో వెంటరాగా ఎయిర్ పోర్టు నుంచి నేరుగా మాధవధారలోని పార్టీ కార్యాలయానికి శ్రీ మనోహర్ గారు చేరుకున్నారు. మాధవధార పార్టీ కార్యాలయానికి వచ్చిన శ్రీ మనోహర్ గారికి పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వితోపాటు పలువురు మహిళ నేతలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు శ్రీ కోన తాతారావు, రాష్ట్ర నాయకులు శ్రీ గడసాల అప్పారావు, శ్రీ బోడపాటి శివదత్, శ్రీ సుందరపు విజయ్ కుమార్, శ్రీ పరుచూరి భాస్కరరావు, డా. బొడ్డేపల్లి రఘు, శ్రీ వంపూరు గంగులయ్య, శ్రీమతి పి.ఉషా కిరణ్, శ్రీ పి.వి.ఎస్.ఎన్. రాజు, శ్రీ శివప్రసాద్ రెడ్డి, శ్రీమతి అంగ దుర్గా ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ టి. శివశంకర్, శ్రీ సత్య బొలిశెట్టి, పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం, పార్టీ నాయకులు శ్రీ గెడ్డం బుజ్జి, శ్రీ గిరడా అప్పల స్వామి, శ్రీ సూర్యచంద్ర తదితరులతో సమావేశమయ్యారు.