రంగారెడ్డి జిల్లాలో పత్తి పంట నాణ్యత మెరుగుపరిచేందుకు బెటర్‌ కాటన్‌ ఇనీషియేటివ్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన వెల్‌స్పన్‌ ఫౌండేషన్‌

Wellspun Foundation launched the Better Cotton Initiative project to improve the quality o Initiative project in Rangareddy district.

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్‌, మే 9,2023 : వెల్‌స్పన్‌ ఫౌండేషన్‌ (డబ్ల్యుఎఫ్‌) , రంగారెడ్డి జిల్లాలోని రైతుల కోసం బెటర్‌ కాటన్‌ ఇనీషియేటివ్‌ (బీసీఐ) ప్రాజెక్ట్‌ను 2019లో ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని స్ధిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంతో పాటుగా రంగారెడ్డి జిల్లాలో పత్తి రైతుల జీవనోపాధి మెరుగుపరచడం లక్ష్యంగా ప్రారంభించారు. డబ్ల్యుఎఫ్‌ ఈ కార్యక్రమం ద్వారా 91 గ్రామాలలోని 5033 మంది రైతులను చేరుకోవడంతో పాటుగా 121 లెర్నింగ్‌ గ్రూప్‌ (ఎల్‌జీ)లు ఏర్పాటుచేసింది. ప్రతి ఎల్‌జీలోనూ 40–45 మంది రైతులు ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా మొత్తంమ్మీద 14214 ఎకరాల పత్తి పంటతో పాటుగా ఇతర పంటలతో కలిపి 29158 ఎకరాలను చేరుకున్నారు.

మట్టి నమూనాల విశ్లేషణ పరీక్ష ఆధారిత పోషకాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు బీసీఐ ప్రాజెక్ట్‌ను రూపొందించారు. ప్రతి సంవత్సరం రైతుల నుంచి భూ నమూనాలు డబ్ల్యుఎఫ్‌ సేకరిస్తుంది. ఆ తరువాత సరైన మోతాదులో ఎరువులు వినియోగించడానికి సంబంధించిన సమాచారం అందించడం ద్వారా భూ సారం పెంచుతున్నారు. ఈ సంవత్సర కార్యక్రమంలో భాగంగా, మొత్తంమ్మీద 77 నమూనాలను సేకరించి వీటిని రాజేంద్రనగర్‌ ప్రభుత్వ సాయిల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ కు విశ్లేషణ కోసం పంపారు.

ఈ మట్టి నమూనాల పరీక్షల కార్యక్రమంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే దీనిని ముఖాముఖి కార్యక్రమంగా చేయడం. డబ్ల్యుఎఫ్‌కు చెందిన క్షేత్ర స్ధాయి సిబ్బంది పొలాలకు, రైతులతో సహా వెళ్లడంతో పాటుగా మట్టి నమూనా సేకరిస్తారు. ఈ మట్టి పరీక్షలతో పాటుగా డబ్ల్యుఎఫ్‌ ఇప్పుడు రైతులతో సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తుంది. ఈ సంవత్సర కార్యక్రమాలలో భాగంగా 77 మట్టి నమూనాలను 38 గ్రామాల నుంచి సేకరించారు. అత్యధికంగా నమూనాలను చేవెళ్ల తాలూకా నుంచి సేకరించారు. మొత్తం 24 గ్రామాల నుంచి 50 నమూనాలు వీటిలో ఉన్నాయి. ఈ భూసార పరీక్షల వల్ల రైతులు సరైన రీతిలో ఎరువులు వాడటంతో పాటుగా భూసారాన్నీ మెరుగుపరుచుకోగలిగారు.

వెల్‌స్పన్‌ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ‘‘ పర్యావరణ అనుకూల, సమ్మిళిత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము. స్థిరమైన వ్యవసాయ పద్ధతులను రైతులు స్వీకరించే నైపుణ్యం, విజ్ఞానాన్ని అందించే దిశగా ప్రారంభించిన కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలోని మా బెటర్‌ కాటన్‌ ఇనీషియేటివ్‌ ప్రాజెక్ట్‌ . ఈ ప్రాంతంలో పత్తి పంట రైతుల జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచడంలో తోడ్పాటునందించినందుకు చాలా సంతోషంగా ఉంది’’అని అన్నారు.

రంగారెడ్డి జిల్లాలోని రైతులు స్థిరమైన, లాభదాయక వ్యవసాయ పద్ధతులను స్వీకరించడంలో బీసీఐ ప్రాజెక్ట్‌ సహాయపడుతుంది. ఈ కార్యక్రమం, ఈ ప్రాంతంలో పత్తి రైతుల జీవనోపాధి మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. నాణ్యమైన పత్తి ఆవశ్యకతతో పాటుగా భూసార పరీక్షలను చేయించాల్సిన అవసరం పట్ల రైతులకు అవగాహన కల్పించడానికి డబ్ల్యుఎఫ్‌ కృషి చేస్తుంది. ఈ బెటర్‌ కాటన్‌ ఇనీషియేటివ్‌ (బీసీఐ) ఈ ప్రయత్నాలలో అంతర్భాగం. ఈ ప్రాజెక్ట్‌ను స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం, రంగారెడ్డి జిల్లాలో పత్తి రైతుల జీవనోపాధి మెరుగుపరచడం లక్ష్యంగా చేసుకున్నారు. ఈ బీసీఐ ప్రాజెక్ట్‌ , రైతులకు చక్కటి వ్యవసాయ పద్ధతులు (జీఏపీ) వంటి విత్తనాల ఎంపిక, పంటమార్పిడి, ఐపీఎం, ఐఎన్‌ఎం, పెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ , ఇతర వ్యవసాయ ప్రక్రియలు గురించి వెల్లడిస్తుంది

ఈ ప్రాంతంలోని రైతులు ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆదరించారు. ‘‘మా గ్రామంలో బీసీఐ ప్రాజెక్ట్‌ను డబ్ల్యుఎఫ్‌ పరిచయం చేయడం సంతోషంగా ఉంది. స్ధిరమైన వ్యవసాయ పద్ధతుల పట్ల మేమెంతగానో నేర్చుకున్నాము. తద్వారా మా పంట నాణ్యత కూడా మెరుగుపడింది. ఎరువులు ఏ మేరకు వేయాలన్నది తెలపడంలో భూసార పరీక్షలు తోడ్పడ్డాయి’’ అని రంగారెడ్డి జిల్లా నుంచి ఒక రైతు అన్నారు.

ఈ ప్రాంతంలో లాభదాయక, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి డబ్ల్యుఎఫ్‌ కట్టుబడి ఉంది. ఈ లక్ష్య సాధన దిశగా వేసిన చక్కటి ముందడుగు బెటర్‌ కాటన్‌ ఇనీషియేటివ్‌ ప్రాజెక్ట్‌. స్ధిరమైన వ్యవసాయ ప్రక్రియలను స్వీకరించడంతో పాటుగా వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి రైతులకు అవసరమైన విజ్ఞానం, నైపుణ్యం అందించడం ఈ ఫౌండేషన్‌ లక్ష్యం.

Leave a Reply