స్పీడ్ పెంచుతున్న వైష్ణవ తేజ్ …

గీత ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా కమిట్ అయిన పంజా వైష్ణవ తేజ్  

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తో హీరోగా టాలీవుడ్ లో కి పరిచయము అయ్యారు . సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఉప్పెన సినిమా తో డైరెక్టర్ గా ,మరియు , పంజా వైష్ణవ తేజ్ హీరో గా లాంచ్ చేసే భాద్యతను తీసుకున్నారు .. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. ఉప్పెన సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ , వైష్ణవ తేజ్ యాక్టింగ్ , బుచ్చిబాబు టేకింగ్ , మరియు దేవిశ్రీప్రసాద్ సాంగ్స్ అన్ని కుదిరి హిట్ అవ్వడమే కాకుండా డైరెక్టర్ బుచ్చి బాబు మరియు వైష్ణవ తేజ్ ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మంచి ప్రశంసలు అందుకున్నారు .. మొదటి సినిమా తో హిట్ అందుకోవడమే కాకుండా వంద కోట్ల క్లబ్ లో చేరారు పంజా వైష్ణవ తేజ్ .. ఉప్పెన సినిమా తరువాత పంజా వైష్ణవ తేజ్ కు చాలా ఆఫర్స్ వచ్చాయి . మొదటి సినిమా లవ్ బ్యాక్ డ్రాప్ చేసిన వైష్ణవ తేజ్ ఆ తరువాత సినిమా ఏది అయినా డిఫెరెంట్ గా చెయ్యాలని అనుకున్నారు …

ఉప్పెన సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పంజా వైష్ణవ తేజ్ ,కొంత గ్యాప్ తీసుకొని తన సెకండ్ సినిమా క్రిష్ డైరెక్షన్ లో కొండపోలం సినిమా లో నటించారు .. క్రిష్‌ లాంటి టాలెంటెడ్‌ డైరక్టర్‌ తెరకెక్కించడంతో ‘కొండపొలం’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొండ పొలం సినిమా తో డీసెంట్ హిట్ అందుకున్నాక పంజా వైష్ణవ తేజ్ తరువాత సినిమా ఏమిటి ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అని క్లారిటీ లేదు .. కొండ పొలం సినిమా తరువాత పంజా వైష్ణవ తేజ్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టారు .. పంజా వైష్ణవ తేజ్ తన చేయబోయే సినిమాలు గురించి సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి .. వైష్ణవ్ తేజ్ హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 లో కొత్త చిత్రం నిఱిమిస్తున్నారు అని తెలుస్తుంది .. ప్రస్తుతం పంజా వైష్ణవ తేజ్ స్పీడ్ పెంచి వరుసగా ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుండగా, బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ తరువాత షైన్ స్క్రీన్ బ్యానర్‌లో ఒక సినిమా చేస్తున్నాడు ..ఈ క్రమంలోనే గీతా ఆర్ట్స్ 2 లోను తను ఒక సినిమా చేయడానికి సిద్దమౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి .. మొత్తానికి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పంజా వైష్ణవ తేజ్ సినిమా ఎప్పుడు మొదలౌతుందో అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే …