స్కూటర్లలో ఎస్ యు వీ అయిన “ఇండీ” అనే వాహనాన్ని విడుదల చేసిన “రివర్”

తెలుగు సూపర్ న్యూస్ మార్చి 1,2023: బెంగళూరు కి చెందిన ‘రివర్’ అనే ఎలక్ట్రిక్ వెహికల్ (ఈ వీ) స్టార్ట్అప్ ‘ఇండీ’ అనే స్కూటర్ల లో ఎస్ యూ వీ వంటి స్కూటర్ ని ప్రెవేశ పెట్టింది. ఈ స్కూటర్ విప్లవాత్మకమైన డిజైన్ మునుపెన్నడూ చూడని లక్షణాల తో స్కూటర్ వినియోగాన్ని పెంపొందించేలా తయారుచెయ్యబడింది. ‘ఇండీ’ ‘రివర్’ ఆర్ & డి పరిశోధన సౌకర్యం తో బెంగళూరు లో రూపొందించబడింది. నగర పరిసరాల్లో ఉన్న ‘రివర్’ ఫ్యాక్టరీ లో తయారుచెయ్యబడుతుంది.

“డిజైన్-ఫస్ట్ ప్రక్రియ ద్వారా ప్రజల రోజువారీ జీవితాన్ని మెరుగుపరచడమే ‘రివర్’ ముఖ్య ఉద్దేశం.మా మొదటి ఉత్పత్తి ఐన ‘ఇండీ’ ఒక బోల్డ్ స్టేట్మెంట్. ఇది వాడుక , జీవనశైలి వంటి రెండు విభిన్నమైన విధానాలని కలుపుతుంది. ఇది ప్రాక్టీకాలిటీ, సామర్ధ్యం స్టైల్ ల సరైన కలయిక తో అత్యంత తెలివైన స్కూటర్” అని ‘రివర్’ సహా వ్యవస్థాపకుడు , ముఖ్యకార్యనిర్వహణాధికారి అయిన అరవింద్ మణి తెలిపారు .

భారతదేశం లో ఎలక్ట్రిక్ వెహికల్ విభాగం లో మొదటి సారిగా 14 అంగుళాల చక్రాన్ని ‘రివర్’ అందిస్తోంది. పెద్ద చక్రాలు ఎటువంటి రోడ్ మీద అయినా ఉత్తీర్ణమైన రైడింగ్ స్థితి ని మరియు నడిపే స్థాయి ని అందిస్తాయి. స్కూటర్లన్నింటిలోకి అత్యధిక స్టోరేజ్ అయిన 43 లీటర్ల సీట్ అడుగు స్టోరేజ్ మరియు 12 లీటర్ల ముందు గ్లోవ్ బాక్స్ స్టోరేజ్ ‘ఇండీ’ కలిగి ఉంది. ప్రత్యేకమైన లాక్&లోడ్ పేనియర్-స్టే లు వివిధ ప్రయోజనాలు అందించేలా అనుకూలీకరణ శ్రేణి ని అందించే స్కూటర్ల లో ఇదే మొదటిది .

సిగ్నేచర్ ట్విన్ బీమ్ ఉన్న హెడ్ లాంప్ మరియు విభిన్న టైల్ లాంప్ స్కూటర్ కి విభిన్నమైన రూపాన్ని ఇస్తాయి. ఇది రహదారి పై అత్యంత దృశ్యమానతను నిర్ధారిస్తుంది.
మోటారుసైకిల్స్ చేత ప్రేరణ పొందిన క్లిప్-ఆన్ హేండిల్ బార్ మెరుగైన హ్యాండ్లింగ్ మరియు నిలకడని అందిస్తుంది. వాహనం ప్రమాదవశాత్తు పడినప్పుడు ‘ఇండీ’ లో ఉన్న సేఫ్-గార్డ్స్ ఫీచర్ బాడీ పానెల్స్ కి రక్షణ కల్పిస్తుంది.

” ఇండీ ఎప్పుడూ అభివృద్ధి చెందే మరియు ప్రతి రోజు పూర్తి ఉపయోగాలకు వినియోగించే ఆధునిక భారతీయుడి నుండి ప్రేరణ పొందింది.విభిన్న డిజైన్ అంశాలు మరియు సాంకేతిక లక్షణాల కలయిక ‘ఇండీ’ కి విభిన్న వ్యక్తిత్వాన్ని మరియు మరింత చెయ్యాలి అనే ప్రేరణ ని ఇస్తాయి” అని ‘రివర్’ సహా వ్యవస్థాపకుడు మరియు ముఖ్యఉత్పత్తిఅధికారి విపిన్ జార్జ్ తెలిపారు .

వివిధ ఎత్తులు కలిగిన వ్యక్తులకు సరిపడే విధంగా ‘ఇండీ’ యొక్క నడిపే స్థితి ని తెలివిగా డిజైన్ చేసారు. ఈ .వీ విభాగం లో అత్యంత వెడల్పైన మరియు పొడువైన సీట్ ‘ఇండీ’ కి ఉంది. అది రాజీలేని సౌకర్యాన్ని అందిస్తుంది .’ఇండీ ‘ లో ఫ్రంట్ ఫుట్ పెగ్స్ అనేది ఇంకొక వినూత్నమైన ఫీచర్ మొదటిసారిగా రివర్ అందించింది , అది సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన రైడ్ ని అందిస్తూ ఫ్లోర్ బోర్డు మీద ఎక్కువ నిల్వ చేసే సదుపాయాన్ని అందిస్తుంది. ఇండీ యొక్క వెనుక భాగం లో ఉన్న ట్విన్ హైడ్రాలిక్ సస్పెన్షన్ మరియు ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ అత్యంత మెరుగైన సౌకర్యాన్ని అందిస్తాయి.

‘ఇండీ’ లో ఉన్న శక్తివంతమైన మోటార్ అందించే 6.7 కిలో వాట్ల అత్యధిక పవర్ 90 కిలోమీటర్ల వేగం వరకు తీసుకు వెళ్లే ,18 డిగ్రీ ల గ్రాడబిలిటీ కలిగి ఉంది.రైడర్ కి ఎకో, రైడ్ ,రష్ అనే మూడు రైడ్ మోడ్ ల లో మార్చుకోగలిగే సదుపాయం ఉంది . 4kwh బ్యాటరీ ‘ఇండీ’ కి 120 కిలోమీటర్ల వాస్తవ రేంజ్ ని , స్టాండర్డ్ చార్జర్ తో 5 గంటల లో 80% ఛార్జ్ చేసే సదుపాయాన్ని కలిగిస్తుంది.ఎంతటి ఎండా లో అయిన బాగా కనిపించే విధంగా ఎక్కువ కాంట్రాస్ట్ కలర్ డిస్ప్లే పనిచేస్తుంది. రెండు యూ స్ బి ఛార్జింగ్ పోర్ట్లు , రివర్స్ పార్కింగ్ అసిస్ట్ ఫీచర్ రైడర్ సౌకర్యాన్ని, సౌలభ్యాన్ని పెంపొందిస్తాయి.

‘ఇండీ’ ధర 125000/- రూపాయిలు ( ఎక్స్-షోరూం బెంగళూరు)’రివర్’ వెబ్సైటు లో ప్రీ-ఆర్డర్స్ ఈరోజు నుండి మొదలుఅవుతాయి, మరియు ఆగష్టు 2023 నుండి డెలివరీలు మొదలుఅవుతాయి

Leave a Reply