అమెజాన్ లో నీతో చిత్రం ట్రెండింగ్..

“నీతో”.. సున్నితమైన అంశాలను స్పృశిస్తూ దర్శకుడు బాలు శర్మ రాసుకున్న కథాంశం, అలాగే తమ మధ్యన ఏర్పడిన ప్రేమ బంధానికి సరైన నిర్వచనాన్ని వెతకడానికి నాయకా, నాయికలు ప్రయత్నించే తీరు ఆసక్తికరంగా సాగుతుంది.

నీతో హీరో అభిరామ్ వర్మ్ చాలా ఈజ్‌తో నటించాడు. కొన్ని సీన్స్‌‌లో ఫీల్‌ను కళ్ళతో బాగా ఎలివేట్ చేశాడు. అలాగే కథానాయిక సాత్విక రాజ్ కూడా మంచి పరిణితితో కూడిన నటనను కనబరిచింది. హీరో చిన్నాన్న పాత్రలో రాజీవ్ కనకాల కూడా బాగా నటించారు. ఆయన నటనానుభవం ఆ పాత్రలో ప్రస్ఫుటితంగా కనిపించింది.

థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించిన నీతో సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. అమెజాన్ లో విడుదలైన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ సినిమాకు మిలియన్ వ్యూస్ రావడంతో పాటుగా ట్రేండింగ్ లో ఉండడం విశేషం. పృథ్వీ క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

Check it out now on Prime Video!
https://app.primevideo.com/detail?gti=amzn1.dv.gti.fd891626-a832-4972-8ef4-f8902f2de0bd&ref_=atv_dp_share_mv&r=web

Leave a Reply