నందమూరి కల్యాణ్‌రామ్ గారి బింబిసార ZEE5 పై భారీగా విజయవంతమయింది; 100 మిలియన్ ప్రసార నిముషాలను సాధించింది!

తెలుగు సూపర్ న్యూస్ ,నేషనల్, 28 అక్టోబర్ 2022: భారతదేశం అతిపెద్ద గృహ-ఆధారిత వీడియో ప్రసార వేదిక అయిన ZEE5, బ్లాక్ బస్టర్ ఫ్యాంటసీ తెలుగు యాక్షన్ చిత్రం ‘బింబిసార’ ను తన వేదికపై దీపావళి రోజున తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళంలో ప్రీమియర్ చేసింది. థియేటర్లలో విడుదలైన సందర్భంగా ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకొని విమర్శకుల అభిమానాన్ని అందుకోగా, డిజిటల్ ప్లాట్‌ఫామ్ యొక్క ప్రీమియర్ కూడా ధమాకాకు ఏ మాత్రం తక్కువ కాలేదు.

ZEE5 పై ప్రీమియర్ ప్రసారమైన 48 గంటల లోపున, ఈ చిత్రం 100 మిలియన్ ప్రసార నిముషాలను సాధించింది మరియు ZEE5 ఇండియాపై అతిపెద్ద దీపావళి వారపు ప్రారంభాన్ని చవి చూసింది. అంతమాత్రమే కాదు, ఈ చిత్రం యొక్క అభిమానులు ఎంతో కోలాహలంగా విజయవాడ , హైదరాబాద్ నగరాల్లో విజయోత్సవాలను జరుపుకున్నారు. బింబిసార అభిమానులు తమ అభిమాన నటుడిపై అంతులేని ప్రేమ కురిపిస్తూ అతని (నందమూరి కల్యాణ్‌రామ్) నిలువెత్తు కటౌట్ పై పూలజల్లును వెదజల్లారు.

ఈ ప్లాట్‌ఫామ్, నిర్మాతలు, నటీనటుల కోసం ఈ దీపావళి సంబరాలు ఇలా జరుపుకోవడం నిజంగా ఒక గొప్ప సమయంగా ఉండినది. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ వారిచే నిర్మించబడి మరియు నూతన పరిచయం మల్లిడి వశిష్టచే రచన మరియు దర్శకత్వం వహించబడిన, విమర్శకులచే ప్రశంసలు పొందిన ఈ తెలుగు చిత్రం 2022 అక్టోబర్ 21 నుండి ప్రీమియర్ గావించబడింది.
ZEE5 ఇండియా ఛీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కల్రా గారు మాట్లాడుతూ, “ప్లాట్‌ఫామ్ పైన బింబిసార అందుకున్న విశేష స్పందన పట్ల మేము ఎంతగానో ఆనందించాము. కేవలం 2 రోజుల లోపున, మేము 100 మిలియన్ ప్రసార నిముషాలను చవి చూశాము, నిజంగా ఇది మాకు ఎంతో గొప్ప మైలురాయిగా ఉంది.

మేము వినోదాత్మకమైన, ఇంకా ప్రభావవంతమైన కథలను సమర్పించాలనే మా వాగ్దానాన్ని నిలుపుకోవడం ఎంతో గర్వంగా భావిస్తాము. కార్తికేయ 2, కెప్టెన్, మరి ఇప్పుడు బింబిసార వంటి చిత్రాలతో, మేము తెలుగు విపణిలో మా పాదముద్రను బలోపేతం చేసుకున్నాము మరియు మా లైబ్రరీకి నాణ్యమైన కంటెంటును జోడించడం కొనసాగిస్తాము” అన్నారు.
నందమూరి కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ, “బింబిసార కొరకు ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ పట్ల ప్రేక్షకుల నుండి ఇంతటి ఘనమైన స్పందనను చూడడం పట్ల నేను ఉబ్బి తబ్బిబ్బవుతున్నాను.

దీపావళి వారాంతం సందర్భంగా ఇది 100 మిలియన్ ప్రసార నిముషాలను దాటి వెళ్ళడం మా అందరికీ నిజంగా ఒక గర్వకారణమైన క్షణంగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే అత్యంత ఉద్విగ్న భావనకు లోనయ్యాను, ప్రేక్షకులు ఇచ్చిన ఈ గొప్ప వరం పట్ల నేను ధన్యవాదాలు మాత్రమే చెప్పగలను” అన్నారు.

చిత్రదర్శకులు మల్లిడి వశిష్ట మాట్లాడుతూ, “చారిత్రాత్మక పాత్రలు మరియు కథల కొరకు ఫాంటసీలు మరియు ఆకర్షణల పట్ల నా ప్రేమకు బింబిసార ఒక ఉత్పాదన కాబట్టి ఇది నా హృదయానికి అతి దగ్గరగా నిలిచిపోతుంది. ప్రేక్షకులచే ఈ కథాంశం బాగా స్వీకరించబడి మరియు ప్రేమించబడడం పట్ల నేను సంతోషిస్తున్నాను. థియేటరులో మరి ఇప్పుడు ZEE5 పై దీని విజయంతో, ఈ విశేష స్పందన పట్ల నేను ఎంతగానో ఆనందిస్తున్నాను, మరియు ఇది నా హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక అనుభూతి అవుతుంది” అన్నారు. బింబిసార ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళంలో ప్రత్యేకంగా ZEE5 పై అందుబాటులో ఉంది!

Leave a Reply