నాదర్గుల్ డీపీఎస్ లో ఇన్విస్టిచర్ వేడుక..

తెలుగు సూపర్ న్యూస్, నాదర్గుల్, జూలై 3,2023:కొత్త అకడమిక్ ఇయర్ 2023-2024 ప్రారంభంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, నాదర్గుల్ ఇన్వెస్టిచర్ వేడుక జూలై 3, 2023న పాఠశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా, గౌరవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ముఖ్య అతిథిగా ఎన్.బలరామ్ (ఫైనాన్షియల్ డైరెక్టర్, సింగరేణి కలరీస్ కంపెనీ లిమిటెడ్) అధ్యక్షత వహించారు. అలాగే మరో గౌరవ అతిథిగా కల్నల్ అనిల్ కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి టి. పద్మ జ్యోతి ఆహ్వానితులందరికీ సాదర స్వాగతం పలికారు.

నిబద్ధత, విశ్వాసం సమర్ధతతో పాఠశాలను ముందుండి నడిపించేందుకు అర్హులైన యువ ప్రతిభావంతులైన విద్యార్థులకు బాధ్యతలు అప్పగించే ఇన్వెస్టిచర్ వేడుకను పాఠశాల ఘనంగా నిర్వహించింది. వివిధ కష్టతరమైన ఇంటర్వ్యూలు ప్రచారం తర్వాత నామినేషన్లు, ఓటింగ్ ద్వారా విద్యార్థులచే ఎన్నుకోబడిన విద్యార్థి కౌన్సిల్ సభ్యులచే ప్రమాణం చేయించారు. ముఖ్య అతిథులచే బ్యాడ్జీలను విద్యార్థులకు  అందజేశారు.

ముఖ్య అతిథి గారైన అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ.. ఎన్ సీసీ అనేది విద్యార్థులకు ఎంతో అవసరమని, దీనివలన క్రమశిక్షణతో పాటు పట్టుదల, పోటీతత్వం , దేశసేవ లాంటి సద్గుణాలు అలవాడతాయని, భవిష్యత్తులో ఎన్ సీసీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కూడా లభిస్తాయని అన్నారు.

రెండవ ముఖ్య అతిథి గారైన బలరాం మాట్లాడుతూ.. విద్యార్థులు చక్కగా చదవాలని, సృజనాత్మకతను పెంచుకోవాలని, చదువు ప్రాధాన్యత గురించి వివరించి, ప్రతి విద్యార్థి దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉండాలని, ఉత్తమ పౌరులుగా దేశానికి సేవ చేయాలని సభాముఖంగా విద్యార్థులను ఉద్దేశిస్తూ చెప్పారు.

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంస్థల అధినేత మల్కా కొమరయ్య మాట్లాడుతూ.. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో నేటి విద్యార్థినీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అధునాతనమైనటువంటి వసతులను కల్పిస్తున్నామని, వాటిని విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎన్నికలలో గెలుపొందిన విద్యార్థుల్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, హౌస్ కెప్టెన్, సెక్రటరీస్ మొదలైనటువంటి బాధ్యతలను స్వీకరిస్తూ తమకిచ్చిన బాధ్యతలను

సక్రమంగా నిర్వహిస్తామని విద్యార్థులు ప్రమాణ స్వీకారం చేశారు.  

స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి టి. పద్మ జ్యోతి మాట్లాడుతూ.. జీవితం మన ముందు విసురుతున్న ఆటంకాలు సవాళ్లను అధిగమించి ముందుకు సాగాలని పిల్లలను చైతన్యపరిచారు. నాయకులుగా ఉండటమే కీలకమైన పాత్ర అని, కొత్త విద్యార్థి పరిషత్‌కు తగిన బాధ్యతలు ఉంటాయని ఆమె అన్నారు.

ఈ సందర్భంగా పాఠశాల సీఓఓ మల్కా యశస్వి మాట్లాడుతూ..  నాణ్యమైన విద్యను మరింత ముందుకు తీసుకెళ్లి దేశంలోనే అగ్రగామి విద్యాసంస్థగా పాఠశాలను తీర్చిదిద్దాలని యువ నాయకులను అభినందించారు. వసుధైక కుటుంబం- ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే అంశంపై డ్రిల్‌ను విద్యార్థులు ప్రదర్శించడంతో వేడుక ముగిసింది.

Leave a Reply