గూడూరులో రిలయన్స్ రిటైల్ స్మార్ట్ బజార్ ప్రారంభం

తెలుగు సూపర్ న్యూస్,గూడూరు,జనవరి 16,2023: రిలయన్స్ రిటైల్ కు చెందిన పెద్ద ఫార్మాట్ సూపర్ మార్కెట్ అయిన స్మార్ట్ బజార్ తన కొత్త స్టోర్ ను గూడూరులోని కొత్త ఆర్టీసీ బస్టాండ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమీపంలో ఉన్న పీఎస్ఆర్ మాల్‌లో ప్రారంభించింది.

కిరాణా, పండ్లు, కూరగాయలు, పాల ఉత్ప‌త్తులు, కిచెన్ వేర్, హోమ్ వేర్, దుస్తులు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మొదలైన అనేక రకాల ఉత్పత్తులను ఒకేచోట అందించేలా ఈ స్టోర్ వన్ స్టాప్ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ స్టోర్ ప్రారంభంతో, స్మార్ట్ బజార్ ఇప్పుడు గూడూరులోనూ ప్ర‌వేశించిన‌ట్ల‌యింది.

దాదాపు 15వేల‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన స్మార్ట్ బజార్.. వినియోగదారులకు మ‌రింత పొదుపు, మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి సిద్ధ‌మైంది.

ఇది వినియోగదారులకు కిరాణా, పాల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు వంటి రోజువారీ నిత్యావసరాల నుంచి హోంవేర్‌, కిచెన్ వేర్‌, పాదరక్షలు, దుస్తులు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రత్యేక వస్తువులు.. ఇలా అనేక రకాల ఉత్పత్తులను ఒకేచోట‌ అందిస్తుంది.

ఇది ఎంఆర్‌పీ, ప్రత్యేక సీజనల్ ఆఫర్లపై 5% వరకు తగ్గింపుతో సంవత్సరం పొడవునా వినియోగదారులకు గొప్ప పొదుపు అవకాశాలను అందిస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, పానీయాలు, వ్యక్తిగత సంరక్షణ, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రత, ఫ్యాబ్రిక్, హోంకేర్, గృహాలంకరణ వంటి విభాగాల్లో ఆకర్షణీయమైన ఆఫర్లలో లభించే బ్రాండ్ల శ్రేణి ఈ స్టోర్‌లో ఉంది.

స్మార్ట్ బజార్‌లో షాపింగ్ చేయడం వ‌ల్ల క‌లిగే ప్రత్యేక ప్రయోజనం ఏమిటంటే.. ఎక్కువ కొంటే ఎప్పుడూ ఎక్కువ పొదుపు చేయొచ్చు. ఉదాహరణకు, కనీసం రూ.1,499 కొనుగోలు చేసే కస్టమర్ల‌కు కిలో చక్కెర కేవలం రూ.9కే వ‌స్తుంది.

పూర్తి సమాచారం ఉన్న కస్టమర్ అసోసియేట్లు, ఫంక్షనల్ డిజైన్, లేఅవుట్, ఆకర్షణీయమైన ధరలకు నాణ్యమైన ఉత్పత్తులతో వినియోగదారుల హృదయాలను స్మార్ట్ బజార్ గెలుచుకుంటూనే ఉంది. ఇది వారి దైనందిన జీవితంలో భాగంగా మారింది.

రిలయన్స్ రిటైల్, త‌న వివిధ కిరాణా ఫార్మాట్లతో, ధరల పరిధిలో రోజూ.. అలాగే ప్రత్యేక సందర్భాల్లోనూ తన వినియోగదారుల అవసరాలను తీరుస్తూనే ఉంది. కస్టమర్ పై గరిష్ఠ‌ దృష్టి సారించడంతో, స్మార్ట్ బజార్ దాని విస్తృతశ్రేణి ఆఫర్, వినియోగదారుడికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో పెద్ద ఫార్మాట్ సూపర్ మార్కెట్ విభాగంలో అత్యుత్త‌మ‌ షాపింగ్ అనుభవాన్ని అందిస్తూనే ఉంది.
.

Leave a Reply