రెడ్డిగారింట్లో రౌడీయిజం మూవీ రివ్యూ…

కమర్షియల్ ఎంటర్టైనర్… రెడ్డిగారింట్లో రౌడీయిజంసిరి మూవీస్ బ్యాన‌ర్‌పై ర‌మ‌ణ్ క‌థానాయ‌కుడిగా కె.శిరీషా ర‌మ‌ణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. ఎం.ర‌మేష్‌, గోపి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వ‌ర్ష హీరోయిన్స్‌. సీనియ‌ర్ న‌టుడు వినోద్ కుమార్ విల‌న్‌గా న‌టించారు. ఇటీవల హీరో శ్రీకాంత్ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. లవ్… రొమాన్స్… యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం పదండి.కథ: ప్రతాప్ రెడ్డి(వినోద్ కుమార్) గ్రామంలో కులాంతర వివాహాలను కానీ, ప్రేమ వివాహాలను కానీ అసలు ఎంకరేజ్ చేయరు. అలా చేస్తే చంపి పాతిపెట్టే రకం ఆయన. తన పక్క గ్రామానికి చెందిన.శివ(ర‌మ‌ణ్).ఊళ్ళో అల్లరి చిల్లరగా స్నేహితులతో సరదాగా తిరిగే ఓ గ్రామీణ యువకుడు. తండ్రి(జూనియర్ బాలకృష్ణ) ఎంత చెప్పినా డిగ్రీ కంప్లీట్ చేయకుండా అమ్మాయిల చుట్టూ ప్రేమ పేరుతో తిరుగుతూ ఉంటాడు. అయితే తన క్లాస్ మేట్ అయిన సంధ్య(ప్రియాంక రౌరీ)ని ప్రేమిస్తాడు. ఈమె ప్రతాప్ రెడ్డి కూతురు. అసలే ప్రేమ పెళ్ళిళ్లకి, కులాంతర వివాహాలంటే రగిలిపోయే ప్రతాప్ రెడ్డి… వీరి వివాహానికి ఒప్పుకున్నాడా? అసలు సంధ్య… శివని నిజంగానే ప్రేమించిందా? శివ ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.కథనం విశ్లేషణ: కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. రొమాన్స్, యాక్షన్ పార్ట్ ని సరైన మోతాదులో వెండితెరపై చూపించగలిగితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్. అందుకే చాలా మంది నిర్మాతలు ఇలాంటి సబ్జెక్టుని ఎంచుకుని మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యే డెబ్యూ హీరోలు కూడా ఇలాంటి కథలనే సెలెక్ట్ చేసుకొని తమలోని టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు. అలానే సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో మంచి దర్శకులుగా పేరు తెచ్చుకోవాలనుకునే వారూ ఇలాంటి కమర్షియల్ కథలను ఎంచుకుని విజయం సాధిస్తున్నారు. ఇలాంటి కొత్త టీమ్ యే.. ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ అనే ఓ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ సినిమా విడుదలకు ముందే… టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను సొంతం. చేసుకుంది. కులం, మతం కంటే… ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం గొప్ప మానవత్వం అని చాటి చెప్పే సినిమా ఇది. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కులం పేరుతో ఆటవికంగా మనుషులను అంతమొదించడం…. నిమ్న కులాల వారిని అంటరాని వారిగా చూడటం చూస్తూనే ఉన్నాం. ఆలాంటి… సున్నితమైన సబ్జెక్టును తీసుకుని… వాటికి కమర్షియల్ విలువలు జోడించి… ఓ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా సినిమాని తెరకెక్కించారు. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటీనటుల విషయానికి వస్తే… ఈ చిత్రంతో వెండితెరకు పరిచయమైన హీరో ర‌మ‌ణ్‌ చాలా మెచ్యూర్డ్ గా నటించారు. ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ని ఎలా మెప్పించాలో.. అలా అలరించారు. పాటలు, ఫైట్స్, డైలాగ్స్ విషయంలో ఎక్కడా కొత్త కుర్రాడు అనే థాట్ రాకుండా చాలా ఎనర్జిటిక్ గా నటించారు. అలానే అందమైన ముద్దుగుమ్మలు నలుగురూ ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వర్ష పోటీ పడి యూత్ ని ఆయకట్టు కున్నారు. సీనియర్ హీరో వినోద్ కుమార్ మరోసారి తన మార్కు నటన విలనిజంతో మెప్పించారు. రచ్చ రవి, జూనియర్ బాలకృష్ణ అండ్ బ్యాచ్ కామెడీ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. ముఖ్యంగా హీరో తండ్రి పాత్రలో జూనియర్ బాలకృష్ణ బాగా ఆకట్టుకున్నాడు.సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే… కమర్షియల్ ఎంటర్టైనర్ ని దర్శకులిద్దరూ ఎం. ర‌మేష్‌, గోపి బాగా డీల్ చేశారు. ఒక డెబ్యూ హీరోని ప్రేక్షకులు మెచ్చేలా వెండితెరపై అన్ని విధాలుగా ఆవిష్కరించి సక్సెస్ అయ్యారు. సున్నితమైన కథను ఓ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాంగా మలచడానికి ట్విస్టులతో రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. శ్రీ‌వ‌సంత్‌ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్‌ ఒకే. మ‌హిత్ నారాయ‌ణ్‌ స్వరపరిచిన సంగీతం బాగుంది. ఎ.కె. ఆనంద్‌ సినిమాటోగ్ర‌ఫీ రిచ్ గా ఉంది. హీరో ఎలివేషన్… హీరోయిన్ల అందాలను యూత్ కి కనెక్ట్ అయ్యేలా కెమెరాలో బంధించారు. శ్రీ‌నివాస్ పి. బాబు, సంజీవ‌రెడ్డి ల ఎడిటింగ్ ఇంకాస్త కృస్పీగా ఉంటే బాగుండేది. అల్టిమేట్ శివ‌, కుంగ్‌ఫూ చంద్రు కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ మాస్ ని మెప్పిస్తాయి నిర్మాత‌ కె.శిరీషా ర‌మ‌ణారెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని ఎంతో ఉత్తమమైన నిర్మాణ విలువలతో నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్..!!

!రేటింగ్: 3.25

ఆర్ ఆర్ ఆర్ మూవీ రివ్యూ…

బాహుబలి రెండు పార్ట్స్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ అవ్వడం తో పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు దర్శకధీరుడు రాజమౌళి ……….. తెలుగు సినీ పరిశ్రమలో డైరెక్టర్ బి ఎన రెడ్డి తరువాత , విజువల్ వండర్ ని స్క్రీన్ మీద క్రియేట్ చేసే దర్శకుడు అతను .. శిల్పి శిల్పాన్ని తీర్చి దిద్దే నేర్పరి అతను , అపజయం ఎరుగని విజయ్ ధీరుడు .. ఒక కొత్త ప్రపంచము లోకి ప్రేక్షకుడిని తీసుకు వెళ్లే మంత్రగాడు .. తెలుగు సినిమా కి ఇంటర్నేషనల్ స్థాయి లో గుర్తింపు తీసుకు వచ్చిన దర్శక ధీరుడు , అతనే ఎస్ ఎస్ రాజమౌళి .. అలానే రాజమౌళి ఏ సినిమా చేసిన ప్రాణం పెట్టి చేస్తారు , ఇటు హీరోకు స్టార్ ఇమేజ్ ,అటు ప్రొడ్యూసర్ కు మంచి పేరు టేబుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చే వన్ అండ్ ఓన్లీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి .. అమృతం సీరియల్ తో మొదలు అయిన తన కెరీర్ , ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ వరకు వెల్లింది అంటే దాని వెనుక రాజమౌళి పడిన తపన , హార్డ్ వర్క్ , డెడికేషన్ . ఇక అసలు విషయానికి వెళ్ళితే జక్కన్న డైరెక్ట్ చేసిన బాహుబలి రెండు పార్ట్స్ భారీ విజయం అందుకొని , పాన్ ఇండియా మార్కెట్ , పాన్ ఇండియా డైరెక్టర్ , పాన్ ఇండియా హీరో పాన్ ఇండియా స్టోరీ తో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుకొని , డైరెక్టర్ రేంజ్ నుంచి పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరారు దర్శకదీరుడు రాజమౌళి … బాహుబలి రెండు పార్ట్స్ భారీ విజయం అందుకోవడంతో .. డైరెక్టర్ రాజమౌళి కొంత గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ , ఎన్టీఆర్ తో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ మూవీని తెరకెక్కించారు .. ఈ కాంబినేషన్ , అలానే పేట్రియాటిక్ స్టోరీ కావడంతో , ఈ మూవీ పై ప్రేక్షకుల్లో హై ఎక్సపెక్టేషన్స్ నెలకొన్నాయి .. ఇక డైరెక్టర్ రాజమౌళి తొలిసారిగా ఒక ఫిక్షన్ స్టోరీని తీసుకొని తన ఊహ ను జ్యోడించి ఈ సినిమాను భారీ కాస్టింగ్ తో తెరకెక్కించారు .. రాజమౌలి సినిమా అంటేనే ఒక పెద్ద విజువల్ గ్రాండియర్ , సెట్స్ , గ్రాఫిక్స్ , మరియు ఎమోషన్ , యాక్షన్ ఎలిమెంట్స్ , సెంటిమెంట్స్ ఇలా అన్ని కలిసి ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉంటుంది .. డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఎన్టీఆర్ , మరియు రామ్ చరణ్ ఇద్దరు సినిమాలు చేశారు , వీరిద్దరి స్టామినా ఏమిటో అలానే వీరిద్దరి యాక్టింగ్ టాలెంట్ ,అలానే వీరిద్దరి ని కలిపి ఒకే బిగ్ స్క్రీన్ పై ప్రెజెంట్ చెయ్యాలంటే ఒక్క రాజమౌళి కె బాగా తెలుసు .., ఈ సినిమాకు రైటర్ గా విజయేంద్రప్రసాద్ కధ అందించారు . స్టోరీ రెడీ , కధ అయితే మాములుగా లేదు ఫ్రీడమ్ ఫైటర్స్ అల్లూరి సీతారామరాజు , మరియు కొమరం భీమ్ ఇద్దరు క్యారెక్టర్స్ చుట్టూ అల్లుకున్న ఫిక్షన్ డ్రామా గా బ్యాలెన్స్ చేస్తూ స్టోరీ స్క్రీన్ ప్లే పక్కాగా కుదిరింది .. పాన్ ఇండియా సినిమా అంటేనే భారీ సెట్స్ ,భారీ ఖర్చు , భారీ గ్రాఫిక్స్ , ఇలా అన్ని భారీగానే ఉంటాయి , ఈ సినిమాను దాదాపుగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు .ఎన్టీఆర్ , రామ్ చరణ్ పడిన కష్టం స్క్రీన్ మీద బాగా కనబడుతుంది , . పీరియాడిక్ ఫిక్షన్ డ్రామా గా తెరెకెక్కిన సినిమా కాబట్టి రాజమౌళి సినిమా విజువల్స్ విషయంలోనూ , సెట్స్ విషయంలోనూ , మరియు గ్రాఫిక్స్ , కాస్టింగ్ విషయం లోను చాలా శ్రద్ధ తీసుకున్నారు అని ఫిల్మ్ క్రిటిక్స్ చెబుతున్నారు .. అదే విధంగా ఇద్దరు కలిసి డాన్స్ చేసే విజువల్స్ ,మరియు ఎన్టీఆర్ సెంటిమెంట్ తో చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి .. ఎన్టీఆర్ , రామ్ చరణ్ స్నేహబంధం గురించి తెలిపే ప్రతి సీన్ డైరెక్టర్ రాజమౌళి అద్భుతముగా తెరకెక్కించారు ..ఇక బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తన వీరత్వం చూపిస్తూ పోరాడే సీన్స్ మరో హై లైట్ , మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి ఈ సినిమాకు ప్రాణం పెట్టి పని చేశారు ,ముఖ్యంగా రీ రికార్డింగ్ సినిమాకు మరో లెవెల్ కు తీసుకొని వెల్లింది ..అలానే డైలాగ్స్ రాసిన సాయి మాధవ్ బుర్ర గారు ఒక్కో డైలాగ్ ఒక్కో బులెట్ లా పేలాయి .. ఫైనల్ గా ఈ సినిమా కి పని చేసిన సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ తన గ్రాండ్ విజువల్స్ తో సినిమాను మరో స్థాయి కి తీసుకువెళ్లారు …. రాజమౌళి చెక్కిన మరో అద్భుతం , రాజమౌళి పడిన కష్టం నిర్మాతలు పెట్టిన ప్రతి రూపాయి ప్రతి షాట్ లో కనబడుతుంది . ఇక ఇప్పటికే పలు చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. ఓవర్సీస్ లో కూడా షోలు పడటంతో టాక్ బయటకి వచ్చేసింది. సినిమా చూసిన వారంతా రాజమౌళి దర్శకత్వానికి, ఎన్టీఆర్, రామ్ చరణ్ నటనని పొగుడుతున్నారు. సినిమా అద్భుతం, అదిరిపోయింది అంటూ ప్రశంసిస్తున్నారు. ఫ్యాన్స్, ప్రేక్షకులు నుంచి సెలబ్రిటీల వరకు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు…

ఈ మూవీ లో రామ్ చరణ్ అల్లరి సీతారామరాజు పాత్రలో కనిపించారు .. ఈ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ పడిన కష్టం ప్రతి షాట్ లోను కనబడుతుంది .. అలానే ఈ మూవీ కోసం రామ్ చరణ్ తన డైలాగ్ డెలివరీ యాక్టింగ్ , స్టంట్స్ , యాక్షన్ సీన్స్ కోసం చాలా శ్రద్ద తీసుకొని బాగా కష్టపడ్డాడు , ఆ కష్టానికి తగ్గిన ప్రతిఫలం ఈ రోజున బిగ్ స్క్రీన్ మీద కనబడుతుంది

…ఎన్టీఆర్‌ ఆర్ ఆర్ ఆర్ సినిమాకి ప్రాణం పెట్టి వర్క్ చేశారు .. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ అందరి హృదయాలను గెలుచుకున్నారు .ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసం ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి దొరికిన నిజ‌మైన రెండు శ‌క్తులు ఎన్టీఆర్‌, రామ్‌చ‌రణ్‌. ఆయ‌న మొద‌లు పెట్టిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యుద్ధాన్ని వెదుక్కుంటూ వ‌చ్చిన రెండు ప‌దునైన ఆయుధాల్లాగే మారిపోయారు. కొమరం బీమ్ పాత్ర‌ల్లో ఒదిగిపోయిన తీరు, పోరాట ఘ‌ట్టాల్లో అభిన‌యం చాలా బాగుంది. ‘నాటు నాటు’ పాట‌లో ఇద్ద‌రూ క‌లిసి సింక్‌లో డ్యాన్స్ చేసిన తీరు చూస్తూ క‌ళ్లు తిప్పుకోలేం.కీరవాణి గురించి …ఈ సినిమాకు అతి పెద్ద ఎసెట్‌ కీరవాణి సంగీతం. పాటల్లోనూ, నేపథ్యసంగీతంతోనూ సినిమాకు ప్రాణం పోశారు .. ఇక ఈ మూవీ లోని అన్ని సాంగ్స్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది టెక్నీకల్ డీటెయిల్స్ :: ప్రతి షాట్‌నీ, ప్రతి సీన్‌నీ ఇంట్రడక్షన్‌ సీన్‌లా తీయాలనే రాజమౌళి ఆలోచనకు ఫిదా ఆవలిసిందే ..ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ , ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగానే అందరూ టెక్నీకల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ..లొకేషన్లు, కెమెరా వర్క్ చాలా అద్భుతంగా ఉంది కెమెరా మెన్ సెంథిల్ రాజమౌళి విజువలైజేషన్ తగ్గట్టు గా ప్రతి ప్రేఫ్ ని చక్కిని పెయింటింగ్ లా చెక్కినట్లు బిగ్ స్క్రీన్ మీద కనబడుతుంది ……….. ఇక ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ అందించిన సెట్స్ , మినియేచర్స్ , రామోజీ ఫిల్మ్ సిటీ సెట్స్ అన్ని చాలా గ్రాండియర్ ని తీసుకొచ్చాయి ……..

రాజమౌళి గురించి :: రాజమౌళి ఏ సినిమా మొడులు పెట్టిన ప్రాణం పెట్టి పనిచేస్తాడు .. ప్రతి ఫ్రెమ్ , ప్రతి షాట్ , ప్రతి సీన్ అద్భుతంగా వచ్చేంతవరకు కష్టపడుతూనే ఉంటాడు .. ఇక కెరీర్ బిగినింగ్ నుండి తాను తెరకెక్కించి న మూవీస్ అన్ని నిర్మాతలకు లాభాలు తీసుకొచ్చాయి అనడం లో ఎటువంటి సందేహం లేదు ……… , ఇటు హీరోకు స్టార్ ఇమేజ్ ,అటు ప్రొడ్యూసర్ కు మంచి పేరు మంచి , టేబుల్ ప్రాఫిట్స్ తీసుకొచ్చే వన్ అండ్ ఓన్లీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి .. బాహుబలి మూవీ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగారు రాజమౌళి , ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా తో జక్కన పేరు వరల్డ్ వైడ్ మార్కెట్ లో తన పేరు మారుమోగిపోతుంది .. నాలుగు సంవత్సరాల సినిమా, మూడు సంవత్సరాల మేకింగ్ ప్రాజెక్ట్ .. ఒక తపస్సు లా చేసిన ఈ మూవీ రాజమౌళి కెరీర్ ని మరో మెట్టు ఎక్కించింది…

అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ‘క్లాప్’…

స్పోర్ట్స్ బ్యాక్క్సఫీస్ ను బద్దలు కొట్టాయి. అందుకే నిర్మాతలు ఇలాంటి కథలను తెరకెక్కించే దర్శకులను ఎంచుకొని మంచి ఇంస్పైరింగ్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘క్లాప్’ ఇలాంటి స్టోరీతోనే తెరకెక్కింది. ఇది సోనీ లివ్ (ఓటిటి)లో ఈరోజే ఎక్స్ క్లూజివ్ గా రిలీజ్ అయింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకుందో చుద్దాం పదండి. కథ: విష్ణు (ఆది పినిశెట్టి) రన్నింగ్ రేస్ లో ఒక తిరుగులేని ఛాంపియన్. హాకీ ప్లేయర్ అయిన మిత్ర(ఆకాంక్ష సింగ్) విష్ణుని ప్రేమిస్తుంది. కానీ ఓరోజు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో తన కాలిని కోల్పోయి.. స్పోర్ట్స్ కి దూరం అవుతాడు విష్ణు. అయినా మిత్ర విష్ణుని వివాహం చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత వైవాహిక జీవితంలో ఏమాత్రం ఆసక్తి లేకుండా ఓ ఉద్యోగం చేస్తూ బతుకుతాడు విష్ణు. మరి ఈ క్రమంలో తనకి ఓ స్టేట్ లెవెల్ మహిళా రన్నర్ భాగ్యలక్ష్మి(కృష్ణ కురూప్) అనే అమ్మాయికి కోచ్ గా మారే పరిస్థితి ఏర్పడుతుంది. మరి తన జీవితంలో వచ్చిన ఈ మలుపుతో విష్ణు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటాడు? నేషనల్ ఛాంపియన్ అవ్వాలనుకున్న తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు? అనేది తెలియాలి అంటే ఈ సినిమాని సోనీ లివ్ లో చూడాల్సిందే.కథ.. కథనం విశ్లేషణ: స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో చాలా కథలను వెండితెరపై ఆవిష్కరించారు. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ఇప్పుడు ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి.. కూడా అలాంటి కథనే ఎంచుకుని ‘క్లాప్’మూవీతో మన ముందుకు వచ్చాడు. ఇది వరకు మనం చూసిన పలు స్పోర్ట్స్ డ్రామాస్ తరహాలోనే ఈ సినిమా కూడా కొన్ని ఇంప్రెసివ్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ తో కూడి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఆది తనకి వచ్చిన ఈ సరికొత్త పాత్రని చాలా బాగా చేసాడు. అథ్లెట్ గా… తర్వాత తన లైఫ్ మారిపోయిన యువకుడిగా… రెండు షేడ్స్ లో మంచి నటనని కనబరిచాడు. కాలు పోగొట్టుకొని… ఓ డిజార్డర్ తో విపరీతంగా బాధపడే యువకుని పాత్రలో మెప్పించాడు. భాగ్యలక్ష్మిగా కనిపించిన కృష్ణ కురూప్ మంచి నటనను కనబరిచింది. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ సీనియర్ నటుడు నాజర్. చాలా కాలం తర్వాత తనలోని విలనిజాన్ని సాలిడ్ గా చూపించారు. స్పోర్ట్ కి సంబంధించి ఎలాంటి పాలిటిక్స్ ఉంటాయి, ప్లేయర్స్ పరంగా ఎదురయ్యే ఇబ్బందులను ఇందులో చూపించిన విధానం బాగుంది. ఇంకా ఆకాంక్ష సింగ్, మైమ్ గోపి తదితరులు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. స్పోర్ట్స్ డ్రామాలో వుండే మంచి ఇన్ స్పైర్ చేసే సన్నివేశాలు.. డైలాగ్స్ అన్నీ ఉన్నాయి. దాంతో సినిమా మరింత ఆసక్తి కరంగా ఉంటుంది. కథనంలో మరింత మంచి డ్రామా ప్లే చేయడంలో దర్శకుడు విజయం సాధించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ… సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా కంపోజ్ చేయడం బాగుంది. అలాగే ఇళయరాజా సంగీతం మంచి ఎఫెక్టివ్ గా ఉందని చెప్పాలి. అలాగే ఎడిటింగ్ కూడా బాగుంది. ఇంకా నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు పృద్వి ఆదిత్య రన్నింగ్ బ్యాక్ డ్రాప్ లో మంచి లైన్ రాసుకుని… అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే స్థాయిలో మూవీని తెరకెక్కించాడు. సాలిడ్ ఎమోషన్స్ తో తెరకెక్కిన క్లాప్ చిత్రానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సరదాగా సోనీ లివ్ లో చూసి ఆనందించండి. డోంట్ మిస్ ఇట్..!!!రేటింగ్: 3.25

పంచ్ డైలాగులు… కామెడీ సీన్స్ తో నవ్వించే “ఊరికి ఉత్త‌రాన‌”

సరదాగా సాగిన “ఊరికి ఉత్త‌రాన‌”

గ్రామీణ వాతావరణం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి… బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. నేటికీ ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ తో సినిమాలు వస్తూనే వున్నాయి. గ్రామీణ జీవితం, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు… వాటి వ్యవహారాలను బేస్ చేసుకొని వెండితెరపై కొత్త కొత్త కథలు ఆవిష్కృతమవుతూనే ఉన్నాయి… నరేన్ హీరోగా పరిచయం అవుతూ అతని సరసన దీపాలి శర్మ అనే అమ్మాయిని హీరోయిన్ గా నిర్మించిన చిత్రం ఊరికి ఉత్తరాన.

ఈ చిత్రాన్ని ఈగల్ ఐ ఎంటైర్ టైన్మెంట్స్  బ్యానర్ పై వనపర్తి వెంకటయ్య , రాచాల యుగంధర్ సంయుక్తంగా నిర్మించారు. సతీష్ అండ్ టీమ్ దర్శకత్వం వహించారు. ఇతర పాత్రల్లో రామరాజు, మల్లేశం ఫేం ఆనంద చక్రపాణి, ఫణి, జగదీష్ లు నటించారు. ఈ చిత్రం ఈరోజే విడుదల అయింది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ చిత్రం ఎలా ఆకట్టుకుందో చూద్దాం…

కథ: వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో శంకర్ పటేల్(రామరాజు) గ్రామ పెద్ద. ఆయన ప్రేమ వివాహాలకు దూరం. పెద్దలు కుదిర్చిన పెళ్లినే చేసుకోవాలని ఓ కట్టుబాటు విధిస్తాడు. దాన్ని అతిక్రమించిన వారిని తలకిందులుగా ఉట్టి కట్టి తలను పగలగొట్టి శిక్ష విధిస్తాడు. అలాంటి శంకర్ పటేల్ మేన కోడలు శైలు(దీపాలి శర్మ) పట్నంలో పాలిటెక్నిక్ చదువుతూ వుంటుంది. అదే గ్రామానికి చెందిన కరెంట్ రాజు(నరేన్) కూడా అదే కాలేజ్ లో చేరతాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టంగా వున్నా.. దాన్ని ఎప్పుడూ బర్గతపరచరు. కట్ చేస్తే.. వీళ్ళిద్దరూ హైదరాబాద్ లో చార్మినార్ చూడటానికి వస్తారు. అయితే హఠాత్తుగా శైలు ట్రైన్ లో తప్పిపోతుంది. మరో వైపు ఊళ్ళో వీళ్ళిద్దరూ లేచిపోయారనే పుకారు పుడుతుంది. మరి తప్పిపోయిన శైలు ఆచూకి లభించిందా? అలా ఎందుకు ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది? వీళ్ళకి శంకర్ పటేల్ ఎలాంటి శిక్ష విధించాడు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: విలేజ్ బ్యాక్ డ్రాప్ కథలకు ఇప్పిటికీ డిమాండ్ వుండనడానికి ఊరికి ఉత్తరాన సినిమా కథను బట్టే అర్థం అవుతుంది. ఎంత ప్రపంచం టెక్నాలజీ చుట్టూ తిరిగినా ఊళ్ళో కట్టు బాట్లు మారలేదని చెప్పడానికి దర్శకుడు సతీష్ ఎంచుకున్న కథ… దాన్ని నడిపించడానికి ఎంచుకున్న హీరో నరేన్, హీరోయిన్ దీపాలి శర్మల పాత్రలను చూస్తే తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగా రాసుకున్న స్క్రీన్ ప్లే సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే సాగిపోతుంది. సినిమా ఆద్యంతం హిలేరియస్ కామెడీ పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బ ఎంటర్టైన్ చేస్తుంది. ఎక్కడ బోరింగ్ లేకుండా రాసుకున్న సీన్స్ అన్నీ మంచి ఫీల్ గుడ్ అనిపిస్తాయి.

హీరో నరేన్ నటన అద్భుతంగా ఉంది. ఓ చిన్న సినిమాను తన నటనతో రెండు గంటలకు పైగా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం మామూలు విషయం కాదు. ఇటీవల ఎస్ ఆర్ కల్యాణ మండపంతో దూసుకొచ్చిన కిరణ్ అబ్బవరంలాగ… నరేన్ కూడా మంచి ఈజ్ ఉన్న నటుడని ఇందులో తనని చూస్తే తెలిసి పోతుంది. ఎక్కడా తొణకాకుండా… ఇంతకు ముందు ఓ పది పదిహేను చిత్రాలు చేసిన నటుడిగా తన హావభావాలతో మెప్పించారు. దీపాలి శర్మ అచ్చం తెలుగు అమ్మాయిలా గ్రామీణ యువతి పాత్రలో ఆకట్టుకుంది. గ్రామ పెద్దగా శంకర్ పటేల్ పాత్రలో రామరాజు ఎప్పటిలాగే అలరించారు. కట్టుబాట్లను అతిక్రమించిన వారు ఎంతటి వారైనా శిక్ష తప్పదనే గ్రామ పెద్ద పాత్రకు న్యాయం చేశాడు. కమెడియన్ ఫణి, ఆనంద్ చక్రపాణి, జగదీష్ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

దర్శకుడు సతీష్ అండ్ టీమ్ రాసుకున్న కథ, కథనాలు బాగున్నాయి. ఎక్కడా బోరింగ్ లేకుండా బాగా నవ్వించాడు. డైలాగ్స్ బాగున్నాయి. భీమ్స్ సంగీతం బాగుంది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ వాతావరణం, పట్టణ వాతావరణం బాగా చూపించారు. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్ చేసుంటే బాగుండు. నిర్మాత ఖర్చుకి వెనుకాడలేదని వరంగల్ సెట్ ని చూస్తే అర్థం అవుతుంది. సినిమా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మంచి పంచ్ డైలాగులతో బాగా నవ్విస్తుంది.

గో అండ్ వాచ్ ఇట్…!!!

రేటింగ్: 3.5

తెలంగాణ దేవుడు మూవీ రివ్యూ…

తెలంగాణ దేవుడు మూవీ రివ్యూ…

శ్రీకాంత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. జిషాన్‌ ఉస్మాన్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు సాగర్ శిష్యుడైన వడత్యా హరీష్ ఈ చిత్రానికి దర్శకుడు. మొహమ్మద్‌ జాకీర్‌ ఉస్మాన్‌ నిర్మాత. ఇందులో
సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం.

కథ:

చెప్పడానికి ఇది ఒక చరిత్ర. విజయ్ దేవ్ (జిషాన్ ఉస్మాన్, శ్రీకాంత్) చిన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఎలా నడిచింది? చదువుకునే టైమ్‌లో విజయ్ దేవ్ ఎలా ఉండేవాడు? అతను తెలంగాణ ఉద్యమం వైపు దారి తీయడానికి గల కారణాలేంటి? ఎలా విజయ్ దేవ్ ఉద్యమంలో అడుగుపెట్టి.. ఉద్యమ నాయకుడు అయ్యాడు? ఉద్యమ నాయకుడు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం అతను చేసిన ప్రయత్నాలేంటి? తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చింది? రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ దేవ్ బంగారు తెలంగాణను సాధించాడా? సమాధానాలన్నింటికి వివరణ ఇచ్చేదే ఈ చిత్రం .

కథనం విశ్లేషణ:

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రపై ఇప్పటి వరకు చాలా సినిమాలే వచ్చాయి. ఉద్యమం సమయంలో జగపతిబాబు ప్రధాన పాత్రలో ‘జై భోలో తెలంగాణ’ సినిమా వచ్చి మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఉద్యమం మీద ‘తెలంగాణ దేవుడు’ పేరుతో కేసీఆర్ జీవిత చరిత్రను బాల్యం నుంచి … ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగిన ప్రధాన ఘట్టాలు ఓ వైపు చూపుతూ… 1956లో ఆంధ్రప్రదేశ్ గా కొత్త రాష్ట్రం ఏర్పడిన దశాబ్దం తరువాత… మళ్లీ ప్రత్యేక తెలంగాణ కోసం 1969 లో మళ్ళీ ఉద్యమం మొదలు కావడం… లాంటి ఘట్టాలను… మరోవైపు చూపిస్తూ… ఎక్కడా బోరింగ్ లేకుండా దర్శకుడు సినిమాను తెరపై ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీని వదిలి… తెలంగాణ సాధన కోసం.. ఉద్యమ పార్టీని స్థాపించి… ఆ తరువాత రాజకీయ పార్టీగా తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీలను శాసించే స్థాయికి అంచెలంచెలుగా ఎదిగి… ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి.. రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి… బంగారు తెలంగాణ సాకారం ఎలా ఆవిష్కరించారు అనేదాన్ని చాలా చక్కగా చూపించారు. ప్రజల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలు… రైతులకోసం కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు… తదితర వాటిని హైలైట్ చేస్తూ తెరకెక్కించిన సీన్స్ అన్నీ ఎంతో ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి.

కేసీఆర్‌ చిన్నతనం నుంచి… తన కాలేజ్ లైఫ్, ఉద్యయం, సీఎం వరకు సాగే కథను కమర్షియల్ ఫార్మాట్ లో కేసీఆర్‌ జీవితాన్ని చాలా ఫ్రెష్‌గా చూపించారు. ఈ కథను… కేసీఆర్ ఇప్పటి జీవితానికి అనుగుణంగా రాసుకొని పాటలు, డ్యూయెట్ లతో ఓ కమర్షియల్ బయోపిక్‌లా తెరకెక్కించారు. కేసీఆర్ కి సాహిత్యం పట్ల అవగాహన ఉంది కనుకే జై బోలో తెలంగాణలో ఓ పాట కూడా రాసారు. ఆయన ఎక్కువగా సీనియర్ ఎన్ టి ఆర్, శోభన్ బాబు గారి సినిమాలు కూడా చూసి… వాళ్ళను అభిమానించారు కావున… ఆ కోణంలోనూ కొంత సినిమాటిక్ లిబర్టీతో ఇందులో కేసీఆర్ అండ్ వైఫ్ కాంబినేషన్లో పాటలు కూడా పెట్టి… ఆడియన్స్ ఎక్కడా డాక్యుమెంటరీ చూస్తున్న ఫీలింగ్ కలగనీయకుండా ఎక్కడ ఎమోషన్ ఉండాలి, ఎక్కడ కామెడీ ఉండాలి అని ఆలోచించి ఈ ప్రత్యేక కమర్షియల్ సీన్స్ ని క్రియేట్ చేసారేమో అనిపిస్తుంది. ఓవరాల్ గా తెలంగాణాకు కేసీఆర్ నిజంగానే ‘తెలంగాణ దేవుడు’ అయ్యాడు.

దర్శకుడు కథ రాసుకుంటున్నప్పుడే శ్రీకాంత్ ని కేసీఆర్ పాత్రకోసం ఎన్నుకోవడంతో… సగం సక్సెస్ సాధించి…. ఆ పాత్రను చాలా ఈజీగా తెరమీద చేయడంతో… పక్కా విజయం సాధించారు. హీరో శ్రీకాంత్ కేసీఆర్ పాత్రలో ఒదిగిపోయారు. ఇంతకు ముందు ఆయన ఎన్నో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చేశారు… కానీ ఈ సినిమా లాంటి పాత్ర చేయలేదు. చాలా డిఫరెంట్‌గా చేసి… మరోసారి తానేంటో నిరూపించారు..కేసీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించిన డెబ్యూ నటుడు జిషాన్ ఉస్మాన్ చక్కగా నటించారు. పర్ఫెక్ట్ హైట్, కలర్, బాడీ లాంగ్వేజ్ అన్నీ జిషాన్ ఉస్మాన్‌లో ఉండటంతో… ఈ సినిమాలో మంచి పాత్ర పోషించారు. కేసీఆర్ భార్య పాత్రలో సంగీత… కవిత పాత్రలో మధుమిత… హరీష్ రావు పాత్రలో అజయ్, ప్రొఫెసర్ జయశంకర్ పాత్రలో సుమన్, రాజశేఖర్ రెడ్డి పాత్రలో కాశీ విశ్వనాథ్, జగన్ పాత్రలో సునీల్, జానారెడ్డి పాత్రలో పృథ్వి… తదితరులు నటించి మెప్పించారు. ముఖ్యంగా రోశయ్య పాత్ర బాగా నవ్విస్తుంది.

దర్శకుడు హరీష్… కేసీఆర్ బయోపిక్ ని… ప్రేక్షకులకు నచ్చేవిధంగా కమర్షియల్ ఫార్మాట్ లో చక్కగా… బోరింగ్ లేకుండా.. ఎంతో ఎమోషనల్ గా వెండితెరపై ఆవిష్కరించి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం బాగా కుదిరింది. ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ముఖ్యంగా వివిధ పాత్రల కోసం ఎంపిక చేసుకున్న భారీ తారాగణం కోసం నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. చివరిగా.. తెలంగాణ దేవుడు… ఓ ఉద్యమ నాయకుడి విజయ యాత్ర… చూసి తీరాల్సిందే..!!!

రేటింగ్: 3.5

యదార్థ సంఘటనల “మిషన్ 2020”

యదార్థ సంఘటనల “మిషన్ 2020”

నవీన్ చంద్ర హీరోగా కరణం బాబ్జి దర్శకత్వంలో వచ్చిన సినిమా “మిషన్ 2020”. కుంట్లూర్ వెంకటేష్ గౌడ్ మరియు కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఏమాత్రం సందేశం ఇచ్చిందో చూద్దాం పదండి.
 
కథ : జయంత్ (నవీన్ చంద్ర) ఓ సిన్సియర్ సీరియస్ పోలీస్ ఆఫీసర్. నేరం రుజువు అయితే ఎన్ కౌంటర్ చేయడానికి కూడా వెనుకాడడు. అయితే మరోపక్క ప్రకాష్ అతని ముగ్గురు ఫ్రెండ్స్ గుడ్ స్టూడెంట్స్. కాలేజీలో టాపర్స్ కూడా. అయితే, నలుగురూ అశ్లీల వీడియోల మత్తులో పడి.. చదువు పై నిర్లక్ష్యం చేస్తారు. ఆ అశ్లీలతను చూసిన ఉద్రేకంలో అనుకోకుండా తమ స్నేహితురాలు స్వాతి పై వారు అత్యాచారం జరుపుతారు. దాంతో మంచి వాళ్ళుగా, మంచి విద్యార్థులుగా పేరు తెచ్చుకున్న ప్రకాష్ మరియు అతని ఫ్రెండ్స్ జీవితాలు ఎలా తారుమారయ్యాయి ? అసలు వీళ్ళను పోలీస్ ఆఫీసర్ జయంత్ (నవీన్ చంద్ర) ఎలా పట్టుకున్నాడు ? ఈ క్రమంలో జయంత్ ఏమి చేశాడు ? అసలు ప్రకాష్, అతని ఫ్రెండ్స్ అత్యాచారం చేయడానికి అసలు కారణం ఏమిటి ? చివరకు వాళ్లకు ఎలాంటి శిక్ష పడింది ? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే…!!!

కథ… కథనం విశ్లేషణ: మంచి మార్గంలో స్వేచ్ఛగా చైతన్యవంతులుగా ఎదగాల్సిన యువత… అశ్లీల వీడియోల మత్తులో పడి తమ బతుకును ఎలా దుర్భరం చేసుకుంటున్నారనే కోణంలో సందేశాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా.. మెసేజ్ పరంగా ఆకట్టుకుంది. ఆకట్టుకునే కథ… కథనాలు, మెప్పించే సన్నివేశాలు, బలమైన పాత్రలు… సినిమా కి బాగా ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలో సగటు ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే అంశాలు చాలా వున్నాయి. యదార్ధ సంఘటనల ఆధారంగా సమకాలీన రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో మంచి సందేశంతో పాటు ఫాదర్ సెంటిమెంట్ మరియు శ్రీ రాపాక స్పెషల్ సాంగ్ వంటి అంశాలు ఆకట్టుకున్నాయి. ఇక చైతన్యంతో ఎదగాల్సిన యువత అశ్లీల వీడియోల మత్తులో పడి బతుకును ఎలా దుర్భరం చేసుకుంటుందనే కథాంశంతో వచ్చిన ఈ సినిమా సందేశం పరంగా మాత్రం నిజంగా స్ఫూర్తినిచ్చే సినిమానే.
ముఖ్యంగా అశ్లీల వీడియోల ప్రభావం కారణంగా తెలిసీ తెలియని వయసులో కొందరు ఎలా తమ జీవితాన్ని వృధా చేసుకుంటారో లాంటి అంశాలను కూడా చాలా ఎమోషనల్ గా చూపించారు. అలాగే సమాజం చుట్టూ ఉన్న పరిస్థితులను, జనం ఆలోచనా విధానాన్ని హైలైట్ చేస్తూ చెప్పడం కూడా బాగుంది. ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్ర‌లో నటించిన నవీన్ చంద్ర తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నాగ బాబు, జయ ప్రకాష్, సత్య ప్రకాష్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అదే విధంగా ఇతర కీలక పాత్రల్లో నటించిన సమీర్, చలాకి చంటి, మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు.
 మంచి మెసేజ్ తో కూడుకున్న కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు కరణం బాబ్జి, ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సన్నివేశాలను రాసుకొని సక్సెస్ అయ్యారు. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. ర్యాప్ రాక్ షకీల్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ఐటెం సాంగ్ యూత్ ని అలరిస్తుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు సినిమాకి తగ్గట్టు బాగానే ఖర్చు పెట్టారు. మూవీ క్వాలిటీగా ఉంది. గో అండ్ వాచ్ ఇట్…

రేటింగ్: 3.5/5

1 2