అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ‘క్లాప్’…

స్పోర్ట్స్ బ్యాక్క్సఫీస్ ను బద్దలు కొట్టాయి. అందుకే నిర్మాతలు ఇలాంటి కథలను తెరకెక్కించే దర్శకులను ఎంచుకొని మంచి ఇంస్పైరింగ్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘క్లాప్’ ఇలాంటి స్టోరీతోనే తెరకెక్కింది. ఇది సోనీ లివ్ (ఓటిటి)లో ఈరోజే ఎక్స్ క్లూజివ్ గా రిలీజ్ అయింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఏమాత్రం ఆకట్టుకుందో చుద్దాం పదండి. కథ: విష్ణు (ఆది పినిశెట్టి) రన్నింగ్ రేస్ లో ఒక తిరుగులేని ఛాంపియన్. హాకీ ప్లేయర్ అయిన మిత్ర(ఆకాంక్ష సింగ్) విష్ణుని ప్రేమిస్తుంది. కానీ ఓరోజు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో తన కాలిని కోల్పోయి.. స్పోర్ట్స్ కి దూరం అవుతాడు విష్ణు. అయినా మిత్ర విష్ణుని వివాహం చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత వైవాహిక జీవితంలో ఏమాత్రం ఆసక్తి లేకుండా ఓ ఉద్యోగం చేస్తూ బతుకుతాడు విష్ణు. మరి ఈ క్రమంలో తనకి ఓ స్టేట్ లెవెల్ మహిళా రన్నర్ భాగ్యలక్ష్మి(కృష్ణ కురూప్) అనే అమ్మాయికి కోచ్ గా మారే పరిస్థితి ఏర్పడుతుంది. మరి తన జీవితంలో వచ్చిన ఈ మలుపుతో విష్ణు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటాడు? నేషనల్ ఛాంపియన్ అవ్వాలనుకున్న తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు? అనేది తెలియాలి అంటే ఈ సినిమాని సోనీ లివ్ లో చూడాల్సిందే.కథ.. కథనం విశ్లేషణ: స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో చాలా కథలను వెండితెరపై ఆవిష్కరించారు. ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. ఇప్పుడు ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి.. కూడా అలాంటి కథనే ఎంచుకుని ‘క్లాప్’మూవీతో మన ముందుకు వచ్చాడు. ఇది వరకు మనం చూసిన పలు స్పోర్ట్స్ డ్రామాస్ తరహాలోనే ఈ సినిమా కూడా కొన్ని ఇంప్రెసివ్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ తో కూడి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఆది తనకి వచ్చిన ఈ సరికొత్త పాత్రని చాలా బాగా చేసాడు. అథ్లెట్ గా… తర్వాత తన లైఫ్ మారిపోయిన యువకుడిగా… రెండు షేడ్స్ లో మంచి నటనని కనబరిచాడు. కాలు పోగొట్టుకొని… ఓ డిజార్డర్ తో విపరీతంగా బాధపడే యువకుని పాత్రలో మెప్పించాడు. భాగ్యలక్ష్మిగా కనిపించిన కృష్ణ కురూప్ మంచి నటనను కనబరిచింది. ఇక ఈ సినిమాలో మరో హైలైట్ సీనియర్ నటుడు నాజర్. చాలా కాలం తర్వాత తనలోని విలనిజాన్ని సాలిడ్ గా చూపించారు. స్పోర్ట్ కి సంబంధించి ఎలాంటి పాలిటిక్స్ ఉంటాయి, ప్లేయర్స్ పరంగా ఎదురయ్యే ఇబ్బందులను ఇందులో చూపించిన విధానం బాగుంది. ఇంకా ఆకాంక్ష సింగ్, మైమ్ గోపి తదితరులు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. స్పోర్ట్స్ డ్రామాలో వుండే మంచి ఇన్ స్పైర్ చేసే సన్నివేశాలు.. డైలాగ్స్ అన్నీ ఉన్నాయి. దాంతో సినిమా మరింత ఆసక్తి కరంగా ఉంటుంది. కథనంలో మరింత మంచి డ్రామా ప్లే చేయడంలో దర్శకుడు విజయం సాధించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ… సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా కంపోజ్ చేయడం బాగుంది. అలాగే ఇళయరాజా సంగీతం మంచి ఎఫెక్టివ్ గా ఉందని చెప్పాలి. అలాగే ఎడిటింగ్ కూడా బాగుంది. ఇంకా నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు పృద్వి ఆదిత్య రన్నింగ్ బ్యాక్ డ్రాప్ లో మంచి లైన్ రాసుకుని… అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే స్థాయిలో మూవీని తెరకెక్కించాడు. సాలిడ్ ఎమోషన్స్ తో తెరకెక్కిన క్లాప్ చిత్రానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. సరదాగా సోనీ లివ్ లో చూసి ఆనందించండి. డోంట్ మిస్ ఇట్..!!!రేటింగ్: 3.25