కొత్త ఫ్రాగ్రాన్స్ కలెక్షన్ డ్రీమ్ బ్రైట్‌ను విడుదల చేసిన బాత్ అండ్ బాడీ వర్క్స్..
తెలుగు సూపర్ న్యూస్ హైదరాబాద్, ఫిబ్రవరి 23, 2023: అమెరికాలో ఎక్కువ మంది అభిమానించే ఫ్రాగ్రాన్స్‌లకు నిలయమైన బాత్ అండ్ బాడీ వర్క్స్ తమ నూతన కలెక్షన్, డ్రీమ్ బ్రైట్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ప్రకాశవంతమైన, మరుపురాని,సాహసోపేతమైన, ఫ్లోరల్ -ఫ్రూటీ సువాసన కలను సాకారం చేస్తూ, సఫైర్ బెర్రీలు, రాత్రిపూట వికసించే ఆర్చిడ్‌లు, క్రిస్టలైజ్డ్ వనీలా వినూత్న సమ్మేళనంగా మలిచింది.
డ్రీమ్ బ్రైట్ విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తుంది. వీటిలో ఫైన్ ఫ్రాగ్రాన్స్ మిస్ట్, యూ డీ పెర్‌ఫ్యూమ్, బాడీ క్రీమ్, బాడీ లోషన్, హ్యాండ్ క్రీమ్, 3 విక్ క్యాండిల్, గ్లోయింగ్ బాడీ స్క్రబ్, షవర్ జెల్, మాయిశ్చరైజింగ్ బాడీ వాష్ ఉన్నాయి.
బాత్ అండ్ బాడీ వర్క్స్ తాజా కలెక్షన్, డ్రీమ్ బ్రైట్, వినూత్న పరిమళాల సమ్మేళనం. దీనికి తగినట్లుగా అత్యద్భుతమైన ప్యాకేజింగ్‌లో దీనిని అందిస్తున్నారు. ఇది ప్రకాశవంతంగా, మెరుస్తున్నట్లుగా ఉంటుంది. బ్రాండ్ ప్రస్తుత పోర్ట్‌ఫోలియోకు తాజా జోడింపు ఇది.
బ్రాండ్ ప్రస్తుత జాబితాలో అత్యుత్తమ విక్రయాలు జరుపుకుంటున్న ఫ్రాగ్రాన్స్ అయిన గింఘమ్, ఏ థౌజెండ్ విషెస్, అరోమా థెరఫీ, ఇన్ ద స్టార్స్ మరియు దశాబ్దాలుగా వినియోగదారులు అమితంగా ఇష్టపడుతున్న జపనీస్ చెర్రీ బ్లూసమ్ ఉన్నాయి.
ఈ మృదువైన స్క్రబ్ , చర్మాన్ని మృదువుగా మారుస్తూనే ప్రకాశవంతంగా, ఆరోగ్యవంతంగా కనిపించే చర్మాన్ని బహిర్గతం చేస్తుంది. ఖచ్చితమైన స్వీయ సంరక్షణ బహుమతిగా డ్రీమ్ బ్రైట్ బబుల్ బాత్ నిలుస్తుంది. షియా బటర్, కోకోవా బటర్‌తో తయారుచేసిన ఈ మహోన్నత క్రీమీ ఫోమ్ మీ చర్మాన్ని సువాసనలు వెదజల్లేలా ఎక్కువ కాలం నిలిచి ఉండే, అలా్ట్ర పాంపరింగ్ బుడగలతో ఆవరిస్తుంది.
తల నుంచి పాదాల వరకూ సువాసన..
విప్డ్ గ్లో–టియన్ అండ్ డైమండ్ షిమ్మర్ మిస్ట్ వంటి పరిమిత ఎడిషన్ స్పార్ల్కర్స్‌తో సహా అద్వితీయమైన సువాసలనలను ఆస్వాదించడానికి డ్రీమ్ బ్రైట్ గతంలో కంటే మరిన్ని మార్గాలను కలిగి ఉంది. హైలురోనిక్ యాసిడ్, ప్రయోజనాలతో నింపిన ఈ ఉత్పత్తులు మీ చర్మానికి తాజా , పోషణతో కూడిన, ఆహ్లాదకరమైన సువాసనల అనుభవాలను అందిస్తాయి.
బాత్ అండ్ బాడీ వర్క్స్ ప్రత్యేకమైన ఫ్రాగ్రాన్స్ డ్రీమ్ బ్రైట్ కలెక్షన్, నూతన రూపాలను సైతం పరిచయం చేసింది. వీటిలో ఈయూ డీ పర్‌ఫ్యూమ్, గ్లోయింగ్ బాడీ స్క్రబ్, బబుల్ బాత్ ఉన్నాయి. ఈయూ డీ పర్‌ఫ్యూమ్‌ను అత్యధిక గాఢత కలిగిన సువాసనల నూనెలతో తయారు చేశారు.
ఈ కారణం చేత ఈ పెర్‌ఫ్యూమ్ మరింత సుదీర్ఘకాలం పాటు ఉండేలా అత్యుత్తమ, విలాసవంతమైన రీతిలో సువాసనలను అందిస్తుంది. నూతన గ్లోయింగ్ బాడీ స్క్రబ్‌తో ప్రకాశవంతమైన చర్మం సాధ్యమవుతుంది. దీనిని మెరుగైన ప్రకాశాన్ని అందించే రీతిలో షియా బటర్, విటమిన్ ఈ వంటి పదార్ధాలతో చేశారు.