హైదరాబాద్‌లో తమ సరికొత్త షోరూమ్‌ని ప్రారంభించిన లగ్జరీ రీటైలర్‌లో అగ్రగామి అజా ఫ్యాషన్స్..!
తెలుగు సూపర్ న్యూస్,ఫిబ్రవరి 10, 2023: ఇండియన్ ఫ్యాషన్ రంగంలో అగ్రగామిగా పేరుంది అజా ఫ్యాషన్స్‌కి. మోడ్రన్ లగ్జరీ సర్వీసులలో అత్యుత్తమంగా పేరు తెచ్చుకున్న అజాను డాక్టర్ అల్కా నిషార్ 2005లో ప్రారంభించారు. ఇప్పుడు ఇండియాలో లీడింగ్ ఫ్యాషన్ అథారిటీగా వెలుగుతోంది అజా. ముంబై, ఢిల్లీలో ఇప్పటికే పలు స్టోర్‌లున్నాయి అజాకి. తాజాగా హైదరాబాద్‌లో సరికొత్తగా స్టోర్‌ని ప్రారంభించింది. భాగ్యనగర వాసులకు సరికొత్త షాపింగ్ ఎక్స్ పీరియన్స్ అందించడానికి అజా కృషి చేస్తోంది. వినియోగదారుల సంతృప్తి, వ్యక్తిగతమైన సేవలలో అత్యుత్తమ ప్రతిభ, అనితరసాధ్యమైన శ్రద్ధను కనబరుస్తుంది అజా.
అజా హైదరాబాద్ స్టోర్‌ని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఫిలాన్‌థ్రాఫిస్ట్ పింకీ రెడ్డి స్వర్ణహస్తాలతో ప్రారంభించారు. అజా వ్యవస్థాపకుడు, ఛైర్‌పర్సన్ డాక్టర్ అల్కా నిషార్ అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించారు. మేనేజింగ్ డైరక్టర్ దేవాంగి పరేఖ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకకు మరిన్ని వెలుగులు అద్దారు మిల్కీబ్యూటీ తమన్నా భాటియా. ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు తమన్నా. ప్రముఖ డిజైనర్లు నుపూర్ కనోయ్, మయూర్ గిరోత్రా, రితికా మిర్చందని, షాహిల్ అనేజా, ధ్రువ్ వెయిష్, శ్రియా సోమ్ ఈ వేడుకలో పాలుపంచుకున్నారు.
”మా టాప్ డొమెస్టిక్ ఆన్‌లైన్ మార్కెట్స్ లో హైదరాబాద్‌కి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఇక్కడ ఆఫ్‌లైన్ స్టోర్‌ని ఏర్పాటు చేశాం. భాగ్యనగరానికి ఉన్న పొటెన్షియల్ గురించి మాకు ప్రత్యేకంగా తెలుసు. దాదాపు నాలుగు ఫ్లోర్లలో 12వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మా అజా బంజారా హిలస్ స్టోర్ చూపరులను ఇట్టే ఆకర్షిస్తోంది. డిజైనర్ల పరిశీలనాత్మక కలెక్షన్లతో పాటు, ప్రామినెంట్ బ్రాండ్‌లు అన్నిటినీ ఒకే గొడుగుకింద తీసుకురావడమే మా అజా కలెక్షన్ ముఖ్యోద్దేశం” అని అన్నారు azafshions.com మేనేజింగ్ డైరక్టర్ దేవాంగి పరేఖ్.
ప్రముఖ డిజైనర్లు అనామికా ఖన్నా, రిధి మెహ్రా, పాయల్ సింఘాల్, వరుణ్ బాహ్ల్, గౌరీ నిహారిక, రింపుల్, హర్‌ప్రీత్ నరుల, రోహిత్ గాంధీ + రాహుల్ ఖన్నా, షెహ్లా ఖాన్, సురిలీ గోయెల్ లో పాటు ఎంతో మంది జాగ్రత్తగా ఎంపిక చేసినవాటిని వినియోగదారులకు అందుబాటులో ఉంచాం. ఎస్టాబ్లిష్డ్ పేర్లతో పాటు, వృద్ధిలోకి వస్తున్న ఎందరో ప్రతిభావంతులను ప్రోత్సహించడంలోనూ ముందంజలో ఉంది అజా. భాగ్యనగర వాసులకు ఎక్స్‌క్లూజివ్ డిజైనర్ వేర్ రేంజ్‌ని, యాక్సెసరీస్‌ని, ఆభరణాలను అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది అజా.
ప్రముఖ ఫ్యాషన్ అథారిటీ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండింటిలోనూ తనదైన ప్రత్యేకతతో విరాజిల్లుతోంది. www.Azafashions.comని 2015లో దేవాంగి పరేఖ్ ప్రమోట్ చేశారు. ఈ కామర్స్ స్టోర్‌ని గ్లోబల్ వెబ్ ప్లాట్‌ఫార్మ్ గా ప్రారంభించారు. వినియోగదారులు కోరుకున్నవి ప్రపంచంలో ఎక్కడున్నా అందుబాటులోకి తెచ్చే సౌలభ్యాన్ని కలిగిస్తోంది ఈ స్టోర్. ప్రీమియర్ మల్టీ డిజైనర్ ఆన్‌లైన్ పోర్టల్ లో లగ్జరీ అప్పీల్ ఉన్న యాక్సెసరీస్‌లు అందుబాటులో ఉన్నాయి. వెయ్యిమందికి పైగా గుర్తింపు పొందిన ప్రతిభావంతులైన డిజైనర్లు పనిచేస్తున్నారు.