“దృఢసంకల్పం, ఆత్మవిశ్వాసం,”ఉన్నచోట తప్పక విజయం ఉంటుంది..

తెలుగు సూపర్ న్యూస్, నవంబర్ 20,2023: “దృఢసంకల్పం, తరగనిఆత్మవిశ్వాసం, బలమైనకోరిక “ఉన్నచోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. అటువంటి విజయాన్ని చేరుకున్న రోజు ఈరోజు.

అదే పల్లవి మోడల్ స్కూల్ బోడుప్పల్ లో డిజిజ్ఞాన్ అనే కార్యక్రమం విజయవంతంగా ముగించిన రోజు.యువ ఆవిష్కర్త లైన మానస రెడ్డి ,నఫీసా అంజి వీరి నూతన ఆలోచన ద్వారా గ్రామాలలో నిబాలి కలకు కంప్యూటర్ ఉపయోగాల గురించిజ్ఞానాన్ని కల్పించారు.

దాని కోసం చుట్టు పక్కల నగల గ్రామాలలో గల 10 ప్రభుత్వ పాఠశాలలు,1 ప్రైవేట్ పాఠశాలను ఎంపిక చేశారు.ఆపాఠశాలలోచదువుకునే570 ప్రభుత్వ విద్యార్థులకు,250 ప్రైవేటు విద్యార్థులకు ఈఅవకాశం కల్పించారు.

ఈ రోజు వారి శిక్షణను పూర్తిచేసుకొనిన సందర్భముగా నవంబర్ 14న పల్లవి మోడల్ స్కూల్ బోడుప్పల్ లోడిజిజ్ఞాన్ గ్రాడ్యుయేషన్ రోజును ఘనంగా నిర్వహించారు.

దీనికి ముఖ్య అతిథులుగా ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్శ్రీ జయేష్ రంజన్ గారు, వి హబ్ సి.ఇ.ఒ దీప్తి రావుల గారు, కోర్దినేటర్ తాజ్ గారు, పల్లవి గ్రూప్ఆఫ్స్కూల్స్‌ చైర్మన్‌ కొమురయ్య గారు, పల్లవి గ్రూప్స్‌ ఆఫ్ స్కూల్స్‌ అకాడమిక్ డెరెక్టర్‌ డా.సుధ గారు పాఠశాలడైరెక్టర్శ్శీల్కు మార్గారు,పాఠశాల ప్రిన్సిపల్ తనూజ గారు హాజరయ్యారు.

కార్యక్రమాన్నిముందుగాదీపప్రజ్వలనంతోప్రారంభించారు.అథితులకు స్వాగతం పలుకుతూ స్వాగత నృత్యాన్ని ప్రదర్శించారు. ఈసందర్భంగా శ్రీ సుశీల్ కుమార్ గారు మాట్లాడుతూ ఇలాంటి కొత్త ఆవిష్కరణ చేయటానికి వయసుతో నిమిత్తం లేదని ఆలోచన ప్రధానమని తెలిపారు.

ఈకార్యక్రమానికి వచ్చిన బాలికలందరినీ కొత్త ఆలోచనలు చేసేలా ఉత్సాహ పరిచారు.ఈ కార్యక్రమాన్ని గురించి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ముఖ్యఅతిథులు జయేష్ రంజన్ గారు మాట్లాడుతూ చిన్నారులందరికీ బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుత సమాజంలో సాంకేతిక విజ్ఞానం,అవగాహన ఎంతో అవసరమని తెలిపారు. పల్లవి మోడల్ స్కూల్ విద్యార్థులైన మానస, నఫీసా తలపెట్టిన పనిని కొనియాడారు. ఏ పాఠశాల కూడా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేపట్టలేదని పల్లవి మోడల్ స్కూల్ ను ప్రశంసించారు.

అంతేకాక ఈ కార్యక్రమం ఇంతటితో ఆగకూడదని మరింత ఎక్కువ మంది విద్యార్థులకు సాంకేతిక విషయాలపట్ల అవగాహన కలిగించాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిద్వారా కూడా విద్యార్థులకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తానని తెలియజేశారు.

ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ డిజిజ్ఞాన్ అనేతరగతులలో వారు సైబర్ నేరాలు అరికట్టడం, M.S ఆఫీస్ ఉపయోగాలు మొదలైన వాటి గురించి తాము ఎంతో జ్ఞానాన్ని సంపాదించామని తెలియజేస్తూ, సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Leave a Reply