తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లో ఐదు నూతన టచ్‌పాయింట్‌లను ప్రారంభించిన ఫోక్స్‌ వేగన్ ఇండియా

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్,ఆగష్టు 30,2023: తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్‌లలో ఐదు కొత్త టచ్‌పాయింట్‌ల ప్రారంభోత్సవాన్ని ఫోక్స్‌ వేగన్ ఇండియా ప్రకటించింది, తద్వారా వినియోగదారులకు అసాధారణమైన & అనుకూలమైన సర్వీస్ ఆఫర్‌లతో పాటు ప్రీమియం జర్మన్-ఇంజనీరింగ్ & సురక్షితమైన ఉత్పత్తులను అందించడంలో కంపెనీ నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఈ ఔట్ లెట్ల ప్రారంభోత్సవం బ్రాండ్ ,నెట్‌వర్క్ విస్తరణకు అనుగుణంగా దాని ప్రపంచ-స్థాయి ఉత్పత్తులు, సేవలను వినియోగదారులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఉంది.

పిపిఎస్ మోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజీవ్ సంఘ్వీ , అత్యున్నత నాయకత్వంలో నిర్వహించబడుతున్న కొత్తగా ప్రారంభించబడిన టచ్‌పాయింట్‌లు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లోని అధిక సంభావ్య ప్రాంతాలలో ఉన్నాయి. 250+ కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో కూడిన బలమైన బృందంతో, నైపుణ్యం, శిక్షణ పొందిన సేల్స్ & సర్వీస్ బృందం ఇప్పటికే ఉన్న , సంభావ్య కస్టమర్‌ల అవసరాలను తీరుస్తుంది.


ఫోక్స్‌ వేగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ శ్రీ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, “ఫోక్స్‌ వేగన్ ఇండియాలో మేము చేసే ప్రతిదానికీ కస్టమర్-కేంద్రీకృత విధానం ప్రధానం గా ఉంటుంది. ఈ టచ్‌పాయింట్‌ల ప్రారంభోత్సవం తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్‌లోని మా కస్టమర్‌లకు మమ్మల్ని మరింత చేరువ చేస్తుందని మేము నమ్ముతున్నాము. ఈ రెండు రాష్ట్రాలు తమ ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సాంకేతిక శక్తి, ప్రీమియం ఆటోమొబైల్స్‌ పరంగా చక్కటి అభివృద్ధి సాధించాయి. ఫోక్స్‌ వేగన్ వంటి ప్రీమియం బ్రాండ్‌ను ఈ ప్రాంతంలోని కస్టమర్‌ల కోసం అందించటం, ఈ ప్రాంతం లో ప్రాధాన్యతా మొబిలిటీ భాగస్వామిగా నిలపటం లో గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తోంది” అని అన్నారు.


పిపిఎస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజీవ్ సంఘ్వి మాట్లాడుతూ, “ఫోక్స్‌ వేగన్ తో మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం మాకు ఆనందంగా ఉంది. ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా 5 షోరూమ్‌లను ప్రారంభిస్తున్నాము. దీనితో మా నెట్‌వర్క్ 23 సేల్స్, 11 సర్వీస్ ఔట్లెట్స్ గా విస్తరించి ఉంది. ఇవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్ & అస్సాం రాష్ట్రాల్లో వున్నాయి. మేము ఫోక్స్‌ వేగన్ తో సుదీర్ఘమైన, ఫలవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించాము, ఈరోజు ఫోక్స్‌ వేగన్ తో 15 సంవత్సరాల అనుబంధాన్ని వేడుక చేసుకుంటున్నాము. మేము ఫోక్స్‌ వేగన్ తో పని చేయడానికి,ఎదగడానికి ఎదురుచూస్తున్నాము ” అని అన్నారు.

బంజారాహిల్స్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, కర్నూలు, అనంతపురంలో ఈ కొత్త టచ్‌పాయింట్లు ఉన్నాయి. ఈ కొత్త ప్రారంభోత్సవాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మొత్తం నెట్‌వర్క్ బలం 24 సేల్స్, 13 సర్వీస్ అవుట్‌లెట్‌లకు చేరుకుంది. భారతదేశం అంతటా, వోక్స్‌వ్యాగన్ 136 నగరాల్లో 184 సేల్స్ , 131 సర్వీస్ అవుట్‌లెట్‌లతో తన వినియోగదారులకు చేరువవుతోంది.
ఫోక్స్‌ వేగన్ ఉత్పత్తులు, సేవల గురించి మరింత సమాచారం కోసం, కస్టమర్‌లు వారి సమీప ఫోక్స్‌ వేగన్ షోరూమ్ లేదా ఫోక్స్‌ వేగన్ ఇండియా వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


కొత్తగా ప్రారంభించిన ఫోక్స్‌ వేగన్ టచ్‌పాయింట్లు:
ఫోక్స్‌ వేగన్ హైదరాబాద్ 403, అశోక క్యాపిటల్, ప్లాట్ నెం. 89 & 90, షేక్‌పేట్ విలేజ్, రోడ్ నెం. 2, బంజారా హిల్స్, హైదరాబాద్, తెలంగాణ – 500045.
ఫోక్స్‌ వేగన్ సికింద్రాబాద్ కె ఎల్ టవర్స్, రామకృష్ణాపురం, మల్కాజిగిరి మండలం, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా, తెలంగాణ – 500056
ఫోక్స్‌ వేగన్ కూకట్‌పల్లి భవ్యాస్ అఖిల ఎక్సోటికా, గ్రౌండ్ ఫ్లోర్, బ్లాక్ # 2, హైదర్‌నగర్ గ్రామం, కూకట్‌పల్లి, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, తెలంగాణ – 500072
ఫోక్స్‌ వేగన్ కర్నూల్ ప్లాట్ నెం.16/A, N.H.7, సంతోష్ నగర్, టాటా కార్ షో రూమ్ పక్కన, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ – 518003
ఫోక్స్‌ వేగన్ అనంతపూర్ NH-44, నీలం రాజశేఖర్ రెడ్డి కన్వెన్షన్ సెంటర్ పక్కన, అనంతపురం. ఆంధ్రప్రదేశ్ – 515002

Leave a Reply