క్రీమ్ స్టోన్ లో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ ఐస్ క్రీమ్స్..

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్, మే 8, 2023 : టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ కోల్డ్ స్టోన్ ఐస్ క్రీమ్ క్రియేషన్స్‌లో అగ్రగామిగా పేరుగాంచిన బ్రాండ్ క్రీమ్ స్టోన్ లో సందడి చేశారు. ఐస్ క్రీమ్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అందుకోసమే స్వయంగా సొంతంగా ఐస్ క్రీమ్ కాన్సెప్ట్‌ను సృష్టించారు. బ్రాండ్ క్రీమ్‌స్టోన్ దీనికి “విజయ్ దేవరకొండ క్రియేషన్” (వీడీసీ) అని పేరు పెట్టింది.

వీడీసీ అనేది మడగాస్కర్ ఐస్‌క్రీమ్, డార్క్ చాక్లెట్, రిచ్ చాక్లెట్, బాదం, జెమ్స్, బిస్కాఫ్, క్రంచీస్, ప్రలైన్, కోల్డ్ స్టోన్‌పై మిక్స్‌డ్, వంటివాటితోపాటు వీడీసీ కూడా అన్ని క్రీమ్‌స్టోన్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంటుంది.

తన పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ “దేవరకొండ బర్త్‌డే ట్రక్స్”ను ప్రారంభించారు. క్రీమ్‌స్టోన్ ఐస్ క్రీమ్ ద్వారా ప్రత్యేక ట్రక్కులు 8 నగరాల్లోని ఐస్ క్రీమ్ ప్రియులకు ఉచితంగా ఐస్ క్రీం పంపిణీ చేస్తాయి.

ఈ సందర్భంగా క్రీమ్‌స్టోన్ వీరేన్ షా ,అమ్రిష్ షా మాట్లాడుతూ.. “క్రీమ్‌స్టోన్‌లో ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ మా స్టోర్ ను సందర్శించినందుకు మేము సంతోషిస్తున్నాము, ఆయన ఐస్‌క్రీమ్ ప్రేమికుడు కావడంతో క్రీమ్‌స్టోన్‌లో మేము కొత్త కాన్సెప్ట్‌ను సృష్టించాము”అని అన్నారు.

“విజయ్ దేవరకొండ తన కాన్సెప్ట్‌ను క్రీమ్‌స్టోన్‌తో కలిసి రూపొందించారు, మేము ఈ కాన్సెప్ట్‌కు “విజయ దేవరకొండ క్రియేషన్స్” (VDC)” అని పేరు పెట్టాము, దానితో పాటు అందరి అభిమాన నటుడు “విజయ దేవరకొండ” పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము, ఈ సంవత్సరం విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఐస్ క్రీం ప్రియులకు, విజయ్ దేవరకొండ అభిమానులకు ట్రక్కుల కొద్దీ ఐస్ క్రీం పంపిణీ చేస్తున్నామని” చెప్పారు.

క్రీమ్‌స్టోన్ సీఈఓ శీతల్ పాటిల్ మాట్లాడుతూ “9 ట్రక్కులు 8 నగరాల మీదుగా వెళ్తాయి. అవి హైదరాబాద్‌లో 2, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, వైజాగ్, పూణె, ముంబై , విజయవాడలో ఉన్నాయి. వివిధ నగరాల్లోని అన్ని ట్రక్కులు క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అవుట్‌లెట్ల నుంచి ప్రారంభమవుతాయని పాటిల్ తెలిపారు.

“ఇది వేసవి కాలం కాబట్టి 8 నగరాల్లో ప్రసిద్ధ మ్యాంగో రష్ ఐస్ క్రీమ్‌లను క్రీమ్ స్టోన్ పంపిణీ చేస్తుంది. విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ట్రక్కులను ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ట్రక్కులు మే9 భారతదేశంలోని 8 నగరాల్లో ఐస్ క్రీమ్‌లను పంపిణీ చేస్తాయి.

క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్‌లు 100శాతం ప్యూర్ వెజిటేరియన్ ఐస్ క్రీమ్‌లు. బ్రాండ్ ఫ్రెష్ ఫ్రూట్ ఐస్ క్రీమ్‌లు, చాక్లెట్ ఆధారిత ఐస్ క్రీమ్‌లు, నట్స్ ఆధారిత ఐస్ క్రీమ్‌లు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు షుగర్ ఫ్రీ, తక్కువ కేలరీల ఐస్ క్రీమ్‌లు, ఐస్ క్రీమ్ పిజ్జాలు, ఐస్ క్రీమ్ మిల్క్ షేక్స్,థిక్ షేక్స్, వాఫ్ఫల్స్ & ఐస్ క్రీమ్ కేకులు, కాన్సెప్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.

Leave a Reply