గని సినిమా నుండి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ …

గని సినిమా నుండి మరో పోస్టర్ రిలీజ్ ...

మెగా హీరోల్లో వరుణ్ తేజ్ స్టోరీస్ సెలెక్షన్ చాలా విభిన్నంగా ఉంటుంది . రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ , కెరీర్ మొదటి నుంచి విభిన్నమైన స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో గా ఎదిగారు ..ముకుంద సినిమా తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన వరుణ్ తేజ్ , మొదటి సినిమా ఫలితం ఎలా ఉన్నా , ఈ సినిమాలో తన నటనకు , ప్రేక్షకుల్లో మంచి మార్కులు పడ్డాయి .. ఆరు అడుగుల అందగాడు , మంచి ఫిజిక్ , యాక్టింగ్ లో ఈజ్ కనపరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొని తనకంటూ అభిమానుల హృదయం లో మంచి స్థానం సంపాదించుకున్నారు .. పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి కావలిసిన లక్షణాలు అన్ని వరుణ్ తేజ్ కు ఉన్నాయి , కానీ ఒక్క సాలిడ్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నారు .. 2019 లో డైరెక్టర్ హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా ‘గద్దలకొండ గణేష్‌’ . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ , వరుణ్ తేజ్ యాక్టింగ్ , వరుణ్ తేజ్ లుక్స్ , మరియు కామిడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ అందుకుంది .. ‘గద్దలకొండ గణేష్‌’ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని “గని” మరియు ‘ఎఫ్ 3’ సినిమాలు చేస్తున్నారు ..మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా కోసం మెగా హీరో వరుణ్ తేజ్ చాలా స్పెషల్ గా విదేశాల్లో అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్స్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తుంది .. . కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమాను అల్లు బాబీ మరియు సిద్దు ముద్ద లు సంయుక్తంగా అల్లు అరవింద్ సమర్పణలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. గని సినిమాలో హీరోయిన్ గా వరుణ్ కు జోడీగా సాయి మంజ్రేకర్ నటించిన విషయం తెల్సిందే. గని సినిమా ను డిసెంబర్ 3న థియేటర్ల ద్వారా విడుదల చేస్తున్నారు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి , మోషన్ పోస్టర్ ,మరియు వరుణ్ తేజ్ కు సంబంధించి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా , హీరోయిన్ పోస్టర్ రిలీజ్ చేయలేదు , మొదటి మోషన్ పోస్టర్ లో వరుణ్ తేజ్ బాక్సింగ్ చేస్తున్నట్లు గా పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ , హీరోయిన్ కు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేయలేదు , అంతే కాకుండా ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సింగ్ పోస్టర్ కాకుండా సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్సమెంట్ చేస్తూ వరుణ్ తేజ్ , మరియు హీరోయిన్ సాయి మంజ్రేకర్ ఉన్న పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. మొత్తానికి వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా దీపావళి సందర్భంగా రెండో పోస్టర్ రిలీజ్ చేయడం , ఈ పోస్టర్ లో మెగా హీరో వరుణ్ తేజ్ పక్కన హీరోయిన్ సాయి మంజ్రేకర్ ,గులాబీ పూలు పట్టుకొని ,హీరో వరుణ్ తేజ్ పక్కన ఉండటం ఈ పోస్టర్ ని చూసి మెగా హీరోలు అందరూ సంతోషపడుతున్నారు …