2026 నాటికి 3000కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న వి-ట్రాన్స్

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 27, 2023: ప్రముఖ లాజిస్టిక్స్ సరఫరా సంస్థ, వి-ట్రాన్స్ (ఇండియా) రాబోయే మూడు సంవత్సరాలలో 3,000 కోట్ల టర్నోవర్ చేరుకోవాలనే తన ప్రణాళికను ప్రకటించింది. మొత్తం 600 వరకు ఉద్యోగావకాశాల సృష్టికి దారితీసే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లతో సహా దక్షిణ భారతదేశములో తన ఉనికిని విస్తరించడంపై సంస్థ దృష్టితో సమానంగా ఈ ప్రతిష్ఠాత్మకమైన లక్ష్యము ఉంది.

దక్షిణ భారతదేశములో లాజిస్టిక్స్ రంగము సామర్థ్యాన్ని పెంచే లక్ష్యము కలిగిన ప్రభుత్వ మౌలికసదుపాయాల సంకల్పము నుంచి ప్రయోజనం పొందడానికి వి-ట్రాన్స్ సెట్ చేశారు. ఇది రాబోయే 1-2 సంవత్సరాలలో సంస్థ ఉద్యోగావకాశాలను సృష్టిస్తుంది అని ఆశించబడుతోంది.

భారతదేశములో తయారీ రంగము ప్రాముఖ్యతను ఈ డిమాండ్ ను పూర్తి చేయుటకు భవిష్యత్ గిడ్డంగులను కొత్త శాఖలను నిర్మించడంలో పెట్టుబడిపెడుతోంది అని సంస్థ గుర్తించింది. భారతదేశపు విధానాలలో అత్యంత వేగంగా కీలకం అవుతున్న లాజిస్టిక్స్ రంగములో భవిష్యత్తు ఉందని వి-ట్రాన్స్ గమనించింది.

కొత్త శాఖలు దక్షిణ భారతదేశములోని ప్రధాన నగరాలు, పట్టణాలలో విస్తరిస్తాయి, ఇందులో హైదరాబాదు, బెంగళూరు కోయంబత్తూరు వంటి నగరాలు కూడా ఉన్నాయి. ఈ విస్తరణతో, వి-ట్రాన్స్ ఈ ప్రాంతములో లాజిస్టిక్స్, రవాణా సేవల కొరకు పెరుగుతున్న డిమాండ్ ను తీర్చడము, తన వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటిని అందిచడాన్ని లక్ష్యము కలిగి ఉంది.

వి-ట్రాన్స్ లో ఉత్తమమైన మౌలికసదుపాయాలు ఉన్నాయి.1000+ శాఖలు, 50+ ట్రాన్స్‎షిప్మెంట్స్ కేంద్రాలు,లొకేషన్ ట్రాకింగ్ సదుపాయము ఉన్న 2500 ఆధునిక ట్రక్కుల దళముతో దేశవ్యాప్తంగా తన ఉనికి కలిగి ఉంది. ఇది బ్యాక్ ఎండ్ లో ఉత్తమ ఈఆర్‎పితో అనుసంధానించబడి ఉంది. కార్గో కదలికల పూర్తి వీక్షణను అందిస్తుంది.

ఇటీవల జారీ చేయబడిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ పరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్తుంది అని ఆశించబడుతోంది వి-ట్రాన్స్ దీనిని అనుకూలపరచుటకు మంచి-స్థానములో ఉంది. లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించుట, లాజిస్టిక్స్ రంగము సామర్థ్యాన్ని మెరుగుపరచుట ఈ పాలసీ లక్ష్యము. మా హబ్ ట్రాన్స్‎షిప్మెంట్ కేంద్రాలు, శాఖలు, ఈ ప్రాంతములో వస్తువుల వేగవంతమైన , మృదువైన కదలికలను అనుకూలపరచుటకు రూపొందించబడి ఉంది.

ఈ నెట్వర్క్ కార్గోను ఏకీకృతం చేస్తుంది. రవాణా ప్రక్రియను స్ట్రీమ్ లైన్ చేయుటలో సహాయపడుతుంది. తద్వారా తగ్గిన రవాణా సమయము వ్యయము రూపములో వినియోగదారులు లాభపడతారు.

దక్షిణ ప్రాంతములో అన్ని లాజిస్టిక్స్ మరియు రవాణా అవసరాలను అందించుటలో వన్-స్టాప్ పరిష్కారాన్ని అందించడం,తన వినియోగదారులకు అసమానమైన సేవా నాణ్యత మరియు విశ్వసనీయతను అందించడము వి-ట్రాన్స్ లక్ష్యముగా కలిగి ఉంది. పోటీలో ముందు ఉండేందుకు కొత్త ఆవిష్కరణలు, సాంకేతికతలపై సంస్థ దృష్టి తోడ్పడింది.

లాజిస్టిక్స్ రంగములో నిరంతర పెట్టుబడి రాబోయే సంవత్సరాలలో సానుకూల ఫలితాలను అందిస్తుందని ఆశించబడుతోంది. వి-ట్రాన్స్ ఆరు దశాబ్దాలుగా అనేక పరిశ్రమ-ఆధారిత తయారీ క్లయింట్లకు సేవలు అందిస్తోంది. వివిధ సైజ్ ల,చిన్న, మధ్య లేదా పెద్ద తరహా క్లయింట్లకు లాజిస్టిక్స్ ఎడ్జ్ ను అందించుట ద్వారా సంస్థ తయారీ రంగానికి అనుకూలమైన పరిష్కారాలను అందిస్తుంది.

సర్క్యులర్ ఎకానమీని నిర్మించే దిశగా తన బాధ్యతను కూడా వి-ట్రాన్స్ అర్థంచేసుకుంటుంది. మెరుగైన పరిసరాల కొరకు పనిచేస్తుంది. వివిధ సంస్థలచే దీని ప్రయత్నాలు గుర్తించబడ్డాయి. అభినందించబడ్డాయి. పునరుద్పాదక శక్తి, మొక్కలు నాటడం, వెనుకబడిన వర్గాలలో విద్యాభ్యాసానికి సహకరించడము, పశు సంరక్షణ మొదలైన రంగాలలో ఈ సంస్థ ప్రయత్నాలు గుర్తించదగినవి.

మహేంద్ర షా, వి-ట్రాన్స్ (ఇండియా) లి. చైర్మన్, గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. “లాజిస్టిక్స్ రంగములో అభివృద్ధి సంభావ్యత గురించి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాము. ఈ రంగములో మా పెట్టుబడి మరియు భవిష్యత్ గిడ్డంగుల నిర్మాణము. పెరుగుతున్న తయారీ కార్యకలాపాలను అనుకూలపరచడముపై మా దృష్టి ప్రతిష్ఠాత్మకమైన మా అభివృద్ధి లక్ష్యాలను సాధించుటలో సహాయపడతాయి.”

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వి-ట్రాన్స్ (ఇండియా) లి. రాజేష్ షా మాట్లాడుతూ “సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , దక్షిణ ప్రాంతం రీజన్ ఇన్చార్జ్ గా, మా సంస్థ మొత్తం అభివృద్ధి ప్రణాళికలలో సహకారాన్ని దక్షిణ భారతదేశములో ఎక్కువ సంభావ్యతను చూడగలుగుతున్నాము. భారతదేశపు ఆలోచనలకు సాంస్కృతికంగా సమలేఖనమైన, ఒక ప్రక్రియ-ఆధారిత టెక్-ఆధారిత సంస్థ కావడము వలన, దక్షిణ భారతదేశములో మా నెట్వర్క్ ను బలోపేతం చేయడము అనేది మేము మా లక్ష్యాన్ని సాధించుటకు దోహదపడుతుంది.”అని అన్నారు.

Leave a Reply