‘ఇన్వెస్ట్‌ రైట్‌ ’ను ప్రారంభించిన అప్‌స్టాక్స్‌

Upstox

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్‌, 4 ఏప్రిల్‌ 2023 : భారతదేశంలో సుప్రసిద్ధ డిజిటల్‌ పెట్టుబడుల వేదికలలో ఒకటైన  అప్‌స్టాక్స్‌,  తమ నూతన ప్రచారం, ‘ఇన్వెస్ట్‌ రైట్‌’ను ప్రారంభించింది. మదుపరులు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, మరీ ముఖ్యంగా ఎందుకు పెట్టుబడులు పెట్టాలనేది తెలుసుకోవడంలో  సహాయపడుతుంది.

ఈ ప్రచారం, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)  నూతన సీజన్‌ ప్రారంభంతో పాటుగానే ప్రారంభమైంది. టాటా ఐపీఎల్‌ కు అధికారిక భాగస్వామి అప్‌స్టాక్స్‌.  ఈ ప్రచారంతో, అప్‌స్టాక్స్‌  భారతదేశం పెట్టుబడులు పెడుతున్న తీరును మార్చాలని కోరుకుంటుంది. ఈ పెట్టుబడులను సరళీకృతం చేయడంతో పాటుగా సహజసిద్ధంగా,అనుసంధానితంగా మారుస్తుంది. సరిగ్గా చెప్పాలంటే  గత దశాబ్ద కాలంలో  ఏ విధంగా భారత క్రికెట్‌కు నూతన దిశను ఐపీఎల్‌ ఏ విధంగా అందించిందో ఆ విధంగా !

తమ గత ఐపీఎల్‌ ప్రచారం ‘స్టార్ట్‌ కర్‌కే దేఖో’  ద్వారా భారతీయులను పెట్టుబడుల పరంగా తొలి అడుగు వేయమంది. ఈ సంవత్సర ప్రచారం ‘ఇన్వెస్టింగ్‌ రైట్‌’ (సరిగా పెట్టుబడులు పెట్టండి) దిశగా మార్చాము.  నేడు, మదుపరులు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు కానీ తరచుగా గందరగోళానికి గురవుతుంటారు. అందువల్ల వారికి సహాయపడేందుకు, అప్‌స్టాక్స్‌ ఇప్పుడు ఈ పెట్టుబడులను సరళీకృతం చేసేందుకు కృషి చేస్తుంది.

ఇండియా వృద్ధి చెందుతుందనే మహోన్నత నమ్మకం మరియు ఈక్విటీ పార్టిస్పేషన్‌తో భారతదేశపు వృద్ధి కథ నుంచి మరొకరు ప్రయోజనం పొందగలరు. అప్‌స్టాక్స్‌ అత్యంత కీలకమైన ప్రచారం, భారతదేశంలో ఒకరు  ఏ విధంగా పెట్టుబడులు పెట్టగలరనే  దానిపై దృష్టి సారిస్తుంది. మార్కెట్‌ పెర్‌ఫార్మెన్స్‌ అన్‌స్టాక్స్‌ను ట్రాక్‌ చేసే మార్గం ఇండెక్స్‌ ఫండ్స్‌కు వీరిని పరిచయం చేయడం ద్వారా అందుబాటు ధరలలో,  అత్యంత సులభంగా, దీర్ఘకాలిక పరిష్కారాన్ని ద్రవ్యోల్బణం అధిగమించడం , తమ సంపద వృద్ధి చేసుకోవడంపై అందిస్తుంది.

మ్యూచువల్‌ ఫండ్స్‌ లోపల ఒకరికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. అందువల్ల దీనిని మరింతగా సరళీకరించేందుకు , అప్‌స్టాక్స్‌ ఇప్పుడు వందలాది మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను వాటి రిస్క్‌ ,రివార్డ్‌ రేషియో ద్వారా పరిశీలించడంతో పాటుగా వాటి  నుంచి ఈ విభాగంలో అగ్రగామి ఫండ్స్‌ను ఎంపిక చేసి అందిస్తుంది. ఈ ప్రత్యేకంగా ఎంపిక చేసిన జాబితా ఫండ్స్‌, నిపుణుల విశ్లేషణతో ఈ బ్రాండ్‌ వినియోగదారులకు అత్యుత్తమ  యాప్‌ అనుభవాలను మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడుల కోసం అందిస్తుంది.  ఈ బ్రాండ్‌ ఇప్పుడు సమాచారం , పరిశోధనలను అందించడంతో పాటుగా మదుపరులకు పూర్తి సమాచారయుక్త నిర్ణయాలను సైతం అందిస్తుంది.

Upstox

ఈ ఫీచర్‌తో పాటుగా అప్‌స్టాక్స్‌ ఇప్పుడు భారతీయులకు పెట్టుబడుల పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడిస్తుంది.  ఉదాహరణకు, ఒకరు సిప్‌ను కేవలం 5వేల రూపాయలతో ప్రారంభిస్తే అది 12.5% రాబడిని అందించడంతో పాటుగా మార్కెట్‌లో 25 సంవత్సరాల పాటు పెట్టుబడులను పెడితే, వారి నగదు ఒక కోటి రూపాయలకు పెరిగే సామర్ధ్యం ఉంది. అది కాంపౌండింగ్‌ శక్తిని సైతం చూపుతుంది. ఇదే తరహాలో, అప్‌స్టాక్స్‌ ఇప్పుడు అతి సులభంగా అనుసరించతగిన ఇతర నిజాలను సైతం చూపుతుంది.  ప్రతి నిజంతోనూ, వారు వినియోగదారులు విజయవంతం కావడానికి చర్య తీసుకోతగిన దశలను అందిస్తారు. ఈ ప్రచార కాలమంతటా, అప్‌స్టాక్స్‌ వరుసగా పలు ఆన్‌లైన్‌, ఆఫ్‌ లైన్‌ అభ్యాస సదస్సులను మ్యూచువల్‌ ఫండ్స్‌, టెక్నికల్‌ ఎనాలిసిస్‌, ఆప్షప్‌ ట్రేడింగ్‌ మొదలైన వాటిపై అందిస్తుంది. దీనితో, అప్‌స్టాక్స్‌ వ్యక్తులకు, సంపూర్ణమైన, సమగ్రమైన  పెట్టుబడి విధానం అందించడంతో పాటుగా వారు అభ్యసించేందుకు, నిర్ణయాలను తీసుకునేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు మరియు అప్‌స్టాక్స్‌ అంతటా వాణిజ్యం చేసేందుకు అనుమతిస్తుంది.

ఈ సందేశాన్ని పూర్తిగా వ్యాప్తి చేసేందుకు, ఈ యాడ్‌ ప్రచారంలో ప్రతి రోజూ మనం చూసే క్యారెక్టర్స్‌ ఉంటాయి. ఉదాహరణకు, ఇద్దరు స్నేహితులు యుపీఐ వినియోగించి రోడ్‌సైడ్‌ కొబ్బరి బొండాల వ్యక్తులకు చెల్లింపు చేస్తారు. ఈ ప్రచారంలో ఈ సంఘటన (యుపీఐ చెల్లింపు) వినియోగించుకుని , ఇరు క్యారెక్టర్లు, వీక్షకులకు  భారతీయ ఆర్ధిక వృద్ధిలో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుపుతుంది.  అంతిమంగా మాత్రం భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి,  ఇండెక్స్‌ ఫండ్స్‌లో  పెట్టుబడులు పెట్టండి అని  ఆర్ధికంగా అవగాహన ఉన్న వ్యక్తి ద్వారా సందేశం ఇవ్వబడుతుంది. ఈ  వ్యక్తి ఆ తరువాత తనకు ఈ అవగాహనను అప్‌స్టాక్స్‌ అందించిందని, అందువల్ల సరైన ఎంపిక చేయగలిగానని వెల్లడించారు.

ఈ తరహా పరిస్థితిలతో ఈ క్యాంపెయిన్‌ అవగాహన , పరిగణన, పెట్టుబడిదారుల మధ్య బ్రాండ్‌ ప్రేమను సైతం పెంచుతుంది.

అప్‌స్టాక్స్‌, కో–ఫౌండర్‌, కవితా సుబ్రమణియన్‌  మాట్లాడుతూ ‘‘ మ్యూచువల్‌ ఫండ్స్‌ మదుపరులకు వారి పోర్ట్‌ఫోలియోను వైవిధ్యీకరించడానికి,ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాల వృద్ధి సామర్ధ్యంలో పాల్గొనడానికి  గొప్ప అవకాశాన్ని అందిస్తాయి.  భారతదేశ ఆర్థిక వృద్ధి , అభివృద్ధికి ఆర్థిక చేరిక చాలా అవసరమని మేము నమ్ముతున్నాము. అప్‌స్టాక్స్‌ వద్ద,  ప్రతి పెట్టుబడిదారునికీ నాణ్యమైన పెట్టుబడి సలహాలు, మార్గదర్శకాలు అందించాలనేది మా ఆకాంక్ష. ఈ దిశగా, మా నూతన ప్రచారంను భారతదేశంలో మరింత మంది ప్రజలకు సహాయపడటం ద్వారా  వారికి అవసరమైన సాధనాలు, వనరులు, మద్దతుతో పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి తగిన సహాయం అందించేలా రూపొందించబడింది.

భారతీయులందరికీ వారి ఆర్ధిక నియంత్రణకు అవసరమైన జ్ఞానం,విశ్వాసంతో సాధికారిత కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఆర్ధిక చేరికను ప్రోత్సహించడం,నాణ్యమైన పెట్టుబడి సలహాలను ఎక్కువ మందికి అందుబాటులో ఉంచడం ద్వారా మరింత సంపన్నమైన ఆర్థిక వ్యవస్ధను సృష్టించేందుకు సహాయపగలమని విశ్వసిస్తున్నాము’’ అని అన్నారు.

ఈ ప్రచారాన్ని 18–35 సంవత్సరాల వ్యక్తులను మరీ ముఖ్యంగా టియర్‌ 2, టియర్‌ 3 ప్రాంతాలలోని  వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్రచారాన్ని డిజిటల్‌, సోషల్‌, ప్రింట్‌తో సహా బహుళ మార్గాలలో అందించడంతో పాటుగా లక్ష్యిత విభాగాలలో  అవగాహన, పరిశీలనను పెంచడానికి ఆన్‌ గ్రౌండ్‌ యాక్టివేషన్‌తో మద్దతు ఇవ్వబడుతుంది.

Leave a Reply