మార్కెట్లోకి బీఎస్‌ 6స్టాండర్డ్స్ ఆటోమోటివ్‌ ఇంజిన్‌ ఆయిల్స్‌ను విడుదల చేసిన యునో మిండా

తెలుగు సూపర్ న్యూస్, విజయవాడ, మార్చి2, 2023: ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌(ఓఈఎం)లకు ప్రొప్రైయిటరీ ఆటోమోటివ్‌ పరిష్కారాల టైర్‌ వన్ సరఫరాదారు యునో మిండా, తమ బీఎస్‌ 6 స్టాండర్డ్స్ కలిగిన ఆటోమోటివ్‌ ఇంజిన్‌ ఆయిల్స్‌ను ద్విచక్ర వాహనాల కోసం విడుదల చేసింది. ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఇంధన సామర్థ్యం కలిగిన ఇంజిన్‌ ఆయిల్స్‌ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం కోసం ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటుగా తమ వినియోగదారుల మారుతున్న డిమాండ్‌ను సైతం తీర్చనుంది.

మరీ ముఖ్యంగా తమ వాహనాల కోసం అత్యధిక పెర్‌ఫార్మెన్స్‌ లుబ్రికెంట్ల కోసం వెదుకుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చనుంది. మూడు విభిన్నమైన గ్రేడ్లు మినరల్‌, సెమీ సింథటిక్‌, ఫుల్లీ సింథటిక్‌ లో విడుదల చేసిన ఈ ఆయిల్స్‌, అత్యధిక విస్కాసిటీ తో వైవిధ్యమైన లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇవి అత్యున్నతంగా ఇంజిన్‌కు రక్షణ అందించడంతో పాటుగా గణనీయంగా నిర్వహణ ఖర్చులను సైతం తగ్గిస్తాయి. తద్వారా ఇంజిన్‌ జీవిత కాలం కూడా పెరుగుతుంది.

యునోమిండా నుంచి అత్యున్నత నాణ్యత కలిగిన ఆటోమోటివ్‌ ఇంజిన్‌ ఆయిల్స్‌ను ‘పెర్‌ఫోమ్యాక్స్‌’ పేరిట మినరల్‌ గ్రేడ్‌లో అందిస్తున్నారు. దీనిని 100సీసీ-125 సీసీ బైక్‌లు,స్కూటర్‌ల కోసం సూచించడమైనది. సెమీ సింథటిక్‌ ఇంజిన్‌ ఆయిల్‌ను ‘ప్యురోసింథ్‌’ పేరిట 125సీసీ–150 సీసీ బైక్‌ల విడుదల చేశారు.

పూర్తి సింథటిక్‌ ఆయిల్‌ను ‘అల్టిమో’ పేరిట విడుదల చేశారు. దీనిని 150 సీసీ ఆపైన బైక్‌లను సూచించడమైనది. ‘రాయల్‌ ఈ ’ను ప్రత్యేకంగా యుసీఈ ఇంజిన్‌ కోసం డిజైన్‌ చేశారు. దీనిని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటర్‌సైకిల్స్‌ (క్లాసిక్‌ అండ్ బుల్లెట్‌ 350)కోసం విడుదల చేశారు. ఈ సందర్భంగా యునో మిండా లిమిటెడ్ 2-వీలర్ సెగ్మెంట్ హెడ్ రాజీవ్ జునేజా మాట్లాడుతూ ‘‘ప్రీమియం నాణ్యత ఎడిటివ్స్‌ను వినియోగించడం ద్వారా కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడంతో పాటుగా తమ వినియోగదారులకు అత్యుత్తమతను అందించడానికి యునోమిండా కట్టుబడి ఉంది.

ఈ బీఎస్‌ 6 ప్రమాణాలు కలిగిన ఆటోమోటివ్‌ ఇంజిన్‌ ఆయిల్స్‌ను మా సిద్ధాంతమైన ఎం3 , మోర్‌ లైఫ్‌. మోర్‌ మైలేజీ మోర్‌ పెర్‌ఫార్మెన్స్‌నుదృష్టిలో పెట్టుకుని సూత్రీకరించాము. ఈ అత్యున్నత పెర్‌ఫార్మింగ్‌ లుబ్రికెంట్స్‌, ఇన్‌స్టెంట్‌ స్టార్ట్‌ను కలిగి ఉండటంతో పాటుగా పికప్‌కు భరోసా అందిస్తాయి. ఇవి మరింత మృదువైన సవారీ అనుభవాలను అందించడంతో పాటుగాఅత్యుత్తమ ఇంధన సామర్థ్యమూ అందిస్తాయి. తద్వారా మొదటి సారి వినియోగం నుంచి అసాధారణ డ్రైవింగ్‌ అనుభవాలను గణనీయంగా పెంచుతాయి. సాధారణ వినియోగంతో వినియోగదారులు మెరుగైన జీవితాన్ని ఆశించవచ్చు’’ అని అన్నారు.

మా ఉత్పత్తులలో మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే, వీటిని 100% పర్యావరణ హితంగా లెడ్‌ రహిత కంటెయినర్లలో ప్యాక్‌ చేశాము. ఈ ఇంజిన్‌ ఆయిల్స్‌ సామర్ధ్యంను 10వేల కిలోమీటర్ల వరకూ పరీక్షించడం జరిగింది. ఇవి ఆర్ధికంగా చక్కటి తోడ్పాటునందించచడంతో పాటు,కమర్షియల్‌ డ్రైవర్లకు అనుకూలంగా ఉంటాయి. ఈ నూతన తరపు బీఎస్‌ 6 ప్రమాణాలు కలిగిన లూబ్రికెంట్లు ఇప్పటికే మీ దగ్గరలోని ఆటోమోటివ్‌ స్టోర్లలో లభ్యమవుతున్నాయి’’ అని అన్నారు.

Leave a Reply