ఒకే సారి ముగ్గురు స్టార్ హీరో లను లైన్ లో పెట్టిన త్రివిక్రమ్…

మాటల మాంత్రికుడు ” 2020 లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆల వైకుంఠపురములో మూవీ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు .. ఆల వైకుంఠపురములో మూవీ తరువాత త్రివిక్రమ్ కొంత గ్యాప్ తీసుకొని , ప్రిన్స్ మహేష్ తో హ్యాట్రిక్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు .. ఈ మూవీ కి సంబంధించి త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ , కాస్టింగ్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు .. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు , ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది , సర్కారు వారి పాట సినిమా పూర్తి కాగానే మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో జాయిన్ అవుతాడు

అసలు విషయానికి వెళ్ళితే .. సర్కారు వారు పాట సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది .. ఈలోపు త్రివిక్రమ్ టైమ్ అసలు వృధా చేయకుండా , మధ్యలో బీమ్లా నాయక్ మూవీకి స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ని అందించాడు , ప్రస్తుతం మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది అని తెలుసుకున్న త్రివిక్రమ్ , ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కి ఇంకాస్త మెరుగులు దిద్దుతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి .. మహేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ది హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో సినిమా పూర్తి కాగానే ,, ఆ తరువాత తాను చేయబోయే తరువాత మూవీస్ ని కూడా లైన్ లో పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ,, ఈ క్రమంలో మరో రెండు బడా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టినట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. అయితే ఈ బడా ప్రాజెక్ట్స్ లో నటించే స్టార్స్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ పేర్లు గట్టిగా వినపడుతున్నాయి , త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ మూవీస్ చేసాడు ,అలానే ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ వంటి ఇండస్ట్రీ హిట్ అందించాడు , సో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు – అల్లు అర్జున్ , ఎన్టీఆర్ కు మంచి స్నేహ బంధం ఉంది …

త్రివిక్రమ్ ఇటీవల ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లను కలిసినట్లు తెలుస్తుంది .. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు , ఆ తరువాత డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ ఒక సినిమా చేస్తున్నాడు , అలానే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు .. అల్లు అర్జున్, తారక్ ఇద్దరూ త్రివిక్రమ్‌తో పని చేయడానికి ఎప్పుడు సిద్దమే … . ప్రస్తుతానికి ఈ రెండు ప్రాజెక్ట్‌ల కు సంబంధించి స్క్రిప్ట్‌లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది … 2022 ముగిసేలోపు మహేష్ బాబు సినిమా షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి, వచ్చే ఏడాది తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ ఖాతాలో ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు, అనిల్ రావిపూడి లతో సినిమాలు ఉన్నాయి. మరోవైపు అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమా చేస్తూనే అట్లీ, బోయపాటి శ్రీను మూవీస్ లైన్ లో ఉన్నాయి ..ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ – స్లో అండ్ స్టడీ మెథడ్ , స్లో టేకింగ్ , కి ఫుల్ స్టాప్ పెట్టి , కాళీ సమయంలో పలు స్క్రిప్ట్ పనులు చకా చకా మొదలు పెడుతున్నాడు . అలానే మహేష్ బాబు ప్రాజెక్ట్ అయిన తరువాత అసలు గ్యాప్ లేకుండా రెండు ప్రాజెక్ట్స్ ను పట్టాలెక్కించే పని లో ఉన్నట్లు తెలుస్తుంది .. మొత్తానికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ , తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఎక్కడ ఎనౌన్స్ చేయలేదు , కానీ సోషల్ మీడియా లో మాత్రం త్రివిక్రమ్ శ్రీనివిస్ చేయబోయే మూవీస్ గురించే చర్చ…