దక్షిణ భారతదేశంలో తమ ‘గ్రేట్ 4X4 X-పెడిషన్’ మొదటి జోనల్ డ్రైవ్‌ను ప్రారంభించిన టయోటా కిర్లోస్కర్ మోటార్

బెంగుళూరు, మే 26, 2023: టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) దేశవ్యాప్తంగా మోటారు ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న , అసాధారణమైన మూడు రోజుల సాహసయాత్రకు నాంది పలుకుతూ ఈరోజు ‘గ్రేట్ 4×4 ఎక్స్-పెడిషన్’ ను ప్రారంభించింది. ఈ థ్రిల్లింగ్ డ్రైవ్ ప్రధాన లక్ష్యం అసమానమైన ఆఫ్-రోడింగ్ అనుభవం ద్వారా అభిమానులను ఆకర్షించడం వారితో మమేకం కావడం , వారిని సాధారణతకు మించి వెళ్లేలా ప్రోత్సహించడం, వారిలో సాహస స్ఫూర్తిని రగిలించడం,టయోటాతో ఈ ఉత్తేజకరమైన ప్రయాణం ద్వారా శాశ్వత జ్ఞాపకాలను సృష్టించడం. ఈ కార్యక్రమం లో పాల్గొనే 4×4 కమ్యూనిటీకి “మాస్ హ్యాపీనెస్” అందించడానికి సిద్ధంగా ఉంది.

టయోటా ఈ గ్రేట్ 4×4 X-పెడిషన్ ను ఈ ఉదయం బెంగళూరు నుండి ప్రారంభించింది. దక్షిణ భారతదేశం నుండి 4×4 ఔత్సాహికుల దీనిలో పాల్గొన్నారు . లెజెండరీ Hilux, Fortuner 4×4, LC 300, Hyryder AWD సహా ఇతర SUV బ్రాండ్‌ల వాహనాలను సగర్వంగా సొంతం చేసుకున్న యజమానులు తమ వాహనాల నిజమైన సామర్థ్యాన్ని వెలికితీసేందుకు ఆఫ్-రోడింగ్ కి సిద్ధమయ్యారు. ఆఫ్ రోడింగ్ లో ఔత్సాహికులచే నడపబడే 4×4 SUVల ఆకట్టుకునే కాన్వాయ్‌, రాబోయే రెండు రోజులలో హసన్ సకలేష్‌పూర్‌లోని విభిన్న మార్గాల్లో ప్రయాణిస్తుంది.

ఈ X-పెడిషన్‌లో అంతర్భాగంగా, TKM ఒక అదనపు 4WD ట్రాక్‌ని సృష్టించింది. దీనిలో సహజసిద్ధమైన ఆర్టిక్యులేషన్, సైడ్ ఇంక్లైన్‌లు, రాంబ్లర్, డీప్ డిచ్‌లు, స్లష్, రాకీ బెడ్‌లు మరెన్నో సహజమైన అడ్డంకులను సైతం సృష్టించింది. గతంలో మరెవ్వరూ అందించని విధంగా అత్యున్నత ఆఫ్-రోడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

రాబోయే కొద్ది రోజులలో, ఈ సవారీ లో పాల్గొనేవారు థ్రిల్లింగ్ ఆఫ్-రోడింగ్ అడ్వెంచర్‌లలో మునిగిపోవడమే కాకుండా, ఈ ప్రాంతం సుందరమైన అందాలలో లీనమవుతారు. దారిలో ఉన్న చారిత్రక ప్రదేశాలనూ అన్వేషిస్తారు. ఈ కార్యక్రమం స్థిరత్వం దిశగా కంపెనీ లక్ష్యం వెల్లడించటంతో పాటుగా ప్రకృతి పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడానికి దోహదం పడేలా సామాజిక జోక్యాల ఆవశ్యకతనూ తెలుపుతుంది. అంతేకాకుండా, ఈ రైడ్ లో హాజరైనవారు స్పూర్తిదాయకమైన 4×4 అవుట్‌డోర్ లైఫ్‌స్టైల్ అనుభవం యొక్క ఉత్సాహాన్ని పెంపొందించగల వివిధ వినోద కార్యక్రమాలలో సైతం పాల్గొనవచ్చు.

దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ‘గ్రేట్ 4×4 X-పెడిషన్’ ప్రారంభాన్ని గురించి , టయోటా కిర్లోస్కర్ మోటార్ సేల్స్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ మాట్లాడుతూ, “టయోటా యొక్క గ్రేట్ 4×4 X-పెడిషన్ 4×4 అభిమానులతో కనెక్ట్ అయ్యేలా రూపొందించబడింది, మరపురాని ఈ ప్రయాణంలో భాగమయ్యే అవకాశాన్ని వారికి అందించడం ద్వారా వారి అనుభవాలను సుసంపన్నం చేస్తుంది. ఉత్సాహంగా ఈ రైడ్ లో పాల్గొన్న వారందరికీ మేము మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వారికి సురక్షితమైన, చిరస్మరణీయమైన ఉత్తేజకరమైన డ్రైవ్‌ అనుభవాలు లభించాలని కోరుకుంటున్నాము” అని అన్నారు.

Leave a Reply