ఇన్నోవా క్రిస్టా టాప్‌ గ్రేడ్స్‌ ధరలను ప్రకటించిన టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌

· ఎకో,పవర్‌ డ్రైవ్‌ మోడ్స్‌లో 2.4 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను 5 స్పీడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో కలిగి ఉంది

· భద్రతా ఫీచర్లలో ఏడు ఎస్‌ఆర్‌ఎస్‌ ఎయిర్‌బ్యాగ్‌లు , ముందు, వెనుక పార్కింగ్‌ సెన్సార్‌లు, వెహికల్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ , హిల్‌ స్టార్ట్‌ కంట్రోల్‌, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌), ఎలకా్ట్రనిక్‌ బ్రేక్‌ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ (ఈబీడీ), బ్రేక్‌ అసిస్టెంట్‌ (బీఏ), 3 పాయింట్‌ సీట్‌ బెల్ట్‌, మెరుగైన భద్రత కోసం హెడ్‌ రెస్ట్‌

· డిజిటల్‌ డిస్‌ప్లేతో వెనుక ప్రయాణీకులకు సౌకర్యం అందిస్తూ రియర్‌ ఆటో ఏసీ, 8 వే పవర్‌ ఎడ్జస్ట్‌ డ్రైవర్‌ సీట్‌, స్మార్ట్‌ ఎంట్రీ సిస్టమ్‌, సీట్‌ బ్యాక్‌ టేబుల్‌, టీఎఫ్‌టీ మిడ్‌ తో సవివరమైన డ్రైవ్‌ ఇన్‌ఫర్మేషన్‌, లెదర్‌ సీట్‌రంగుల అవకాశాలు ( బ్లాక్‌ , క్యామిల్‌ టాన్‌) , ప్రకాశవంతమైన వెలుతురు, ఒన్‌ టచ్‌ టంబెల్‌ సెకండ్‌ వరుస సీట్లు

· స్మార్ట్‌ ప్లే కాస్ట్‌ 8 అంగుళాల టచ్‌ స్ర్కీన్‌ ఆడియో, ఆండ్రాయిడ్‌ ఆటో/యాపిల్‌ కార్‌ ప్లే మహోన్నత మల్టీ మీడియా అనుభవాలను అందిస్తాయి.

తెలుగు సూపర్ న్యూస్,బెంగళూరు,మే 5,2023: టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ (టీకెఎం) నేడు తమ నూతన ఇన్నోవా క్రిస్టా రెండు గ్రేడ్స్‌ (జెడ్‌ఎక్స్‌ ,వీఎక్స్‌) ధరలను వెల్లడించింది. ఈ వాహనం మెరుగైన ఫ్రంట్‌ ఫేసిమా కలిగి ఉంటుంది. దీనిని కఠినమైన, ధృడమైన ప్రదర్శన కోసం నిర్థిష్టమైన ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. తద్వారా భారతీయ కుటుంబాలు, వ్యాపారవేత్తలు, కార్పోరేట్‌ అవసరాలు తీరుస్తుంది.

ఎక్స్‌ షోరూమ్‌ ధరలు, గ్రేడ్‌ల వారీగా ఈ విధంగా ఉన్నాయి…

ఈ ఎక్స్‌ షోరూమ్‌ ధరలు దేశవ్యాప్తంగా అన్ని గ్రేడ్‌లకూ వర్తిస్తాయి. ప్రీమియం కలర్స్‌కు అదనపు ధరలు వర్తిస్తాయి.

తమ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక ఎంపీవీ అగ్రగామిగా 2005లో మార్కెట్‌లో విడుదలైన నాటి నుంచి నిలువడంతో పాటుగా ఇప్పటి వరకూ ఒక మిలియన్‌కు పైగా యూనిట్లు విక్రయించబడ్డాయి. ఈ వాహనాన్ని ఈ సంవత్సరారంభంలో విడుదల చేసిన నాటి నుంచి ముందస్తు బుకింగ్స్‌ పరంగా అపూర్వ స్పందన అందుకుంది.

ఈ సందర్భంగా టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ సేల్స్‌, స్ట్రాటజిక్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ అతుల్‌ సూద్‌ మాట్లాడుతూ ‘‘ నూతన ఇన్నోవా క్రిస్టల్‌ డీజిల్‌ టాప్‌ టూ గ్రేడ్‌ ధరలను వెల్లడించేందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ వాహనాన్ని వినియోగదారులు అన్ని నూతన వేరియంట్లలోనూ ఆదరిస్తున్నారు. దీని కఠినమైన, ధృడమైన ముందు భాగం, శైలి, సౌకర్యం, పనితీరు ఖచ్చితమైన సమ్మేళనంతో నూతన ఇన్నోవా క్రిస్టా ఖచ్చితంగా ఇన్నోవా వారసత్వంను ముందుకు తీసుకువెళ్లనుంది. ఈ వాహనంలో అత్యాఽధునిక భద్రతా ఫీచర్లు ప్రయాణీకులకు అత్యున్నత భద్రతను అందించనున్నాయి. ఈ వాహనం అందించే మెరుగైన డ్రైవింగ్‌ అనుభవాలను మా వినియోగదారులు ఆస్వాదించడంతో పాటుగా ప్రశంసించగలరనే నమ్మకంతో ఉన్నాము’’అని అన్నారు.

ఈ నూతన ఇన్నోవా క్రిస్టా ను 50వేల రూపాయలు చెల్లించి బుక్‌ చేసుకోవచ్చు. వినియోగదారులు డీలర్‌ ఔట్‌లెట్లుతో పాటుగా www.toyotabharat.com.. వద్ద ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. ఈ నూతన ఇన్నోవా క్రిస్టా నాలుగు గ్రేడ్స్‌ G, GX, VX & ZX ఐదు రంగులు– సూపర్‌ వైట్‌, ఆటిట్యూడ్‌ బ్లాక్‌ మికా, అవంత్‌ గ్రేడ్‌ బ్రాంజ్‌ మెటాలిక్‌, ప్లాటినమ్‌ వైట్‌ పెరల్‌,సిల్వర్‌ మెటాలిక్‌లో లభ్యం.

Leave a Reply