కొత్తగా ఆవిష్కరించిన తేలికపాటి 4WD మహీంద్రా ఓజా 3140 ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దమ్ము పనుల్లో సమూల మార్పులు తేనున్నది

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్, మార్చి 19, 2024: మహీంద్రా గ్రూప్‌లో భాగమైన, పరిమాణంపరంగా ప్రపంచంలోనే అత్యధిక ట్రాక్టర్లు తయారు చేసే మహీంద్రా ట్రాక్టర్స్ భవిష్యత్ అవసరాలకు కూడా ఉపయోగపడగలిగే మహీంద్రా ఓజా (OJA) 3140ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రైతుల కోసం ఇటీవల ఆవిష్కరించింది. ఖరీఫ్ సీజన్‌లో ప్రవేశపెట్టబడిన కొత్త మహీంద్రా ఓజా, వరి వంటి పంటలకు సంబంధించిన దమ్ము పన్నుల్లో అసాధారణమైన ఫలితాలు చూపింది. విజయవంతంగా ఆవిష్కృతమైన ఈ ఉత్పత్తికి రాబోయే రబీ సీజన్‌లో కూడా చక్కని డిమాండ్ ఉండగలదని మహీంద్రా ఆశిస్తోంది.

ట్రాక్టర్ డిజైన్‌ ప్రపంచంలో కొత్త మార్పులను ఆవిష్కరిస్తూ కొత్త ఓజా 3140 భారీతనంపురోగామితత్వంఅసమానమైన పనితీరుతో పాటు ఆధునిక వ్యవసాయ పరికరాలకు కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తూమరింత సాధించే దిశగా రైతులకు సాధికారత కల్పించగలదు. స్థిరంగా వివిధ రకాల వ్యవసాయ పనులను నిర్వహించగలిగే సామర్థ్యాలు గల కొత్త ఓజా 3140 ప్రామాణికమైన 4WDగా లభిస్తుంది. ఇది తేలికగా ఉండటంతో పాటు అధునాతన పనితీరు కనపరుస్తుంది.

3-సిలిండర్ 29.82 kW (40hp) ఇంజిన్ @2500 RPM మరియు 25.95kW (34.8hp) PTO శక్తితోఈ సెగ్మెంట్‌లోనే మొట్టమొదటిసారిగా సింక్రో షటిల్‌ గల కాన్‌స్టంట్ మెష్ గేర్‌బాక్స్ కాన్ఫిగరేషన్ మరియు 12 ఫార్వర్డ్ 12 రివర్స్ గేర్లతోఓజా అత్యధిక శక్తినినిర్వహణ సామర్ధ్యాలను అందిస్తుంది. బహుళ రివర్స్ గేర్లతో కూడుకున్న అధునాతన గేర్ వ్యవస్థ అనేది చిన్న కమతాల్లో కూడా రైతులు వేగంగా మరియు సౌకర్యవంతంగా పని చేసుకునేందుకు సహాయపడగలదు.

950 కేజీల హైడ్రాలిక్ లిఫ్ట్ సామర్థ్యాలు గల ఓజా 3140 ట్రాక్టర్లుపండ్ల తోటల పెంపకం మరియు దమ్ము పనుల్లో రైతులు పూర్తి సామర్ధ్యాలతో పని చేసేందుకు తోడ్పడగలవు. మృదువుగా పని చేసే ఓజా పవర్ స్టీరింగ్ సిస్టమ్ వల్ల ట్రాక్టరును తిప్పడం సులభతరంగా ఉంటుంది. చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటూముట్టుకుంటే ప్రీమియం అనుభూతిని కలిగిస్తూ రైతులకు గర్వకారణంగా ఉండేలా ఈ ట్రాక్టర్లు తీర్చిదిద్దబడ్డాయి. చుట్టూరా 360 డిగ్రీల కోణంలో పనిని మరియు పనిముట్లను చూసుకునేందుకు వీలు కల్పించేలా ఓజా 3140 యొక్క ఎత్తు అనేది తగినంత స్థాయిలో ఉంటుంది. ఎన్‌వీహెచ్ (నాయిస్వైబ్రేషన్హార్ష్‌నెస్)ను తగ్గించడంసర్వీస్‌ను సులభతరం చేయడం మరియు సుదీర్ఘంగా గంటల పాటు పని చేయగలిగే సామర్థ్యాలు కల్పిస్తూనే, పని చేసేటప్పుడు మెరుగైన భద్రత ఫీచరు అందించడంపైనా ప్రధానంగా దృష్టి పెట్టబడింది.

కొత్త మహీంద్రా 4WD ఓజా 3140 ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రూ. 7.35 లక్షల ఆకర్షణీయమైన ధర శ్రేణిలో లభిస్తోంది. ఇందులో మహీంద్రా ఓజాకు చెందిన అధునాతన టెక్నాలజీ ప్యాక్‌లైన – ప్రోజా (PROJA), మ్యోజా (MYOJA), మరియు రొబోజా (ROBOJA) ఉన్నాయి. ట్రాక్టర్ పనితీరు మరియు యూజరు అనుభూతిని అత్యంత మెరుగుపర్చేందుకు ఇవి తోడ్పడగలవు.

శక్తి కేంద్రమనే అర్థం గల సంస్కృత పదం “ఓజస్” పేరిట తీర్చిదిద్దిన సరికొత్త మహీంద్రా 4WD ఓజా 3140 అనేది మహీంద్రా ట్రాక్టర్స్ ఇటీవలే ఆవిష్కరించిన కొత్త మహీంద్రా ఓజా సిరీస్‌లో భాగం. ఇది మహీంద్రా యొక్క అంతర్జాతీయ తేలికపాటి ట్రాక్టర్ ప్లాట్‌ఫాం ఆధారంగా రూపొందింది. భారత్‌లోని మహీంద్రా రీసెర్చ్ వేలీ, భారత్‌లోని మహీంద్రా యొక్క పరిశోధన & అభివృద్ధి కేంద్రం మరియు జపాన్‌కి చెందిన మిత్సుబిషి మహీంద్రా అగ్రికల్చర్ మెషినరీ యొక్క ఇంజినీరింగ్ బృందాలు దీన్ని సంయుక్తంగా రూపొందించాయి. ట్రాక్టర్ టెక్నాలజీలో అధునాతన సాంకేతికతను ఆవిష్కరిస్తూ సరికొత్త ఓజా శ్రేణి ఉత్పత్తులు తేలికపాటి 4WD ట్రాక్టర్ డిజైన్ మరియు ఇంజినీరింగ్‌లో కొత్త మార్పులు తీసుకురాగలవు.

భారత్‌లో ఆసక్తికరంగా ప్రయాణం ప్రారంభించిన ఓజా శ్రేణి ట్రాక్టర్లు తదుపరి ఉత్తర అమెరికా, ASEAN, బ్రెజిల్, ఆస్ట్రేలియా, దక్షిణాప్రికా, యూరప్, మరియు సార్క్ దేశాల్లో ఆవిష్కరించబడనున్నాయి. ఓజా తోడ్పాటుతో 2024లో థాయ్‌ల్యాండ్‌తో మొదలుపెట్టి ఆగ్నేయాసియా దేశాల కూటమి ఆసియాన్ ప్రాంతంలో కూడా మహీంద్రా కాలు మోపనుంది. మహీంద్రా ఓజా ట్రాక్టర్ల శ్రేణి తెలంగాణలోని జహీరాబాద్‌లో మహీంద్రాకు గల అధునాతన ట్రాక్టర్ల ప్లాంటులో తయారు చేయబడుతోంది. భారతదేశంలోనే అతి పెద్దవైన మరియు  అత్యంత అధునాతన ట్రాక్టర్ల తయారీ ప్లాంట్లలో ఈ ప్లాంటు కూడా ఒకటి.

ఓజా టెక్నాలజీ ప్యాక్‌లు

ఆధునికపురోగామి రైతులు, వ్యవసాయాన్ని వ్యాపకంగా చేసే రైతులుమరియు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంపై మక్కువ కలిగిన వారి వివిధ రకాల అవసరాలను తీర్చే విధంగా తీర్చిదిద్దబడిన విప్లవాత్మక మహీంద్రా ఓజానిర్వహణ మరియు సామర్ధ్యాలపరంగా అసమానమైన పనితీరు కనపర్చగలదు. ఈ కేటగిరీలోనే మొట్టమొదటిసారిగా ఉపయోగిస్తున్న సాంకేతికతఅత్యుత్తమ ఫీచర్లతో తీర్చిదిద్దబడిన ఈ శ్రేణి పనితీరుపరంగా అత్యుత్తమ ప్రమాణాలను అందుకోగలదు.

ఉత్పాదకత మరియు అనుభూతిని మెరుగుపర్చే విధంగా మూడు అధునాతన టెక్నాలజీ ప్యాక్‌లు ఓజా శ్రేణి ట్రాక్టర్లకు తోడ్పడతాయి. అవేమిటంటేప్రోజా (ఉత్పాదకత ప్యాక్)మ్యోజా (టెలీమ్యాటిక్స్ ప్యాక్)మరియు రోబోజా (ఆటోమేషన్ ప్యాక్). ఈ తరహా టెక్నాలజీ భారత్‌లో అందుబాటులోకి రావడం ఇదే ప్రథమం.

ప్రోజా – మెరుగైన దిగుబడులకు సమర్ధమంతమైన సాగు

ప్రొడక్టివిటీ ప్యాక్‌గా కూడా వ్యవహరించే ప్రోజా అనేది ఓజా ప్లాట్‌ఫాంలో అంతర్గత భాగం.  ఇది పనితీరును మెరుగుపర్చేందుకుగరిష్ట రాబడులను అందించేందుకు తోడ్పడగలదు. ముఖ్యంగా చిన్న కమతాల్లోని పరిస్థితులను బట్టి మానవ ప్రమేయాన్ని తగ్గించడంఆపరేటరు అలసటకు గురికాకుండా చూడటం ద్వారా అంతిమంగా ఉత్పాదకతను పెంచడంవ్యయాలు తగ్గించడం మరియు మొత్తం మీద ఉత్పత్తి వినియోగ అనుభూతిని మెరుగుపర్చడమనే లక్ష్యంతో ఇది తీర్చిదిద్దబడింది.

రైతు కచ్చితత్వంతో పని చేయగలిగేలా క్రీపర్ మోడ్ సహాయపడగలదు. అత్యల్పంగా గంటకు 0.3 కిలోమీటర్ల వేగంతో కూడా పనిచేయడం ద్వారా  విత్తనాలను కచ్చితత్వంతో నాటేందుకుమల్చింగ్ షీట్లను సులభతరంగా వేసేందుకు ఇది తోడ్పడగలదు.

సమర్ధమంతమైన పొందికైన ఇంజిన్ సాంకేతికత కారణంగా పని అత్యంత సులభతరమవుతుంది. పూర్తి స్థాయి పనితీరు కనపర్చేందుకు గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తూఈ కేటగిరీలోనే అత్యుత్తమ NVH (నాయిస్వైబ్రేషన్హార్ష్‌నెస్) స్థాయులతో ఇది పని చేయగలదు.

F/R షటిల్ ఫీచర్ అనేది బహుళ రివర్స్ స్పీడ్ ఆప్షన్లను అందిస్తుంది. దీనితో పొలంలో పని చేసేటప్పుడు మరింత వేగంగా పనిచేయడానికి వీలవుతుంది. ఫార్వర్డ్ మరియు రివర్స్ కోసం ఒకే లీవర్‌ను ఉపయోగించడం వల్ల ప్రతి మలుపులోనూ 15-20 శాతం సమయం ఆదా అవుతుంది. తద్వారా ఆపరేటరు అలసటను కూడా ఇది తగ్గిస్తుంది. 

టిల్ట్ & టెలిస్కోపిక్ స్టీరింగ్ అనేది పని చేసేటప్పుడు సౌకర్యవంతంగా ఉండేలా స్టీరింగ్ పొజిషన్‌ కోణం మరియు ఎత్తును తగిన విధంగా సరి చేసుకునేందుకు తోడ్పడుతుంది.

వెట్ ఎలక్ట్రిక్ పీటీవో అనేది ద్రాక్షతోటల్లో పని చేసేటప్పుడు లేదా వరుస పంట-నడవాల్లోను మరియు చిన్నపాటి కమతాల్లో దమ్ము చేసేటప్పుడు పీటీవోను బటన్ నొక్కడం ద్వారా ప్రారంభించేందుకుఆపేందుకు ఆపరేటరుకు సహాయకరంగా ఉంటుంది.

మ్యోజా – అసాధారణ ఉత్పాదకత మరియు సమర్ధత అందిస్తుంది

మొబైల్ ఫోన్ అప్లికేషన్ ద్వారా తమ ట్రాక్టర్లపై మరింత నియంత్రణ కలిగి ఉండేందుకు మ్యోజా లేదా టెలీమ్యాటిక్స్ ప్యాక్ అనేది రైతులకు సాధికారత కల్పిస్తుంది.  ఉన్న ప్రదేశంఇంధన వినియోగంత ట్రాక్టరు స్థితిగతులకు సంబంధించి ఈ ఫీచరు రియల్-టైమ్ డేటా అందిస్తుంది. దీనితో మెయింటెనెన్స్ ప్రణాళికలు సులభతరమవుతాయి. అలాగేతమ ట్రాక్టర్ల స్థితిగతులుపనితీరుపై రైతు ఒక కన్నేసి ఉంచేందుకు ఈ ఫీచరు ఉపయోగపడగలదు.

జీపీఎస్ లైవ్ లొకేషన్ అనేది ట్రాక్టర్ యొక్క లైవ్ లొకేషన్‌ను ట్రాక్ చేసేందుకు సహాయపడుతుంది. అలాగేఆపరేటరుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు జియోఫెన్సింగ్‌ కోసం తోడ్పడుతుంది.

సర్వీస్ అలర్ట్‌లనేవి క్రియాశీలకంగా సర్వీస్ రిమైండర్లను పంపడం ద్వారా రైతులకు వారి ట్రాక్టర్ సర్వీస్ అవసరాల గురించి తెలియజేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. సకాలంలోసమర్ధమంతమైన సర్వీసింగ్‌కి దోహదపడతాయి.

క్రిటికల్ అలర్ట్స్ ఫీచర్ అనేది ఇంజిన్ సంబంధిత పెద్ద సమస్యలేమైనా వస్తే తక్షణం నోటిఫికేషన్లు పంపిస్తుంది. ట్రాక్టరు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షించేందుకుదుర్వినియోగమైతే గుర్తించేందుకు సహాయపడుతుంది.

డీజిల్ మానిటరింగ్ ఫీచర్ అనేది ఇంధన స్థాయిని చూపిస్తుంది. తద్వారా ఇంధన చోరీ ఉదంతాలను సమర్ధమంతంగా నివారిస్తుంది.

కవరేజీ ట్రిప్ కాల్‌క్యులేటర్ అనేది పొలం పని మరియు హాలేజీ విషయంలో ట్రాక్టరు పనితీరును సులభతరంగా ట్రాక్ చేసేందుకు సహాయపడుతుంది.

రోబోజా – కచ్చితత్వంలో పరివర్తన తేగలిగే అధునాతన ఆటోమేషన్ మరియు స్మార్ట్ అప్లికేషన్స్ అందిస్తుంది

రోబోజా లేదా ఆటోమేషన్ ప్యాక్ అనేది అత్యంత సమర్ధత మరియు కచ్చితత్వం అందించే దిశగా ట్రాక్టరును ఆపరేట్ చేసేటప్పుడు మాన్యువల్ ప్రమేయాన్ని విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. స్వంతంగా ఇంజిన్ లేదా శక్తి వనరులు ఉండని అదనపు పరికరాలకు కూడా శక్తిని అందించడం ద్వారా సమర్ధమంతంగా సాగు చేసేందుకు ఓజా ట్రాక్టర్లు ఉపయోగపడతాయి. ఈ కేటగిరీలో ఇలాంటి సాంకేతికతను అందించడం ఇదే ప్రథమం.

ఆటో పీటీవో ఫీచర్ అనేది బటన్ నొక్కడం ద్వారా సులభతరంగా పీటీవోను ఉపయోగించేందుకు వీలు కల్పిస్తుంది. ఎలక్ట్రిక్ వెట్ పీటీవో క్లచ్ అనేది పనితీరు మరియు వినియోగం సులభతరంగా ఉండేలా సహాయపడుతుంది. అదనంగా, ట్రాక్టరును తిప్పేటపుడు మరియు వెనక్కి తీసేటప్పుడు ఆటో పీటీవోను ఆన్ లేదా ఆఫ్ చేయొచ్చు. దీనితో క్రిమిసంసంహారకాలు మరియు ఎరువుల ఖర్చులు ఆదా కావడంతో పాటు పొలంలో పని చేయడం కూడా సులభతరమవుతుంది. 

ఆటో ఇంప్లిమెంట్ లిఫ్ట్ ఫీచరు అనేది మలుపు తిరిగేటప్పుడు లేదా రివర్స్ చేసేటప్పుడు పనిముట్లను ఆటోమేటిక్‌గా పైకెత్తడం మరియు కిందికి  దింపడానికి సహాయపడుతుంది. తద్వారా ట్రాక్టర్ సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుంది. ఎలక్ట్రానిక్ డెప్త్ మరియు డ్రాఫ్ట్ కంట్రోల్ హైడ్రాలిక్ సిస్టమ్స్ అనేవి సాగుపనులను కచ్చితత్వంతో మరియు సమర్ధమంతంగా నిర్వహించేందుకు తోడ్పడతాయి.

ఆటో వన్-సైడ్ బ్రేకింగ్ అనేది మలుపులు తిరిగేటప్పుడు ఒక వైపున బ్రేక్ వేసేందుకు వీలు కల్పిస్తుంది. తద్వారా స్టీరింగ్ మరియు బ్రేక్‌ను ఒకేసారి చూసుకోవాల్సిన సమస్య తప్పుతుంది. తద్వారా తక్కువ స్థలంలోనే తిప్పేందుకు మరియు వర్షాలు పడేటప్పుడు జారడం లేదా అదుపు తప్పడం వంటివి చోటు చేసుకోకుండా నివారిస్తుంది.