ఇంజనీరింగ్ స్కాలర్‌లకు మద్దతుగా స్కాలర్‌షిప్‌ను ప్రకటించిన హార్డ్‌వేర్ పితామహుడు డా. అజయ్ చౌదరి

తెలుగు సూపర్ న్యూస్, హైదరాబాద్, 31 జూలై 2023: పద్మభూషణ్ అవార్డు గ్రహీత, హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడు ,ఇటీవల విడుదల చేసిన జీవిత చరిత్ర ‘ జస్ట్ ఆస్పైర్’ రచయిత డాక్టర్ అజయ్ చౌదరి భారతదేశపు భవిష్యత్తు ప్రతిభను పెంపొందించడానికి ఒక కార్యక్రమాన్ని ప్రకటించారు. చౌదరి కుటుంబ ట్రస్ట్, స్వయం ఛారిటబుల్ ట్రస్ట్ ‘ ఆస్పైర్ స్కాలర్‌షిప్‌’ ను ఏర్పాటు చేసింది – ఉన్నత విద్యను అభ్యసించడంలో ఆర్థిక అడ్డంకులను ఎదుర్కొనే ఔత్సాహిక ఇంజనీర్‌లకు అవసరమైన సహాయాన్ని అందించడం. వారికి ఉజ్వల భవిష్యత్తును సృష్టించడంలో సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుంది.

మొదటి మూడు సంవత్సరాల్లో INR 100 మిలియన్ల వ్యయంతో, ఈ ట్రస్ట్ 84 మంది విద్యార్థులకు సహాయ పడటానికి కట్టుబడి ఉంది, విద్యార్థుల కోర్సు మొత్తం కాలంలో వారికి సమగ్ర ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. తమ కలలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులకు ఆపన్న హస్తం అందించడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ స్కాలర్‌షిప్ ట్యూషన్ ఫీజులను మాత్రమే కవర్ చేయటం కాకుండా కోర్సు కాలంలో ఎంపిక చేసిన విద్యార్థులకు హాస్టల్, మెస్ ఫీజులను కూడా అందిస్తుంది.

ఫౌండర్ EPIC ఫౌండేషన్, కో-ఫౌండర్ హెచ్‌సిఎల్ & స్వయం ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్ అజయ్ చాదరి మాట్లాడుతూ, “ఆస్పైర్ అనేది కేవలం స్కాలర్‌షిప్ మాత్రమే కాదు, ఈ ఔత్సాహిక ఇంజనీర్లలో ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చి , వారి ప్రకాశం , చురుకుదనంతో ప్రపంచాన్ని మార్చడానికి వీలు కల్పించే ఆశాజ్యోతి. ఈ స్కాలర్‌షిప్ భారతదేశం భవిష్యత్తు వృద్ధికి అవసరమైన ఔత్సాహిక ఇంజనీర్‌లకు సహాయం చేయడం. భారతదేశ వృద్ధి కథలో పాల్గొనడానికి సహకరించడంలో వారికి సహాయపడటం లక్ష్యంగా పెట్టుకుంది. నేడు ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం మనది. మనలో ఉన్న ప్రతిభను మనం ఎక్కువగా ఉపయోగించుకోకపోతే, తెలివైన యువత కు మద్దతు ఇవ్వకపోతే, ఈ రోజు అడ్డంకులను అధిగమించడంలో వారికి సహాయం చేయకపోతే, సాంకేతిక ఆధిపత్యం కోసం ఈ రేసులో మనం చాలా వెనుకబడి ఉంటాము. ఆస్పైర్ స్కాలర్‌షిప్ అనేది మా వంతు , సమాజానికి తిరిగి ఇచ్చే ప్రయత్నం, ఇది నాలాంటి వ్యక్తులు పెద్దగా ఆలోచించడానికి నా కలలను సాధించడానికి సహాయపడనుంది” అని అన్నారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఖరగ్‌పూర్, హైదరాబాద్, పాట్నా, ఢిల్లీ, బొంబాయి, గోవా ), ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ, డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నయా రాయ్‌పూర్, జబల్‌పూర్ ఇంజినీరింగ్ కాలేజ్ అండ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ రాంచీ తో సహా భారతదేశంలోని పది ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించబడుతుంది. మొత్తం 10 ఇన్‌స్టిట్యూట్‌ల ప్రతినిధుల సమక్షంలో ఈరోజు వెబ్‌నార్‌లో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది.

ఈ కార్యక్రమం 2023-2024 B.Tech బ్యాచ్‌తో ప్రారంభమవుతుంది, ఇది అర్హులైన స్కాలర్స్ కోసం ఒక అసాధారణ ప్రయాణానికి నాంది పలికింది. రాబోయే మూడు సంవత్సరాల పాటు, స్వయం నిర్వహణ భారతదేశంలోని పది ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్టిట్యూట్‌లలోని మొదటి సంవత్సరం B.Tech బ్యాచ్‌ల నుండి ఏటా 28 అత్యుత్తమ స్కాలర్‌లను ఎంపిక చేస్తుంది. ఈ వ్యవధిలో, స్కాలర్‌షిప్ 84 మంది స్కాలర్‌లకు సాధికారత ఇస్తుంది, వారి కోర్సు మొత్తం వ్యవధికి అవసరమైన సమగ్ర ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

స్వయం చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ కునాల్ చౌదరి మాట్లాడుతూ, “యువ ప్రతిభను పెంపొందించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం.మన దేశానికి ఉజ్వల భవిష్యత్తును సృష్టించడం పట్ల మా నిబద్ధతను ఈ స్కాలర్‌షిప్ రుజువు చేస్తుంది. ఒకరి నేపథ్యంతో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరూ, వారి కలలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుందని మేము నమ్ముతున్నాము” అని అన్నారు

ఈ అసాధారణమైన విద్యార్థుల ఎంపిక ప్రక్రియ కఠినంగా ఉంటుంది, ఇది స్వయం మేనేజ్మెంట్ లేదా దాని నియమించిన జ్యూరీ ద్వారా న్యాయమైన , పారదర్శకమైన ఎంపిక ప్రక్రియ ద్వారా నిర్వహించబడుతుంది, ఇది అత్యుత్తమ ప్రమాణాలను కలిగి ఉంటుంది.

ఆస్పైర్ స్కాలర్‌షిప్‌ను స్కాలర్‌షిప్ మేనేజ్‌మెంట్ సేవలలో ప్రముఖ సంస్థ అయిన బడ్డీ 4 స్టడీ నిర్వహిస్తుంది. దాని అత్యాధునిక సాంకేతిక ఇంటర్‌ఫేస్ ద్వారా, ఇది ప్రోగ్రామ్ సౌకర్యవంతమైన నిర్వహణకు హామీ ఇస్తుంది మరియు పరిపాలన కోసం సేవలు , సహాయాన్ని అందిస్తుంది.

Leave a Reply