“INDRA RV25: 240N” ను ఆవిష్కరించిన రఘు వంశీ మెషిన్ టూల్స్పూర్తిగా స్వదేశీ మైక్రో టర్బోజెట్ ఇంజిన్

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, 26 ఫిబ్రవరి 2024 :ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న రఘు వంశీ మెషిన్ టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆత్మనిర్భర్ భారత్ “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమంతో పూర్తి స్వదేశీ మైక్రో టర్బోజెట్ ఇంజిన్‌ ను ప్రారంభించినట్లు సగర్వంగా ప్రకటించింది. ఆర్వీఎంటీ హైదరాబాద్ కేంద్రంలో ఇంజిన్ ప్రత్యక్ష పరీక్షను ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, రక్షణ శాఖ మంత్రి మాజీ సైంటిఫిక్ అడ్వైజర్, డీఆర్ డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి సమక్షంలో ఈ ప్రయోగం జరిగింది. అసెంబ్లీ మరియు టెస్ట్ ల్యాబ్‌ను ఆయన ఈ సందర్భంగా ప్రారంభిం చారు.

ఈ ముఖ్యమైన సందర్భం భారతదేశం ఏరోస్పేస్ రంగానికి ఒక గొప్ప విజయాన్ని సూచిస్తుంది. ఆర్వీఎంటీ ఆవిష్కరణ అనేది స్వయం సమృద్ధి, సాంకేతిక నైపుణ్యానికి సంస్థ నిబద్ధతను ప్రదర్శిస్తుంది. భారతదేశం లోనే తొలిసారిగా స్వదేశీ మైక్రో టర్బోజెట్ ఇంజన్ అభివృద్ధి; ప్రపంచ స్థాయిలో అత్యాధునిక ఏరో స్పేస్, రక్షణ సాంకే తికతల రూపకల్పన, తయారీ మరియు అమలులో కంపెనీ సామర్థ్యాన్ని నొక్కి చెబు తుంది.

పూర్తి స్వదేశీ మైక్రో టర్బోజెట్ ఇంజిన్ “INDRA RV25: 240N” ముఖ్యాంశాలు: • స్వదేశీ రూపకల్పన , అభివృద్ధి: రఘు వంశీ మెషిన్ టూల్స్ చెందిన నైపుణ్యం కలిగిన ఇంజనీర్ల బృందం చే పూర్తిగా భారతదేశంలో రూపొందించబడింది & ఐఐటీ హైదరాబాద్ మద్దతు కలిగిఉంది.

పరిశ్రమ -విద్యాసంస్థల భాగస్వామ్యానికి గొప్ప నిదర్శనం
• స్వావలంబన , స్వయంప్రతిపత్తి: దిగుమతి చేసుకున్న సాంకేతికతలు, భాగాలు, నైపు ణ్యంపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా, మైక్రో టర్బోజెట్ ఇంజిన్ అనేది క్లిష్టమైన రంగాలలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించడం, జాతీయ భద్రత, ఆర్థిక స్థితిస్థాపకతను పెంపొందిం చడం వంటి లక్ష్యాలకు దోహదం చేస్తుంది.
• స్థానిక తయారీకి సాధికారత: స్వదేశీ మైక్రో టర్బోజెట్ ఇంజిన్ ప్రారంభం సాంకేతిక ఆవిష్కరణ లను మాత్రమే కాకుండా దేశీయ ఏరోస్పేస్, రక్షణ తయారీ పర్యావరణ వ్యవస్థ వృద్ధిని ప్రేరేపిస్తుంది, ఉద్యోగాలను సృష్టిస్తుంది, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది.

ఈ సందర్భంగా రఘు వంశీ మెషిన్ టూల్స్ ఎండీ వంశీ వికాస్ మాట్లాడుతూ, ‘‘మా పూర్తి స్వదేశీ మైక్రో టర్బోజెట్ ఇం జిన్‌ను ఆవిష్కరించడం మాకు గర్వకారణం. ఇది ఏరోస్పేస్ ఆవిష్కరణలకు గ్లోబల్ హబ్‌గా మారాలనే భారతదేశ నైపుణ్యం మరియు సంకల్పానికి నిదర్శనం. మన దేశానికి వృద్ధిని, శ్రేయస్సును ప్రోత్సహించే ఆత్మనిర్భర్ భారత్‌, “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమాల మద్దతు ఇవ్వడంలో మా నిబద్ధతను ఈ విజయం పునరుద్ఘాటిస్తుంది.

రఘువంశీ గ్రూప్ సీఓఓ అరవింద్ మిశ్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘‘‘ఏరోస్పేస్, రక్షణ రంగం కోసం మిషన్-క్రిటికల్ ఉత్పత్తులు, పరిష్కారాలను రూపొందించడంలో, నిర్మించడంలో మా సామర్థ్యాలకు ఈ అభి వృద్ధి ఒక నిదర్శనం. ఇలాంటి అత్యాధునిక సాంకేతికతల స్వదేశీ అభివృద్ధి భారతదేశాన్ని స్వయంసమృద్ధి చెందేలా చేస్తుంది. క్లిష్టమైన సైనిక ఉత్పత్తులు, పరిష్కారాల ఎగుమతి కేంద్రంగా దేశాన్ని మారుస్తుంది. యూఏవీలు, మిసైల్ ప్రొపల్షన్, సహాయక పవర్ యూనిట్లు మరియు రేంజ్ ఎక్స్ టెండర్స్ తో సహా అనేక ఇతర చోట్ల 100 కేజీఎఫ్ వరకు ఉపయోగించడానికి మైక్రో టర్బో జెట్ ఇంజిన్‌ల మొత్తం సూట్‌ను రూపొం దించడానికి ఈ విజయం మాకు మార్గం సుగమం చేస్తుంది’’ అని అన్నారు.

Leave a Reply